• Follow NativePlanet
Share
» »లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?

లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?

Written By: Venkatakarunasri

లేపాక్షి నిర్మాణ కౌశలానికి సాక్షి. రాచరికఠీవి అక్కడి శిల్ప సౌందర్యంలో కన్పిస్తుంది. ఆ రాతి శిల్పాల మాటున చారిత్రక విశేషాలు ఎన్నో.ఎన్నో. 16వ శతాబ్దపు కౌశల్యానికి,శిల్పకళానైపుణ్యానికి,చిత్రకళా విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం లేపాక్షి. లేపాక్షి పర్యాటకప్రదేశం.మరి అలనాటి అద్భుత రాతికట్టడాల విశేషాలను చూసొద్దాం రండి మరి. అనంతపురం జిల్లా హిందూపూర్ కి తూర్పుగా 18కి.మీ ల దూరంలోను, బెంగుళూరు - అనంతపురం జాతీయ రహదారిపై గల కుడికండ అడ్డరోడ్డుకు 6 కి.మీ ల దూరంలోను వుంది లేపాక్షి గ్రామం. క్రీ.శ. 15వ శతాబ్ది చివరలో ప్రారంభించబడిన ఈ దేవాలయ కట్టడ సముదాయాన్ని క్రీ.శ. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయల కొలువులో పెనుగొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపన్న పూర్తి గావించాడని తెలుస్తోంది.

తాడిపత్రి - అత్యద్భుతమైన దేవాలయాలు !!

భారతదేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎద్దు శిల్పం ఇక్కడ తప్ప మరెక్కడా లేదట. 27అడుగుల పొడవు, 15అడుగుల ఎత్తుతో చెక్కిన ఈ శిల్పం ప్రపంచ ప్రఖ్యాతిపొందింది. హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉన్నది. హిందూపూర్ నుండి లేపాక్షి 13 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 120 కిలోమీటర్లు. పట్టణ ప్రవేశంలోనే తోటలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది. ఈ పట్టణంలో ప్రధాన ఆకర్షణ వీరభద్ర స్వామి దేవాలయం. ఇవేకాక పురాతన శివాలయం, మహా విష్ణువుకు అంకితం చేయబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ముందుగా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం నుండి పర్యటన మొదలుపెడదాం !!

భక్తుల కోర్కెలను తీర్చే పెన్న అహోబిలం స్వామి !!

లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, ప్రతి స్తంభం మలిచిన తీరు వర్ణనాతీతం. "సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు."

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కళాతేజం లేపాక్షి

విజయనగర రాజుల పరిపాలనలో పరిఢవిల్లిన కళాతేజం లేపాక్షి.. లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే.

2. ఏడు పడగల విగ్రహం

2. ఏడు పడగల విగ్రహం

ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది. అలాగే నంది కుడి ఎడమపక్కలలో నృసింహస్వామి ముఖం చెక్కబడి ఉంటుంది. విగ్రహం కుడివైపున నిలబడి నంది దృష్టిలోంచి చూస్తే వీరభద్రాలయంలోని నాగరాజు ఏడు పడగల విగ్రహం కొంత స్పష్టతతో కనిపిస్తుంది.

PC: Reddy Bhagyaraj

3. ముఖ్య విశేషమే లేపాక్షి బసవన్న

3. ముఖ్య విశేషమే లేపాక్షి బసవన్న

విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన వీరభద్రాలయం గోడలమీద, పైకప్పుమీద అనేక కుడ్య చిత్రాలు మనోహరంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడి ముఖ్య విశేషమే లేపాక్షి బసవన్న.

PC:Pp391

4. యాత్రాస్థలం

4. యాత్రాస్థలం

వీరభద్రాలయం కూర్మశిల అనే కొండమీద నిర్మించబడింది. కొండ ఆకారం తాబేలు రూపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, యాత్రాస్థలంగానూ విలసిల్లింది.

PC:రహ్మానుద్దీన్

5. ప్రతిమలున్న పెద్ద శిల

5. ప్రతిమలున్న పెద్ద శిల

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.

PC:Bikashrd

6. శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు

6. శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు

లేపాక్షికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యయుగాలనాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉండే శివలింగాన్ని పెద్ద పాము చుట్టుకుని ఉన్నట్లుగా ఉండే శివలింగం ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో చక్కటి శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలు ఉంటాయి.

7. 70 స్తంభాలు

7. 70 స్తంభాలు

ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుంటారు కూడా...! నాట్య మంటపం- నాట్య మంటపంలో మొత్తం 70 స్తంభాలున్నాయి. ఇక్కడ రంభ, నారదుడు, తుంబురుడు మొదలైన వారి శిల్పాలు చెక్కి ఉన్నారు.

PC: P. L. Tandon

8. స్తంభం యొక్క రహస్యం

8. స్తంభం యొక్క రహస్యం

ఇది నాట్య మంటపంలో ఉంది. బ్రిటీష్ ఇంజనీర్లు కొంతమంది ఈ స్తంభం యొక్క రహస్యం కనుగొనాలి అని దీన్ని జరిపే ప్రయత్నం చేసారంట మొత్తం మంటపంలోని మిగిలిన స్తంభాలు కదిలేసరికి మొత్తం మంటంపం కూలుతుందేమో అని వదిలేసారంట. అలా దీనికి ఆధారం లేనప్పటికి మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట.

Tarun R

9. శ్రీ కృష్ణుడి చిత్రం

9. శ్రీ కృష్ణుడి చిత్రం

ఇక నాట్య మంటపం పై కప్పుకు ఉన్న వర్ణచిత్రాలు . ఇవి పూర్తిగా సహజ వర్ణాలతో వేయబడ్డవి. చాలావరకు చెక్కు చెదరకుండా ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయి. ఎటువైపు నుంచి చూసిన మనల్నే చూస్తున్నట్టు ఉండే శ్రీ కృష్ణుడి చిత్రం.

Indi Samarajiva

10. మహా లింగం

10. మహా లింగం

ఏడు శిరస్సుల నాగు ఛత్రంగా ఉన్న మహా లింగం. నంది దగ్గర నుంచి చూస్తే ఈ నాగు శిరస్సు కనపడుతుంది. ఆలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు మొదట వినాయకుడితో ప్రారంభించారంట.

Indi Samarajiva

11. లేపాక్షి ఎలా చేరుకోవాలి ?

11. లేపాక్షి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బెంగళూరు లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్నది. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని లేపాక్షి సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

లేపాక్షికి సమీపాన హిందూపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి. హిందూపూర్ లో దిగి, అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో, జీపులలో లేపాక్షి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి హిందూపూర్ కు బస్సులు కలవు. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులలో, జీపులలో ప్రయాణించి లేపాక్షి వెళ్ళవచ్చు.

12. లేపాక్షి శ్రీ వీరభద్రాలయ

12. లేపాక్షి శ్రీ వీరభద్రాలయ

అసంపూర్తి కళ్యాణ మండపంలో దక్షిణ దిక్కున యముని ప్రతిమ వుంది. ఈ ప్రతిమలో యముడు రౌద్రుడుగా, పెద్ద పెద్దవిగా విప్పార్చుకున్న కనులతోనూ, గుండ్రని కనుబొమలతోనూ మలచబడి కనిపిస్తాడు. నాలుగు చేతులు - పై చేతులలో గద, పాశం, క్రింది చేతులు అభయ, వరద ముద్రలలో వున్నాయి.

Vishal Prabhu

13. అందమైన రూపం

13. అందమైన రూపం

లేపాక్షిలోని కుబేరుని ప్రతిమ చాలా అందంగా తీర్చబడింది. నాలుగు చేతులు, పై రెండు చేతులలో గద, ఖడ్గం వుండి, క్రింది రెండు చేతులూ అభయ, వరద ముద్రలలో వున్నట్లుగా మలచబడి వుంది. కుబేరునిది కుండ లాంటి పొట్ట అని కూడా చెబుతారు. లేపాక్షి ప్రతిమలో మాత్రం అలా కనపడదు. అందమైన రూపంతో వుంటుంది ప్రతిమ.

Vijay Krishna

14. ప్రత్యేకత

14. ప్రత్యేకత

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణ మండపంలోని ఇంద్రుని ప్రతిమకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అన్ని హంగులతో చాలా అందంగా తీర్చబడి వున్న ఇంద్రుని ప్రతిమకు, నొసటన నిలువుగా మూడవ కన్ను చెక్కబడి వుండడం అనేది గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైనది సంగతి.

15. రాతి స్తంభాల పైన డిజైన్స్

15. రాతి స్తంభాల పైన డిజైన్స్

ఈ కల్యాణ మండపం ప్రక్కనే రాతి స్తంభాల పైన డిజైన్స్ ఉంటాయి . మొత్తం 36 స్తంభాలు. ఒక్కో స్తంభం పైన 4. అలా మొత్తం 144 డిజైన్స్ ఉన్నాయి. రిపీట్ కాకుండా చెక్కారు. ‘లేపాక్షి' ఒకసారి జ్ఞాపకంలోకి విచ్చేస్తే అంత తొందరగా వదిలి వెళ్ళదు. మిగతావి ఏవైనా సరే విడిచి పెట్టి, దృష్టి అటువేపు మళ్ళించాలిసిందే!!

Nagarjun Kandukuru

16. వసతిసౌకర్యాలు

16. వసతిసౌకర్యాలు

లేపాక్షి లో స్నాక్స్, వాటర్ బాటిల్ షాప్ లు తక్కువ. కనుక పర్యాటకులు వెంట ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ వెంట తీసుకువెళ్లడం మంచిది. హిందూపూర్, లేపాక్షి కి సమీప పట్టణం. ఇక్కడ హోటల్స్, లాడ్జీలు, రెస్టారెంట్లు కలవు. వసతి కి కూడా హిందూపూర్ సూచించదగినది.

Nagarjun Kandukuru

17. 3 రూపాలు

17. 3 రూపాలు

రెండు తలలు మూసి ఒక్కో తలను చూసినప్పుడు ఇందులో వరుసగా మేత మేస్తున్న ఆవు, దూడకు పాలు ఇస్తున్న ఆవు, తల ఎత్తి చూస్తున్న ఆవు అలా 3 రూపాలు కనపడుతాయి.

Nagarjun Kandukuru

18. హస్తకళల అద్భుతమైన మార్కెట్

18. హస్తకళల అద్భుతమైన మార్కెట్

లేపాక్షి లో హస్తకళల అద్భుతమైన మార్కెట్ ఉంది. ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్ వంటివి చాలా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి