» »156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలో (త్రిచీ గా పిలువబడే) తిరుచిరాపల్లి లోని అందమైన, ముగ్ధ పరచే ద్వీప నగరం శ్రీరంగం. ప్రాచీనకాలంలో శ్రీరంగాన్ని వేల్లితిరు ముతగ్రామం అని పిలిచే వారు. తమిళ భాష లో ఈ నగరాని తిరువరంగం అనేవారు. కావేరి - కొల్లిదం (కావేరి ఉపనది) నదుల మధ్య శ్రీరంగం వుంది. ప్రసిద్ధ శివ, విష్ణ్వాలయాలు వుండడం వల్ల ఇది హిందువులకు ప్రధాన పర్యాటక స్థానం. నిజానికి శ్రీరంగంలో విష్ణ్వారాధకులైన శ్రీవైష్ణవుల జనాభా ఎక్కువ. ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీ రంగనాధ స్వామి దేవాలయం ఒకటి. ప్రతి ఏటా విష్ణువు అనుగ్రహం కోసం అనేక మంది హిందూ భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద హిందూ దేవాలయం గా ఇది ప్రసిద్ది పొందింది. దీన్ని 631000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 4 కిలొమీటర్లు లేక 10,710 అడుగుల చుట్టు కొలతతో నిర్మించారు. దేవతల నివాసం విష్ణు భగవానుని ఎనిమిది దేవాలయాల్లో మొదటి ఆలయం కలిగి వుండడం శ్రీరంగం ప్రత్యేకత.

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

హిందూ పురాణాల ప్రకారం ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలే. విష్ణు భగవానుని 108 దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిదిగా భావిస్తారు. ఈ విష్ణ్వాలయం చాలా పెద్దది - 156 ఎకరాల విస్తీర్ణం లో దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణం వున్న ప్రదేశం కూడా కావేరి కోలేరూన్ నదుల మధ్య వున్న ద్వీప ప్రాంతంలో వుంది.

PC: Soldierhustle

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ఈ గుడికి ఏడు ప్రాంగణాలు వుంటాయి - ప్రాకారాలు గా స్థానికంగా పిలిచే వీటి గుండా భక్తులు నడుచుకుంటూ లోపలి వెళ్తారు. ఈ ప్రాకారాలు కూడా ప్రధాన ఆలయం చుట్టూ వృత్తాకారంలో నిర్మించిన దట్టమైన పెద్ద గోడలు గా వుంటాయి. ఈ ప్రాకారాల్లో 21 పెద్ద శిఖరాలు కూడా వున్నాయి. ఈ ప్రాకారాలతో వున్న ఈ గుడి నిర్మాణ పరంగా ఒక అధ్బుతమే.

PC:Melanie-m

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

శ్రీరంగనాథ స్వామి ఆలయం తమిళనాడురాష్ట్రంలోని తిరుచ్చిలో వున్న శ్రీరంగంలో వుంది. ఈ ఆలయాన్ని తిరువరంగంఅని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధానదైవం విష్ణువు.ఈ గుడి గురించి ప్రాచీనతమిళ సాహిత్రగ్రంథమైన దివ్యప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6నుండి 9వ శతాబ్దంవరకూ వున్న ఆళ్వారులగురించి రాసారు.

PC:youtube

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ఈ క్షేత్రాన్ని విష్ణువుకి ప్రీతికరమైన 108దివ్యదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో సాంప్రదాయకరంగా పూజాదికాలు జరుగుతాయి.శ్రీరంగం తమిళనాడులోని తిరుచునాపల్లికి ఆనుకుని ఉభయకావేరి నదులమధ్య వున్న పట్టణం.

PC:youtube

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధపుణ్య క్షేత్రం. దక్షిణభారత దేశంలో పురాతనమైన,ప్రముఖమైన వైష్ణవఆలయాలలో ఇది ఒకటి.ఈ ఆలయచరిత్ర సుప్రసిద్ధమైనది.కావేరీనదిలో ఒక ద్వీపంవంటి దానిలో వుండే ఈ ఆలయం ఎన్నో దండయాత్రలకు గురిఅయింది.

