Search
  • Follow NativePlanet
Share
» »వీటిని సందర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయట...ఐశ్వర్య వృద్ధి తథ్యమట

వీటిని సందర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయట...ఐశ్వర్య వృద్ధి తథ్యమట

By Beldaru Sajjendrakishore

విస్తారమైన జనాభా కలిగిన భారతదేశంలో వివిధ మతాల వారు జీవిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి ఆధ్యాత్మికంగా తన భక్తిని చాటుకుంటారు. ఈ అందమైన దేవాలయాలకు గొప్ప నిర్మాణం మరియు గొప్ప చరిత్ర ఖచ్చితంగా వుంటుంది. పరమశివుని యొక్క ముఖ్యమైన దేవాలయాలు కొన్ని భారతదేశం లో ఉన్నాయి. వీటిని 'జ్యోతిర్లింగాలు' అని పిలుస్తారు. హిందూ మత భక్తులకు ప్రపంచంలో కొన్నిఅత్యంత పవిత్రమైన స్థలాలుగా పరిగణింపబడతాయి.

తెలుగు జానపద సినిమాల రహస్య కోట ఇక్కడ ఉంది.

వేసవిలో తెలుగు రాష్ట్రాల కొండ కోనల్లో చల్ల...చల్లగా

3500 ఏళ్ల మామిడి చెట్టు ఉన్న పుణ్యక్షేత్రం ఇదే

భారతదేశం నలుమూలలా "పన్నెండు జ్యోతిర్లింగాలు" ఉన్నాయి. ఇవి మొత్తం 64 అని అయితే వాటిలో 12 అతి పవిత్రమైనవిగా శివపురాణం పేర్కొంటుంది. ఈ పన్నెండింటిని సందర్శిస్తే అన్ని పాపాలు నశించి నరలోక ప్రాప్తి తప్పుతుందని చెబుతారు. అదే విధంగా ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ 12 జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి వాటి వెనుక కథ అవి ఎక్కడ ఉన్నాయన్న వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1. శివ పురాణం ప్రకారం

1. శివ పురాణం ప్రకారం

1. శివ పురాణం ప్రకారం

Image Source:

శివ పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది.బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది.

2. మొదలు తుది తెలుసుకోవాలని

2. మొదలు తుది తెలుసుకోవాలని

2. మొదలు తుది తెలుసుకోవాలని

Image Source:

ఆ మహా లింగం మొదలు,తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రుపమలో ఆదిని కనుక్కోవడానికి బయలు దేరుతారు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం (మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపి తనకు, బ్రహ్మకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు.

3. ఆవును కూడా

3. ఆవును కూడా

3. ఆవును కూడా

Image Source:

ఆవు కనపడితే అదే విధంగా చెప్పి, ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా, విష్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటారు. కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని, కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు.

4. తలతో అవునని

4. తలతో అవునని

4. తలతో అవునని

Image Source:

బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది. కాని, అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ దేవుడు అబద్దం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శాపం యిచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరం ఇచ్చాడు.

5. ఆ లింగం నుంచి వెలువడిన కిరణాలే

5. ఆ లింగం నుంచి వెలువడిన కిరణాలే

5. ఆ లింగం నుంచి వెలువడిన కిరణాలే

Image Source:

శివుడు యేర్పరచిన "జ్యోతిర్లింగం" అనంతమైనది. దానినుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి . ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం "లింగము" . ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది.

6. రామనాథ స్వామి లింగం రామేశ్వరం

6. రామనాథ స్వామి లింగం రామేశ్వరం

6. రామనాథ స్వామి లింగం రామేశ్వరం

Image Source:

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములో ద్వాదశ జోత్యిర్లింగాలలో ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరములో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు.

7. బ్రహ్మ హత్యాపాతకం

7. బ్రహ్మ హత్యాపాతకం

7. బ్రహ్మ హత్యాపాతకం

Image Source:

ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురిడిని అంతం చేసిన తర్వాత తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరములో రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.

8. మల్లికార్జున లింగం శ్రీశైలం

8. మల్లికార్జున లింగం శ్రీశైలం

8. మల్లికార్జున లింగం శ్రీశైలం

Image Source:

శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

9. భీమ శంకర లింగం భీమా శంకర

9. భీమ శంకర లింగం భీమా శంకర

9. భీమ శంకర లింగం భీమా శంకర

Image Source:

భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం . భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. ముంబాయికి 200 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది.

10. శాకిని, డాకినితో సేవించబడుతున్నాడు

10. శాకిని, డాకినితో సేవించబడుతున్నాడు

10. శాకిని, డాకినితో సేవించబడుతున్నాడు

Image Source:

సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపానది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణవచనం.

