Search
  • Follow NativePlanet
Share
» »మరువలేని మరో లోకం .. మడికేరి !

మరువలేని మరో లోకం .. మడికేరి !

By Super Admin

మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా?మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా?

మడికేరి, కర్నాటక లోని కొడుగు జిల్లా లో గల అందమైన పట్టణం. ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ కూర్గ్ కు మడికేరి 41 కిలోమీటర్ల దూరంలో కలదు. బస్సులో అయితే గంట / గంటన్నార లో చేరుకోవచ్చు. మడికేరి లో చూడవలసిన పర్యాటక అందాలు చాలానే ఉన్నాయి. ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది.

మడికేరి సంస్కృతి

వీరి ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి. వారు పలకరించే తీరు కూడా అక్కడి సంప్రదాయ కట్టుబాట్లకి తగ్గట్టు ఉంటాయి. పురుషులు చుట్టూ చుట్టుకొనే కుప్య అనే వస్త్రాలు ధరిస్తారు (ప్రస్తుతం పండుగలలో మాత్రమే ధరిస్తున్నారు). ఆడవారు ప్రత్యేకమైన శైలి లో చీర లను ధరిస్తారు. వీరికి కత్తులు పట్టుకోవటం, యుద్ధ విన్యాసాలతో కూడిన నృత్యాలు చేయటం అంటే మహా సరదా ! త్రాగటం, నృత్యాలు చేయటం మరియు మాంగోస్టీన్ తో కూడిన మాంసాహారాలు ఇక్కడి ప్రధాన వంటకాలు.

ఆకర్షణీయ ప్రదేశాలు

రాజు గారి కోట, రాజు గారి సమాధి స్థలం, రాజాస్ సీట్, అబ్బే ఫాల్స్, నీలకంఠ స్వామి గుడి, 40 కిలోమీటర్ల దూరంలోని తలకావేరి, భాగమండలం చూడదగ్గవి. ముందుగా మడికేరి లోని పర్యాటక స్థలాలను చూద్దాం పదండి.

ఇది కూడా చదవండి : కొత్త జంటల విహార కేంద్రం : కూర్గ్ !

ఇది కూడా చదవండి : సొంత ఇంటిని తలపించే హోం స్టే : పుష్పాంజలి !

రాజుగారి కోట

రాజుగారి కోట

రాజుగారి కోట ని మడికేరి కోట అని కూడా పిలుస్తారు. కోట ను మట్టితో నిర్మించారు. కోట లోపలి భాగంలో అందమైన ప్యాలెస్, వీరభద్ర గుడి కలదు. ప్యాలెస్ తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. రెండు పెద్ద ఏనుగు రాతి విగ్రహాలు పాలెస్ ను కాపలాకాస్తున్నట్లు ఉంటాయి. కోట చుట్టుపక్కల జైలు, మహాగణపతి దేవాలయం, ఎం జి పబ్లిక్ లైబ్రేరి లు చూడదగ్గవిగా ఉన్నాయి. గణపతి దేవాలయంలో దసరా ఘనంగా నిర్వహిస్తారు.

చిత్ర కృప : VASANTH S.N.

రాజు గారి సమాధి

రాజు గారి సమాధి

రాజుగారి సమాధిని గద్దిగె అంటారు. రాజు దొడ్డ వీర రాజేంద్ర మరియు అతని రాణి సమాధులు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఇండో సార్కానిక్ శైలిలో నిర్మించారు. మధ్యలో నాలుగు స్తంభాల ఆధారంగా కేంద్ర గోపురాన్ని నిర్మించారు. కుడి గోపురం రాజు లింగ రాజేంద్ర ది కాగా, ఎడమ గోపురం పురోహితుడు రుద్రప్పది.

చిత్ర కృప : Pranav Ashok

తలకావేరి

తలకావేరి

మడికేరి నుండి తలకావేరి 43 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది కావేరి నది జన్మస్థలం. ఇక్కడ నదిలో పుణ్య స్నానాలు చేసి అగస్తేశ్వర దేవాలయాన్ని దర్శిస్తారు. సమీపంలో గణపతి, సుబ్రమణ్య స్వామి, విష్ణు దేవాలయాలు కలవు. జాతర సమయంలో ఈ ప్రదేశాన్ని దర్శిస్తే ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఏటా అక్టోబర్ - నవంబర్ మాసాలలో జాతర జరుగుతుంది.

