Search
  • Follow NativePlanet
Share
» »జాతకంలోని దోషాలను పరిహారం చేసుకోవటానికి ప్రఖ్యాతి గాంచిన క్షేత్రాలు ఇవి...

జాతకంలోని దోషాలను పరిహారం చేసుకోవటానికి ప్రఖ్యాతి గాంచిన క్షేత్రాలు ఇవి...

కొన్నిసార్లు జాతకంలో దోషాలవలన జీవితంలో చేయగలిగే అనేక కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురౌతాయి.ఆలస్యంగా వివాహం కావటం,నిరుద్యోగం, సంతానం లేకుండా వుండటం ఇంకా అనేక సమస్యలు ఎదురవ్వటం ఈ జాతకంలోని దోషాలవల్లనే.

By Venkatakarunasri

కొన్నిసార్లు జాతకంలో దోషాలవలన జీవితంలో చేయగలిగే అనేక కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురౌతాయి.ఆలస్యంగా వివాహం కావటం,నిరుద్యోగం, సంతానం లేకుండా వుండటం ఇంకా అనేక సమస్యలు ఎదురవ్వటం ఈ జాతకంలోని దోషాలవల్లనే. అందువలన అనేకమంది జ్యోతిష్యుల వద్దకు మరియు దేవాలయాలకు పరిష్కారం కోసం వెళ్ళడం సర్వసాధారణమైన విషయం.

ఇంకొన్ని రాహువు, కేతువు మరియు శని దోషాలవలన శుభకార్యాలకి ఆటంకాలు ఎదురవ్వటం సహజం. కాబట్టి ఆ దోషాలన్నిటినీ ఏవిధంగా పరిహారం చేసుకోవాలి? అనే సందేహం కలగటం సర్వసాధారణం. దీనికి అదృష్టం వుండాలంటే ఇటువంటి పరిహారాలకి కొన్ని క్షేత్రాలు మరియు దేవాలయాలు మన భారతదేశం అంతటా ప్రసిద్ధిచెంది వున్నాయి.ఇది కూడా ఒక మత పర్యటన. మన దక్షిణభారతదేశంలో అనేక మహిమాన్వితమైన దేవాలయాలు వున్నాయి.మరి ఆ దేవాలయాలు ఏవేవి?అనే దానిని గురించి వివరంగా వ్యాసం మూలంగా తెలుసుకుందాం.

కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయం

కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయం

కొంతమంది జ్యోతిష్యుల ప్రకారం సర్పదోషం సాధారణంగా అనేక జాతకాలలో కనిపిస్తుంది.దీనిని పరిహారంచేసుకొనటానికి, కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ మహిమాన్వితమైన దేవాలయంలో సుబ్రమణ్యస్వామి వెలసియున్నాడు. జాతకంలో ముఖ్యంగా సర్పదోష నివారణకి అతి ప్రముఖమైన స్థలాలలో ఇది కూడా ఒకటి. ఈ క్షేత్రం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రసిద్ధి చెందిన సర్పదోష నివారణ ప్రాంతం.

PC:karthick siva

శ్రీ కాళహస్తి

శ్రీ కాళహస్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుజిల్లాలో శ్రీకాళహస్తి పట్టణంలో వున్న శ్రీకాళహస్తీశ్వర దేవాలయం రాహుకేతు దోషాల పరిహారంకోసం ఇక్కడ విశేషంగా పూజలు నిర్వహిస్తారు.ఇది ముఖ్యంగా కాలసర్పదోషాన్ని నివారించే క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది.ఇదొక విశేషమైన క్షేత్రం. పంచభూతలింగాలలో వాయువును సూచిస్తుంది.అంతేకాదు రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. రాహు-కేతు దోషమున్నవారు ఇక్కడ సంలో 2 సార్లు అంటే ఉత్తరాయణ (జనవరి 15 నుంచి జులై 15 వరకు) మరియు దక్షిణాయణ (జులై 15 నుంచి జనవరి 15 వరకు) సమయంలో ఈ దోషనివారణా పూజ చేయవచ్చు.

PC:Krishna Kumar Subramanian

మన్నారశాలా దేవాలయం

మన్నారశాలా దేవాలయం

మన్నారశాలాలో వున్న నాగరాజుని దేవాలయం కేరళలోని సర్పదేవాలయాలలో అతిపెద్ద ఆలయం. కేరళలోని అలప్పుజ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ క్షేత్రానికి పరశురాముని స్థలపురాణం కూడా వుంది.నాగపూజకు ఇది ఒక ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం.ఇంకొక విశేషం ఏంటంటే ఈ దేవాలయంలో అన్ని పూజలు మహిళలే చేస్తారు. అంటే ఇక్కడ స్త్రీలే అర్చకులు.ఈ ఒక్క క్షేత్రంలోనే 30,000 కి అధికంగా సర్పాలచిత్రాలు, ప్రతిమలను చూడవచ్చును.

PC:Vibitha vijay

త్రయంబకేశ్వర దేవాలయం

త్రయంబకేశ్వర దేవాలయం

పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఈ త్రయంబకేశ్వర దేవాలయంలో నాగాబలి లేదా కాళసర్పదోషాలను నివారించటానికి అనేక పూజలను ఇక్కడ ఆచరిస్తారు.ఇది జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన స్థాలమైనందున భక్తితో ఇక్కడ పూజలను ఆచరిస్తారు.ఇంతకీ ఈ పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో వుంది. నాశిక్ పట్టణంనుంచి కేవలం 30కిమీ ల దూరంలో వుంది.

PC:Niraj Suryawanshi

మహాకాళేశ్వర దేవాలయం

మహాకాళేశ్వర దేవాలయం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వున్న మహాకాళేశ్వర దేవాలయం కూడా కాళసర్ప దోషాలని నివారించటానికి సందర్శించవలసిన క్షేత్రాలలో ఒకటి. ఇది 12 పవిత్రమైన జ్యోతిర్లింగ ప్రదేశాలలో ఒకటి.

PC:Ssriram mt

ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయం

ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయం

సర్ప క్షేత్రాల్లో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం ప్రఖ్యాతిగాంచిన సర్పక్షేత్రమైతే, ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయం బెంగుళూరికి అతిసమీపంలో వుండే సర్పక్షేత్రం. ఈ దివ్యమైన క్షేత్రం బెంగుళూరినుంచి కేవలం 60కిమీల దూరంలో వుంది.దక్షిణభారతదేశంలోని నాగారాధన మరియు దోషాలపరిహారానికి సరైన స్థలం అనే చెప్పవచ్చును. ఆదివారం మరియు మంగళవారాలందు వేలకొలది భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి తమ దోషాలనకు పరిహారం చేసుకుంటారు.

మోపిదేవి

మోపిదేవి

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో చల్లపల్లి నుంచి కేవలం 5కిమీ ల దూరంలో వున్న మోపీదేవి సుబ్రహ్మణ్యస్వామిదేవాలయం నాగదోష పరిహార పూజలకు పేరుగాంచిన ప్రదేశం.ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి శివలింగరూపంలో వెలసియున్నాడు.భక్తుల సకల ఇష్టార్థాలను స్వామి నెరవేర్చుతాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X