Search
 • Follow NativePlanet
Share
» »Solo Travel - ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒంటరి ప్రయాణం

Solo Travel - ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒంటరి ప్రయాణం

ప‌ని ఒత్తిడితో అలసిన మ‌న‌సుకు కాస్త ప్ర‌శాంత‌త కావాలంటే ట్రావెల్ చేయాల్సిందే. అది కూడా సోలోగా ట్రావెల్ చేస్తే త్వ‌రితగ‌తిన ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం దొరుకుతుంద‌ని కొన్ని అధ్యయ‌నాలు చెబుతున్నాయి. ప్ర‌యాణ‌పు ప్ర‌ణాళిక మొద‌లుకుని, దాన్ని అమ‌లు ప‌ర‌చ‌డం వ‌ర‌కూ అంతా మ‌న చేతుల్లోనే ఉంటే స‌రికొత్త ఉత్తేజంతో ముందుకెళ‌తామ‌ట‌! ఎక్క‌డికి ఏ స‌మ‌యంలో వెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఏం తినాలి ఇలా ప్ర‌తి నిర్ణ‌యాన్ని మ‌న‌కు న‌చ్చిన‌ట్లు తీసుకోవ‌డం వ‌ల్ల ఒంట‌రిగా మ‌నం ఏదైనా సాధించ‌గ‌లం అనే సంక‌ల్పం మ‌న‌సులో ధృడంగా నాటుకుపోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

స‌రికొత్త ప‌రిచ‌యాల‌కు వేదిక‌..

ఒంట‌రి ప్ర‌యాణం వ‌ల్ల ఏదో కోల్పోయిన అనుభూతి క‌లుగుతుంద‌ని చాలామంది అభిప్రాయ‌ పడుతుంటారు. అందులో వాస్త‌వం లేదు. ప్ర‌యాణం ఒంట‌రిగా మొద‌లుపెట్టిన‌ప్ప‌టికి స‌రికొత్త ప‌రిచ‌యాల‌కు సొలో ట్రావెల్ వెదిక‌వుతుంద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్ర‌పంచం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంద‌నే విష‌యాన్ని మ‌ర్చిపోతే ఎలా చెప్పండి. స‌మ‌యానుగుణంగా మ‌న భావాల‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకు సోలో ట్రావెల్‌లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ప్ర‌యాణంలోని ప్ర‌తి క్ష‌ణాన్ని మ‌రుపురాని మ‌ధుర అనుభూతిగా ఆస్వాదిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ వివ‌రాల‌ను డైరీలో రాయ‌డం గానీ, కుటుంబ‌సభ్యులు, స్నేహితుల‌తో పంచుకోవ‌డం గానీ చేయ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. ఇలా చేయ‌డం వ‌ల్ల మీ ట్రావెల్ వివ‌రాల‌తో పాటు మీరు సుర‌క్షితంగా ఉన్నారు అనే విషయాన్ని వారికి చేర‌వేసిన‌ట్ల‌వుతుంది.

Solo Travel

ఒంట‌రి ప్ర‌యాణంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

మ‌నం ఎంచుకున్న ప్ర‌దేశాన్ని బ‌ట్టి మ‌న వ‌స్త్రాధార‌ణ‌లో మార్పులు త‌ప్ప‌నిస‌రి. కొన్ని ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను అక్క‌డివారి మ‌నోభావాల‌ను గౌర‌విస్తూ మ‌న వస్త్ర‌ధార‌ణ ఉండాలి. అప‌రిచిత వ్యక్తులను గ‌మ‌నిస్తూ ఉండాలి. అలాంటివారు తినేందుకు ఏమైనా అందించినా వాటిని స్వీక‌రించ‌క‌పోవ‌డ‌మే మంచిది. మ‌న‌తోపాటు తీసుకెళ్లిన వ‌స్తువుల విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. ల‌గేజ్‌ని మీ క‌నుస‌న్న‌ల్లోనే ఉంచుకోవ‌డం మంచిది. అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కు ల‌గేజ్‌ని త‌క్కువ‌గా తీసుకెళితే అనువుగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో న‌గ‌దును క్యారీ చేయ‌కూడ‌దు. విలువైన ఆభ‌ర‌ణాల‌ను ప్ర‌యాణాల్లో ధ‌రించ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం. సోలో ట్రావెల్ స‌మ‌యాల్లో చుట్టూ ఉన్న వారితో క‌లివిడిగా ఉండ‌డం మంచిదైన‌ప్ప‌టికీ దానికీ కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌ని గుర్తించుకోండి.

మీ ఆత్మ‌విశ్వాసం మీ క‌ళ్ల‌లో

వాతావ‌ర‌ణ మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని ప్రాథ‌మిక చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ కిట్‌ను అందుబాటులో ఉంచుకొండి. ఏ నిర్ణ‌య‌మైనా మీరు ఇష్ట‌పూర్వ‌కంగా తీసుకునే అవ‌కాశం ఉంది. ఒంట‌రిగా ప్ర‌యాణిస్తున్న‌మ‌నే విష‌యం న‌లుగురికి తెలియాల్సిన అవ‌స‌రం లేదు. అవ‌త‌లి వాళ్లు మిమ్మ‌ల్ని ర‌హ‌స్యంగా ఫాలో అయ్యే ప్ర‌మాదం ఉంది. అందుకే, మీ ట్రావెలింగ్ విష‌యాల‌ను మీకు అత్యంత స‌న్నిహితులైన వారితోనే పంచుకోవాలి. కొత్త ప్ర‌దేశ‌మే కావొచ్చు. కానీ అది మ‌న చూపుల్లో బ‌య‌ట‌ప‌డొద్దు. బెరుకు బెరుకుగా చూస్తే ఇట్టే దొరికిపొతారు. ఆ ప్రాంతం మీకు తెలుసు అన్న‌ట్లుగా ఉండాలి. మీ ఆత్మ‌విశ్వాసం మీ క‌ళ్ల‌లో క‌నిపించాలి. అప్పుడే క‌దా మీ చుట్టూ ఉన్న‌వారు మిమ్మ‌ల్ని ఆద‌ర్శంగా తీసుకునేది. అందుకే అనేది, సోలో ట్రావెల్ సో బెట‌ర్ అని.

  Read more about: solo travel
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X