» »ఆనంద నిలయ దివ్య విమానం - తిరుమల

ఆనంద నిలయ దివ్య విమానం - తిరుమల

Written By: Venkatakarunasri

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.

ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

తిరుమల అనే పదం ‘తిరు' (పవిత్ర), ‘మల' (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం' అని అనువదించబడింది.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఈ వ్యాసంలో మనం ఆ కలియుగ వైకుంఠదేవుడు శ్రీనివాసుడిగురించి ఒక ప్రత్యేక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిగురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.ఇక ముక్కోటి దేవతలతో పూజలందుకునే దేవదేవుడు కొలువైన సప్తగిరులగురించి తెలుసుకోవలసినది కూడా ఎంతో వుంటుంది.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఇది సాక్ష్యాత్తూ ఆ శ్రీమహావిష్ణువే స్వయంభువుడిగా అవతరించిన పుణ్య క్షేత్రం నిత్యకళ్యాణం,పచ్చతోరణంతో అలరారే తిరుమలనాథుడ్ని దేవతలు రహస్యంగా దర్శించి ప్రత్యేక పూజలు చేసి వెళ్తూఉంటారని నమ్ముతాం.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఇదే విషయాన్ని గురించి తిరుమల అర్చకులు రమణదీక్షితులు వ్యాఖ్యలు చేసారు.తిరుమలపై ఒక టి.వీఛానల్ రూపొందించిన ప్రత్యేకకార్యక్రమంలో భక్తులకు ఊహకందని విశేషాలను ఆయన వెల్లడించారు.
తిరుమల గిరులపై శ్వేతదీపం వుందని ఇక్కడ యోగులు, సిద్దులతో పాటు ధవళవస్త్ర ధారులైన దేవతలూ నివసిస్తారని అన్నారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

శ్వేతదీపం నుంచి స్వామి వారి ఆలయంలోకి ఒక రహస్యమార్గం వుందని దాని గుండా దేవతలు వచ్చి వెళుతూవుంటారని,పురాణాల్లో వుందని అన్నారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఇక పవళింపు సేవతర్వాత సుప్రభాత సేవకు ముందు స్వామి వారిని సేవించటానికి అసంఖ్యాకంగా దేవతలు వస్తూవుంటారట.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

సుప్రభాతం ముగిసిన పిమ్మట గర్భాలయంలోకి అర్చకులు ప్రవేశించేవేళ వారి భుజాలను తాకుతూ దేవతలు బయటకు వెళ్ళిపోతారనీ తెలిపారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఇక అష్టాదశ పురాణ సారమైన వేంకటాచాల మహత్యంలో ఈ వివరాలన్నీ వున్నాయని పేర్కొన్నారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

శ్వేతదీపాన్ని చేరుకోటానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని పవిత్రస్థలాల్లో రహస్యమార్గాలు వున్నాయి.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

సిద్ధులు,యోగులు, దేవతలు వీటిద్వారా రాకపోకలుసాగించి బాహ్యప్రపంచానికి వచ్చి లోకకళ్యాణం కోసం కొన్ని కార్యాలు నిర్వహిస్తారని వివరించారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఇక ఉత్తరఈశాన్య ప్రాంతంలోని దట్టమైన అడవుల్లోవుండే ఒక గుహ ముఖద్వారమే ఈ శ్వేతదీపానికి,శేషాచల కొండల్నుంచి రహస్యమార్గమని సూచనగా పేర్కొంటారని రమణదీక్షితులు అన్నారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

శ్వేత ద్వీపంలో వుండే రత్నకచిత సింహాసనం పై ఒక మహాపురుషుడు ఆసీనుడై ఇరువైపులా దేవేరులతో కొలువుంటారని కూడా ఆయన పేర్కొన్నారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఇన్నాళ్ళు దేవరహస్యంగా వున్న ఈ విషయంపై రమణదీక్షితులు ఇంటర్యూలో స్పందించారు.

కలియుగ వైకుంఠదేవుడు

కలియుగ వైకుంఠదేవుడు

ఆ దేవదేవుని మహత్యానికి ఇదీ ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును.