Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు లో ప్రసిద్ధిచెందిన గ్యాలరీలు !

బెంగళూరు లో ప్రసిద్ధిచెందిన గ్యాలరీలు !

By Mohammad

బెంగళూరు .. పర్యాటకులకు పరిచయం అక్కర్లేని నగరం. సాఫ్ట్ వేర్ హబ్ గా, సిలికాన్ వాలీ గా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు మహానగరంలో పర్యాటకుల మనసులను ఆకర్షించటానికి ఎన్నో సైట్ సీఇంగ్ ప్రదేశాలు ఉన్నాయి. ఎప్పుడూ చూసే ప్రదేశాలను కాకుండా కాస్త డిఫరెంట్ గా బెంగళూరు గురించి తెలుసుకుందాం..!

బెంగళూరు లో ఇప్పటివరకు చుట్టుపక్కల ఉండే ట్రెక్కింగ్ ప్రదేశాలు గురించి, పర్యాటక ప్రదేశాలు గురించి, తినే ఆహారాల గురించి తెలుసుకున్నాం. కానీ ఎప్పుడూ బెంగళూరును కళాత్మక దృష్టితో చూడలేదు. కళల మీద ఆసక్తి గలవారికి బెంగళూరు తప్పక ఆనందపరుస్తుంది.

ఇది కూడా చదవండి : లాల్ బాగ్ పూల ప్రదర్శన అందాలు ... అద్భుతాలు !

బెంగళూరు లో ఆర్ట్ గ్యాలరీలకు కొదువలేదు. దేశ, విదేశీ కళాకారులు తరచూ ఇక్కడకు వచ్చి తమ కళలకు పదునుపెడుతుంటారు. ఏటా నిర్వహించే పెయింటింగ్ పోటీలలో పాల్గొని బహుమతులను గెలుచుకుంటారు. బెంగళూరు లో కళాత్మకత ఉట్టిపడే నాలుగు ప్రసిద్ధ ఆర్ట్ గ్యాలరీల విషయానికి వస్తే ...

ఆర్ట్ గ్యాలరీలోని అందమైన పెయింటింగ్

ఆర్ట్ గ్యాలరీలోని అందమైన పెయింటింగ్

చిత్రకృప : mahuagallery

01. మహువ ఆర్ట్ గ్యాలరీ

మహువ ఆర్ట్ గ్యాలరీ నగరంలో ప్రసిద్ధి చెందిన ఆర్ట్ గ్యాలరీలలో ఒకటి. ఇందులో సమకాలీన, వర్తమాన అంశాలతో కూడిన పెయింటింగ్ లు ప్రదర్శిస్తారు. ఆర్ట్ లవర్స్ కు ఇదొక చక్కటి ప్రదేశం. దేశంలోని 15 రాష్ట్రాల నుండి చిత్రకారులు ఇక్కడికి వచ్చి పెయింటింగ్ వేస్తుంటారు.

చిరునామా : 4వ మెయిన్ రోడ్, సదాశివ నగర్, ఆర్మనే నగర్, బెంగళూరు.

తెరిచే సమయం : ఆదివారం తప్ప మిగితా అన్ని రోజులలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు.

ఇది కూడా చదవండి : బెంగళూరు నగరాన్ని ఎందుకు ఇష్టపడతారు ?

చిత్రకళా పరిషత్ లోని తరగతి గదులు

చిత్రకళా పరిషత్ లోని తరగతి గదులు

చిత్రకృప : Rajesh_dangi

02. కర్ణాటక చిత్రకళా పరిషత్

నగరంలోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ వద్ద కర్ణాటక చిత్రకళా పరిషత్ కలదు. ఈ క్యాంపస్ లో 13 మ్యూజియం గ్యాలరీలు మరియు 5 ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. ఇక్కడ కూడా కాలాలకు పెద్ద పీట వేస్తారు. ఇక్కడ తరచూ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంటారు.

చిరునామా : నెం.1, ఆర్ట్ కాంప్లెక్స్, 560001, కుమార కృప రోడ్, బెంగళూరు.

తెరిచే సమయం : ఆదివారం తప్ప మిగితా అన్ని రోజులలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 7:30 వరకు.

ఇది కూడా చదవండి : 16 అంశాల ప్రసిద్ధి ... బెంగళూరు !!

సబ్ లైం గ్యాలరీ వద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్

సబ్ లైం గ్యాలరీ వద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్

చిత్రకృప : sublimegalleria

03.సబ్ లైం గ్యాలరియా

సబ్ లైం గ్యాలరీ బెంగళూరు లో ప్రఖ్యాతిగాంచిన యూబీ టవర్స్ లో కలదు. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ మరియు ఇతర ఆర్ట్ ప్రదర్శనలు ప్రదర్శిస్తుంటారు. ఇది ఇండియా యొక్క ఫస్ట్ స్కై గ్యాలరీ గా ప్రసిద్ధికెక్కింది. ప్రతిరోజూ చిత్రకారులు ఇక్కడికి వచ్చి వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సబ్ లైం గ్యాలరీలో తరచూ ఆర్ట్, మ్యూజిక్ వర్క్ షాప్ లు నిర్వహిస్తుంటారు.

చిరునామా : 801, యూబి సిటీ, విట్టల్ మాల్యా రోడ్, బెంగళూరు.

తెరిచే సమయం : ఆదివారం తప్ప మిగితా అన్ని రోజులలో ఉదయం 11 :00 నుండి రాత్రి 8 : 00 వరకు.

ఇది కూడా చదవండి: నమ్మ మెట్రో - 18 ఆసక్తికర విషయాలు !

తస్వేర్ గ్యాలరీ లో ప్రదర్శనకై ఉంచిన ఒక ఫోటో

తస్వేర్ గ్యాలరీ లో ప్రదర్శనకై ఉంచిన ఒక ఫోటో

చిత్రకృప : tasveerarts

04. తస్వేర్ గ్యాలరీ

తస్వేర్ గ్యాలరీ ఫోటోగ్రఫీ చిత్రాలకు అంకితం చేయబడింది. ఇందులో చారిత్రక, వర్తమాన ఫోటోగ్రఫీ చిత్రాలను ప్రదర్శనకై ఉంచుతారు. తరచూ ఫోటో ఎగ్జిబిషన్ లు మరియు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంటారు.

చిరునామా : 26/1, సుఆ హౌస్, కస్తూర్బా క్రాస్ రోడ్, బెంగళూరు.

తెరిచే సమయం : సండే తప్ప మిగితా అన్ని రోజులలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:00 వరకు.

ఇది కూడా చదవండి : బెంగళూరు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X