Search
  • Follow NativePlanet
Share
» »షిర్డిలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించిందెవరూ..

షిర్డిలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించిందెవరూ..

By Venkatakarunasri

షిర్డీ మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లాలో నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరం లోని ఒక పాత, చిన్న గ్రామం, ఈ రోజు అది ఒక క్రిక్కిరిసిన యాత్రా స్థలంగా మారిపోయింది. 20వ శతాబ్దపు గొప్ప యోగి సాయి బాబాకు షిర్డీ పుట్టినిల్లు. బాబా షిర్డిలో అర్థ శతాబ్దం కన్నా ఎక్కువ నివసించారు, అంటే తనని చూడ్డానికి, ప్రార్ధించడానికి వచ్చే భక్తులతో ఓ అనామక చిన్న గ్రామంలో 50 ఏళ్ళకు పైగా వుంటూ దాన్ని ఓ పెద్ద యాత్రా స్థలంగా మార్చివేసారు. షిర్డీ - అద్భుత యోగి సాయిబాబా ఆవాసం సాయి బాబా మూలాలు ఎవరికీ తెలియదు - ఆయన జన్మ వివరాలు ఇప్పటికీ రహస్యమే; ఐతే, 16 ఏళ్ళ చిరుత ప్రాయంలో మొదటిసారి వేప చెట్టు క్రింద కనబడింది మొదలు ఆయన అందరిని ఆకట్టుకుంటూనే వున్నారు. బాధాసర్ప ద్రష్టులైన పేద వారి అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

సాయి బాబా ను ‘దేవుడి బిడ్డ' గా అభివర్ణించేవారు, ఎందుకంటే ఆయనను శివుడి అవతారంగా నమ్మేవారు. ఎప్పుడూ ‘సబ్ కా మాలిక్ ఏక్' అంటూ తన జీవితం మొత్తం సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ మత శాంతి సందేశాలను బోధిస్తూ వుండేవారు. షిర్డీ - అప్పట్నించీ - కేవలం ఆయన అద్భుత రూపాన్ని తమ కళ్ళతో చూసేందుకు దేశం నలు మూలాల నుంచీ వచ్చే సందర్శకులు, భక్తులతో నిండిపోయింది.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

ఆ మహా యోగి 1918 లో సమాధి చెందినా, ఇప్పటికీ ఆయన సమాధిని నిత్యం లక్షలాది మంది దర్శిస్తున్నారు. బాల యోగిగా బాబా షిర్డీ చేరుకున్న ప్రదేశాన్ని గురుస్తాన్ అని పిలుస్తారు. ఈరోజు, అక్కడ ఒక చిన్న గుడి, స్మారకం కట్టారు. షిర్డిలో సాయిబాబా తో ఏదో విధమైన అనుబంధం కల ఇతర ప్రదేశాల్లో ఆయన రోజు విడిచి రోజు పడుకునే ద్వారకామాయి కూడా వుంది.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

ఖండోబా దేవాలయం, సాకోరి ఆశ్రమం, శని దేవాలయం, చంగ్ దేవ్ మహారాజ్ సమాధి, నరసింహ దేవాలయం షిర్డీ వెళ్ళే భక్తుల్ని ఆకర్షించే ప్రదేశాల్లో కొన్ని. బాబా తన స్వహస్తాలతో పెంచి పోషించిన తోట లెండి వనం. బాబా నిత్యం ఈ వనాన్ని దర్శించి వేప చెట్టు క్రింద విశ్రమించేవారు. ఈ ప్రదేశంలో స్మారకంగా అష్టదళాల తో వుండే ‘నందాదీపం' అనే దీపగ్రుహాన్ని కట్టారు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

నిలువెత్తు సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం ఉదయాన్నే 5 గంటల కల్లా కాకడ ఆరతి తో తెరుస్తారు - రాత్రి ప్రార్ధనల తర్వాత రాత్రి 10 గంటలకు మూసివేస్తారు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

