Search
  • Follow NativePlanet
Share
» » బ్రహ్మ దేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన సప్తశృంగి మాత ఆలయం

బ్రహ్మ దేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన సప్తశృంగి మాత ఆలయం

దసరా, నవరాత్రి పర్వ దినాలలో మహర్ణవమి రోజున అమ్మవారు దాల్చిన అవతారం, మహిషాశుర మర్ధిని అవతారం. ఈ అలంకరణతో సర్వ శోభాయమానంగా అమ్మవారి దర్శన భాగం లభించే వణి క్షేత్రంలో వెలసిన సప్తశృంగి మాత ఆలయం. మహారాష్ట్రలోని వణి పర్వతంపై వెలసిన సప్తశృంగి మాత స్వయంభువుగా వెలసినది. లోక రక్షణకై ఆమె ఈ భూమిపై వెలసిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

మహారాష్ట్రలో కొలువైన మూడు సుప్రసిద్ద శక్తి పీఠాలలో అర్థ పీఠమైన సప్తశృంగి దేవీ ఆలయం ఒకటి. సప్తశృంగి దేవీ అభిష్టసిద్ది వరప్రదాయినిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, విరాజిల్లుతోంది. ఇది నాసిక్ పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఒక కొండపై ఉన్నది. ఈ శక్తి పీఠం సముద్ర మట్టానికి నాలుగువేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది.

ఈ శక్తిపీఠానికి ఒక వైపు లోతైన లోయ, మరో వైపు చుట్టూ ప్రక్కలా పచ్చగా, ఆహ్లాదంగా అలరించే ప్రకుతి అందాలతో ఎత్తైన పర్వతాలున్నాయి. ఇక్కడ నిలబడి చూస్తే దేవీ మాత ఆలయం మనల్ని ఆహ్వానిస్తున్నట్లు కనబడుతుంది. ఈ మహా శక్తి పీఠం వెనుక ఒక పురాణగాథ ఉంది. మరి ఆ విశేషాలేంటో ఈ శక్తి పీఠం యొక్క మహిమలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దుష్టశిక్షణ, సిష్ట రక్షణ చేయడానికి

దుష్టశిక్షణ, సిష్ట రక్షణ చేయడానికి

దుష్టశిక్షణ, సిష్ట రక్షణ చేయడానికి దేవి అనేక రూపాలలో అవతరించింది. మహిషాశురుడు, చండముండా, సింభ, నిసుంభ వంటి తదితర రాక్షసులను వధించడానికి ఆది శక్తి మహిషాసురమర్థిని చాముండ, చంఢిక, దుర్గా, కౌశకి వంటి అవతారాల్లో అవతరించి శాంతి దామాన్ని స్థాపించిందని స్కంద, మార్కెండేయ, దేవీ భాగవతాల్లో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది.

Image Source: wikimedia.org

మహిషాసురుడు, భీమాసురుడు తదిత రాక్షసులను వధించడానికి సప్తశృంగి మాత వెలసిందని

మహిషాసురుడు, భీమాసురుడు తదిత రాక్షసులను వధించడానికి సప్తశృంగి మాత వెలసిందని

అలా మహిషాసురుడు, భీమాసురుడు తదిత రాక్షసులను వధించడానికి సప్తశృంగి మాత వెలసిందని పురాణాల ద్వారా అవగతం అవుతోంది. మన దేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తి మాత ఆలయాల్లో ప్రముఖంగా విరాజిల్లుతున్న ఆలయం సప్తశృంగి ఆలయం. ఈ దివ్య క్షేత్రం భక్తులకు ఒక మనోహరమైన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులకు మధురానుభూతలను కలిగించే ఈ దివ్య క్షేత్రం ఏడు పర్వత పక్తుల మేలు కలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగి అని పిలవడం జరుగుతోంది.

Image Source: wikimedia.org

 పురాణాల ప్రకారం ప్రపంచంలో మొత్తంలో 108శక్తిపీఠాలు

పురాణాల ప్రకారం ప్రపంచంలో మొత్తంలో 108శక్తిపీఠాలు

మహిషాసురుడి ఆగడాల నుండి విముక్తి పొందడానికి సకల దేవతలూ దేవీ మాతను వేడుకొన్నప్పుడు , దేవీ మాత సప్తశృంగి రూపంలో ప్రత్యక్షమైంది. పురాణాల ప్రకారం ప్రపంచంలో మొత్తంలో 108శక్తిపీఠాలున్నాయి. అందులో ఎక్కువ శాతం మహారాష్ట్రలో ఉండటం విశేషం. మహారాష్ట్రలో ఉన్న మూడున్నర శాతం పీఠాలను అర్థ శక్తి పీఠాలుగా భావిస్తున్నారు. మహారాష్ట్రాలోని శక్తిపీఠాల్లో తప్ప ప్రాచీన హిందూ తాళపత్రాల్లో ఏ ఇతర ప్రాంతంలోనూ అర్థ శక్తిపీఠం ఉన్నట్లు పేర్కొన్న దాఖలాలు లేదు.

Image Source: wikimedia.org

బ్రహ్మ దేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన

బ్రహ్మ దేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన

ఈ శక్తి పీఠంలోని దేవిని బ్రహ్మస్వరూపిణిగా కూడా పిలువబడుతున్నది.

బ్రహ్మ దేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన గిరిజామహానంది దేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటున్నదని భక్తుల విశ్వాసం. సప్తశృంగి దేవిని మహాకాలుడు, మహాలక్ష్మీ, మహాసరస్వతిల సంయుక్త రూపమే సప్తశృంగి దేవి అని భక్తులు పూజిస్తుంటారు. నాసిక్ లోని తపోవననానికి సీతారామలక్ష్ముణులు విచ్చేసినప్పుడు ఈ పీఠాన్ని సందర్శించారట.

Image Source: wikimedia.org

శక్తి మాత ఏడు రూపాల కలయికైన సప్తశృంగి మాత

శక్తి మాత ఏడు రూపాల కలయికైన సప్తశృంగి మాత

పురాణగాత ప్రకారం పూర్వం భీమాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను తీవ్రంగా హించడం మొదలుపెట్టడాట, అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి, వారి లోకాన్ని అపహించాడట. దేవతలు భీమాసురుడి ఆగఢాలు భరించలేక మార్కెండేయ మహర్షిని ప్రార్థించగా శక్తి మాత ఏడు రూపాల కలయికైన సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుడిని మట్టు పెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అంధించినదట. అప్పటి నుండి సప్తశృంగి మాత ఈ క్షేత్రంలోనే కొలువైనట్లు పురాణాల ద్వారా అవగతం అవుతోంది.

Image Source: wikimedia.org

 వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు

వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు

స్థానికులు చెప్పే కథనాల ప్రకారం ఇక్కడ ఒకానొకప్పుడు తేనె పట్టును చేధించాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా చూశాడట. సప్తశృంగి దేవి పీఠం 8 అడుగుల ఎత్తు ఉంటుంది. మహిషాసురడి మర్ధన కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడి దేవికి ఉన్న 18 హస్తాలలో అలలారుతుంటాయి. వాటిలో..

Image Source: wikimedia.org

 దేవి చేతుల్లోని ఆయుధాలు

దేవి చేతుల్లోని ఆయుధాలు

ఆ పరమేశ్వరుడి త్రిశూలం, విష్ణు చక్రాయుధం, వరుణుడి శంఖువు, అగ్ని జ్వాలాయుధం, వాయువు విల్లు బాణాలు, ఇంద్రుడి వజ్రాయుధం, యమదండం, దక్షప్రజాపతి స్పటిక మల్ల, బ్రహ్మ కమండలం, సూర్య కిరణాలు, కళస్వరూపి కత్తి, క్షీరసాగరుడి హారం, కుండలం, కంకణం, విశ్వామిత్రుడి పరుశు మరియు ఆయుధం ఇక్కడి దేవి చేతుల్లో అలలారుతుంటాయి.

Image Source: wikimedia.org

సప్తశృంగి దేవి ఆలయానికి

సప్తశృంగి దేవి ఆలయానికి

సప్తశృంగి దేవి ఆలయానికి వెళ్ళే మార్గంలో 472 మెట్లు ఉంటాయి. చైత్ర అశ్విని నవరాత్రులలో ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. చైత్రమాసంలో దేవి దరహాస వదనంతో ఉండగా, నవరాత్రుల్లో రుద్రరూపంలో ఉంటుందని చెబుతుంటారు.

Image Source: wikimedia.org

పర్వతంలో 108 చిన్న మడుగులు ఉన్నాయి

పర్వతంలో 108 చిన్న మడుగులు ఉన్నాయి

పర్వతంలో 108 చిన్న మడుగులు ఉన్నాయి. ఇవి ఈ చుట్టు ప్రక్కల ఉన్న ప్రదేశాల సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తుంటాయి.

Image Source: wikimedia.org

ఎలా వెళ్ళాలి:

ఎలా వెళ్ళాలి:

సప్తశృంగి దేవీ ఆలయానికి దగ్గరలో ముంబై లేదా పూణే విమానాశ్రయాలున్నాయి. ఇక్కడి నుండి మీరు నాసిక్ పట్టణానికి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు. అన్ని ముఖ్యమైన నగరాలతో నాసిక్ రైలు మార్గం ఉంది. కాబట్టి ఇక్కడికి రైలు ప్రయాణం చాలా సులువైన మార్గం.

నాసిక్‌కు 65 కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి పర్వత శ్రేణి ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు మహారాష్ట్ర రోడ్డు రవాణా బస్సును లేదా ప్రయివేటు వాహనాన్ని ఉపయోగించవచ్చు.

Image Source: wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more