Search
  • Follow NativePlanet
Share
» »కోహినూర్ వజ్రం గుంటూరు మారుమూల గ్రామంలో దొరికింది అని తెలుసా ? ఎలా దొరికిందో తెలుసా ?

కోహినూర్ వజ్రం గుంటూరు మారుమూల గ్రామంలో దొరికింది అని తెలుసా ? ఎలా దొరికిందో తెలుసా ?

By Venkatakarunasri

కోహినూర్ వజ్రం దీని కోసం యుద్ధాలు జరిగాయి. ప్రాణాలు పోయాయి. పుట్టినిల్లు భారత్ అయినప్పటికీ ఆ వజ్రం మాత్రం పరాయి దేశపు చేతుల్లో వుంది. మాది మాకు ఇవ్వండి అని గట్టిగా గొంతు ఎత్తి అరిచినా పట్టించుకునేనాధుడు లేడు. అసలు ఏం జరిగింది.కోహినూర్ వెనకున్న రహస్యమేమిటి?ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్రిటిష్‌రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్‌ వజ్రాన్ని, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్‌ చేసిన ప్రతిపాదనను బ్రిటన్‌ తోసిపుచ్చింది. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు. బ్రిటిష్‌ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది.

బాబర్‌ చక్రవర్తి నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు 'ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత' అన్నాడట. ఆల్బర్ట్‌ యువరాజు దానిని సానబట్టిస్తే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది.

అందుకోసం బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. తెలుగువారి అమూల్య సంపద

1. తెలుగువారి అమూల్య సంపద

కోహినూర్ వజ్రం తెలుగువారి అమూల్య సంపదకు మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకు ఒక గీటు రాయి.

pc: Chris 73

2. కోహినూర్ అనగా ?

2. కోహినూర్ అనగా ?

కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం అని అర్ధం.

pc: youtube

3. ఎక్కడ దొరికింది ?

3. ఎక్కడ దొరికింది ?

గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో కొల్లూరులో విశ్వవిఖ్యాత కోహినూర్ వజ్రం దొరికింది.

pc: youtube

4. అతిపెద్ద వజ్రం ఎన్ని కేరట్లు?

4. అతిపెద్ద వజ్రం ఎన్ని కేరట్లు?

కోహినూర్ వజ్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వజ్రంగా పరిగణింపబడింది. 105కేరట్లు గల ఈ వజ్రం చరిత్రలోనే పలు వివాదాలకు కారణమైంది.

pc: youtube

5. విక్టోరియా మహారాణి కిరీటంలో పొదగబడిన వజ్రం

5. విక్టోరియా మహారాణి కిరీటంలో పొదగబడిన వజ్రం

హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్దంనకు దారితీసి చివరికి బ్రిటీష్ వారికి దక్కింది. 1877 లో విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్టాభిషక్తురాలైనప్పుడు ఆమె కిరీటంలో ఒక పొదగబడింది.

pc: youtube

6. బ్రిటిష్ వారికి ఎలా దక్కింది?

6. బ్రిటిష్ వారికి ఎలా దక్కింది?

కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది.

pc: youtube

7. కోహినూర్ వజ్రం ధరిస్తే మగవారికి శాపమా?

7. కోహినూర్ వజ్రం ధరిస్తే మగవారికి శాపమా?

1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది. అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది.

pc: youtube

8. ఎక్కడ లభించింది?

8. ఎక్కడ లభించింది?

భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు. కోహినూరు వజ్రం తెలుగునాట కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాతమైన వజ్రం లభించింది.

pc: youtube

9. కోహినూర్ వజ్రానికి తొలి యజమాని ఎవరు?

9. కోహినూర్ వజ్రానికి తొలి యజమాని ఎవరు?

మాల్వా రాజు మహలక్ ‌దేవ్‌ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారు.

pc:Jean-Baptiste Tavernier

10. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడుకి సంబంధం వుందా?

10. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడుకి సంబంధం వుందా?

చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.

PC: wikimedia.org

11. ఇబ్రహీం లోఢీ చేతిలోకి ఎప్పుడు వచ్చింది?

11. ఇబ్రహీం లోఢీ చేతిలోకి ఎప్పుడు వచ్చింది?

ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు.

PC:Ahnode

12. అమూల్యవస్తువులు

12. అమూల్యవస్తువులు

ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు.

pc: Chris 73

13. మొఘలుల వద్ద ఈ వజ్రం

13. మొఘలుల వద్ద ఈ వజ్రం

తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.

PC:Ahnode

14. హుమాయున్

14. హుమాయున్

బాబర్ తన కుమారుడు, సామ్రాజ్యవారసుడూ అయిన హుమాయున్‌కి ఇచ్చారు. హుమాయున్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

PC:Ahnode

15. హుమయూన్

15. హుమయూన్

షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసినా హుమాయున్ అతనిపై ఓటమిచెందారు. హుమాయున్ రాజ్యాన్ని పరిమితం చేసుకని, ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు. అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవు రాజ్యం దగ్గరలో హుమయూన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు.

PC:youtube

 16. ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ

16. ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ

అందుకోసం బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు.

PC:youtube

17. బాబర్‌ వజ్రం

17. బాబర్‌ వజ్రం

1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై 'బాబర్‌ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు.

PC:wikimedia.org

18. తెలివి

18. తెలివి

అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు.

PC:youtube

19. కాంతి శిఖరం

19. కాంతి శిఖరం

అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్‌ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ - ఇ- నూర్‌ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.

PC:youtube

20. భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు

20. భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు

క్రీ. శ. 1913 వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు.

pc: Alexander Bassano

21. సాన బెట్టిన కోహినూర్ వజ్రం

21. సాన బెట్టిన కోహినూర్ వజ్రం

రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.
తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు.

PC:youtube

22. ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టమా?

22. ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టమా?

దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది.

PC:youtube

23. భారత ప్రభుత్వం విజ్ఞప్తి

23. భారత ప్రభుత్వం విజ్ఞప్తి

ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more