• Follow NativePlanet
Share
» »తిరుమల గురించి గుండె పగిలే 10 నిజాలు !

తిరుమల గురించి గుండె పగిలే 10 నిజాలు !

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది. స్వామి వారిని ప్రతి రోజు అసంఖ్యాక భక్తులు దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550 కి.మీ, బెంగళూరుకు 256 కి.మీ., చెన్నైకు 140 కి.మీ దూరంలో ఉంది. ప్రపంచంలో మరే ఇతర దేవాలయాని చెందని విశిష్టత వేంకటేశ్వరుని ఆలయ సొంతం. భక్తుల సందర్శన లోనూ, ఆలయ ఆదాయంలోనూ ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

ప్రస్తుత కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఈయనను భక్తులు 'కలియుగ వైఖుంటుడు' అంటుంటారు. వేంకటేశ్వరుని నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. సామాన్య భక్తులు మొదలు విఐపీలు, వివిఐపీ లు మరియు అసాధారణ భధ్రతా ప్రముఖులు స్వామి వారి ఆశీస్సులు పొందటానికి తిరుమల వస్తుంటారు. స్వామి వారి నామాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు సకల సుఖాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్థాయి.

వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొనే లక్షలాది భక్తులు, తిరుమల గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం మంచిది. తిరుమల స్థల పురాణం గురించి చాలా మంది చదివే ఉంటారు కానీ తిరుమల వచ్చే భక్తులు క్రింద పేర్కొన్న వాస్తవాలను ఎక్కడ చదివుండరు, వినుండరు. తిరుమల వాస్తవాలను ఒకసారి గమనిస్తే ...

మొదటిది

మొదటిది

ఆలయ ప్రవేశంలో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని శిరస్సుపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. బాల్య దశలో ఉన్న స్వామివారిని ఆ గుణపంతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తంవస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం ప్రారంభమైంది.

pc: indusleo

రెండవది

రెండవది

వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (నిజమైన జుట్టు) ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడదని అంటుంటారు.

pc: Raghunathan Krishnarao

మూడవది

మూడవది

తిరుమలలో శ్రీవారి దేవాలయం నుండి సుమారు 23 కి.మీ దూరంలో ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. ఆ గ్రామస్థులు ఎంత పద్ధతిగా ఉంటారంటే, స్త్రీలు రవికలు(జాకెట్లు) కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు మరి. అక్కడ ఉండే తోట నుండే స్వామి వారికి వాడే పూలు తీసుకొస్తారు. గర్భగుడిలో ఉండే ప్రతీది అంటే పాలు, నెయ్యి, పూలు, వెన్న మొదలైనవన్నీ కూడా ఆ గ్రామం నుండే వస్తాయి. ఇది కూడా చదవండి : అభయారణ్యంలో ... వేంకటేశ్వరుని దర్శనం !

pc: Shashi Bellamkonda

నాల్గవది

నాల్గవది

స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ, నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు భోధపడుతుంది.

pc: Anu singh

ఐదవది

ఐదవది

స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు ఇది అందరికీ తెలిసిందే అవునా ..! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. దాదాపు 50 వేల ఖరీదు చేసే శ్రీవారి సేవ ఒకటుంది (ఇది బహుశా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన సేవ). ఆ సేవలో పాల్గొన్న భార్యాభర్తలకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. ఈ టికెట్లు దొరకడం చాలా కష్టం. తక్కువ టిక్కెట్స్ మాత్రమే అమ్ముతారు.

pc: siva kumar

ఆరవది

ఆరవది

గర్భగుడిలో నుండి తీసేసిన పూలన్నీ కూడా బయటికి తీసుకొనిపోరు. స్వామి వారి వెనకాల ఒక జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి తిరిగిచూడకుండా పడవేస్తారు.

pc: R Muthusamy

ఏడవది

ఏడవది

స్వామి వారి వెనక భాగం వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. ఇది కూడా చదవండి : ప్రకృతిలో మమేకమైన చిత్తూరు సోయగాలు !

pc: naru reddy

ఎనిమిదవది

ఎనిమిదవది

స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు(ముద్ర) అలానేవస్తుంది. దాన్ని అమ్ముతారు.

pc:ISKCON Bangalore Group

తొమ్మిదవది

తొమ్మిదవది

చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు పదార్థాలు అన్నీ పూజారి వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (శ్రీకాళహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

pc: R E B E L TM®

పదవది

పదవది

స్వామివారి ముందర వెలిగే దీపాలు ఎప్పటికీ కొండెక్కవు (ఆరిపోవు). అవి ఎన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

pc:rajavarma

పదకొండవది

పదకొండవది

క్రీ.శ. 1800 వ శతాబ్ధంలో గుడి పన్నెండేళ్లపాటు మూసేశారట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకుగానూ హతమార్చి గోడకు వ్రేలాడదీశాడట. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలసిందని అంటారు. ఇది కూడా చదవండి : తిరుపతి పురాతన చిత్రాలలో ...!

pc: arun

తిరుపతి చేరుకొనే మార్గాలు

తిరుపతి చేరుకొనే మార్గాలు

విమాన మార్గం

తిరుపతి కి సమీపంలో ఉన్న విమానాశ్రయం రేణిగుంట దేశీయ విమానాశ్రయం. ఇది తిరుపతి కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. ఇక్కడి నుండి క్యాబ్ లో, సిటీ బస్సుల్లో, ప్రేవేట్ వాహనాల్లో ప్రయాణించి తిరుపతి చేరుకోవచ్చు.

రైలు మార్గం

ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి లో రైల్వే స్టేషన్ కలిగి ఉంది. ఈ రైల్వే స్టేషన్ లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్ళన్నీ ఆగుతాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై వంటి నగరాలకు సులభంగా ప్రయాణించవచ్చు.

రోడ్డు మార్గం

తిరుపతి కి ఆర్టీసి వారి బస్సులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి తిరుగుతుంటాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరంలో అంతర్గత రవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చిత్ర కృప : Karthik Iyer (R.I)

pc: Karthik Iyer (R.I)

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి