» »ధర్మశాల లో ఏమి చూడాలి ?

ధర్మశాల లో ఏమి చూడాలి ?

Posted By:

ధర్మ శాల హిమాచల్ ప్రదేశ్ లో ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది దలై లామా వుండే ప్రదేశం. అంతే కాదు, చైనా నుండి బహిష్కరించబడిన టిబెటన్ లు కూడా ఇక్కడ అధికం. మంచు కొండలు, చక్కటి సంస్కృతి, అందమైన, పురాతనమైన ఆరామాలతో ధర్మశాల ఒక మంచి పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకొంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ త్రియుండ్ హిల్ దీనిని ధర్మశాల ఆభరణం అంటారు. ధర్మశాలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఇక్కడ పర్యాటకులు అనేక సాహసక్రీడలు కూడా ఆచరించవచ్చు.

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

భాగ్సు జలపాతాలు
భాగ్సు జలపాతాలు, భాగ్సు విలేజ్ కు ఒక కి. మీ. దూరంలో కలవు. వెళ్ళు మార్గం కొంచెం కష్టతరమైనప్పటికి అక్కడకు చేరుకొని హాయి అయిన స్నానం చేయవచ్చు.

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

దళ్ సరస్సు
దళ్ సరసు ఒక కి. మీ. విస్తీర్ణం కలిగి చుట్టూ రోడో దేన్ద్రాన్ చెట్లు, దేవదార్ మరియు జూనిపర్ చెట్లు కలగి వుంటుంది.

Pic Credit: Basharat Alam Shah

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

త్రైయుండ్
త్రియుండ్ ధౌళాధర్ ప్రదేశం కొండల కింద కలదు. మేక్లీద్ గంజ్ నుండి ట్రెక్కింగ్ లో చేరవచ్చు. ఈ ప్రదేశం నుండి పర్వతాల, లోయల అద్భుత దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ రాత్రి బసకు వసతులు కలవు.
Pic Credit: Travelling Slacker

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

మేక్లీద్ గంజ్
మేక్లీద్ గంజ్ ఒక వ్యాపార కేంద్రం ఇక్కడ మీరు హండి క్రాఫ్ట్ వస్తువులు కొనవచ్చు. టిబెట్ ఆహారాలు, దొరుకుతాయి. ఇక్కడ ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం ప్రధాన ఆకర్షణ

Pic Credit: Kiran Jonnalagadda

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

బీర్
బీర్ పర్యటన పర్యావరణ పర్యటనకు పెట్టింది పేరు. ఈ ప్రదేశంలో యోగ, ధ్యానం, పారా గ్లైడింగ్ వంటివి టూరిస్ట్ ఆకర్షణలు.

Pic Credit: Koshy Koshy

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

హస్తకళలు - టిబెట్ దుస్తులు !

చాముండి టెంపుల్
ఈ టెంపుల్ ధర్మశాల నుండి 15 కి. మీ. లు. బనేర్ నది ఒడ్డున మంది - పటాన్ కోట్ హై వే లో కలదు. ఈ ప్రదేశంలో కాళీ మాత చందా మరియు ముండ అనే రాక్షసులను వదిన్చిందని చెపుతారు.
Pic Credit: Varun Shiv Kapur

స్థానిక ఆహారాలు - టిబెట్ దుస్తులు

స్థానిక ఆహారాలు - టిబెట్ దుస్తులు

షాపింగ్
టిబెట్ దేశ సంస్కృతి కల ఆభరణాలు దుస్తులు, వూల్లెన్ శాల్స్, ప్రార్ధన జెండాలు, పెయింటింగ్ లు దొరుకుతాయి. ఈ కొనుగోలు లో చక్కని విశ్రాన్తినిచ్చే టిబెటన్ సింగింగ్ బౌల్ తప్పక చేర్చండి. దీనితో మ్యూజిక్ తిరపి చేసికొనవచ్చు. ఈ కొనుగోళ్లకు మీరు మేక్లీద్ గంజ్ లోని టెంపుల్ రోడ్ కు చేరాలి.
Pic Credit: Tom Collins

స్థానిక ఆహారాలు - టిబెట్ దుస్తులు

స్థానిక ఆహారాలు - టిబెట్ దుస్తులు

ధర్మశాల లో ఏమి ఆహారం
ఇక్కడ మీకు టిబెట్ స్థానిక ఆహారాలు, పానీయాలు లభిస్తాయి. మామో లు - వీటిలో మాంసం లేదా కూరగాయలు, లేదా ఇతర పదార్ధాలు పెట్టి ఉడికించి అమ్ముతారు. నూడుల్స్ వేడిగా రుచికర వెజ్ సూప్ లేదా మాంసం తో లభిస్తాయి. పోచా అనే ఉప్పు టీ వెన్న కలిపినది తాగవచ్చు.

Pic Credit: momo