Search
  • Follow NativePlanet
Share
» »శివరాత్రి స్పెషల్: మన ఇండియాలో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు కొలువై ఉన్న ప్రదేశాలు

శివరాత్రి స్పెషల్: మన ఇండియాలో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు కొలువై ఉన్న ప్రదేశాలు

మన ఇండియాలో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు కొలువై ఉన్న ప్రదేశాలు

దేశంలో హిందువులు పవిత్రంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి మహాశివరాత్రి. ఈ పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. నేడు మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల కోర్కోలను తీర్చే భోళా శంకరుడు. త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడైన ఆ పరమేశ్వరుడు పూజలందుకోవడంలో మాత్రం ముందు ఉంటాడు.

ఆ పరమేశ్వరుడని ప్రతిమగా కంటే లింగాకారంలో ఉన్న లింగాలను పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. మన దేశంలో ఎన్నో శైవక్షేత్రాలున్నాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే మనదేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో భారీ శివలింగాలు, అతి ఎత్తైన శివుడి విగ్రహాలున్నాయి. భారీ విగ్రహాల రూపంలో ఆ పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. మన దేశంలో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు ఎక్కడున్నాయో మనం ఇప్పడుు తెలుసుకుందా...

మురుడేశ్వరలో శివుడి విగ్రహం:

మురుడేశ్వరలో శివుడి విగ్రహం:

కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కల మురుడేశ్వర శివ విగ్రహ ప్రదేశం ప్రసిద్ధ హిందువుల పుణ్య క్షేత్రం. ఇక్కడి విగ్రహం ఎత్తు 122 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. అరేబియా సముద్ర ఒడ్డున కల ఈ విగ్రహం దేశంలోనే కాక విదేశీయులకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
PC: Lucky vivs

కోయంబత్తూర్:

కోయంబత్తూర్:

కోయంబత్తూర్ లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహం ఉంది. ఇది మన దేశంలో మూడవ అతి పెద్ద పరమేశ్వరుని విగ్రహం. భూమ్మీద ఉన్న విగ్రహాలన్నింటిలోను అతి పెద్ద ముఖం ఉన్న విగ్రహం ఇదే. ఈ విగ్రహాన్ని పూర్తిగా స్టీల్ తో తయారుచేసిన ఈ విగ్రహం సుమారు 500 టన్నులు ఉంటుంది.

PC: Youtube

కెంఫోర్ట్ శివాలయం బెంగళూరు:

కెంఫోర్ట్ శివాలయం బెంగళూరు:

నగరంలో అత్యంత ఎతైన శివుడి విగ్రహం ఉన్న దేవాలయం కెంఫోర్ట్. నగరంలోని ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న ఈ దేవాలయం అత్యంత ఆకర్షనీయమైన దేవాలయాల్లో ఒకటి. ఈ విగ్రహం ఎత్తు సుమారు 65 అడుగులు. ఇక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం చూడటానికి చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తారు. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.

PC: Youtube

వడోదర :

వడోదర :

గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర ఒకటి. వడోదర ప్రాంతంలో ఒక సరస్సులో శివుడు నిలుచుని ఉన్న ఎత్తైన విగ్రహం ఉంది. ఈ చెరువుని అక్కడి స్థానికులు సూర్ సాగర్ లేక్ అని పిలుస్తుంటారు. ఈ సూర్ సారగ్ లేక్ లో ఉన్న ఆ పరమేశ్వరుడి విగ్రహం ఎత్తు 120 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహాన్ని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టించారు. ఇది ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శివుడి విగ్రహం.

PC: Youtube

శివగిరి కర్ణాటక:

శివగిరి కర్ణాటక:

85 అడుగుల ఎత్తైన విగ్రహం శివగిరి వద్ద ఉంది, ఈ శివగిరి కర్ణాటక రాష్ట్రంలో గల బీజాపూర్ కు 3 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ అందమైన పార్క్, మధ్యలో శివయ్య చూడ్డానికి చాలా బాగుంటుంది.

PC: Youtube

 ఓంకారేశ్వర – మధ్యప్రదేశ్:

ఓంకారేశ్వర – మధ్యప్రదేశ్:

భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. రెండుకొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలు ను ఆకాశం నుండి చూస్తె ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు .ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం రాయబడి ఉంటుంది . దేవుని శివుడికి అంకితం చేయబడిన హిందు దేవాలయం. ఇది శివుడి యొక్క 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి.ఇక్కడ శివుడి ఎత్తైనా విగ్రహం ఉంది.

PC: Youtube

నాగేశ్వర దేవాలయం- గుజరాత్

నాగేశ్వర దేవాలయం- గుజరాత్

గుజరాత్ రాష్ట్రంలోని జాగేస్వర్ లో కల నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఈ జ్యోతిర్లిన్గాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగనిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో ద్వారాక పట్టనానికి 12కిమీ దూరంలో ఉంది. నాగేశ్వర్ ద్వారకా నగరానికి, బేట్ ద్వారకాకి మధ్య మైదానంలో వుంది. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ 82 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ వున్న శివలింగం అన్ని చోట్లా వున్నట్లు నున్నగా వుండదు. ద్వారకాశిలతో చేయబడింది. చిన్న చిన్న చక్రాలు వుంటాయి లింగం మీద. అంతే కాదు మూడు ముఖాల రుద్రాక్షాలు వున్నట్లు వుంటుంది ఈ లింగం.

PC: Youtube

సిద్దేశ్వర ధామ్-సిక్కిం:

సిద్దేశ్వర ధామ్-సిక్కిం:

సిక్కిం: సిక్కిం భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం . సిక్కింలో ఒక పెద్ద కొండ ప్రాంతంపైన 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ఈ ప్రాంతాన్ని సిద్దేశ్వర ధామ్ అని స్థానికులు పిలుస్తుంటారు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలకు చార్ ధామ్ యొక్క ప్రతి రూపాలను చూడగలిగే ఏకైక స్థలం ఇదే.

PC: Youtube

రాజస్థాన్ ఉదయ్ పూర్

రాజస్థాన్ ఉదయ్ పూర్

ప్రపంచంలోనే ఎత్తైన పరమ శివుని విగ్రహాన్ని రాజస్థాన్ ఉదయ్ పూర్ సమీపంలోని నాథ్వారాలో నిర్మిస్తున్నారు. 351 ఫీట్ల ఎత్తు ఉన్న భారీ విగ్రహ పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పార్కులు, పిల్లల ఆటస్థలాలు, అతి విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ విగ్రహాం లోపలి నుంచి శివుని కంఠం వరకు పర్యాటకు రెండు లిఫ్టుల ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

PC: Youtube

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కల హర కి పౌరి

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కల హర కి పౌరి

అద్భుత ఆకర్షణ కల భగవాన్ శివుడి విగ్రహం ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కల హర కి పౌరి ఘాట్ లో కలదు. ఈ విగ్రహం ఎత్తు 100 అడుగులు. ప్రపంచంలోని ఎత్తైన శివుడి విగ్రహాలలో ఇది మూడవదిగా చెపుతారు. శివ భక్తులు తమ ఉత్తరాఖండ్ పర్యటనలో ఈ విగ్రహ దర్శన తప్పక చేస్తారు. హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. హిందువులు పవిత్రంగా భావించే ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి.

PC: Youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X