Search
  • Follow NativePlanet
Share
» »తిరునల్లార్ - శనిగ్రహానికి అంకితం చేసిన ఊరు !

తిరునల్లార్ - శనిగ్రహానికి అంకితం చేసిన ఊరు !

By Mohammad

తిరునల్లార్ కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి లోని కారైకాల్ కి సమీపాన ఉన్న గ్రామం. ఈ ప్రదేశం శని గ్రహానికి అంకితం చేయబడినది. ఈ గ్రామంలో శనీశ్వర్ ఆలయం అత్యంత ప్రసిద్ధ ఆలయం మరియు శని యొక్క పుణ్య క్షేత్రం. ఇక్కడ దేవుడు శివుని రూపంలో ఉంటారు. లక్షలాది భక్తులు దేవుని పూజల కోసం శనీశ్వరన్ ఆలయంను సందర్శిస్తారు.

తిరునల్లార్ చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

తిరునల్లార్ పట్టణంలో శనీశ్వరన్ దేవాలయం, శ్రీ దర్బరన్యేశ్వర ఆలయం మరియు బద్రకలియమ్మన్ ఆలయం అనే మూడు ఆలయాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

ఆలయ ముఖ ద్వారం

ఆలయ ముఖద్వారం

చిత్ర కృప : Suresh S

ప్రతి రోజు వేల సంఖ్యలో ఈ ఆలయాలను యాత్రికులు సందర్శిస్తారు. ఈ ఆలయాలను సందర్శించుట వల్ల తమ కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం.

శ్రీ దర్బరన్యేశ్వర ఆలయం

శనీశ్వరన్ దేవాలయం కింద శ్రీ దర్బరన్యేశ్వర ఆలయం ఉన్నది. ప్రతి రోజు వేల సంఖ్యలో ఈ ఆలయాన్ని యాత్రికులు సందర్శిస్తారు. ఈ ఆలయం సందర్శించుట వల్ల తమ కోరికలు తీరతాయని విశ్వాసం ఉన్నందున మొత్తం దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఒకటిగా భావిస్తారు. శని గ్రహానికి అంకితం చేసిన నవగ్రహ ఆలయాలలో ఇది ఒకటి.

ఇది కూడా చదవండి : తమిళనాడు లోని నవగ్రహ ఆలయాల పూర్తి సమాచారం !

భక్తులు దేవునికి ప్రార్థనలు చేయటానికి ముందు నల తీర్థంలో స్నానం చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నారు. శనీశ్వరన్ ఆలయంలో దేవుడు ఒక చేయి దీవెనలు ఇస్తున్నట్లు ఉంటుంది.

దర్బరన్యేశ్వర ఆలయంలోని లోపలి భాగం

దర్బరన్యేశ్వర ఆలయంలోని లోపలి భాగం

చిత్ర కృప : Ramachandra Sreedharan

శ్రీ దర్బరన్యేశ్వర ఆలయంలో శివున్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడు స్వయంభు లింగంగా ఉన్నారు. తిరునల్లార్ లార్డ్ శివ లార్డ్ బ్రహ్మ యొక్క దీవెనలతో వర్షాన్ని కురిపించిన పవిత్ర ప్రదేశం.

బద్రకలియమ్మన్ ఆలయం

తిరునల్లార్ లో మరొక ప్రసిద్ధ ఆలయం బద్రకలియమ్మన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలోని దేవత టెర్రా కొట్టా తో తయారుచేయబడి, నాలుగు చేతులు కలిగి ఉంటుంది. భక్తులు అమ్మవారికి పూజిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కారైకాల్ కు పశ్చిమ దిశలో 15 కిలోమీటర్ల దూరంలో భద్రకాళీ యమ్మన్ ఆలయం ఉన్నది. ఆలయాన్ని అమ్బగారతుర్ కాళీ యమ్మన్ అని మరో పేరుతో కూడా పిలుస్తారు.

అమ్మవారి విగ్రహం, బద్రకలియమ్మన్ ఆలయం

అమ్మవారి విగ్రహం, బద్రకలియమ్మన్ ఆలయం

చిత్ర కృప : mohan ram

అంతేకాకుండా పెద్ద నిశ్చలంగా ఉన్న రెండు పవిత్ర రథాలు తిరునల్లార్ లో ఉన్నాయి. ఈ రథాలు ఊరేగింపుగా వెళ్లిన్నప్పుడు భక్తులకు దేవుళ్ల దర్శనం అందిస్తుంది.

సమీప నవగ్రహ ఆలయాలు

మిగిలిన ఎనిమిది నవగ్రహ ఆలయాలు తిరునల్లార్ చేరువలో ఉన్నాయి. అవి సురియనర్ కోయిల్ (సూర్య గ్రహం లేదా ఆది దేవుడు కోసం), కన్జనూర్ (శుక్ర గ్రహం లేదా సుక్రన్ కోసం), అలంగుడి (బృహస్పతి గ్రహం లేదా గురు కోసం కోసం), తిరువెంకడు (బుధ గ్రహం లేదా బుధన్ కోసం), వైదీశ్వరన్ కోయిల్ (అంగారక గ్రహం లేదా సెవై కోసం ), తిరునగేస్వరం మరియు కీజ్హ్పెరుమ్పల్లం (రెండు పాము గ్రహాలకు) మరియు తిన్గాలుర్ (చంద్రుని కోసం) ఉన్నాయి.

నవగ్రహ ఆలయం

నవగ్రహ ఆలయం

చిత్ర కృప : Manfred Sommer

తిరునల్లార్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

ట్రిచీ ఎయిర్ పోర్ట్ తిరునల్లార్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 150 కిలోమీటర్ల దూరంలో కలదు. దేశంలోని ప్రధాన నగరాల నుండి మరియు చెన్నై నుండి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానించనబడింది. క్యాబ్ లేదా టాక్సీ లలో తిరునల్లూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరునల్లార్ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన మైలదితిరై అనే రైల్వే స్టేషన్ మాత్రమే ఉన్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట క్యాబ్ లేదా ప్రభుత్వ వాహనంలో ఎక్కి కొద్దీ నిమిషాల్లో తిరునల్లూర్ చేరుకోవచ్చు.

ప్రధాన ఆలయ కోనేరు

ప్రధాన ఆలయ కోనేరు

చిత్ర కృప : Vijaya Raghavan Damodaran

బస్సు / రోడ్డు మార్గం

కారైకాల్ పట్టణం దాదాపు తమిళనాడు లోని ప్రతి పట్టంతో, నగరంతో చక్కగా కలపబడి ఉంటుంది. కనుక, కారైకాల్ నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులో ఎక్కి రోడ్డు మార్గాన తిరునల్లూర్ సులభంగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X