Search
  • Follow NativePlanet
Share
» »ఏలగిరి - ఔరా .. అనిపించే సాహస క్రీడలు !

ఏలగిరి - ఔరా .. అనిపించే సాహస క్రీడలు !

By Mohammad

మన దేశంలో పేరుప్రఖ్యాతలు గాంచిన ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒక్కో ప్రదేశం .. ఒక్కో ఆనందాన్ని ఇస్తుంటుంది. ఆ ఆనందాలకు భిన్నంగా, పచ్చని ప్రకృతి అందాలను యాత్రికులకు అందించే ప్రదేశమే ఏలగిరి.

ఏలగిరి అందమైన హిల్ స్టేషన్. ఇది తమిళనాడు లోని వెల్లూరు (93 కి.మీ) జిల్లాలో కలదు. సముద్ర మట్టానికి 1048 మీటర్ల ఎత్తులో ఉండే ఏలగిరి 14 గిరిజన కుగ్రామాల సమూహం. ఏలగిరి రాగానే ఎవరికైనా కనిపించేది ఇక్కడి నిశబ్ధ, ప్రశాంత పరిసరాలే. ఇవే ఈ ప్రాంతంలో ఉండే అందాలు కూడా .. !

ఇది కూడా చదవండి : వెల్లూరులో బంగారు ఆలయాన్ని చూశారా ?

ఏలగిరి సందర్శించే పర్యాటకులు ఎత్తైన కొండ ల మీద నుండి అమాంతంగా కిందకు దూకేస్తుంటారు. అదేదో సూసైడ్ అనుకొనేరు !! అదొక సాహస క్రీడ. దాని పేరు 'పారాగ్లైడింగ్'. కేవలం ఇదొక్కటే కాదు .. పర్వతారోహణ, ట్రెక్కింగ్ వంటి అనేక సాహస క్రీడలను చేపట్టవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ కొండకోనల్ని చుట్టేద్దామ్ పదండి ..!

పుంగనూర్ సరస్సు

పుంగనూర్ సరస్సు

పుంగనూర్ సరస్సు, ఏలగిరి నడిబొడ్డున ఉన్నది. ఇదొక కృతిమ సరస్సు. పర్యాటకులను ఆకర్షించడానికి, ఆ ప్రాంత అందాల్ని మరింత పెంచడానికి ఈ సరస్సును నిర్మించారు. సుమారు 25 అడుగుల లోతు ఉండే ఈ సరస్సులో బోటింగ్, రోయింగ్ లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

చిత్ర కృప : Ashwin Kumar

నిలవూర్ సరస్సు

నిలవూర్ సరస్సు

నిలవూర్ సరస్సు కేవలం బోటింగ్ కోసం ఉద్దేశించబడినది. ఇక్కడికి తరచూ బోటింగ్ ఔత్సాహికులు వస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ ఒక పెద్ద ఉద్యానవనం ఉంటుంది. సాయంత్రంవేళ సందర్శకులు అందులో కూర్చొని కాలక్షేపం చేయవచ్చు.

చిత్ర కృప : mahul bhattacharya

దేవి ఆలయం

దేవి ఆలయం

నిలవూర్ సరస్సు ప్రాంతానికి సమీపాన కడవు నచియా కి చెందిన దేవి ఆలయం ఉన్నది. భక్తులు ఈ ఆలయంలో రాత్రుళ్ళు పూజలు (ప్రతి శుక్రవారం) చేయడానికి అధిక సంఖ్యలో వస్తారు. ఈ దేవి సర్వశక్తులు కలదని భక్తుల నమ్మకం.

చిత్ర కృప : Ashwin Kumar

తంబిరాన్ లోటస్ పాండ్

తంబిరాన్ లోటస్ పాండ్

నిలవూర్ లేక్ వద్ద ఈ మధ్య కొత్తగా తంబిరాన్ లోటస్ పాండ్ నిర్మించారు. ఈ పాండ్ సమీపంలో మోక్ష విమోచన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలో ప్రార్ధనలు చేస్తే వారి పాపాలు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం.