మందిరంలో 600 మంది భక్తులు సరిపోయే పెద్ద హాల్ వుంది. మొదటి అంతస్తులో ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపే చిత్రపటాలు వున్నాయి - అవి చూడవచ్చు. ఈ పవిత్ర స్థలంలోని దుకాణాలు అన్నిటిలో బాబా జీవితానికి సంబంధించిన జ్ఞాపికలు అమ్ముతారు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

షిర్డీ - తీర్థ క్షేత్రం

షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది. తప్పకుండా చూడాల్సిన ఇతర దేవాలయాల్లో శని, గణపతి, శివాలయాలు వున్నాయి.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

ఎంతో పవిత్రంగా భావించే షిర్డిలోని సాయినాథుని విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు?ఈ విషయాలను ఈ వ్యాసంలో మనం తెలుసుకుందాం. గుజరాత్ లో 1889వ సంలో జన్మించిన స్వామి సాయిచరణ్ మొట్టమొదట సాయిబాబాను తన తండ్రితో కలిసి మొట్టమొదట 1911లో బాబాను దర్శించుకున్నాడు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

ఒక కుండ చేత్తో పట్టుకుని కుష్టురోగులకు సపర్యలు చేస్తూ కనిపించిన బాబాను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ తండ్రిఆజ్ఞతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు బాబా ఆనంద్ తో దేవుడు వున్నాడో,లేడో అనకు అన్నాడు.అటు తరవాత 1912లో జూలైగురుపూర్ణిమ రోజున బాబా ఆనంద్ కు కలలోకనిపించి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

అదిమొదలు ఆనంద్ షిర్డిలోనే వుండిపోయాడు. బాబా భక్తులదగ్గర దక్షిణ తీసుకోవడాన్ని చాలా సార్లు గమనించాడు.బాబా జీవితంలో అద్భుతాలు, ప్రభోదాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని తను బాబాకు సన్నిహితంగా వుంటూ పరిశీలించినప్పటి విషయాలను పేర్కొంటూ మరొక పుస్తకాన్ని రచించాడు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

బాబా మహాసమాధి అయినతర్వాత సాయి సంస్థానంలోని కార్యకలాపాలలో ఆనంద్ చురుకుగా పాల్గొనేవాడు.1954లో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహప్రతిష్ట జరిగింది. ఆనంద్ 1963లో సన్యాసం స్వీకరించి స్వామి సాయిచరణ్ ఆనంద్ జీగా మారి అందరి మన్ననలు పొందారు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

ఈ పవిత్ర క్షేత్రాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చూడవచ్చు, కాని వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం హాయి గోల్పేదిగా వుంటుంది కనక, వర్షాకాలంలో దర్శించడం మంచిది. షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు - గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి - అప్పుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

ఈ పండుగలప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది - వాతావరణం అంతా సాయి భజనలతో మార్మోగి పోతుంది, అప్పుడు జరిగే రథ యాత్రలో కూడా పాల్గొన వచ్చు. ఈ రోజుల్లో మాత్రమె షిర్డీ లోని సమాధి మందిరం రాత్రంతా తెరిచి వుంటుంది.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

సాయి బాబా యొక్క ఈ పవిత్ర నివాసానికి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా తేలిగ్గానే చేరుకోవచ్చు. ఊరు బాగా అభివృద్ది చెందింది - నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది. దగ్గరలోనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు, దీని వల్ల ప్రపంచం నలు మూలల నుంచీ వచ్చే యాత్రికుల సౌకర్యం పెరుగుతుంది. రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర - మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10 మీదుగా రావచ్చు - అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది.

pc:wikimedia.org

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

రోడ్డు ద్వారా

పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచి షిర్డీ కి ప్రభుత్వ బస్సు సర్వీసులు అందుబాటులో వున్నాయి. మీరు ఎంచుకునే బస్సు సర్వీసుల ఆధారంగా చార్జీలు మనిషికి 200 రూపాయల నుంచి 400 రూపాయల దాకా వుండచ్చు. ముంబై, పూణే, నాశిక్ లాంటి నగరాల నుంచి ప్రైవేట్ లక్జరీ, డీలక్స్ బస్సుల్లో కూడా షిర్డీ చేరుకోవచ్చు. ముంబై నుంచి షిర్డీ కి రాష్ట్ర రవాణా సంస్థ, ప్రైవేట్ ఆపరేటర్లు ప్రత్యెక కోచ్ లు నడుపుతారు.

