Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారతంలోని నాలుగు ఉత్తమ వీధి మార్కెట్‌ల‌ను సంద‌ర్శిద్దాం!

దక్షిణ భారతంలోని నాలుగు ఉత్తమ వీధి మార్కెట్‌ల‌ను సంద‌ర్శిద్దాం!

దక్షిణ భారతంలోని నాలుగు ఉత్తమ వీధి మార్కెట్‌ల‌ను సంద‌ర్శిద్దాం!

దక్షిణ భారతదేశంలో పర్యాటకులను ఆక‌ర్షించే ప్ర‌ధాన‌మైన గ‌మ్య‌స్థానాలు స్థానిక‌ వీధి మార్కెట్‌లు. వీటినే వీధి మార్కెట్లు లేదా బజార్లుగా ప‌రిగ‌ణిస్తారు. కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడు షాపింగ్ చేయడానికి అనువైన స్థలాలుగా వీధి మార్కెట్‌ల‌ను ఎంపిక చేయ‌వ‌చ్చు. ఇవి స్థానిక సంస్కృతిని ప్ర‌తిబింబించేలా ఉంటాయి. అందుకే పర్యాటకుల ప్ర‌ధాన గ‌మ్య‌స్థానాల జాబి

తాలో వీధి మార్కెట్‌లు చేర్చ‌బ‌డ్డాయి. ఈ స్థలాలు ఉత్తమమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తాయి. స్థానిక సంస్కృతిపై అవ‌గాహ‌న‌ పొందడానికి, ఉత్తమ షాపింగ్ అనుభవాన్ని చేరువ‌చేసే దక్షిణ భారతదేశంలోని ప్ర‌ఖ్యాత‌ వీధి మార్కెట్‌ల విశేషాల‌ను తెలుసుకుందాం.

అర్పోరా నైట్ మార్కెట్ - గోవా

అర్పోరా నైట్ మార్కెట్ - గోవా

గోవాలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో అర్పోరా నైట్ మార్కెట్ ఒకటి. ఈ మార్కెట్‌ను గతంలో ఇంగోస్ నైట్ మార్కెట్ అని పిలిచేవారు. స్థానికులు ఇప్పటికీ దీనిని అలానే చెబుతారు. రాత్రి స‌మ‌యంలో మిరుమెట్లు గొలిపే లైట్లు, అద్భుతమైన ఆహారంతోపాటు లైవ్ మ్యూజిక్ ఈ మార్కెట్‌కు నైట్‌పార్టీ మూడ్ వాతావరణాన్ని అందిస్తాయి. బట్టలు, బూట్లు, ఆభరణాలు మరియు తోలు ఉపకరణాలు కాకుండా, సావనీర్‌లు మరియు గృహాలంకరణను పొందడానికి మార్కెట్ గొప్ప ప్రదేశం.

కొంకణి వంటకాలు మరియు ఇతర స్థానిక రుచికరమైన వంటకాలు తప్పనిసరిగా ఇక్క‌డ రుచి చూడాల్సిందే. ఈ మార్కెట్ సందర్శించడానికి నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉత్త‌మ స‌మ‌యంగా చెప్ప‌వ‌చ్చు. సాయంత్రం 4 నుండి రాత్రి 11 వరకు శనివారాల్లో మాత్రమే మార్కెట్ తెరిచి ఉంటుంది

టిబెటన్ మార్కెట్ - ఊటీ

టిబెటన్ మార్కెట్ - ఊటీ

దీనిని టిబెట్ వాక్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఊటీలో షాపింగ్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి. హాయిగా ఉండే చలికాలం కోసం వివిధ రకాల ఉన్ని ఉత్పత్తులను సంద‌ర్శ‌కుల‌కు అందించడం కోసం ఇది స్థానికులు ఏర్పాటు చేసుకున్న వీధి బ‌జార్‌. శాలువాలు, కార్డిగాన్స్, జాకెట్‌లు, పుల్‌ఓవర్‌లు, హూడీలు, గ్లోవ్‌లు వంటి మ‌న్నికైన‌ దుస్తులకు టిబెట‌న్ మార్కెట్ కేరాఫ్ అడ్ర‌స్‌గా చెప్పొచ్చు. అంతేకాదు, టిబెటన్ హస్తకళలు మరియు గృహాలంకరణలు షాపింగ్ చేయడానికి కూడా ఇది మంచి ప్రదేశం. వారాంతాల్లో మాత్ర‌మే తెర‌చి ఉండే ఈ మార్కెట్‌ రాత్రి 9 నుండి ఉద‌యం 7:30 వరకు అందుబాటులో ఉంటుంది.

లాడ్ బజార్ - హైదరాబాద్

లాడ్ బజార్ - హైదరాబాద్

చార్మినార్ పక్కనే ఉన్న నాలుగు ప్రధాన రహదారులపై లాడ్ బజార్ విస్తరించి ఆహ్వానం ప‌లుకుతుంది. కుతుబ్ షాహీలు మరియు నిజాంల కాలం నుండి ఈ మార్కెట్ ఉంది. ఇది దేశంలోని పురాతన మార్కెట్లలో ఒకటిగా ప్ర‌సిద్ధి పొందింది. లాడ్ బజార్ ముత్యాలు మరియు అందమైన లక్క గాజులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు బేరసారాలు తప్పనిసరి. ఉదయం 11 నుండి రాత్రి 11 వరకు ఈ బ‌జార్ తెర‌చి ఉంటుంది.

కమర్షియల్ స్ట్రీట్- బెంగళూరు

కమర్షియల్ స్ట్రీట్- బెంగళూరు

కమర్షియల్ స్ట్రీట్ బెంగుళూరులోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఇది షాపింగ్ చేసేవారికి మరియు ఆహార ప్రియులకు స్వర్గధామంగా పేరుపొందింది. మార్కెట్‌లో అనేక దుకాణాలు మరియు స్టాల్స్ ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇవి వివిధ రకాల బట్టలు, బూట్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఎల‌క్ట్రానిక్‌ గాడ్జెట్‌లతోపాటు అనేక వస్తువులను విక్రయించే సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశం. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వ్యాపార లావాదేవీలు జరుగుతున్న మార్కెట్లలో ఇది ఒకటి. ఉదయం 10:30 నుండి రాత్రి 8 వరకు ఇక్క‌డ కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయి.

Read more about: south india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X