Search
  • Follow NativePlanet
Share
» »సొంభద్ర - ఒక చారిత్రాత్మకమైన పట్టణం !!

సొంభద్ర - ఒక చారిత్రాత్మకమైన పట్టణం !!

సొంభద్ర పర్యాటన అనేక చారిత్రక మరియు సాంస్కృతిక అంశాలు తెలియ చేస్తుంది. ఇక్కడ అనేక పురాతన స్మారకాలు, కోటలు, భవనాలు కలవు.

By Mohammad

సొంభద్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద జిల్లా. ఇది వింధ్య పర్వత శ్రేణుల కు ఆగ్నేయంగా వుంది. ఈ ప్రాంతం తూర్పు నుండి పడమటికి ప్రవహించే సోనే రివర్ కలిగి వుంది. సొంభద్ర పర్యాటన అనేక చారిత్రక మరియు సాంస్కృతిక అంశాలు తెలియ చేస్తుంది. ఇక్కడ అనేక పురాతన స్మారకాలు, కోటలు, భవనాలు కలవు.

ఇది కూడా చదవండి : జౌంపూర్ పోదాం .. సాహసాలు చేద్దాం !

సొంభద్ర లోను చుట్టుపట్ల కల ఆకర్షణలు

సొంభద్రలో కల విజ్ఞాన్ కోట 5 వ శతాబ్దం నాటిది. దీనిని కోలి రాజులూ నిర్మించారు. దీనిలో అనేక గుహ పెయింటింగ్ లు, శాసనాలు కలవు. మరొక కోట నౌఘర్ కోట దీనిని కాశి రాజులు కట్టించారు. ఇపుడు ఇది ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా మార్చారు. మరొక అగోరి కోట అందమైనది. దీనికి మూడు పక్కలా మూడు నదులు ప్రవహిస్తాయి.

కేవ్ పెయింటింగ్ సైట్ లు

కేవ్ పెయింటింగ్ సైట్ లు

కేవ్ పెయింటింగ్ సైట్ లు (లఖనియ, పంచముఖి, కోవ కో,లక్హమా గుహలు) - రాక్ ఆర్ట్ పెయింటింగ్ లు కల ఈ గుహాలు వింధ్య మరియు కైమూర్ శ్రేనుల లో కలవు. పెయింటింగ్ లు ఆ నాటిప్రజల జీవన విధానాలను తెలుపుతాయి.

చిత్ర కృప : Nikhil2789

చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి

చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి

ఈ సంక్చురి లో అనేక ఇతర వన్య జీవులు కూడా కలవు. వీటిలో చితాల్, నీల్గాయి, చింకారా, బ్లాక్ బాక్, రాబిట్, సంభార్, మంకీ, ముళ్ళపంది, హయన, వైల్డ్ ఫాక్స్, వంటివి కొన్ని. పక్షి సందర్శకులకు ఈ ప్రదేశం ఒక స్వర్గంగా వుంటుంది.

చిత్ర కృప : Naman Narain

ఘోరమంగార్

ఘోరమంగార్

ఇక్కడ అనేక పరసర ప్రకృతి దృశ్యాలు మిమ్ములను ఆనంద పరుస్తాయి. ఈ కేవ్ షెల్టర్ లో ఆనాటి ప్రజల జీవనాన్ని ప్రతిబింబించే అనేక పెయింటింగ్ లు కలవు. వేట, నృత్యాలు, యుద్ధ సన్నివేశాలు మొదలైన దృశ్యాలను చిత్రీకరించారు. ఘోర మంగర్ రాక్ షెల్తెర్లో ఫ్రాగ్ డాన్స్ ఒక ప్రత్యేకత.

చిత్ర కృప : Kartik Tiwary

రాజ్దారి - దేవ్దారి వాటర్ ఫాల్స్

రాజ్దారి - దేవ్దారి వాటర్ ఫాల్స్

రాజ్ దారి మరియు దేవదారి వాటర్ ఫాల్స్ రెండూ కూడా ఉత్తర ప్రదేశ్ లోని చంద్రప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి లో కలవు. 65 మీటర్ల ఎత్తునుండి పడుతుంది. ఈ ప్రదేశంలో ప్రభుత్వం ఒక పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేసింది. దేవా దారి వాటర్ ఫాల్ రాజ్ దారి వాటర్ ఫాల్ నుండి సుమారు 500 మీటర్ల దూరంలో దిగువకు వుంటుంది.

చిత్ర కృప : Justin Vijesh

సల్కాన్ ఫాస్సిల్ పార్క్

సల్కాన్ ఫాస్సిల్ పార్క్

సల్ఖాన్ ఫాస్సిల్ పార్క్ ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లా లో కైమూర్ వైల్డ్ లైఫ్ సంక్చురి లో కలదు. ఇది రోబెర్ట్స్ గంజ్ నుండి 17 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ చెట్ల శిలాజాలు కలవు. భౌగోళిక శాస్త్రవేత్తల మేరకు ఈ శిలాజాలు 14000 మిలియన్ సంవత్సరాల నాటివిగా చెపుతారు.

