Search
  • Follow NativePlanet
Share
» »వివాదాస్పద భూభాగంలో అద్భుత ఆకర్షణలు !

వివాదాస్పద భూభాగంలో అద్భుత ఆకర్షణలు !

లడఖ్ పేరు చెప్పగాని అనేక ఉత్సాహాలు పెల్లుబుకుతాయి. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున కల ఈ ప్రదేశం, మంచుతో పూర్తిగా కప్పబడిన ఆకాశంలోకి చొచ్చుకు పోయే శిఖరాలు కల దృశ్యాలు పర్యాటకులకు పూర్తి ఆనందం కలిగిస్తాయి. అంత ఎత్తులో చుట్టూ పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి పర్యటించటం ఒక అద్భుత అనుభవం కాగలదు. ఇక లెహ్ పర్యటనకు వస్తే, ఈ ప్రదేశం అంతా ఒక టూరిస్ట్ స్వర్గంగా వుంటుంది. ఉత్తర భారత దేశపు స్వర్గం అని చెప్పవచ్చు. టవున్ లో ఎక్కడ చూసినా టాటూ లు వేసుకున్న టూరిస్ట్ లు, ఎం ఫీల్డ్ బుల్లెట్లు, వివిధ రకాల డిష్ లు తయారు చేసే రెస్టారెంట్ లు మీకు దర్శనం ఇస్తాయి.

లెహ్ ఆకర్షణలు

లెహ్ ఆకర్షణలు

లెహ్ ప్రదేశం పర్యాటకులకు వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు ఒక కేంద్రంగా వుంటుంది. ఇక్కడ నుండి ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు స్థానిక టూరిజం చేస్తుంది. లడక్ చుట్టుపట్ల కల ప్రధాన ఆకర్షణలు చూసేందుకు కనీసం ఒక వారం నుండి పది రోజుల వరకూ పడుతుంది. లెహ్ నుండి వివిధ ప్రాంతాలకు తక్కువ ధరలలో ప్రభుత్వ బస్సు ల తో పాటు ప్రైవేటు కార్, కాబ్ వంటివి కూడా లభ్యంగా వుంటాయి.

లెహ్ ఆకర్షణలు

లెహ్ ఆకర్షణలు

లెహ్ లో మీరు టిబెటన్ శరణార్ధుల మార్కెట్ లు జామా మసీద్ వంటివి చూడవచ్చు. మసీద్ వెనుక భాగంలో తాజాగా చేయబడే రుచికర బ్రెడ్ లు ఆరగించవచ్చు. లెహ్ లో సీమో ఫోర్ట్ ఒక ప్రధాన ఆకర్షణ. లెహ్ పాలస్ మరియు శాంతి స్తూపల నుండి టవున్ లోని సుందర దృశ్యాలు చూడవచ్చు. లెహ్ ప్రదేశానికి సుమారు 50 కి. మీ. ల పరిధిలో కల బౌద్ధ ఆరామాలు, పాలస్ లు చూసేందుకు ఒక రోజు కేటాయిన్చాల్సిందే. తిక్ సే గొంప ప్రదేశాన్ని ఉదయంవేళ ఇక్కడి బౌద్ధ సన్యాసులు చేసే ప్రార్ధన సమయంలో దర్శింఛి ఆనందించవచ్చు.

పాన్గోంగ్ లేక్

పాన్గోంగ్ లేక్

లడక్ లో పాన్గోంగ్ సరస్సు ప్రధాన ఆకర్షణ. ఈ సరస్సు నీరు స్వచ్చంగా దట్టమైన నీలి రంగులో కనపడుతుంది. పరిసరాలు దట్టమైన బ్రౌన్ రంగులో వుంటాయి. చాలా మంది పగటి పూట సరస్సు సందర్శన చేస్తారు. అయితే ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి కలవారు రాత్రి వేళ బస చేసి, ఉదయంలో సూర్య కిరణాలు సరస్సులో పడి వివిధ రంగులు మారటాన్ని ఫోటోలు తీసి ఆనందిస్తారు.

నుబ్రా వాలీ

నుబ్రా వాలీ

నుబ్రా వాలీ చేరాలంటే, ప్రపంచం లోనే ఎత్తైన కార్డుంగ్ లా పాస్ గుండా రోడ్డు మార్గంలో వెళ్ళాలి. ఎన్నో హెయిర్ పిన్ వంపులు, రోడ్ పూర్తిగా రాతి నిర్మాణం, అంత ఎత్తులో సరిగా మీకు ఆక్సిజన్ అందకా పోవటం వంటి సమస్యలతో తలనొప్పి, కడుపులో వికారం వంటివి కలిగే అవకాశం వుంది. ఒక సారి నుబ్రా వాలీ చేరితే, ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. అనేక ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. నుబ్రా వాలీ లో వసతి పొందేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజ్ లు కలవు.

 అల్చి మరియు లమయూరు

అల్చి మరియు లమయూరు

అల్చి ఒక టెంపుల్ కాంప్లెక్స్. ఇక్కడ లడక్ లోని అతి పురాతన బౌద్ధ టెంపుల్స్ కలవు. ఈ టెంపుల్ కుడ్య చిత్రాలు అత్యంత సుందరంగా చెక్కబడి పర్యాటకులకు కనువిందుగా వుంటుంది. ఈ టెంపుల్ నిర్మాణాలు సుమారు 11 వ శతాబ్దం నాటివిగా చెపుతారు. అల్చి నుండి లమయూరు కు రెండు గంటల ప్రయాణం. లమయూరు చిన్న గుట్టలు కల ఒక గ్రామం కాగా, ఇక్కడ మీరు అతి విస్తారమైన, ఆకర్షణీయమైన ఒక బౌద్ధ ఆరామాన్ని చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X