చిత్ర కృప : Sibekai

భాగమండల

భాగమండల

భాగమండల తలకావేరి కి 8 కిలోమీటర్ల దూరంలో, మడికేరి కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనినే త్రివేణి సంగమం(కావేరి నది మరియు దాని ఉపనది కన్నికె సుజ్యోతి నది ఒకే చోట కలుస్తాయి) అని పిలుస్తారు. ఇక్కడ భగందేశ్వర దేవాలయం కలదు. ఆలయం లోపల భగంధేశ్వరుడు, గణపతి, విష్ణు, సుబ్రమణ్య విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని కేరళ శిల్ప శైలిలో నిర్మించారు.

చిత్ర కృప : Rkrish67

రాజాస్ సీట్

రాజాస్ సీట్

రాజాస్ సీట్ మడికేరి లో చూడవలసిన ఆకర్షనలలో ఒకటి. సీజన్ లో పూసే పూల చెట్లతో మరియు అందమైన ఫౌంటెన్ లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. సాయంత్రం ఫౌంటెన్ ల నుండి వచ్చే సంగీతం, రంగురంగుల నీటి ధారలు వినోదం కలిగిస్తాయి. కొండలు, లోయల కంటే ఎత్తుగా ఉన్న ప్రదేశంలో అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమాలు వీక్షించవచ్చు. పిల్లలను ఆకర్షించే టాయ్ ట్రైన్ కూడా కలదు.

చిత్ర కృప : Asem

ఓంకారేశ్వర ఆలయం

ఓంకారేశ్వర ఆలయం

ఓంకారేశ్వర ఆలయం, మడికేరి పట్టణం మధ్య భాగంలో కలదు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడి శివలింగాన్ని రాజు లింగరాజేంద్ర కాశీ నుండి తీసుకొని వచ్చి ప్రతిష్టించాడని చెబుతారు. టిప్పు ఈ ప్రాంతం పై దండెత్తి పాలించడం కారణంగా ఆలయ నిర్మాణం ఇస్లాం నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

చిత్ర కృప : Geetesh Bajaj

అబ్బే జలపాతాలు

అబ్బే జలపాతాలు

అబ్బే జలపాతం మడికేరి కి 10 కిలోమీటర్ల దూరంలో కలదు. కావేరి నది వేగంగా ప్రవహిస్తూ కొండపై నుండి లోయలోకి దూకే క్రమంలో ఈ జలపాతంగా మారుతుంది. ఇక్కడ ఒక వ్రేలాడే వంతెన ద్వారా జలపాతాన్ని దగ్గరి నుండి వీక్షించవచ్చు. మడికేరి నుండి సన్నటి రోడ్డు మార్గం ద్వారా ఈ జలపాతానికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Lakshmi Kanth Raju

టిబెట్టియన్ కాలనీ

టిబెట్టియన్ కాలనీ

మడికేరి నుండి కమలానగర్ చేరుకున్న తరువాత అక్కడి నుండి పక్కన రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే బౌద్ధుల కేంద్రం టిబెట్టియన్ కాలనీ కనిపిస్తుంది. మార్గ మధ్యలో బౌద్ధుల ఆహారం 'మొక్కజొన్న' పొలాలు కనిపిస్తాయి.

చిత్ర కృప : Ashwin Kumar

మడికేరి చేరుకొనే మార్గం ?

మడికేరి చేరుకొనే మార్గం ?

వాయు మార్గం

మడికేరి సమీపాన మైసూర్ విమానాశ్రయం (117 కి.మీ), మంగళూరు (136 కి.మీ), బెంగళూరు (267 కి.మీ) విమానాశ్రయాలు ఉన్నాయి. మీ సౌలభ్యాన్ని బట్టి ఏదేని విమానాశ్రయాన్ని ఎంచుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విమాన సర్వీసులు నడుస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో మడికేరి చేరుకోవచ్చు

రైలు మార్గం

మడికేరి లో రైల్వే స్టేషన్ లేదు. దగ్గరలో హసన్ (105 కి.మీ) మరియు కేరళలోని కన్నూర్ (113 కి.మీ), తెల్లిచెర్రి (110 కి.మీ) రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. మైసూర్ మరియు మంగళూరు కూడా సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ లు. స్టేషన్ బయట టాక్సీ లేదా బస్సు లలో ప్రయాణించి మడికేరి చేరుకోవచ్చు.

రోడ్డు / బస్సు మార్గం

కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు, మైసూరు, శ్రీరంగపట్నం, మంగళూరు, హస్సన్ మరియు కేరళలోని కన్నూర్, తెల్లిచెర్రి ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు లేదా ప్రవేట్ బస్సులలో చేరుకోవచ్చు.

చిత్ర కృప : Subrata Nath

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X