» »బెంగుళూర్ లో అతి పురాతనమైన సోమేశ్వరాలయమునకు యాత్ర

బెంగుళూర్ లో అతి పురాతనమైన సోమేశ్వరాలయమునకు యాత్ర

By: Venkata Karunasri Nalluru

త్రిమూర్తులలో ఒకరైన శివునికి నాశనము చేయగల శక్తి కలదు. శివుడు అత్యంత శక్తివంతుడు. మన భారతదేశంలో శైవ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. ప్రతి ఆలయానికి దాని యొక్క సొంత చరిత్ర మరియు పురాణం ఉంది. మనకు దర్శించుటకు అనేక శైవక్షేత్రాలు వున్నాయి. అందులో బెంగుళూర్ నగరం యొక్క ఉల్సూర్ పట్టణంలో గల శివ ఆలయం ప్రధానమైనది.

బెంగుళూర్ నగరం యొక్క ఉల్సూర్ పట్టణంలో గల "సోమేశ్వర దేవాలయం" అప్పటి విజయనగర రాజుల నిర్మాణాలలో ఒకటి. ఇది చాలా అందమైన దేవాలయం. ఇది బెంగుళూర్ లోని అతి పురాతన దేవాలయాలలో ఒకటి.

సోమేశ్వరాలయము

PC : Dineshkannambadi

ఉల్సూర్ - పేరులో ఏముంది ?

ఉల్సూర్ ను "హలసూరు" అని పిలుస్తారు. విజయనగర రాజు కెంపెగౌడ ఈ ఆలయాన్ని స్థాపించాడు. ఈ ఆలయంలో శివుడు కొలువై వున్నాడు. హలసూరు సరస్సు ఒడ్డున ఈ ఆలయం నిర్మించబడింది. బ్రిటిష్ వలసవాదుల పరిపాలనలో "ఉల్సూర్" పేరు "హలసూరు" గా మారింది.

ఇక్కడ ఆలయ స్తంభాలు అందంగా చెక్కబడినది. అంతేకాకుండా స్తంభాలను చేతులతో తాకితే చాలు సంగీతం వినపడుతుంది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు మరియు శాసనాలు చాలా ఉన్నాయి.

దేవాలయం ముందు వైపున గల పెద్ద ధ్వజస్తంభం భక్తులను ఆకర్షిస్తుంది. త్రిమూర్తులందరూ ఒకేచోట పూజలందుకొనేలా ఒకేచోట అద్భుతంగా చెక్కబడినది. అవును బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు ఈ ముగ్గురూ ఒకేచోట పూజలందుకుంటున్నారు.

సోమేశ్వరాలయము

PC : Gkpandey

ఆలయ ప్రాంగణంలో అరుణాచలేశ్వర, పంచాలింగేశ్వర, నంజుండేశ్వర మరియు భీమేశ్వర విగ్రహాలు (శివుని యొక్క వివిధ రూపాలు) వున్నాయి. పార్వతీదేవి యొక్క మరొక రూపమైన కామాక్షమ్మ విగ్రహం కూడా ఇక్కడ పూజలు అందుకుంటోంది. మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆలయానికి చాలా మంది భక్తులు ఈశ్వరుణ్ణి దర్శించటానికి సంతోషంతో తరలి వస్తారు. ఈ ఆలయంలో భక్తులను ఆకర్షించే మరొక విషయమేమిటంటే కామాక్షమ్మ వార్షిక పండుగను జరుపుకుంటారు. ఆలయం చుట్టూ కామాక్షమ్మ విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు.

సోమేశ్వర ఆలయ పురాణం :

కెంపెగౌడ తన రాజధాని యలహంక నుండి దూరంగా వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఇతనికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వృద్ధుడు అగుపించి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్టించమని కోరాడు. అదేవిధంగా ఇక్కడ ప్రతిష్టించబడి పూజలందుకుంటూ వుంది.

సోమేశ్వరాలయము

PC : Dineshkannambadi

మరొక గాధ చెబుతున్నదేమిటంటే కెంపె గౌడకు స్వప్నంలో కనిపించినట్లుగానే, యలహంక రాజు, జయప్ప గౌడ రాజుకు కూడా స్వప్నంలో స్వప్నంలో ఒక వృద్ధుడు అగుపించి ఒక శివలింగం ప్రతిష్టించమని కోరాడు. అదే విధంగా ప్రతిష్టించారు. తర్వాత ఆ ప్రదేశం పుణ్యక్షేత్రంగా వెలిసి వేలమంది భక్తులు తరలివస్తున్నారు. అయితే ఆలయం చోళుల కాలం నాటిదైనా విజయనగర నిర్మాణ శైలిని పోలివుంది. ఇటీవల తవ్వకాలలో 1200 ఏళ్ళనాటి చెరువు బయటపడినట్లు తెలుస్తోంది.

బెంగుళూర్ లో ఈ పాతకాలపు అద్భుతమైన ఆలయం ఈ శివరాత్రికి దర్శించండి మరియు ఆ పరమాత్ముని యొక్క దీవెనలను పొందండి.

Please Wait while comments are loading...