PC:youtube

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ప్రస్తుతం ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే. ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలో అంకోర్ వాట్ దేవాలయం అనేక భూకంపాలకు శిధిలావస్థలో వుండటం మరియు ప్రస్తుతం ఇది బౌద్ధదేవాలయంగా మారి పోవటంవల్ల మన దేశంలో వున్న శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలో వున్న అతిపెద్ద హిందూదేవాలయంగా భావిస్తున్నారు.

PC:youtube

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

అంతేకాక భారతదేశంలో అతిపెద్దఆలయ సంకీర్ణాలలో ఒకటి. ఈ ఆలయప్రదేశ వైశాల్యం 6లక్షల 31వేల చదరపుమీటర్లు.అంటే 156ఎకరాలు.ఈ ఆలయప్రకారం పొడవు 4కిమీ లు వుంటుంది.శ్రీరంగం ఆలయం 7ప్రాకారాలతో, 21గోపురాలతో విరాజిల్లుతుంది.

PC:youtube

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ఈ ఆలయరాజగోపురం ఆసియాలోనే అతిపెద్ద గోపురం.దీని ఎత్తు 236అడుగులు.ఈ ఆలయం పై వుండే శిలాశాసనాలు చోళ, పాండ్య, హోయసల మరియు విజయనగరవంశీయులకు చెందినవి.
ఈ శిలాశాసనాలు 9లేదా 16వ శతాబ్దానికి చెందినవి.

PC:Nagarjun Kandukuru

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

అనేక రాజకీయవ్యవహారాలమధ్య చోళ, పాండ్య, హోయసల మరియు విజయనగరవంశీయుల కాలంలో క్రమక్రమంగా నిర్మాణం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఆలయశిల్ప కళ అద్భుతంగా వుంటుంది. ఈ శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకోవటానికి భారతదేశనలుమూలలనుండి భక్తులు వేలసంఖ్యలో వస్తారు.

PC:Haneeshkm

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ఇక్కడ గర్భాలయంలో శయనించివున్న మూర్తికి పెరియపెరుమాళ్ అని పేరు. వుత్సవమూర్తికి నంబెరుమాళ్ అని పేరు.ఒక సమయంలో తురుష్కులవల్ల ఉపద్రవం ఏర్పడింది.అప్పుడు శ్రీరంగనాధులవుత్సవమూర్తిని చంద్రగిరిప్రాంతానికి చేర్చారు.అదేసమయంలో మరియొక మూర్తిని ప్రతిష్టించారు.

PC:Laks316

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ఆ విధంగా వేంచేసి వుత్సవాదులు స్వీకరించిన మూర్తిని 'తిరువరంగం ఆలిగయార్' అంటారు. గర్బాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు.

PC:Lokesh Ramachandra

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

స్వామి ప్రసాదములారగించు ప్రదేశమునకు "గాయత్రీమంటపము" అనిపేరు. గర్బాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్బాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.

PC:sowrirajan s

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ప్రపంచంలోనే మరియు దక్షిణభారతదేశంలోనే అతిపెద్ద ఆలయమైన శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రత్యక్షంగాచూడకపోయినా ఇలా చేసినా పుణ్యమే.

PC:Thangamani

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

నిజమైన దేవాలయాల పట్టణం విష్ణ్వాలయమే కాకుండా శ్రీరంగం లో మరో మూడు ప్రముఖ దేవాలయాలు వున్నాయి. వీటిని కూడా కావేరి నది ఒడ్డున నిర్మించారు. (శ్రీరంగపట్నం లోని) ఆది రంగ దేవాలయం, (శివనసముద్రం లోని) మధ్య రంగ దేవాలయం, (శ్రీరంగం లోని) అంత్య రంగ దేవాలయం - ఈ మూడు దేవాలయాలు కూడా రంగనాథుని ప్రధాన ఆలయాలుగా పరిగణిస్తారు.

PC:Thangamani

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

రాక్ ఫోర్ట్ దేవాలయం, తిరువానై కోవిల్, ఉరైయూర్ వెక్కలి అమ్మన్ దేవాలయం, సమయపురం మరియంమన్ దేవాలయం, కుమారా వైయలూర్ దేవాలయం, కాటాళగియా సింగర్ దేవాలయం ఈ చుట్టుపక్కల వున్న ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని. అప్పల రంగనాథార్ ప్రధాన దైవంగా వుండే శ్రీ వడివలగియ నంబి దేవాలయం ఇక్కడి ప్రధాన విష్ణ్వాలయం - దీన్నే అప్పుకుడత్తన్ దేవాలయ౦ అని కూడా అంటారు.

PC:Thangamani

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

శ్రీరంగం పట్టణానికి దగ్గర లోని కోవిలడి గ్రామంలో ఈ దేవాలయం వుంది. శ్రీరంగానికి దగ్గరలోని మరో ప్రసిద్ధ విష్ణ్వాలయం ట్రిచీ కి సమీపంలో వుంది. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం లో భాగమైన అళగియ నంబి దేవాలయం ఇది. పట్టణం లోను, చుట్టూ పక్కలా ఇన్ని దేవాలయాలు వున్న శ్రీరంగం చాలా మంది యాత్రికులను ఆకర్షించడం లో ఆశ్చర్యం ఏముంది.

PC:Ilasun

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

శ్రీరంగనాధ స్వామి దేవాలయం, సమయపురం మారియంమన్ దేవాలయం, జంబు లింగేశ్వర దేవాలయం, అఖిలా౦డేశ్వరి దేవాలయం శ్రీరంగంలోని ఇతర ప్రధాన దేవాలయాలు. వాతావరణం & రవాణా సౌకర్యం వేడి వేసవి నెలలు౦డే ఈ ప్రాంతం ఒక మోస్తరు వర్షపాతం కలిగి వుండి - శీతాకాలాలు బాగా చల్లగా కాకుండా ఆహ్లాదకరంగా వుంటాయి. శ్రీరంగం లో రైల్వే స్టేషన్ వుంది - రోడ్డు ద్వారా వెళ్ళే వారు ట్రిచీ వెళ్ళే బస్సు ఎక్కవచ్చు. మదురై ఇక్కడికి సమీప విమానాశ్రయం.

PC:Dheepika . K

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

శ్రీరంగం ఆకర్షణలు

సమయపురం మరియమ్మన్ దేవాలయం, శ్రీరంగం

తిరుచిరాపల్లి జిల్లా భాగమైన శ్రీరంగం పట్టణంలో సమయపురం మరియమ్మన్ దేవాలయం వుంది. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు సందర్శించే ఈ దేవాలయంలో ఆది, మంగళ, శుక్రవారాల్లో ప్రత్యెక పూజలు జరుగుతాయి కాబట్టి మరింత రద్దీగా వుంటుంది. భక్తులు అనేక రకాల నైవేద్యాలు తెస్తారు గానీ, బియ్యప్పిండి, నెయ్యి, పప్పు, బెల్లం వేసి తయారు చేసే ప్రత్యెక పదార్ధం ఇక్కడి ప్రధాన నైవేద్యం.

PC:NithinSantosh

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

మవిలక్కు మావు అని పిలువబడే ఈ ప్రసాదం దేవతలకు ఇష్టమైనదని చెప్తారు. ఇక్కడి ప్రజలు ఈ దేవాలయాన్ని ఒక తీర్థ యాత్రా స్థలంగా భావించడం వల్ల ఈ గుడికి చాలా ధార్మిక ప్రాధాన్యం వుంది. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ ఒక రథోత్సవం కూడా జరుగుతుంది. ఫిబ్రవరి మార్చ్ నెలల్లో జరిగే పుష్పోత్సవం మరో ప్రధాన పండుగ. పుష్పోత్సవాన్ని పూచోరితల్ అని పిలుస్తారు.