చిత్ర కృప : Mercy Paul

వేలవన్ ఆలయం

వేలవన్ ఆలయం

వేలవన్ ఆలయం లేదా మురుగన్ ఆలయం ఏలగిరి కొండల ఎత్తైన శిఖరాల్లో ఒకటిగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న అందమైన కొండ దృశ్యాలు వచ్చిపోయే పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రతి సంవత్సరం పండగల సమయాల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రధాన ఆకర్షణ ఘటోత్కచన్ విగ్రహం.

చిత్ర కృప : Ashwin Kumar

స్వామి మలై కొండ

స్వామి మలై కొండ

స్వామి మలై కొండ ను పర్వతారోహకులు ఎక్కవగా ఇష్టపడతారు. ఇదొక ట్రెక్ దారి. ట్రెక్ దారి రానుపోనూ సుమారు 6 కి.మీ. ఉంటుంది. ఈ హిల్స్ కేక్ రూపంలో ఉండి, ఆకాశాన్ని అంటినాయా ?? అన్నట్లు అనిపిస్తాయి.

చిత్ర కృప : Ramachandra Mohan

ట్రెక్ దారి

ట్రెక్ దారి

ట్రెక్ దారి పూర్తిగా కొండలతో నిండి ఉంటుంది. జువాది హిల్స్, పల్లమతి హిల్స్ .. ఇలా ఎన్నో కొండలను దారి పొడవునా గమనించవచ్చు. వీలైతే వాటిని ఎక్కుతూ ...దిగుతూ ... ఆనందించండి. ఈ కొండలను ఎక్కడం తేలిక.

చిత్ర కృప : Ilakkiaraj S

పై కొండ కు పర్వతారోహణ

పై కొండ కు పర్వతారోహణ

పైకొండకు పర్వతారోహణ ఏలగిరి కొండలు మీకు అందించే ఉత్తమమైన అనుభవాలలో ఒకటి. జలపాతాలు, పీక్ పాయింట్లు, వాలీ వ్యూ పాయింట్లు వంటి అందమైన ప్రదేశాలతో నిండిన అడవుల గుండా వెళ్ళే ఏడు ట్రెక్ దారులు దీని చుట్టూ ఉన్నాయి.

చిత్ర కృప : L.vivian.richard

ఏడు ట్రెక్ దారులు

ఏడు ట్రెక్ దారులు

1) పుంగనూర్ సరస్సు నుండి నిలవుర్ జలగంపరై వరకు, ట్రెక్ దూరం : 14 కి.మీ

2) పుంగనూర్ సరస్సు నుండి స్వామిమలై హిల్స్ వరకు , ట్రెక్ దూరం : 6 కి.మీ

3) మంగళం నుండి స్వామిమలై కు, ట్రెక్ దూరం : 2 కి.మీ

4) సమాచార కేంద్రం నుండి కూసి కుట్టై వరకు, ట్రెక్ దూరం : 1.5 కి.మీ

5) పుతుర్ నుండి పెరుమడు జలపాతాల వరకు, ట్రెక్ దూరం : 3 కి.మీ

6) బోట్ హౌస్ నుండి పులిచ కుట్తై వరకు, ట్రెక్ దూరం : 3 కి.మీ

7 ) నిలవుర్ నుండి కర్దిమునై వరకు, ట్రెక్ దూరం : 1.5 కి.మీ

పై న పేర్కొన్న ట్రెక్ దారులను ముందుగానే రిజర్వ్ చేసుకోవటం ఉత్తమం.

చిత్ర కృప : Ilakkiaraj S

టెలిస్కోప్ హౌస్

టెలిస్కోప్ హౌస్

టెలిస్కోప్ హౌస్ పొన్నేరి నుండి ఏలగిరి కొండలకు వెళ్ళే దారిలో ఘాట్ రోడ్డు మొదట్లో ఉంది. ఈ టెలిస్కోప్ వాలీ సందర్సనకి, స్తీప్ స్లోప్, జోలర్పేట్ విమానాలు, వనియంబడి చూడటానికి పర్యాటకులకు వీలుకల్పిస్తుంది. వీలుంటే వైను బప్పు సౌర పరిశోధన సంస్థ ను కూడా సందర్శించండి. ఇక్కడ ఏషియాలోనే పెద్దదైన వైను బప్పు టెలిస్కోప్ ఉంది.

