Search
  • Follow NativePlanet
Share
» »కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ పట్టణం అమరావతి నది ఒడ్డున కలదు. ఈ పట్టణం ఇక్కడ కల పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ పట్టణం లోని శివాలయం అయిన పసుపతీశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఏడు పవిత్ర శివాలయాలలో ఒకటి. ఈ దేవాలయంలోని శివలింగం అయిదు అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. కరూర్ లో శ్రీ కరూర్ మరియమ్మ టెంపుల్, శ్రీ షిర్డీ సాయి బాబా టెంపుల్, శ్రీ మహా కలియమ్మ టెంపుల్, శ్రీ వంగాలంమన్ టెంపుల్, కళ్యాణ వెంకటరమణ స్వామి టెంపుల్, శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మ తెంప్లె, సదాసివ టెంపుల్ మరియు అగ్నీశ్వరార్ టెంపుల్ లు కలవు. ఈ దేవాలయాలు అన్నీ చూసేందుకు మీరు ఎంతో సమయం కూడా కేటాయించవలసి వస్తుంది.

కళ్యాణ పసుపతీస్వర టెంపుల్ :

కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు

Photo Courtesy :Balaji

కళ్యాణ పసుపతీస్వర టెంపుల్ శివుడికి అంకితం చేయబడింది. ఈ ప్రాంతంలోని ఏడు ప్రధాన శివలింగం లలో ఒకటి. లింగం ఎత్తు ఏడు అడుగులు వుంటుంది. ఈ లింగాన్ని ఒక పీఠం పై ఆవు పొదుగు నుండి ద్రవించే పాల మధ్య అభిషేకంలో వున్నట్లు చూపుతారు.

కరూర్ గవర్నమెంట్ మ్యూజియం
కరూర్ పట్టాన చిత్ర ఈ మ్యూజియం చాలా చెపుతుంది. మ్యూజియం లో వివిధ రకాల కంచు, రాగి, మొదలైన లోహ తయారీ కల పురాతన వస్తువులు, పురాతన సంగీత సాధనాలు, నాణెములు, వివిధ రకాల పురాతన రాళ్లు, సముద్రపు ప్రాణుల బొమ్మలు వంటివి కలవు. ఈ మ్యూజియం తరచుగా అనేక ప్రసంగాలు మరియు వర్క్ షాపులు నిర్వహిస్తుంది.

కరూర్ మరియమ్మ టెంపుల్
కరూర్ మరియమ్మ టెంపుల్ కారువూర్ లో కలదు. ఇది ఈ ప్రాంతంలో ని ప్రధాన దేవాలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో దేవాలయ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవ వేడుకలలో భాగంగా 'కుంబం' ను దేవాలయం వెలుపలికి తెచ్చి దానిని ఆర్కావతి నదీ నీటిలో కలుపుతారు. ఈ వేడుకల సమయంలో పట్టణంలోని ప్రతి నివాసం కళకళ లాడు తూ ఒక పండుగ వలే జరుపుకుంటుంది.

పుగాజిమలై శ్రీ అరుపదాయ్ మురుగన్ టెంపుల్
పుగాజిమలై శ్రీ అరుపాద మురుగన్ టెంపుల్ పుగాలూర్ లో కలదు. ఈ ప్రదేశం కరూర్ పట్టణానికి వాయువ్యం గా వుంటుంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఇది ఒక చిన్న కొండపై వేలాయుతనపల్యం లో కావేరి నదీ తీరంలో కలదు. టెంపుల్ లో ప్రధాన దైవం శ్రీ సుబ్రమంఎస్వరుడు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో తైపూసం అనే ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు దేవుడి విగ్రహాన్ని ఒక రధంపై వుంచి రాత్రి అంతా పట్టణంలో ఊరేగిస్తారు.

మయనూర్
మయనూర్ పట్టణం కరూర్ కు 21 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ రెండు ప్రధాన టెంపుల్స్ కలవు. అవి మరియమ్మ టెంపుల్ మరియు సేల్లందియమ్మ టెంపుల్.

నేరూర్ శ్రీ సదాసివ బ్రహ్మేంద్ర టెంపుల్
శ్రీ సదాసివ బ్రహ్మేంద్ర టెంపుల్ నేరూర్ లో కలదు. ఇది సాదాసివ బ్రంధ్ర స్వామీ వారి సమాధి. వీరు కాంచీపురం మఠం స్వాములలో ఒకరు.

పుడుకోట్టాయ్ పాలస్
ఇక్కడ మీరు అతి పురాతనమైన పుడుక్కోట్టాయ్ రాజభవనం చూడవచ్చు.

తిరుముక్కదాల్
తిరుముక్కుదాల్ అంటే మూడు నదుల సంగమం అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశంలో పాలార్, చేయ్యార్ మరియు వేగావతి అనే మూడు నదులు కలుస్తాయి. ఈ ప్రదేశం వలజాబాద్ నుండి 4 కి. మీ. ల దూరంలో కలదు.

అర్కేయోలాజికల్ సర్వే అఫ్ ఇండియా సంస్థ తిరుముక్కుదాల్ ను ఒక హెరిటేజ్ సైట్ గా గుర్తించినది. ఇక్కడ ఒక పురాతన దేవాలయం కలదు. దీనిలో దైవాలు అగస్తీస్వర మరియు అన్జనాక్షి మాత.

సోలియమ్మ టెంపుల్
సోలియమ్మ దేవాలయం అతూర్ పట్టణానికి 8 కి. మీ. ల దూరంలో కలదు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ దేవాలయ రధోత్సవం చేస్తారు. ఈ దేవాలయ సమీపంలోనే సోలీస్వర టెంపుల్, మునియప్పాన్ టెంపుల్, వరదరాజ పెరుమాళ్ టెంపుల్, చిన్న మరియమ్మ మరియు పెరియ మరియమ్మ టెంపుల్ లు కూడా కలవు.

షాపింగ్
కరూర్ పట్టణం కాటేజ్ పరిశ్రమలకు ప్రసిద్ధి. కాటన్ బట్టలు, ఇత్తడి వస్తువులు అధికంగా తయారు చేస్తారు. బెడ్ రూమ్, బాత్ రూమ్ మరియు కిచెన్ లకు అవసరమైన గుద్దల తయారీ అధికం. కరూర్ లో విలువైన రాళ్లు అంటే మూన్ స్టోన్స్, ఆక్వా మెరినస్, జాస్పర్, వంటివి లభిస్తాయి.

మరిన్ని ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X