PC:NithinSantosh

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

శ్రీ రంగనాధ స్వామి దేవాలయం, శ్రీరంగం

శ్రీ మహావిష్ణువు శేషతల్ప శాయి గా వుండే మూల విరాట్టు తో రంగానాథావతారంగా శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో పూజలందుకుంటాడు. ద్రావిడ నిర్మాణ శైలి లో వుండే ఈ గుడి నిర్మాణం గురించి ఎన్నో సార్లు ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ప్రస్తావించారు. విష్ణువు ప్రధాన దైవంగా నిర్మించిన 108 దివ్య దేశాల్లో ఈ దేవాలయం మొదటిది.

PC:Haneeshkm

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

దక్షిణ భారతం లోని సుప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఈ గుడి చాల ప్రముఖమైనది. వైభవంగా నిర్మించిన ఈ దేవాలయం ఒక సున్నితమైన ప్రదేశంలో నిర్మించ బడడం వల్ల ఇది బలానికి, శక్తికి ప్రతీక గా నిలుస్తుంది. ప్రాకృతిక ఉపద్రవాల అంచున వున్న ఈ దేవాలయం గతంలో చాలా సార్లు డచ్చి, పోర్చుగీస్, ఇంగ్లీష్ వారి దాడులను తట్టుకుని కాల పరీక్షకు నిలబడింది.

PC:Vsashok123

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ఉత్తమ సమయం

అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం శ్రీరంగం సందర్శనకు అనుకూల సమయం. అప్పుడైతే ఉష్ణోగ్రత తక్కువగానూ వుంటుంది, అలాగని బాగా చలిగా కూడా వుండదు. నిజానికి ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ దేవాలయాల పట్టణంలో అనేక ఉత్సవాలు ఆ సమయంలోనే జరుగుతాయి. ఆ కాలంలోనే భారీ సంఖ్యలో పర్యాటకులు, భక్తులు ఇక్కడికి చేరుకుంటారు కూడా.

PC:Haneeshkm

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా

ట్రిచీ వెళ్ళే బస్సు ఎక్కితే శ్రీరంగం చేరుకోవచ్చు. దక్షిణ భారతం లోని చెన్నై, కన్యాకుమారి, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, మైసూరు, మంగళూరు, కోచి, రామేశ్వరం, తంజావూరు, మదురై, చిదంబరం, తూతుకుడి, కొల్లం, తెంకాసి, తిరుపతి లాంటి ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి బస్సులు వున్నాయి. డిల్లీ నుంచి ట్రిచీ కి నడిచే ప్రత్యెక బస్సులు కూడా వున్నాయి.

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

రైలుమార్గం ద్వారా

శ్రీరంగంలో రైల్వే స్టేషన్ వుంది. ఇక్కడికి చెన్నై కన్యాకుమారి రైల్వే లైన్లో చెన్నై నుంచి రైళ్ళు వస్తాయి. చెన్నై, కన్యాకుమారి రెండు ప్రాంతాలకు ఇతర నగరాల నుంచి చాలా రైళ్ళు వున్నాయి. చెన్నై నుంచి కన్యాకుమారి వెళ్ళే రైలెక్కి శ్రీరంగం చేరుకోవచ్చు - అలాగే వెనక్కి కూడా రావచ్చు.

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

156 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇలా చూసినా మహా భాగ్యమే !

వాయు మార్గం ద్వారా

ట్రిచీ లోని తిరుచిరాపల్లి శ్రీరంగానికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, డిల్లీ లాంటి నగరాలకు ఇక్కడి నుంచి విమానాలున్నాయి. సింగపూర్, అబూ ధాబి, దుబాయి, కువైట్, షార్జాల నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడికి చేరతాయి. విమానాశ్రయం నుంచి శ్రీరంగానికి టాక్సీలలో చేరుకోవచ్చు.