• Follow NativePlanet
Share
» »ఇష్టార్ధాలను శీఘ్రంగా పూరించే దేవి ఈమె !!!

ఇష్టార్ధాలను శీఘ్రంగా పూరించే దేవి ఈమె !!!

మన దేశంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో అతి ముఖ్యమైనవి అష్టదశ శక్తి పీఠాలు. ప్రతి క్షేత్రం దానికదే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ప్రసిద్ధి చెందింది. వాటిలో మానసా దేవి దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం ఆలయ గర్భగుడిలో మానసా దేవి వెలసి అత్యంత మహిమాన్విత శక్తిస్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ ఆలయం పంచ తీర్థాలు లేదా ఐదు తీర్థాలలో ఒకటిగా వుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఈ శక్తిని ఆరాధిస్తారు. కాబట్టి ఆ దేవాలయం యొక్క స్థలపురాణం ఏమిటి? ఆ తల్లి శక్తి ఏమిటి? ఆమె ఎక్కడ వెలసియున్నది? అనే అనేకమైన ప్రశ్నలకు సమాధానంగా వ్యాసంమూలంగా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

ఈ మానసా దేవి దేవాలయం భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పవిత్రమైన నగరం హరిద్వార్ లో వుంది. ఈ దేవాలయం ఒక హిందూ దేవాలయం. మానస దేవికి అంకితం చేయబడినది. ఈ దేవాలయం హిమాలయాల యొక్క దక్షిణ పర్వత శ్రేణులలోని శివాలిక్ కొండల మీద బిల్వా పర్వతం పైన వుంది. ముఖ్యంగా ఈ తీర్థక్షేత్రాన్నిను బిల్వా తీర్థం అని పిలుస్తారు.

pc: Antoine Taveneaux

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

ఆశ్చర్యం ఏంటంటే ఒకానొకకాలంలో ఆదివాసీలచే పూజించబడిన ఈ తల్లి అనేక వేల సంవత్సరాల తరువాత హిందూధర్మంలో పూజించడం ప్రారంభించటం జరిగింది. హాలాహలాన్నిసేవించిన పరమేశ్వరునికి విషప్రభావం నుంచి మానస దేవి రక్షించినది. అదేవిధంగా పరమశివుడు ఆమె కోరికను మెచ్చి తన కూతురిగా స్వీకరించాడు అనే కథ ప్రచారంలో వుంది.

pc: Antoine Taveneaux

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ఈ మానసాదేవి భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తుంది. అందువల్ల చాలామంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. వారి కోరికలను నెరవేర్చటానికి ఈ తల్లి వెలిసిన స్థలంలో ఒక పవిత్రమైన చెట్టు ఉంది. వారు ఆ చెట్టు దగ్గర నిలబడి భక్తులు తమ కోర్కెలను కోరుకుని దారం కడితే శీఘ్రంగా ఇష్టార్థాలు నెరవేరుతాయని నమ్ముతారు.

pc:Madrishh

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

భక్తులు వారి కోరికలు నెరవేరిన తరువాత, వారు ఈ దేవాలయానికి వచ్చి తమ దారాలను విప్పుతారు. ఆ తల్లిని భక్తితో పూజించటానికి టెంకాయలు, పండ్లు, పూలమాలలు మరియు ధూపదీపాలను మానసాదేవికి సమర్పించి వెళ్తారు.

pc: Ekabhishek

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

ఆరాధనకు యోగ్యమైన స్థలం ఇది, హరీద్వార్ లోని మూడు పీఠాలలో ఇది కూడా ఒకటి. ఇతర రెండు పీఠాలు ఏవంటే ఒకటి చండి దేవి దేవాలయం మరొకటి మాయాదేవి దేవాలయం

pc:Antoine Taveneaux

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

మానసాదేవి ఆలయం పురాతన ఆలయాలలో ఒకటి. హరిద్వారాన్ని సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ తల్లిని దర్శించుకుంటారు.ఈ పవిత్రమైన దేవాలయం అనేక శతాబ్దాలనుంచి హరిద్వార్ లో పవిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది.

pc: Antoine Taveneaux

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

ఈ దేవాలయం నుంచి గంగానది మరియు హరిద్వార్ న్ని చూడవచ్చును. ఈ తీర్థయాత్రకు వెళ్ళాలంటే మెట్లమార్గం ద్వారా వెళ్ళాలి. ఈ ఆలయానికి ఒక "తాడు మార్గం" కూడా ఉంది. ఈ సేవను "మానాసాదవి ఉడాన్ కటోలా" అని కూడా పిలుస్తారు. యాత్రికులకు ఈ ప్రదేశంలో చండి దేవి ఆలయం కూడా ఉంది.

pc:Antoine Taveneaux

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

ఈ తాడు-మార్గం సుమారు 540 మీటర్లు (1,770 అడుగులు) మరియు ఎత్తు 178 మీటర్లు (584 అడుగులు) వుంది. సాధారణ రోజులలో ఈ దేవాలయాన్ని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు మానసాదేవిని దర్శించుకొనవచ్చును.

pc:Dan Searle

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

పార్వతి దేవి రూపంలో "మానస" మరియు "చండి" రూపంలో రెండు దేవతలు లీనమై వెలసినారని అక్కడి ప్రజలు నమ్ముతారు.

Antoine Taveneaux

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

అందువల్లనే మనసా దేవి దేవాలయం బ్లూ మౌంట్ ఎదురుగా బిల్వ పర్వతంమీద వెలసియున్నది.

Antoine Taveneaux

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

చేరుకోవడానికి ఎలా ?

మానస దేవి టెంపుల్ కి 2 విధాలుగా చేరుకోవచ్చు. కాలునడక లేదా కేబుల్ కారు ద్వారా. హరిద్వార్, స్టేషన్ నుండి కేవలం 1 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ నుండి 215 km, డెహ్రాడూన్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో, డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రిషికేశ్ నుండి 30 కిలోమీటర్లదూరంలో,మస్సూరు నుండి 85కిమీ ల దూరంలో వుంది. మీరు సులభంగా రిక్షా ద్వారా ఆలయానికి చేరవచ్చును.

ఇది కూడా చదవండి:

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి