Search
  • Follow NativePlanet
Share
» »సంతానభాగ్యాన్ని ప్రసాధించే పవర్ ఫుల్ స్నేక్ టెంపుల్స్: తప్పక సందర్శించండి

సంతానభాగ్యాన్ని ప్రసాధించే పవర్ ఫుల్ స్నేక్ టెంపుల్స్: తప్పక సందర్శించండి

దేవుళ్ల గొప్పతనం, దేవుళ్ళ మహిళలు, రాక్షసుల క్రూరత్వం, దయ్యాల భయంకరం, పుణ్య క్షేత్రాలు, స్వయంబుగా వెలసిన క్షేత్రాలు, దేవుళ్ళ కథలు, పురాణాల గాథలు, ఇతిహాసాలు ఇలా ఎన్నో విశేషాలు, వింత ఆలయాలు, వింత ఆచారాలు

దేవుళ్ల గొప్పతనం, దేవుళ్ళ మహిమలు, రాక్షసుల క్రూరత్వం, దయ్యాల భయంకరం, పుణ్య క్షేత్రాలు, స్వయంబుగా వెలసిన క్షేత్రాలు, దేవుళ్ళ కథలు, పురాణాల గాథలు, ఇతిహాసాలు ఇలా ఎన్నో విశేషాలు, వింత ఆలయాలు, వింత ఆచారాలు చాలా మందికి తెలియని అసలు రహస్యాలు, మీలో చాలా మందికి తెలిసే ఉండవచ్చు, కానీ మనుష్యులతో స్నేహం చేసే విష సర్పాలు, వాటిని దేవతలుగా భావించే భక్తులు. వాటికి ఆలయాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? నమ్మలేకపోతున్నారా?

భారతీయ పురాణ శాస్త్రం, మరియు సంస్కృతిలో పాములకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన ఇండియాలో భక్తులు పాములకు గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నారు. అందుకే పురాతన కాలం నుండి ఉన్న ఆలయాల్లో పాముల విగ్రహాలు కనబడుతాయి. ఇప్పటికీ మన హిందూ దేవాలయాల్లో నాగరాళ్ళు, నాగదేవతల ప్రతిమలు, విగ్రహాలు ఉండటం మీరు గమనించే ఉంటారు.

వాస్తవానికి పాములను చంపడం మహా పాపంగా భావిస్తారు. ప్రమాదకర స్థితిలో చంపినట్లైతే అవి మనల్ని ఏడేడు జన్మలు వెంటాడుతాయాని, పగ పడుతాయని నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. అందుకే పాముదేవతల ఆగ్రహానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉంటూ, పూజలు చేస్తుంటారు. మన ఇండియాలో ప్రసిద్ది చెందిన పాము దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి...

1. మన్నారశాల టెంపుల్:

1. మన్నారశాల టెంపుల్:

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలోని మన్నారశాల టెంపుల్ . ఈ ఆలయాన్ని లార్డ్ పరుశురామ నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో శ్రీ నాగరాజు స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో దాదాపు 30000లకు పైగా నాగదేవతలున్నాయి. కేరళాలోనే అతి పెద్ద స్నేక్ టెంపుల్ . ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచంలో నలుమూల నుండి భక్తులు ఈ ఉత్సవాలకు వస్తుంటారు. మూడు రోజులపాటు జరిగే ఆయిల్యం ఉత్సవాలలో పొంగలి వండితే మహిళలకు సంతాన భాగ్యంతోపాటు వారి కోరికలు సిద్ధిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
PC: Vibhitha Vijay

2. కుక్కే సుబ్రమణ్యం:

2. కుక్కే సుబ్రమణ్యం:

కర్ణాటకాలో అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రమణ్య గ్రామములో కుక్కే సుబ్రమణ్య దేవస్థానం కొలువై ఉంది. మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి. కర్ణాటకాలో లార్డ్ సుబ్రమణ్యంను కార్తికేయ లేదా మురగన్ అని పిలుస్తారు. పురాణ శాస్త్రం ప్రకారం సుబ్రమణ్య స్వామి పాములకు దేవుడని అంటుంటారు. కర్ణాటకాలో దక్షణ కన్నడ ప్రాంతంలో వెలసిన ఫేమస్ స్నేక్ టెంపుల్. భక్తులు ఇక్కడకి సర్పదోష నివారణ కోసం వస్తుంటారు. ఈ దేవస్థానం వెనుక వైపు సుప్రసిద్దమైన కుమారపర్వతం ఉంది. ఈ దేవస్థాన ప్రవేశ మార్గానికి ఈ పర్వతం వర్ణనాతీథమైన అందాన్ని తెచ్చిపెట్టింది.
PC:Shiva Shankar

3.భుజంగ నాగ టెంపుల్:

3.భుజంగ నాగ టెంపుల్:

గుజరాత్ లోని భుజ్ శివార్లలో ఉన్న పురాతన కోట భుజియా కోట. ఈ కోట నాగనాయకులకు(నాగక్లాన్)కు చెందినది. భుజంగా నాయకుల్లో చివరి వాడైన నాగా క్లాన్ ఒక యుద్దంలో మరణించాడు. అందుకు జ్జాపకార్థంగా అక్కడి ప్రజలు భుజంగా నాగ టెంపుల్ ను నిర్మించుకొన్నారు.ఈ టెంపుల్ భుజియా హిల్ పై ఉన్నది. నేడు ఈ ఆలయాన్ని భుజియా నాగ్ టెంపుల్ అని పిలుస్తారు.
PC: Nizil Shah

4. తిరునాగేశ్వర టెంపుల్ :

4. తిరునాగేశ్వర టెంపుల్ :

తిరునాగేశ్వరంలో నాగనాథ స్వామి టెంపుల్ మరియు ఊప్లియప్పన్ టెంపుల్ రెండూ ప్రధాన దేవాలయాలు. ఈ రెండు ప్రఖాత ఆలయాల్లో నాగనాథ స్వామి టెంపుల్ శివుని దేవాలయంగా ప్రసిద్ది చెందినది. పురాణ శాస్త్రం ప్రకారం ఈ దేవాలయంలో ఆదిశేషుడు, కార్కోటకన్ మరియు దక్షన్ అనేవి శివుడిని పూజించే పూజలు.
PC: Infocaster

5. నాగర్ కోయిల్ నాగరాజ టెంపుల్:

5. నాగర్ కోయిల్ నాగరాజ టెంపుల్:

నాగర్ కోయిల్ పట్టణంలో నాగరాజ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఆనంద కృష్ణ మరియు నాగరాజ రెండు ప్రధాన దైవాలుగా ఉన్నారు. ఐదు తలలున్న నాగ దేవతకు భక్తులు పసుపు మరియు పాలతో విగ్రహాలను అభిషేకిస్తారు. లార్డ్ వాసుకి (సర్పాలకు గొప్ప రాజు) ప్రధాన దేవుడిగా పూజలు చేస్తారు.

6. ఘాటి సుబ్రమణ్యం:

6. ఘాటి సుబ్రమణ్యం:

బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలో ఘాటీ సుబ్రమణ్యం టెంపుల్ ఉంది. సుబ్రమణ్యం స్వామికి ఈ గుడి అంకితమివ్వబడినది. సర్ప దేవాలయాల్లో ఘాటి సుబ్రమణ్యం దేవాలయం ప్రముఖమైనది. ఈ దేవాలయంలో కూడా ఒకే సారి ఇద్దరి దేవుళ్ళను పూజిస్తారు. ఒకరు లార్డ్ సుబ్రమణ్యం, మరొకరు లార్డ్ నరసింహ. ఇండియాలో పాపులర్ స్నేక్ టెంపుల్స్ లో ఘాటీ సుబ్రమణ్య టెంపుల్ ఒకటి.
PC: Vedamurthy J

7. అగసనహల్లి నాగప్ప:

7. అగసనహల్లి నాగప్ప:

పురాణ శాస్త్రం ప్రకారం అగస్త్యుడు ఇక్కడ ధ్యానం చెసాడానికి చెబుతారు. ఈ దేవాలయం దవనగరే సమీపంలో అగసనాహాల్లిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం, లార్డ్ నరసింహస్వామి, లార్డ్ సుబ్రమణ్య స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆయలం చుట్టూ ఉన్న పాములు బంగారు వర్ణంలో కనబడుతాయి. అగసన్నహల్లి నాగప్ప దేవాలయం గురించి అనేక రహస్యాలున్నాయి, అందువల్లే ఇది భారతదేశంలో ఒక టాప్ స్నేక్ టెంపుల్ గా పిలువబడుతున్నది.

8.శేష నాగు లేక్:

8.శేష నాగు లేక్:

కాశ్మీర్ లోయలో శేషనాగ్ సరస్సు పవిత్ర స్థలాలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఇక్కడ సరస్సును శేషనాగ్ (పాములకు రాజు)సృష్టించబడింది. ఈ సరస్సులో ఇంకా శేషనాగ్ జీవించి ఉన్నాడని అక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం పహల్గంకు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా అమరనాథ్ యాత్రికులు శేషనాగ్ సరస్సును సందరిస్తారని చెబుతారు. ఈఆలయంలోని నాగదేవుల్లు చాలా శక్తివంతులని చెబుతారు.చాలా మంది ఈ నాగదేవతల శక్తులను ఎక్కువగా నమ్ముతారు.

PC: Akhilesh Dasgupta

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X