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

నాశిక్, అహ్మద్ నగర, ఔరంగాబాద్, పూణే, కోపర్గావ్ ల నుంచి ప్రభుత్వ రవాణా సంస్థ నిత్యం బస్సులు తిప్పుతుంది. ముంబై నుంచి షిర్డీ కి టాక్సీలు కూడా వుంటాయి - చార్జీలు సుమారు 6000 రూపాయలు వుంటుంది. ముంబై నుంచి షిర్డీ కి రోడ్డు ద్వారా 241 కిలోమీటర్ల దూరం వుంటుంది, నాశిక్ నుంచి షిర్డీ కి 88 కిలోమీటర్లు, ఔరంగాబాద్ నుంచి 109 కిలోమీటర్లు, పూణే నుంచి 187 కిలోమీటర్ల దూరం వుంటుంది.

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

రైలు మార్గం

ఈ మధ్యనే దేశం లోని వివిధ నగరాల నుంచి షిర్డీ కి రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. షిర్డిలో కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ మందిరం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వుంది - ఇక్కడి నుంచి ఇతర నగరాలకు రైలు బళ్ళు నడుస్తున్నాయి. రైలు ప్రయాణం పొదుపైనది, షిర్డీ చూడాలనుకునే నిజమైన భక్తులు అందరూ భరించగలిగేది. ముంబై లోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్ నుంచి ఇక్కడికి షిర్డీ ఫాస్ట్ పాసింజర్, జనశతాబ్ది స్పెషల్ బళ్ళు వస్తాయి.

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

కొద్ది పాటి మినహాయింపులతో మరో 51 రైలు బళ్ళు నిత్యం ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. ప్రయాణ సమయం దూరాన్ని బట్టి వుంటుంది. చెన్నై నుంచి వచ్చే షిర్డీ ఎక్స్ప్రెస్స్ లో రావాలంటే ఒక రోజు కన్నా ఎక్కువ సమయం పడుతుంది. షిర్డీ నుంచి 13 కిలోమీటర్ల దూరం లో కోపర్గావ్ స్టేషన్, 52 కిలోమీటర్ల దూరంలో మన్మాడ్ స్టేషన్లు వున్నాయి. ఈ రెండు స్టేషన్లు రాష్ట్రంలోను, బయటా వున్న అన్ని ప్రధాన నగరాలకు చాల రైళ్ళ ద్వారా అనుసంధానంగా వున్నాయి. ఈ రెండు స్టేషన్లు, బస్టాండ్ల నుంచి షిర్డీ కి నిత్యం టాక్సీ సేవలు అందుబాటులో వున్నాయి.

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

వాయు మార్గం

షిర్డీ నుంచి 305 కిలోమీటర్ల దూరంలో వున్నా ముంబై లోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం దగ్గర లోని అంతర్జాతీయ విమానాశ్రయం. దేశంలోని అన్ని ప్రధాన నగరాలూ దీనికి అనుసంధానం చేయబడ్డాయి. ఇతర దేశీయ విమానాశ్రయాలు - నాశిక్ లోని గాంధీ నగర విమానాశ్రయం - వాయు మండల దూరం 76 కిలోమీటర్లు. - ఔరంగాబాద్ లోని చిక్కల్తానా విమానాశ్రయం - వాయు మండల దూరం 104 కిలోమీటర్లు.

షిర్డిలో సాయిబాబా

షిర్డిలో సాయిబాబా

పూణే లోని లోహేగావ్ విమానాశ్రయం - వాయు మండల దూరం - 147 కిలోమీటర్లు. షిర్డీ లోనే 2012 చివరి నాటికి ఒక విమానాశ్రయం కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. పనులు పురోగతిలో వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more