» »భారతదేశంలో అతి పెద్ద చోర్ బజార్ లు ఇవే

భారతదేశంలో అతి పెద్ద చోర్ బజార్ లు ఇవే

Written By: Venkatakarunasri

మన భారతదేశంలో గల ప్రముఖ ప్రదేశాలలో వున్నటువంటి చోర్ బజార్ల గురించి తెలుసుకుందాం. మన ఇండియా ఫేమస్ చోర్ బజార్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చోర్ బజార్ అంటే తెలియని వారుండరు. అయితే ఇక్కడ వాస్తవాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తక్కువ ధరకే సామాగ్రి దొరుకుతుందనే క్రమంలో అక్కడికి వెళుతూవుంటారు. దేశంలోనే అతి పెద్ద చోర్ బజార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ దొంగతనం చేయబడిన వస్తువులు దొరుకుతాయి.

దొంగతనం అయిన ఫోన్స్, మొబైల్స్, ల్యాప్ టాప్స్,ఆటో స్పేర్ పార్ట్స్ నుంచి కార్లవరకు ఇక్కడ లభిస్తాయి.దేశంలోని చోర్ బజార్లలో దొంగతనమైన వాహనాలను మార్పు చేసి అమ్ముతుంటారు. ఇక్కడ గల చోర్ బజార్లలో ఏవైనా వస్తువులు కొనటానికి వెళ్ళినప్పుడు వాహనాలు, బైక్లు తీసుకుని వెళ్ళకూడదు.అక్కడ వాహనం నిల్పారంటే ఇక అంతే సంగతి. మన వాహనంలో గల స్పేర్ పార్ట్స్ అక్కడ ఉన్న షాప్ లలో దర్శనమిస్తాయి. భారతదేశంలో 5 అతిపెద్ద చోర్ బజార్ల గురించి ఇప్పుడు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

ముంబై చోర్ బజార్

ముంబై చోర్ బజార్

దక్షిణ ముంబై, మటన్ స్ట్రీట్, మహమ్మద్ అలీ రోడ్ వద్ద వుంది.ఈ మార్కెట్ సుమారు 150ఏళ్ల నుంచి ఇక్కడ వుంది.మొదట్లో దీనిని షోర్ బజార్ అని పిలిచేవారు.

PC:youtube

ముంబై చోర్ బజార్

ముంబై చోర్ బజార్

షోర్ అంటే అవసరం.ఇక్కడ అరుస్తూ అమ్ముతుంటారు. రాను రాను ఇది చోర్ బజార్ గా మారిపోయింది.

PC:youtube

 ఢిల్లీ చోర్ బజార్

ఢిల్లీ చోర్ బజార్

ఇది దేశంలోనే పురాతన చోర్ బజార్. మొదట్లో ఇక్కడ సండే మార్కెట్ ఎర్రకోట వెనక వుండేది. ప్రస్తుతం దరియాగంజ్ లోని నావెల్లీ జమ్మూ మసీద్ దగ్గర వుంది.

PC:youtube

సోతీ గంజ్

సోతీ గంజ్

అన్ని వాహనాల స్పేర్ పార్ట్లు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చోరీ చేసిన పాతవాహనాలు, యాక్సిడెంట్ వాహనాలు ఎక్కువగా దొరుకుతాయి.

చీక్ పేట్

చీక్ పేట్

ఢిల్లీ,ముంబై చోర్ బజార్లతో పోలిస్తే బెంగుళూరు తక్కువ అనిచెప్పవచ్చును. ఈ మార్కెట్ బెంగుళూరులోని చీక్ పేట్ ఆదివారం నాడు వుంటుంది.

చీక్ పేట్

చీక్ పేట్

ఇక్కడ సెకండ్ హ్యాండ్ గ్రామ్ఫోన్స్, దొంగతనమైన కెమెరాస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంకా ఎన్నెన్నో సామాన్లు తక్కువ ధరలో దొరుకున్నాయి. ఈ మార్కెట్ లోకల్ మార్కెట్ మాదిరిగానే వుంటుంది.

PC:youtube

చెన్నై

చెన్నై

సెంటర్ చెన్నైలో వున్న ఆటోనగర్ లో పురాతన,దొంగతనమైన కార్లు మాడిఫై చేస్తారు.ఇక్కడ వేలసంఖ్యలో దుకాణాలు వున్నాయి.

PC:youtube

చెన్నై

చెన్నై

ఈ దుకాణాలు వాహనాల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ను బదిలీచేయటానికి ఫేమస్ అని చెప్పవచ్చును.