Search
  • Follow NativePlanet
Share
» »పూంపుహార్ ఒకప్పటి చోళ రాజుల రాజధాని !

పూంపుహార్ ఒకప్పటి చోళ రాజుల రాజధాని !

By Mohammad

ఏఓ ... ఏఓ ... అంటూ బాబూమోహాన్ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో చేసే గోల అంత ఇంతా కాదు. రాజేంద్రప్రసాద్ కి రాజయోగం ఉందని, ప్రపంచంలో గొప్ప ధనవంతుడవుతాడని జ్యోతిష్యంలో అలా ఉందని అతన్ని నమ్మిస్తాడు. అలాగే పూంపుహార్ .... అంటూ కొత్త కొత్త పదాలను పలికి ప్రేక్షకులను నవ్విస్తాడు. ఆ సినిమా హాస్యపరంగా మంచి హిట్ అయ్యిందిలెండి ఆది వేరు విషయం ..!

ఇప్పుడు చెప్పబోతున్నదానికి, ఆ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా ?? అనేగా మీ ప్రశ్న. అవును ఇప్పుడు చెప్పబోతున్న ప్రదేశానికి, ఆ సినిమాకి సంబంధం ఉంది. ఆ సినిమాలో బాబూమోహాన్ వాడే పదం 'పూంపుహార్' గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నది.

పూంపుహార్ ఒక ప్రాచీన రేవు పట్టణం. ఇది గతంలో అంటే మేబి రాజుల కాలం, బ్రిటీష్ వారి కాలం లో అనుకుంటా ! సందడిగా ఉండేది. ప్రస్తుతం ఈ రేవు పట్టణం తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టినం జిల్లాలో కలదు. చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ ఇదొక పట్టణం. పూంపుహార్ ఒకప్పటి చోళ రాజుల రాజధాని. చోళ రాజులు ఇక్కడి నుంచే సముద్ర మార్గాన వ్యాపార వాణిజ్యాలు చేసేవారు. ఈ పట్టణానికి సమీపంలోనే కావేరి నది బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది.

ఇది కూడా చదవండి : నాగపట్టినం - సర్వమత కలయిక గల భూమి !

పూంపుహార్ పట్టణంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు మాసిలమని నాతార్ కోవిల్, ఆర్ట్ గ్యాలరీ, బీచ్, చర్చి మొదలగునవి ఒకసారి గమనిస్తే ..

డానిష్ గవర్నర్ బంగ్లా

డానిష్ గవర్నర్ బంగ్లా

పూంపుహార్ ప్రాంతానికి అప్పట్లో అధికారిగా ఉన్న డేనిష్ గవర్నర్ కు నివాసంగా ఈ భవంతిని క్రీ.శ. 1784లో నిర్మించారు. ప్రజల సందర్శనార్ధం తెరిచిఉంచే ఈ భవంతి డేనిష్ నిర్మాణశైలికి అద్భుతమైన తార్కాణం. పూంపుహార్ లోని ప్రఖ్యాత భవంతుల్లో ఇదొకటి మరియు పెద్దది కూడా. పూంపుహార్ లో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ డానిష్ బంగ్లా.

చిత్ర కృప : Samba Murthy

మాసిలమని నాతార్ కోవిల్

మాసిలమని నాతార్ కోవిల్

మాసిలమని నాతార్ కోవిల్ పాండ్య వంశానికి చెందిన మరవర్మ కులశేఖర పాండియన్ రాజు క్రీ.శ. 1305 లో నిర్మించాడు. ఆ కాలంలోని నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ ఈ కోవిల్. పూంపుహార్ సందర్శించే ప్రతిఒక్కరు దీనిని తప్పక చూడాలి. ఇది పూంపుహార్ లో ఇప్పటికీ అత్యంత ప్రసిద్ధ నిర్మాణం అని చెప్పకతప్పదు.

చిత్ర కృప : Kembootha

సిలప్పతికార ఆర్ట్ గ్యాలరీ

సిలప్పతికార ఆర్ట్ గ్యాలరీ

సిలప్పతికార ఆర్ట్ గ్యాలరీ 7 అంతస్తుల్లో, 50 అడుగుల ఎత్తు కలిగి ఉండి విశిష్ట నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ నిర్మాణ గోడలపై వివిధ రకాల శిల్పాలు, పురాణ ఇతిహాసాల ను ఇతి వృత్తాలు అందంగా చెక్కారు. భవన ఆవరణలో కడియం ఆకారంలో ఒక నీటి కొలను, కొలనుకు అటు ... ఇటు కన్నగి, మాధవి విగ్రహాలు ఉంటాయి. 22 అడుగుల ఎత్తులో ఉండే మకర తోరణం గ్యాలరీ ప్రవేశ ద్వారం మీద అందంగా అలంకరించబడి ఉంటుంది.

