Search
  • Follow NativePlanet
Share
» »కాంగ్రా - వేదభూమి, పుణ్యభూమి !

కాంగ్రా - వేదభూమి, పుణ్యభూమి !

By Mohammad

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల జిల్లాలో కాంగ్రా పర్యాటక ప్రదేశం కలదు. ఇదొక దేవభూమి. ఇక్కడ అనేక అద్భుత ఆకర్షణీయ ఆలయాలు కలవు. ఈ ప్రదేశంలో పూర్వం ఆర్యుల కంటే ముందు ఆర్యేతరులు నివసించినట్లు వేదాలలో పేర్కొనబడింది. మహా భారతం లో కాంగ్రా ను 'త్రిగర్త రాజ్యం' గా చెప్పబడింది.

ఇది కూడా చదవండి : పాలంపూర్ - టీ కాపిటల్ ఆఫ్ నార్త్ ఇండియా !

కాంగ్రా నిజమైన వారసత్వ సంపద లకు నిలయం. ఇక్కడి ఆలయాలు పర్యాటకులను యిట్టె కట్టిపడేస్తాయి. మసృర్ ఆలయ సముదాయం అందులో ప్రత్యేకమైనది. దేవాలయాలు, సైట్ సీయింగ్ లతో పాటు కాంగ్రా చేరే దారిలో ట్రెక్కింగ్ ద్వారా పర్యాటకులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలని చూసి ఆస్వాదించవచ్చు కూడా. కాంగ్రా సందర్శనీయ స్థలాలను ఒకసారి గమనిస్తే ...

ధుల్దర్ రేంజ్

ధుల్దర్ రేంజ్

ధుల్దర్ రేంజ్ పర్వతాలు కాంగ్రా జిల్లా లోని ముఖ్య ఆకర్షణ. ఇది నార్త్ అఫ్ కాంగ్రా మరియు మండి వైపు పెరిగి ఉంటాయి. పర్యాటకులు ఈ పర్వత శ్రేణిలో సాహసోపేతమైన ట్రెక్ కొరకు వెళ్ళవచ్చు. ఇక్కడి మైమరిపించే ప్రకృతి అందాలలో విహరించు. హనుమాన్ - క - టిబ లేదా వైట్ మౌంటెన్ అనబడే శిఖరం ఈ పర్వత శ్రేణి లోని ఎత్తైన శిఖరం.

చిత్ర కృప : sanyam sharma

హరీపూర్ - గులేర్

హరీపూర్ - గులేర్

అందమైన పహరి పెయింటింగ్ లు, కాంగ్రా సంప్రదాయం చూడాలనుకొనేవారు ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు. గుహలు, పాడుబడ్డ కోట, కోవెలలు ఈ ప్రదేశంలోని ఇతర అందాలు. చలికాలంలో వలస పక్షులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటాయి.

చిత్ర కృప : Redtigerxyz

బాబా బరోహ్ టెంపుల్

బాబా బరోహ్ టెంపుల్

బాబా బరోహ్ టెంపుల్ ధర్మశాల కు 52 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం రాధా - కృష్ణులకు అంకితం ఇచ్చారు. లోహంతో తయారుచేయబడిన దుర్గా దేవి విగ్రహం ఈ ఆలయంలో ప్రతిష్టించారు. కాళీ నాథ్ బోలే శంకర్ కు అంకితం చేయబడిన ప్రాచీన మందిరం ఈ ఆలయానికి సమీపంలో కలదు.

చిత్ర కృప : telugu native planet

శివ ఆలయం

శివ ఆలయం

కాంగ్రా జిల్లలో ని కథ గర్హ్ లో ఉన్న ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాతి గాంచినది. ధర్మశాల నుండి 54 కిలోమీటర్ల దూరం లో ఉన్నది ఈ దేవాలయం. ఎంతో మంది భక్తులు పరమ శివుడ్ని పుజించుకోవడానికి ఇక్కడికి వస్తు ఉంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువులు తమ ఆధిపత్యం కోసం పోరాడినప్పుడు శివుడు ఆ వివాదాన్ని ఆపడానికి ఒక అగ్ని స్థూపం గా మారాడు అని అదే శివలింగం అని ప్రజలు నమ్ముతారు.