చిత్ర కృప : Kartiktiwary

శివ ద్వార్

శివ ద్వార్

శివ ద్వార్ టెంపుల్ ఉత్తర ప్రదేశ్ లోని రోబెర్ట్స్ గంజ్ కు పడమటి భాగంలో 40 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయంలో శివ పార్వతులు వుంటారు. ఈ విగ్రహాలు సుమారు 11 వ శతాబ్దం నాటివి. చాలా ఆకర్షనీయంగా వుంటాయి. టెంపుల్ శిల్ప శైలి ఆనాటి కళలను చూపుతుంది.

చిత్ర కృప : Kartik Tiwary

విజయ ఘర్ కోట

విజయ ఘర్ కోట

400 అడుగుల పొడవైన ఈ విజయ నగర్ కోట 5 వ శతాబ్దంలో ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో కోల్ రాజులచే నిర్మించబడినది. కోటలో సగం భాగం కైమూర్ శ్రేణుల కొండ ప్రాంతం ఈ కోటలో కేవ్ పెయింటింగ్ లు, విగ్రహాలు, శిలా శాసనాలు, ఎప్పటికి ఎండిపోని కొలనులు కలవు.

చిత్ర కృప : Nandanupadhyay

లోరియా రాక్

లోరియా రాక్

లోరియా రాక్ సొంభద్ర జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన రోబెర్ట్స్ గంజ్ నుండి 10 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇది ఒక అతిపెద్ద రాక్, ఆకర్షనీయంగా వుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Koshy Koshy

అగోరి ఫోర్ట్

అగోరి ఫోర్ట్

అగోరి కోట ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో చోపాన్ నుండి 10 కి.మీ.లు రాబర్ట్స్ గంజ్ నుండి 35 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ పర్యాటకులకు చారిత్రక స్మారకాలు కనపడతాయి.

చిత్ర కృప : Nandanupadhyay

ముఖ ఫాల్స్

ముఖ ఫాల్స్

ముఖ జలపాతాలు ఉత్తరప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో శివ ద్వార్ నుండి 15 కి.మీ.లు, రోబెర్ట్స్ గంజ్ నుండి 55 కి.మీ.ల దూరంలోకలవు. ఈ జలపాతాలు దేవి మందిర్ మరియు కరియా తాల్ సమీపంలోకలవు. వర్షాకాలంలో ఈ జలపాతాలు అద్భుతంగా ప్రవహిస్తాయి.

చిత్ర కృప : Kartik Tiwary

రిహంద్ డాం

రిహంద్ డాం

రిహంద్ డాం ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో పిపారి వద్ద కలదు. ఇది రేను కూత కు అయిదు మైళ్ళ దూరం లో సన్ రివర్ , రిహంద్ రివర్ ను కలిసే ప్రదేశానికి 46 కి. మీ.ల దూరంలో కలదు. డాం ను రిహంద్ నది పై నిర్మించారు.

చిత్ర కృప : Kartik Tiwary

నౌఘర్ ఫోర్ట్

నౌఘర్ ఫోర్ట్

నౌఘర్ ఫోర్ట్ ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో చకియా కు దక్షిణ భాగంలో 40 కి.మీ.ల దూరంలో కలదు. ఈ కోటను కాశి రాజు కట్టించాడు.ఇక్కడ నుండి చుట్టుపట్ల కల ఆకర్షణీయ ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు.

చిత్ర కృప : Nandanupadhyay

సొంభద్ర ఎలా చేరుకోవాలి ?

సొంభద్ర ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

సొంభద్ర వారణాసి నుండి 90 కి.మీ.ల దూరం. సిటీలో ఒక మెటల్ రోడ్ వుంటుంది. దీని నుండి ఉత్తర ప్రదేశ్ లోని ప్రధాన ప్రదేశాలకు చేరవచ్చు. వారణాసి నుండి విధాన్ వెళ్ళే మార్గంలో సొంభద్ర తగులుతుంది.

ట్రైన్ ప్రయాణం

సమీప రైల్వే స్టేషన్ మిర్జాపూర్ రైల్వే స్టేషన్. రాబర్ట్ గంజ్ రైల్వే స్టేషన్ మరియు చోపాన్ రైలు స్టేషన్ లు కూడా సౌకర్యమే.

వాయు మార్గం

సమీప ఎయిర్ పోర్ట్ మయూర్పూర్ ఎయిర్పోర్ట్. ఇది ఒక ప్రైవేటు ఎయిర్ పోర్ట్. కనుక చార్టర్ మరియు ప్రైవేటు ప్లేన్ లు మాత్రమే ఇక్కడ దిగుతాయి. పబ్లిక్ ఎయిర్ పోర్ట్ వారణాసి లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.

చిత్ర కృప : Anup Sadi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X