శ్రీకృష్ణుడితో రాసలీల కోసం గోపిక అవతారమెత్తిన శివుడు!
గోపేశ్వర మహదేవ్ ఆలయం గురించి మీరు విన్నారా? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్త్రీ రూపం దాల్చిన ప్రదేశం గోపేశ్వర మహదేవ్. నేడు బృదావనంగా పిలవబడుతున్న ప్రదేశంలోనే గోపేశ్వర ఆలయం లేదా గోపేశ్వర మందిరం ఉన్నది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడినది. కృష్ణుడికి సంబంధించిన ఆలయాల్లో శివుడికి అంకితం చేయబడిన ఆలయం ఇది.
శ్రీకృష్ణుడి రాసలీలా విశేషాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పరమ పవిత్రమైన పుణ్య స్థలంగా పేరుపొందినది 'బృదావనం'. ఈ క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలలో బడే కుంజ్ లోని 'గోపేశ్వర మందిర్'ఒకటి. ఈ ఆలయంలో రాత్రి వేళల్లో శివుడికి స్త్రీ రూపంలో అలంకారం చేస్తారు. అందుకు కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం ఒకటి పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి.
ఈ ప్రదేశంలోనే శివుడు గోపికగా మారి శ్రీ రాధ అనిగ్రహం పొందినాడని స్థల పురాణం చెబుతున్నది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వేల సంవత్సరాల క్రితం
వేల సంవత్సరాల క్రితం కృష్ణుని మనవడు అయిన వ్రజనాభ ఇక్కడ శివలింగాన్ని స్థాపించారు. ఇక్కడ ఆలయంలో శివుడిని సాయంత్రం గోపికగా అలంకరణ చేయడం వల్ల చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
PC:Officialamit

శరదృతువులో పౌర్ణమి రాత్రి సుగంద,
శరదృతువులో పౌర్ణమి రాత్రి సుగంద, సువాసనల పరిమళాలతో యమునా నది ఒడ్డున శ్రీ కృష్ణుణుడు వేణువు వాయిస్తుండగా అక్కడ ఒక అందమైన ఆహ్లదకరమైన వాతావరణం నెలకొన్నది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో గోపిక నృత్యం చేస్తున్నది!
PC: KuwarOnline

ఆ పరమశివుడు
ఆ పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా..బృందావనంలో శ్రీ కృష్ణుడి వేణు నాధం తీపి ధ్వని విని మంత్రముగ్గులై, కైలాసం వదలి వ్రిందావన్ లో శ్రీ కృష్ణుడి రాసలీలను తిలకించడానికై వచ్చాడు.
P: KuwarOnline
Most Read: ఈ సాక్షి గణపతి లేదా వ్రాతపతిని దర్శిస్తే గొప్ప విద్యావంతులవుతారు

పురాణాల ప్రకారం
పురాణాల ప్రకారం పరమ శివుడికి శ్రీకృష్ణుడితో కలసి రాసలో పాల్గొనాలనే కోరిక కలిగింది. రాసలో ఇతర పురుషులకు ప్రవేశం లేకపోవడం వలన, శివుడు స్త్రీ వేషాన్ని ధరించి రాసకు సిద్దపడుతాడు.
PC:Akshaybussi

అలా స్త్రీ రూపంలో ఉన్న శివుడిని చూసిన రాధ
అలా స్త్రీ రూపంలో ఉన్న శివుడిని చూసిన రాధ అసూయపడుతుంది. రాస జోరుగా జరుగుతున్నప్పుడు ..శివుడి మేలి ముసుగు జారిపోవడం వలన శివుడి నిజ రూపం అందరి కంట పడుతుంది.
PC: rvatemples.com

సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడికి వచ్చినందుకు
సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడికి వచ్చినందుకు అందరూ ఆనందిస్తారు. గోపిక స్థానంలో ఈశ్వరడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు. ఈ కారణం చేతనే ఇక్కడి దేవాలయంలోని శివలింగానికి రాత్రి వేళ స్త్రీ అలంకారం చేస్తారు.
PC: cat_collector
Most Read: రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..

అందుకు నిదర్శనం
అందుకు నిదర్శనం అక్కడ శివలింగంపై కనిపించే చిహ్నాలు గోపిక వేలిముద్రలుగా చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని గోపిశ్వర్ మహదేవ్ టెంపుల్ గా పిలవబడుతోంది.
PC: Atarax42

ఉత్తర ప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాలలో ఒకటి
ఉత్తర ప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాలలో ఒకటి గా ఉన్న బడేకుంజ్ లోని గోపిశ్వర్ ఆలయన్నా సందర్శించి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులను పొందుతారు.
PC:T.sujatha

దర్శన సమయం:
ఆలయాన్ని ఉదయం 5 : 30 నుండి రాత్రి 8 : 30 వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు.
PC:Biswarup Ganguly
Most Read: సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు

బృందావనం ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం : బృందావనంకు సుమారు 150 కి. మీ ల దూరంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని వ్రిందావన్ సందర్శించవచ్చు.
రైలు మార్గం : మథుర రైల్వే స్టేషన్ పదకొండు కిలోమీటర్ల దూరంలో కలదు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట టాక్సీ లేదా ఆటో లేదా బస్సులలో బృందావనం చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం : ఢిల్లీ, అలహాబాద్, ఆగ్రా మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మథుర వరకు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.
PC: cat_collector