చిత్ర కృప : Munish Chandel

బెహనా మహాదేవ

బెహనా మహాదేవ

రాతి ఇటుకలతో నిర్మించిన బెహనా మహాదేవ ఆలయం సత్లేజ్ లోయలో కలదు. అందమైన వరండాలు, బాల్కనీలు, మండపాలు మొదలైనవి ఆలయం చుట్టూ, లోపల ఉన్నాయి.

చిత్ర కృప : Priya B

జ్వాలాముఖి ఆలయం

జ్వాలాముఖి ఆలయం

జ్వాలా ముఖి ఆలయాన్ని 'జ్వాలాజి' అని కూడా పిలుస్తారు. ఆలయాన్ని హిందూ దేవత అయిన జ్వాలాముఖికి అంకితం చేశారు. ఇక్కడ దేవి చిన్న చిన్న జ్వాలల రూపంలో ఉన్నదని భావన. నీలి జ్వాలలు ఆలయంలోని పురాతన రాతి పగుళ్ల నుండి బయట పడతాయి.

చిత్ర కృప : telugu native planet

కోటలు

కోటలు

కాంగ్రా లోని నాగర్కొట్ ఫోర్ట్, కోట్లా ఫోర్ట్ లు ప్రధాన పర్యాటక మజిలీలు. కోట్లా ఫోర్ట్ లో లోనికి వెళితే ఒక చిన్న వినాయక మందిరం ఉంది. నాగర్కొ ట్ ఫోర్ట్ లో ఆకర్షణీయ స్తంభాలు, జైన మందిరాలు, కోవెలలు, షీస్ మహల్, తోటలు చూడవచ్చు. వీలుంటే తారాగర్హ్ ప్యాలెస్ ను కూడా సందర్శించండి.

చిత్ర కృప : Sneha Naidu

పాంగ్ లేక్ సంరక్షణ కేంద్రం

పాంగ్ లేక్ సంరక్షణ కేంద్రం

పాంగ్ లేక్ సంరక్షణ కేంద్రం కాంగ్రా నుండి 60 కిలోమీటర్ల దూరంలో బీస్ నది ఒడ్డున కలదు. ఇక్కడ సుమారు 220 రకాల అరుదైన పక్షులు, చలికాలంలో హిమాలయన్ పక్షులు వలస వస్తుంటాయి.

చిత్ర కృప : telugu native planet

మసృర్ ఆలయం

మసృర్ ఆలయం

మసృర్ ఆలయం దక్షిణ కాంగ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇదొక గుహల సముదాయం. గుహల మధ్యలో 15 శిఖర్ ఆలయాలు ఉన్నాయి. ఇందులో పరమ శివుడు ప్రధాన దైవం అయినప్పటికీ రాముడు, లక్షణుడు, సీతా దేవి విగ్రహాలు కూడా కలవు. క్రీ. శ 10 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఆర్యుల నిర్మాణ శైలిని పోలి, అజంతా ఎల్లోరా ను గుర్తుకు తెస్తుంది.

చిత్ర కృప : Akashdeep83

సిద్ధనాథ ఆలయం

సిద్ధనాథ ఆలయం

కాంగ్రా లోని బైజనాథ్ లో గల సిద్ధనాథ్ ఆలయంలో మహా శివుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ దేవాలయం నిర్మాణ శైలి మహాదేవ్ ఆలయాన్ని పోలి ఉంటుంది.

చిత్ర కృప : Sanket Pawar

కాంగ్రా ఎలా చేరుకోవాలి ?

కాంగ్రా ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం : ధర్మశాల, పాలంపూర్, జమ్మూ, పతంకోట్, చండీగఢ్ ప్రాంతాల నుండి కాంగ్రా కు బస్సులు అందుబాటులో కలవు.

రైలు మార్గం : కాంగ్రా కు 90 కిలోమీటర్ల దూరంలో పతంకోట్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

విమాన మార్గం : కాంగ్రా కు 16 కిలోమీటర్ల దూరంలో గగ్గల్ విమానాశ్రయం, జమ్మూ విమానాశ్రయం (200కి.మీ), అమృత్సర్ విమానాశ్రయం (208 కి. మీ) కలవు. క్యాబ్ లేదా టాక్సీ లో ఎక్కి కాంగ్రా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Parthajit Dasgupta

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more