చిత్ర కృప : Nellai S S Mani

పట్టణ ప్రవేశ ద్వారం

పట్టణ ప్రవేశ ద్వారం

డెన్మార్క్ దేశీయులు నిర్మించిన పట్టణ ప్రవేశద్వారం పూంపుహార్ పై వారి పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్రవేశ ద్వారాన్ని క్రీ.శ. 1792 లో నిర్మించారు. డేనిష్ నిర్మాణశైలికి ఇది అద్భుతమైన తార్కాణం. బ్రిటీషువారి ఆదేశానుసారం నిర్మించిన ఈ భవంతి నమూనా, నిర్మాణం పూర్తిగా డెన్మార్కు దేశస్థులదే. వివిధ యూరోపియన్ దేశాల ప్రవేశ ద్వారాల తరహాలో నిర్మించడం వల్లనే ఈ ప్రవేశ ద్వారం బాగా ప్రసిద్ధిచెందింది.

చిత్ర కృప : Raghunathan Krishnarao

పూంపుహార్ బీచ్

పూంపుహార్ బీచ్

పూంపుహార్ తీరం ఒక అందమైన విహార ప్రాంతం. నల్లటి ఇసుక తిన్నెలతో, కావలసినంత నీడతో ఉండే ఈ తీరం సకుటుంబంగా విహారాలకు వెళ్ళడానికి బాగుంటుంది. ఇక్కడి సముద్ర ప్రాంతం బాగుండకపోవడం వల్ల నీరు ఈతకు పనికిరావు. అయినప్పటికీ, తీరికగా వినోదకార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ తీరం చాలా అవకాశాలు కల్పిస్తుంది.

చిత్ర కృప : Nellai S S Mani

జియాన్ చర్చి

జియాన్ చర్చి

పూంపుహార్ లోని జియాన్ చర్చిని క్రీ.శ. 1701 లో మొదటి డచ్ సెటిలర్లు నిర్మించారు. ఇది పూంపుహార్ లోని మరో ప్రధాన ఆకర్షణ. పునరుజ్జీవ కాలంలో నిర్మించిన ఈ చర్చి ఆనాటి డేనిష్ నిర్మాణ శైలిని దర్శింపచేస్తుంది. అనేక మంది పర్యాటకులను ఆకర్షించే ఈ చర్చి పూంపుహార్ లో తప్పక చూడాల్సిన ప్రదేశం. క్రిస్మస్ వేడుకలు ఇక్కడ సంబరాల మధ్య ఆనందంగా జరుపుకుంటారు.

చిత్ర కృప : JoeCroos

పూంపుహార్ ఎలా చేరుకోవాలి?

పూంపుహార్ ఎలా చేరుకోవాలి?

వాయు మార్గం

148 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉన్న త్రిచి సమీపపట్టణం. తమిళనాడు రాజధాని చెన్నై పూంపుహార్ కి 256 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయుమార్గం ద్వారా రెండు నగరాలను తేలికగా చేరుకోవచ్చు. అక్కడి నుంచి ట్యాక్సీ లేదా ప్రవేట్ వాహనాల మీదుగా పూంపుహార్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

పూంపుహార్ కి నాగపట్టినం సమీప రైల్వే స్టేషన్. నాగపట్టణం నుండి పూంపుహార్ ప్రయాణానికి బస్సు సరైన ఎంపిక. నాగపట్టణం రైలు ద్వారా అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది, ఒక వ్యక్తికీ బస్సు టికెట్ ఖరీదు 50 రూపాయలు.

రోడ్డు మార్గం

పూంపుహార్ వెళ్ళడానికి సులభమైన మార్గాలలో రోడ్డుమార్గం ఒకటి. నాగపట్టణం వంటి సమీప స్థలాల నుండి రోజువారీ బస్సులు నడుస్తాయి. ఇది తేలికైన, చౌకైన ఎంపిక. అదే విధంగా త్రిచి వంటి సమీప ప్రదేశాల నుండి కూడా రోజువారీ బస్సు సర్వీసులు ఉన్నాయి.

చిత్ర కృప : Arun Tuticorin

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X