Search
  • Follow NativePlanet
Share
» »కణతల్ - ఉత్తరాఖండ్ ప్రసిద్ధ వేసవి విడిది !!

కణతల్ - ఉత్తరాఖండ్ ప్రసిద్ధ వేసవి విడిది !!

శివుడు సతీదేవిని కైలాస పర్వతానికి తీసుకెళుతుండగా ఆమె శరీరంలోని ఒక భాగం ఈ ప్రదేశంలో పడుతుంది. ఆ ప్రదేశమే సుర్కంద దేవి ఆలయం.

By Mohammad

ప్రదేశం : కణతల్

రాష్ట్రం : ఉత్తరాఖండ్

ప్రధాన ఆకర్షణలు : కొడియా జంగల్, శివపురి, సుర్కంద దేవి ఆలయం, తెహ్రి డ్యాం

సమీప పెద్ద పట్టణం : రిషికేష్ (80 KM)

ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రి గర్వాల్ జిల్లాలో చంబా-ముస్సోరీ హైవే పై "కణతల్" ఒక చిన్న గ్రామం. ఈ అందమైన గ్రామం సముద్ర మట్టానికి 8500 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలవారికి ఇది ఒక విడిది స్థలం. ఈ గ్రామానికి నలువైపులా ఉన్న పచ్చటి పరిసరాలు,మంచుతో కప్పపడిన పర్వతాలు, నదులు, అడవులు ఈ గ్రామ అందాన్ని మరింత పెంచుతాయి.

సుర్కంద దేవి ఆలయంసుర్కంద దేవి ఆలయం

సుర్కంద దేవి ఆలయం

చిత్రకృప : MatSwiki

ఒకానొకప్పుడు ఉన్న "కణతల్" సరస్సు పేరు మీద ఈ గ్రామం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ సరస్సు ఆనవాళ్ళు లేవు.ఈ గ్రామం లో ఉన్న పలు దర్శనీయ స్థలాలలో సుర్కంద దేవి గుడి బాగా ప్రసిద్ధి. జాన పద కధ ప్రకారాం పరమ శివుడు సతీ దేవిని కైలాస పర్వతానికి తీసుకెడుతుండగా సతీ దేవి శరీరం పడిన ప్రదేశం ఇది. సతీ దేవి వివిధ శరీర భాగాలు పడిన ప్రదేశాలు "శక్తి పీఠాలు" గా ప్రసిద్ధి. సుర్కంద దేవి గుడి ఈ శక్తి పీఠాలలో ఒకటి. ప్రతీ సంవత్సరం మే, జూన్ నెలలలో ఇక్కడ "గంగ దశరా"పండగ ని అత్యంత ఆసక్తి, ఉత్సాహలతో జరుపుతారు.

ప్రపంచంలో ఎత్తైన డ్యాములలో ఒకటైన తెహ్రి డ్యాం కణతల్ లో మరొక పర్యాటక ప్రాంతం. ఈ బహుళార్ధ సాధక డ్యాం ని భాగీరధీ నది పైన నిర్మించారు.

జంగిల్ లో సూర్యాస్తమయ దృశ్యం

జంగిల్ లో సూర్యాస్తమయ దృశ్యం

చిత్రకృప : Stuti sharma 09

కొడియా జంగల్

ప్రశాంతమైన కొడియా జంగల్ అనేక సహజ సిద్ధ నీటి బుగ్గలకి ప్రసిద్ధి. ఈ అడవి చిన్న ఆసియా జింక అయిన "బార్కింగ్ డీర్","అడవి పంది",జింక జాతికి చెందిన "గోరల్","కస్తూరి జింక" లకి నివాస ప్రదేశము. వివిధ రకాల పక్షులని గమనించడానికి,ప్రక్రుతి ఫోటోగ్రఫీ కి మరియు పిక్నిక్ లకి ఈ అడవి బాగా ప్రసిద్ధి. ఈ అడవిలో దాదాపు 6 కిలో మీటర్ల మేర ట్రెక్కింగ్ చేస్తూ ఎత్తుపల్లాల కొండలు,లోయల అందాలని చూడవచ్చు. ఇంకా జీప్ సఫారీ లో కూడా ఈ అడవి లొపల చుట్టి రావచ్చు. సందర్శకులు తమ వెంట భోజనం తీసుకు వెళ్ళడం ఉత్తమం.

శివ్ పురి బేస్ క్యాంప్

శివ్ పురి బేస్ క్యాంప్

చిత్రకృప : Arkadeep Meta

శివ్ పురి

శివ్ పురి రుషికేష్ నుండి 16 km దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. హిందూ మత దేవుడైన శివకి అంకితమైన పలు ఆలయాలు ఉండుట వల్ల ఈ స్థలం శివుడు యొక్క నివాసం అనగా 'శివపురి' అనే పేరు వచ్చింది. సాహస ఔత్సాహికులు శివపురి నుండి రుషికేష్ కు తెప్ప ద్వారా వెళ్లి థ్రిల్ ను అస్వాదించవచ్చు. శివపురిలో అనేక బేస్ క్యాంపులు ఉన్నాయి. సందర్శకులు ఇక్కడి బీచ్ క్యాంపుల్లో రాత్రి గడిపి మర్నాడు రాఫ్టింగ్ కి వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం ప్రశాంతత మరియు నిర్మలమైన వాతావరణంనకు ప్రసిద్ధిచెందింది.

తెహ్రి డ్యాం

తెహ్రి డ్యాం

చిత్రకృప : Arvind Iyer

కణతల్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

రిషికేశ్ దగ్గరలోని ఢిల్లీ, డెహ్రాడున్, మరియు హరిద్వార్ వంటి నగరాలకు బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉన్నది. ఈ నగరాల ప్రైవేటు లేదా రాష్ట్ర ప్రభుత్వ బస్సుల ద్వారా ఇక్కడికి చెరుకొవచ్చు.

ఇది కూడా చదవండి : రుద్రప్రయాగ, జోషీమఠ్ పుణ్యక్షేత్రాల దర్శనం !

రైల్ మార్గం

రిషికేశ్ లోని రైల్వే స్టేషన్ భారత దేశపు ఢిల్లీ, ముంబై, కోట్ద్వార్ మరియు డెహ్రాడున్ వంటి ముఖ్య నగరాలను కలుపుతుంది. ఇది నగరానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.

వాయు మార్గం

డెహ్రాడున్ జాలి గ్రాంట్ ఎయిర్ పోర్ట్ రిషికేశ్ కు దగ్గర లోని ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడికి 18 కి. మీ. దూరంలో ఉన్నది. పర్యాటకులు కాబ్ లను కుడా అద్దెకు తీసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X