» »మనదేశంలోనూ ఆ మ్యూజియంలు

మనదేశంలోనూ ఆ మ్యూజియంలు

Written By: Beldaru Sajjendrakishore

వాక్స్ మ్యూజియం అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ప్రపంచంలో అత్యంత ప్రతిభా వంతమైన, ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల విగ్రహాలను మైనంతో తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతుంటారు. ఇందులో రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని వివిధ క్రీడలకు చెందిన క్రీడాకారాల విగ్రహాలు, సమాజ సేవకుల విగ్రహాలు కూడా ఉంటాయి. దీంతో చాలా మంది సెలబ్రెటీలు మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో తమ విగ్రహం ఉండటం ఒక గౌరవ సూచకంగా భావిస్తుంటారు. ఈ విగ్రహాలు కూడా అచ్చు సదరు మనిషిని పోలినట్లే ఉండటం గమనార్హం. దీంతో లండన్ సందర్శించిన వారు ఈ మ్యూజియంను సందర్శించి ఆ విగ్రహాల ముందు తప్పక ఫొటో తీసుకుంటూ ఉంటారు. అయితే వాక్స్ మ్యూజియం చూడాలంటే లండన్ కే వెళ్లక్కర లేదు. భారత దేశంలో కూడా ఉన్నాయి. అవి కూడా ప్రముఖ పర్యాటక కేంద్రాల్లోనే ఉండటం గమనార్హం. మరెందుకు ఆలస్యం ఆ యా ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ మైనపు బొమ్మలు ఉన్న మ్యూజియంను కూడా సందర్శించండి

1. మెలోడీ మ్యూజియం

1. మెలోడీ మ్యూజియం

PC

మిగిలిన వాక్స్ మ్యూజియంలతో పోలిస్తే ఇది చాలా భిన్నమైనది. ఇక్కడ దేశీయ, పాశ్చత్య సంగీతానికి సంబంధించిన 300 రకాల వాయిద్యాలను మైనంతో తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఈ వాయిద్యాల్లో శిలా యుగం నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన వాయిద్యాలు ఉండటం విశేషం. అందువల్లే దీన్ని మెలొడీ మ్యూజియం అని అంటారు.

2. 113 నిలువెత్తు విగ్రహాలు

2. 113 నిలువెత్తు విగ్రహాలు

PC

113 నిలువెత్తు విగ్రహాలు కూడా మైనంతో తయారు చేశారు. వీటిని మొత్తం 19 గ్యాలరీల్లో అమర్చారు. హిందులో కొన్ని బొమ్మలు భారత శాస్త్రీయతను గుర్తు చేసే వాయిద్యాలను వాయిస్తుండగా మరికొన్ని హిప్ హాప్, జాజ్ రాక్, చైనిస్ వంటి పాశ్చత్య సంగీతానికి సంబంధించిన వాయిద్యాలను వాయించే భంగిమల్లో ఉంటారు. ఈ మ్యూజియం ఎంట్రీ కేవలం రూ.40 మాత్రమే.

3.మదర్స్ వాక్స్ మ్యూజియం

3.మదర్స్ వాక్స్ మ్యూజియం

PC

ఈ వాక్స్ మ్యూజియం కొలకత్తాలోని న్యూ టౌన్ లో ఉంది. ఇందులో రవీంద్రనాథ్ పుస్తకంచదువుతూ కొర్చొన్న తీరులో ఉన్న బొమ్మల నుంచి లతామంగేష్కర్, కిషోర్ కుమార్ గీతాలాపన చేస్తున్న బొమ్మల వరకూ ఉన్నాయి.

4. రోజూ 1,500 మంది సందర్శన

4. రోజూ 1,500 మంది సందర్శన

PC

శుషాంత్ రాయ్ అనే శిల్పకారుడి చేతులో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియంను ప్రతి రోజూ దాదాపు 1,500 సందర్శిస్తుంటారు. మధ్యాహనం 12.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తారు. సోమవారం సెలవు.

5.దేవ్ భూమి వాక్స్ మ్యూజియం

5.దేవ్ భూమి వాక్స్ మ్యూజియం

PC

ముస్సోరి అంటే కేవలం ప్రక`తి అందాలను తిలకించడానికి మాత్రమే వెళ్లాలని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇక్కడ దేవ్ భూమి పేరుతో ప్రత్యేక వాక్స్ మ్యూజియంను సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు.

6. రాజకీయ నాయకుల విగ్రహాలు

6. రాజకీయ నాయకుల విగ్రహాలు

PC

ఇందులో ప్రపంచ ప్రజల ఆలోచనలను తమ మాటల ద్వారా మార్చిన ఎంతో మంది రాజకీయనాయకుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటి ఒబామా వరకూ వంటి నాయకుల అనేక విగ్రహాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడిప్పుడే కొంత మంది సెలబ్రెటీల బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

7.సెలబ్రెటీ వాక్స్ మ్యూజియం

7.సెలబ్రెటీ వాక్స్ మ్యూజియం

PC

పేరుకు తగ్గట్టే ఇక్కడ మైనంతో తయారు చేసిన సెలబ్రెటీల విగ్రహాలు ఉంటాయి. ఇందులో ప్రభుదవేవ మొదలుకొని ఏ.ఆర్ రెహమాన్, మైకెల్ జాక్సన్ వంటి సినీ సెలబ్రెటీలతో పాటు నరేంద్రమోదీ, కపిల్ దేవ్ వంటి ఇతర రంగాలకు చెందిన వారి విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

8.లోనావాలాలో

8.లోనావాలాలో

PC

ముంబై, పూనే హైవే మధ్యలో వచ్చే లొనావాలా అనే పర్వత శిఖరం ఉన్న ప్రాంతంలోని ఈ సెలబ్రెటీ వాక్స్ మ్యూజియం పర్యాటకులను ఎంతగానే ఆకట్టు కుంటోంది. దీని మ్యూజియం నిర్వహణను సునీల్ కదలూర్ చూస్తున్నారు.

9. ఉద్యాన నగరిలో

9. ఉద్యాన నగరిలో

PC

ఉద్యాననగరిగా పేరుగాంచిన బెంగళూరులో లూయిస్ టుస్సాట్ వాక్స్ మూజియం ఉంది. నగర శివారులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో ఉంది. దీనిని మేడమ్ టుస్సాట్ ఏర్పాటుకు మూల కారణమైన మేరి టుస్సాట్ మునిమనుమడు అయిన లూయిస్ టుస్సాట్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది.

10.మొనాలిసా నుంచి

10.మొనాలిసా నుంచి

PC

ఇందులో మోనాలిసా నుంచి హాలివుడ్, బాలివుడ్ సినామాల్లోని ప్రముఖ క్యారెక్టర్ల రూపాలు కూడా ఇక్కడ మైనం విగ్రహాల రూపంలో ఉండటం గమనార్హం. దాదాపు 100 విగ్రహాలు ఇక్కడ కొలువుతీరి ఉన్నాయి. అదే విధంగా కన్యాకుమారిలో కూడా భారత దేశంలో మొదటి సారిగా ఏర్పాటైన వాక్స్ మ్యూజియం ఉంది.

Read more about: మైసూరు