చిత్ర కృప : David Brossard

ప్రభుత్వ మూలికల మరియు పండ్ల క్షేత్రం

ప్రభుత్వ మూలికల మరియు పండ్ల క్షేత్రం

ప్రభుత్వ మూలికల క్షేత్రం పుంగనూర్ సరస్సు కి సమీపంలో ఉంది. ఈ క్షేత్రం ఔషధ గుణాలు కలిగిన మొక్కలకు, అరుదైన మూలికలకు నిలయం. ఆయుర్వేద వైద్యంలో వీటిని వినియోగిస్తారు. పండ్ల క్షేత్రాలు అతనవూర్, నిలవూర్ వద్ద ఉన్నాయి. ఇవి నిజానికి బేర్ పండ్లు, పూలు కలిగిన అనేక రకాల మొక్కలు, చెట్లతో నిండి ఉన్న బొటనికల్ గార్డెన్. ఈ గార్డెన్ మధ్య తిరుగుతూ తియ్యని పండ్ల వాసన మాధుర్యాన్నీ అనుభవించవచ్చు.

చిత్ర కృప : Aravindhakshan Ramakrishnan

నేచర్ పార్క్

నేచర్ పార్క్

12 ఎకరాల్లో విస్తరించి ఉన్న నేచర్ పార్కు, పుంగనూర్ సరస్సు పక్కనే ఉంది. ఈ పార్కులో అనేక సుగంధ ద్రవ్యాల మొక్కలను నాటారు. ఈ పార్క్ లో ఒక కృత్రిమ జలపాతం, పిల్లల పార్కు, మ్యూజికల్ ఫౌంటెన్, ఎక్వేరియం, సీజనల్ గార్డెన్, వెదురు ఇల్లు, పోలీ హౌస్ లు ఆకర్షణలు ఉన్నాయి.

చిత్ర కృప : Veda Balan

నేచర్ పార్క్

నేచర్ పార్క్

పార్క్ ప్రవేశ రుసుం పెద్దలకైతే 15 రూపాయలు, పిల్లల కైతే 5 రూపాయలు గా ఉన్నది. సాయంత్రం వేళ మ్యూజికల్ ఫౌంటెన్ చూడాలనుకుంటే మరో 25 రూపాయలు అదనంగా చెల్లించాలి. ఈ పార్క్ ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది.

చిత్ర కృప : Karthik A

కోడైవిలా

కోడైవిలా

కోడైవిలా, వేసవి పండగ. ఏలగిరి లో నివసించే గ్రామీణ ప్రజలు ప్రతి ఏటా మే - జూన్ మధ్యలో మూడు రోజులపాటు ఈ పండగ ను జరుపుకుంటారు.

చిత్ర కృప : Aloft Chennai

ఏలగిరి ఎలా చేరుకోవచ్చు ?

ఏలగిరి ఎలా చేరుకోవచ్చు ?

విమాన మార్గం

ఏలగిరి కి సమీపాన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (195 కి.మీ), చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (217 కి.మీ.) లు ఉన్నాయి. ఈ రెండు విమానాశ్రయాల నుండి ఏలగిరి చేరుకోనేందుకు క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

ఏలగిరి కి సమీపాన 23 కి.మీ. దూరంలో జోలర్పెట్టై జంక్షన్ కలదు. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్ నుండి వచ్చే రైళ్ళన్నీ ఇక్కడ ఆగుతాయి. జోలర్పెట్టై నుండి రూ. 500 తో క్యాబ్ అద్దెకు తీసుకొని ఏలగిరి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం / బస్సు మార్గం

తిరత్తూర్, కోయంబత్తూర్, బెంగళూరు, చెన్నై, క్రిష్ణగిరి, హోసూర్, సాలెం, వెల్లూర్, వానయం బడి వంటి నగరాల నుండి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏలగిరి కి తమిళనాడు లోని పొంనెరి నుండి చక్కటి రోడ్డు వ్యవస్థ కలదు. చాలా మంది సొంత వాహనాల్లో వచ్చే పర్యాటకులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.

చిత్ర కృప : SiDDU Photography

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X