Search
  • Follow NativePlanet
Share
» »కురుదుమలె - దేవుళ్ళు కలిసే ప్రదేశం !

కురుదుమలె - దేవుళ్ళు కలిసే ప్రదేశం !

By Mohammad

అవునండీ ..! మీరు వింటున్నది నిజమే. కురుదుమలె దేవుళ్ళ పిక్నిక్ స్పాట్. ఇక్కడికి దేవుళ్ళు తరచూ వచ్చి కలుసుకొనేవారని కధ వ్యాప్తిలో ఉన్నది. ఈ పేరులోని మాటలైన కురుదు మరియు మలె అంటే కలిసే ప్రదేశం అని అర్థం. ఇంతకీ కురుదుమలె ఎక్కడ ఉంది ? అక్కడికి ఎలా చేరుకోవాలి ? ఆ ప్రాంత విశిష్ఠత ఏమిటో మీకూ తెలుసుకోవాలని లేదూ ..! అయితే పదండి కర్ణాటక రాష్ట్రానికి ?!

కురుదుమలె కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో కలదు. ఇక్కడ గణేశుని విగ్రహం చాలా మహిమ కలదని స్వయాన ఇతిహాసాలే చెబుతున్నాయి. గణేశుడి విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కలిసి స్వయంగా ప్రతిష్టించారని ఇతిహాసం చెబుతుంది. ఈ విగ్రహానికి విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు.

ఇది కూడా చదవండి : చిక్కబళ్లాపూర్ - ఆకట్టుకొనే ప్రదేశాలు(86 KM) !

సోమేశ్వర ఆలయం

సోమేశ్వర ఆలయం

చిత్ర కృప : Dineshkannambadi

సోమేశ్వర ఆలయం

సోమేశ్వర దేవాలయంలో హిందువుల దైవం శివలింగం ఉంటుంది. ఎంతో మహిమాన్విత లింగంగా భక్తులు దీనిని ఆరాధిస్తారు. ఈ దేవాలయం గణేశ దేవాలయం కంటే పురాతనమైనది. ఈ దేవాలయ ఆవరణలో ఇంకా చిన్న గుళ్ళ శిధిలాలు కనపడుతూంటాయి.

సోమేశ్వర ఆలయంలోని విగ్రహాలు

సోమేశ్వర ఆలయంలోని విగ్రహాలు

చిత్ర కృప : vijayashankar metikurke

సోమేశ్వర దేవాలయం చోళ రాజుల కాలంలో నిర్మించారు. దేవాలయం పై చెక్కడాలు చరిత్ర ప్రసిద్ధి గాంచిన తండ్రి కుమారులైన జక్కనాచారి అతని కుమారుడు డంకనాచారి నిర్వహించారు. అన్నిటికంటే విశేషమైన అంశం ఏమంటే, ఈ దేవాలయం పూర్తిగా రాళ్ళతోనే చెక్కబడింది. దీనికి పునాదులు లేవు.

గణేశ దేవాలయం

గణేశ దేవాలయం

చిత్ర కృప : Ganesha1

గణేశ దేవాలయం

కురుదుమలె లోని గణేశ ఆలయం ఎంతో మహిమకలది మరియు పవిత్రమైనది. నిర్మాణం యొక్క తీరు , గోడలపై చెక్కిన చెక్కడాలను గమనిస్తే, ఈ దేవాలయం విజయనగర కాలంలో నిర్మించబడింది అని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : అంతరగంగ - సాహస క్రీడల సమాహారం (44KM) !

ఇతిహాసం మేరకు దేవాలయంలోని గణేశ విగ్రహాన్ని హిందూ ఆరాధ్య దైవాలైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు పరమేశ్వరులు కలిసి ప్రతిష్టించారు. అయితే, ఈ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారనేదానికి రుజువులు, సాక్ష్యాలు లేవు.

14 అడుగుల గణేశ విగ్రహం

14 అడుగుల గణేశ విగ్రహం

చిత్ర కృప : vijayashankar metikurke

దేవాలయంలోని గణేశ విగ్రహం పెద్దది. దీని ఎత్తు సుమారు 14 అడుగుల మేర ఉంటుంది. విగ్రహం చాలా ఏళ్ల పాటు బహిరంగ ప్రదేశంలోనే పూజలు అందుకొనేది. ఆ తర్వాత ఈ విగ్రహానికి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారం ద్వారా రుజువైంది. ఈ దేవాలయానికి భక్తులు ప్రతి సంవత్సరం చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల నుండి కూడా వస్తుంటారు.

కురుదుమలె ఎలా చేరుకోవాలి ?

కురుదుమలె ఎలా చేరుకోవాలి ?

చిత్ర కృప : vijayashankar metikurke

కురుదుమలె ఎలా చేరుకోవాలి ?

విమానాశ్రయం : కురుదుమలె సమీపాన 110 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి కురుదుమలె చేరుకోవచ్చు.

రైల్వే స్టేషన్ : కురుదుమలె లో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన 10 కిలోమీటర్ల దూరంలో హవేరి రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం : బెంగళూరు, చిక్కబళ్లాపూర్, కోలార్ తదితర సమీప ప్రాంతాల నుండి ప్రతిరోజూ కురుదుమలె కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X