11. ఘృష్ణేశ్వరం లింగం ఘృష్ణేశ్వరం

11. ఘృష్ణేశ్వరం లింగం ఘృష్ణేశ్వరం

11. ఘృష్ణేశ్వరం లింగం ఘృష్ణేశ్వరం

Image Source:

మహారాష్ట్రలో ఔరంగాబాద్ సమీపంలో ఘృష్ణేశ్వరం మహదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం దేవి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు.ఈ యాత్రా స్థలం దౌలతబాద్ నుండి 15 కి. మి. మరియు ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘృష్ణేశ్వరం మహదేవ్ ఆలయం భూమిపై చివరి లేదా 12 వ (పన్నెండవ) జ్యోతిర్లింగ నమ్ముతారు.

12. అపూర్వ మహిమలకు

12. అపూర్వ మహిమలకు

12. అపూర్వ మహిమలకు

Image Source:

ఎల్లోర గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులది మహాద్భాగ్యమని చెప్పొచ్చు. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.

13. త్రయంబకేశ్వరాలయం నాసిక్

13. త్రయంబకేశ్వరాలయం నాసిక్

13. త్రయంబకేశ్వరాలయం నాసిక్

Image Source:

త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.

14. మరణం నుంచి కాపడమని

14. మరణం నుంచి కాపడమని

14. మరణం నుంచి కాపడమని

Image Source:

త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.

15. సోమనాథ లింగం సోమనాథ్

15. సోమనాథ లింగం సోమనాథ్

15. సోమనాథ లింగం సోమనాథ్

Image Source:

సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. ఇది అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్రతీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది.

16. అనేకసార్లు దోపిడికి గురయ్యింది

16. అనేకసార్లు దోపిడికి గురయ్యింది

16. అనేకసార్లు దోపిడికి గురయ్యింది.

Image Source:

ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తుశకం. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత క్రీస్తుశకం. 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి, భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్‌ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలైన మార్వార్‌, బ్రోచ్‌, ఉజ్జయినీ, గుజరాత్‌ మొదలైన వాటిమీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో రెండవ సారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమయ్యింది. అటు పై అనేకులు ఈ దేవాలయం పై దాడి చేసి సంపదను దోచుకువెళ్లినట్టు చరిత్ర చెబుతుంది.

17. నాగేశ్వర లింగం ద్వారకావనం

17. నాగేశ్వర లింగం ద్వారకావనం

17. నాగేశ్వర లింగం ద్వారకావనం

Image Source:

శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది. జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.

18. ఓంకారేశ్వర లింగం ఓంకారక్షేత్రం

18. ఓంకారేశ్వర లింగం ఓంకారక్షేత్రం

18. ఓంకారేశ్వర లింగం ఓంకారక్షేత్రం

Image Source:

ఓంకారేశ్వర భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇక్కడ ఉంది రెండుకొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలు ను ఆకాశం నుండి చూస్తె ఓం ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు .ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం రాయబడి ఉంటుంది . శివుడికి అంకితం హిందూ మతం ఆలయం. ఇది శివుని జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి.

19. మహాకాళేశ్వర లింగం ఉజ్జయినీ

19. మహాకాళేశ్వర లింగం ఉజ్జయినీ

19. మహాకాళేశ్వర లింగం ఉజ్జయినీ

Image Source:

హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు.

20. వైద్యనాథ లింగం దేవ్ ఘర్

20. వైద్యనాథ లింగం దేవ్ ఘర్

20. వైద్యనాథ లింగం దేవ్ ఘర్

Image Source:

ఖచ్చితమైన ప్రదేశంపై ఇంకనూ వివాదం ఉన్నప్పటికీ, ఈ దేవాలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగడ్ పట్టణంలో కలదు. దీనిని కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగనిస్తారు.

21. విశ్వేశ్వరలింగం వారణాసి

21. విశ్వేశ్వరలింగం వారణాసి

21. విశ్వేశ్వరలింగం వారణాసి

Image Source:

కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది.

22. కేదారేశ్వరలింగం కేదారనాథ్

22. కేదారేశ్వరలింగం కేదారనాథ్

22. కేదారేశ్వరలింగం కేదారనాథ్

Image Source:

దార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు.

23. కాలినడకన మాత్రమే

23. కాలినడకన మాత్రమే

23. కాలినడకన మాత్రమే

Image Source:

గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాధ్ లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు. ఆలయం ముందరి భాగంలో కుంతీదేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి.

24. స్వయంభువుడు

24. స్వయంభువుడు

24. స్వయంభువుడు

Image Source:

గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది.

25. అందుకే వారి విగ్రహాలు

25. అందుకే వారి విగ్రహాలు

25. అందుకే వారి విగ్రహాలు

Image Source:

పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more