Search
  • Follow NativePlanet
Share
» »21,467 అడుగుల అత్యంత ఎత్తులో గంగోత్రి జాగేశ్వర్ ఆలయం !

21,467 అడుగుల అత్యంత ఎత్తులో గంగోత్రి జాగేశ్వర్ ఆలయం !

పరమశివుని జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవది జాగేశ్వర్ ఆలయం, ఉత్తరాఖండ్ ని "ల్యాండ్ ఆఫ్ గాడ్స్" గా వర్ణిస్తారు. ఆల్మోరా జిల్లా ఉత్తరాఖండ్ లో జాగేశ్వర్ ఆలయం వుంది.ఇక్కడ మొత్తం 124ఆలయాలు కలిసి సమూహంగా వుంటాయి.

By Venkata Karunasri Nalluru

పరమశివుని జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవది జాగేశ్వర్ ఆలయం, ఉత్తరాఖండ్ ని "ల్యాండ్ ఆఫ్ గాడ్స్" గా వర్ణిస్తారు. ఆల్మోరా జిల్లా ఉత్తరాఖండ్ లో జాగేశ్వర్ ఆలయం వుంది.ఇక్కడ మొత్తం 124ఆలయాలు కలిసి సమూహంగా వుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని "టెంపుల్ సిటీ" అంటారు. హిందువుల నమ్మకం ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా జాగేశ్వర జ్యోతిర్లింగాన్ని భావిస్తారు. విష్ణుమూర్తి ప్రతిష్టించిన జ్యోతిర్లింగాల్లో దీనిని ఎనిమిదవ జ్యోతిర్లింగం అని భక్తుల నమ్మకం.

ఇది దారుక అనే అడవి మధ్యలో వుంటుంది. ఇది ఎనిమిదవ జ్యోతిర్లింగం.ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారని ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు. 8 వ శతాబ్దంలో నిర్మించి వుండవచ్చని భావిస్తారు. కేదారనాథ్ కి వెళ్ళటానికి ముందు ఆదిశంకరాచార్యులవారు ఇక్కడ పూజాదికార్యక్రమాలు నిర్వహించారట. జాగేశ్వర్ ఆలయం ప్రక్కన వుండే స్మశానంలో పూర్వం చాంద్ రాజుల యొక్క భార్యలు పూర్వం సతీసహగమనం చేసేవారట.

21,467 అడుగుల అత్యంత ఎత్తులో గంగోత్రి జాగేశ్వర్ ఆలయం !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. పరమశివుడు

1. పరమశివుడు

ఈ ఆలయానికి సమీపంలో కోటి లింగాల ఆలయం అనే ప్రాంతంలో పరమశివుడు ధ్యానం చేసుకునేవాడని భావిస్తారు.

pc: youtube

2. శివలింగం

2. శివలింగం

ఈ ఆలయం బయట నంది, స్కంది అనే ద్వారపాలకులు వుంటారు. ఇక్కడ శివలింగం రెండు భాగాలుగా వుంటుంది.

pc: youtube

3. అఖండజ్యోతి

3. అఖండజ్యోతి

ఒక భాగం పరమశివుడిగా, మరొక భాగం పార్వతీదేవిగా భావిస్తారు. ఇక్కడ అఖండజ్యోతి వెలుగుతూ వుంటుంది.

pc: youtube

4. జాగేశ్వర్ ఆలయం

4. జాగేశ్వర్ ఆలయం

స్త్రీ మహామృత్యుంజయ ఆలయం అతి పెద్ద శివాలయం. జాగేశ్వర్ ఆలయం ప్రక్కనే ఈ ఆలయం వుంటుంది.

pc: youtube

5. మృత్యుగండాలు, భయాలు

5. మృత్యుగండాలు, భయాలు

ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఇక్కడ మృత్యుంజయ మంత్రాన్ని జపించిన వారికి అన్ని రకాల మృత్యుగండాలు, భయాలు తొలిగిపోతాయని భావిస్తారు.

pc: youtube

6. త్రినేత్రుడు

6. త్రినేత్రుడు

ఇక్కడ స్వామివారు త్రినేత్రుడిగా దర్శనమిస్తారు. శివలింగం అనే పర్వత శిఖరం లింగం ఆకారంలో వుంటుంది.

pc: youtube

7. అత్యంత ఎత్తైన శిఖరం

7. అత్యంత ఎత్తైన శిఖరం

గంగోత్రి యొక్క పర్వత శిఖరాలలో అత్యంత ఎత్తైన శిఖరం ఇది. సముద్ర మట్టానికి 21, 467 అడుగుల ఎత్తులో వుంటుంది.

pc: youtube

8. గోముఖ ఆకారం

8. గోముఖ ఆకారం

ఉత్తరాఖండ్ కి 6కి.మీ ల దూరంలో లింగాకారంలో మరియు గోముఖ ఆకారంలో కనిపిస్తుంది.

pc: youtube

9. మహాదేవ్ కా లింగ్

9. మహాదేవ్ కా లింగ్

ఇక్కడ నుండే భాగీరథ నది పుట్టిందని భావిస్తారు. శివలింగం పర్వతశిఖరాన్ని మహాదేవ్ కా లింగ్ అని అక్కడి వారు భావిస్తారు.

pc: youtube

10. కేధార్ నాథ్ ఆలయం

10. కేధార్ నాథ్ ఆలయం

గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేధార్ నాథ్ లను చార్ ధాం గా వ్యవహరిస్తారు.

pc: youtube

11. రుద్రశ్రేణులు

11. రుద్రశ్రేణులు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలలో రుద్రశ్రేణులలో వుంది.

pc: youtube

12. రుద్రప్రయాగ్

12. రుద్రప్రయాగ్

వేల సంవత్సరాల నాటిది ఈ ఆలయం. హిందువుల యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో వుంది.

pc: youtube

13. గర్వాల్ కొండలు

13. గర్వాల్ కొండలు

కేదార్ నాథ్ సముద్రమట్టానికి 3584మీ ల ఎత్తులో మందాకినీ నది పైభాగంలో మంచుకొండల మధ్య వుంది. శివ భక్తుల యొక్క ముఖ్య పుణ్యక్షేత్రం కేదారనాథ్ గర్వాల్ కొండల పై భాగంలో వుంటుంది.

pc: youtube

14. అక్షయతృతీయ

14. అక్షయతృతీయ

ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుంచి వరకు ఈ గుడిని తెరిచి వుంచుతారు. ప్రతిష్టించిన శివలింగం యొక్క ఆధారాలు ఏమీ లేవు.

pc: youtube

15. ఆదిశంకరాచార్యుల వారు

15. ఆదిశంకరాచార్యుల వారు

ఈ గుడిని ఆదిశంకరాచార్యుల వారు నిర్మించినట్టు భక్తులు నమ్ముతారు.గుడి వెనకభాగంలో ఆదిశంకరాచార్యులవారి సమాధి వుంది.

pc: youtube

16. స్వయంభూ

16. స్వయంభూ

గర్భగుడిలో ఈశ్వరుడు స్వయంగా స్వయంభూగా దర్శనమిస్తారు. పాండవులు కుంతీదేవితో కలిసి పూజలు నిర్వహించారని, అందుకే వారి విగ్రహాలు ఇక్కడ వున్నాయని భావిస్తారు.

pc: youtube

17. ప్రకృతిలో లోయలు, జలపాతాలు

17. ప్రకృతిలో లోయలు, జలపాతాలు

ఆలయం పర్వత శిఖరాగ్రంలో వుంటుంది. కావున ఏ నిమిషంలోనైనా వర్షం,హిమపాతం కురవవచ్చు.పచ్చటి ప్రకృతిలో లోయలతో,జలపాతాలతో ఎంతో అందంగా వుంటుంది.

pc: youtube

18. ప్రకృతిలో లోయలు, జలపాతాలు

18. ప్రకృతిలో లోయలు, జలపాతాలు

మరి అంతే ప్రమాదకరం కూడా ఈ ప్రయాణం. ఈ మార్గంలో గంటకి 20 కి.మీల కన్నా ఎక్కువ ప్రయాణం చేయలేం. ఎందుకంటే ఒక వైపు కొండ, మరో వైపు 1000 మీ ల లోతున్న లోయ.క్రిందికి చూస్తే భయంతో చెమటలు పట్టడం ఖాయం.

pc: youtube

19. కైలాసం

19. కైలాసం

ఈ ప్రయాణం నిజంగా కైలాసంలో పరమశివుడ్ని దర్శించటానికి వెళ్తున్నామా అనేంత ఆనందంగా భయంగా కూడా వుంటుంది.

pc: youtube

20. ఉత్తరాఖండ్ రాష్ట్రం

20. ఉత్తరాఖండ్ రాష్ట్రం

ఇప్పుడు ధారిదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా భావిస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల మధ్యలో వున్న అలకనందా నదీ తీరంలో పూజలందుకుంటున్న ధారీదేవి అత్యంత శక్తివంతురాలని చెబుతారు.

pc: youtube

21. ధారామాత

21. ధారామాత

ఈమెకు ధారామాత అని ఇంకొక పేరుకూడా వుంది. ధారీదేవి ఆలయం పైన కప్పు వుండదు. అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచటమే ధారీదేవికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆ ప్రాంతానికి చెందిన హైందవులు భావిస్తూవుంటారు.

pc: youtube

22. అలకనందా

22. అలకనందా

ఈ ఆలయానికి అవతలగట్టున ధారీ అనే గ్రామమున్నది. ఈ ఆలయాన్ని మరియు ఆ గ్రామాన్ని కలుపుతూ అలకనందా పైన వూగే బ్రిడ్జ్ వుంది.

pc: youtube

23. ధారీదేవి ఆలయం

23. ధారీదేవి ఆలయం

శ్రీనగర్, బదరీనాథ్,రహదారి మార్గంలో తగిలే కల్యాసర్ అనే ప్రాంతంలో ఈ ధారీదేవి ఆలయం వున్నది.

pc: youtube

24. రుద్రప్రయాగ్

24. రుద్రప్రయాగ్

ఈ ఆలయం ఢిల్లీ నుండి 360 కి.మీ ల దూరంలోను రుద్రప్రయాగ్ నుండి 20కి.మీ ల దూరంలోను వుంది.

pc: youtube

25. ధారీదేవి ఆలయం

25. ధారీదేవి ఆలయం

ఈమె తనని పూజించిన వారిని ఎంత అభిమానంతో కాపాడుతుందో,అదే విధంగా తనను ధిక్కరించిన వారిని అంత భయంకరంగా శిక్షిస్తుంది.

pc: youtube

26. ధారీదేవి ఆలయం

26. ధారీదేవి ఆలయం

ఈ దేవత యొక్క అద్భుత శక్తిని సూచించే ఒక సంఘటన 2013 వ సంవత్సరంలో జూన్ నెల 16వ తేదీన జరిగింది.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X