• Follow NativePlanet
Share
» »మైసూరు వచ్చినప్పుడు ఏమేమి కొనాలో తెలియదా మీ సమస్యకు పరిష్కారం ఇదిగో

మైసూరు వచ్చినప్పుడు ఏమేమి కొనాలో తెలియదా మీ సమస్యకు పరిష్కారం ఇదిగో

Written By: Beldaru Sajjendrakishore

దేవతలందరూ నివశించే ప్రదేశం...అందుకే ఇక్కడ

విషపు రాళ్లతో మలచబడిన ప్రపంచంలో ఏకైక విగ్రహం

ఇక్కడ పిండ ప్రధానం చేస్తే మోక్షం తథ్యం

టూర్ వెళ్లినప్పుడు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇంటి చుట్టు పక్కల వాళ్లకు ఏదో ఒక వస్తువును గిఫ్ట్ రూపంలో తీసుకుని వెళుతుంటాం. అయితే మనం వెళ్లిన ప్రాంతంలో ఏ వస్తువులు చాలా ఫేమస్ అన్న విషయం తెలుసుకొని ఆ వస్తువును తీసుకొని వెళితే మన వాళ్లు ఎక్కువ సంతోషిస్తారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల పర్యాటకులు ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో మైసూరు ముందు వరుసలో ఉంటుంది. ఈ మైసూరులో దొరికే వస్తువులు మిగిలిన ప్రదేశాల్లో దొరికినా నాణ్యత ఇక్కడే బాగుంటుంది. అందువల్ల ఈసారి మైసూరుకు వెళ్లినప్పుడు ఏ వస్తువులను కొనాలన్న విషయం పై ఓ లుక్ వెయ్యండి.

1. పట్టుచీర

1. పట్టుచీర

Image Source:

ఉత్తర భారత దేశంలో బెనారస్ పట్టుచీర ఎంత ఫేమస్సో దక్షిణ భారత దేశంలో కూడా మైసూరు పట్టు చీర అంతే ఫేమస్. ఇక్కడ పట్టుచీరల తయారీకి ప్రత్యేక కర్మాగారం ఉంది. ప్రభుత్వ అధికారుల పర్యవక్షణలో ఈ చీరలు తయారవుతాయి. కాబట్టి కల్తీకి ఆస్కారముండదు. అందువల్ల మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ప్రియమైనవారికి పట్టుచీరను గిఫ్ట్ గా తప్పక తీసుకువెళ్లండి.

2. పెయింటింగ్

2. పెయింటింగ్

Image Source:

మీ ప్రియమైన వారికి పెయింటింగ్ అంటే ఆసక్తి ఉంటే రాచనగరి మైసూరులో దొరికే చిత్రాలను ఖరీదు చేసి తీసుకువెళ్లవచ్చు. మైసూరులో దొరికే పెయింటింగ్స్ లో ఎక్కువగా అలనాటి రాచరికపు గుర్తులు ఎక్కువగా కనిపిస్తాయి.

3. చెన్నపట్టణ బొమ్మలు

3. చెన్నపట్టణ బొమ్మలు

Image Source:

మైసూరు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో చెన్నపట్టణ అనే చిన్న ఊరు ఉంది.
ఇక్కడ తయారయ్యే బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామ ఇండియా పర్యటన వచ్చినప్పుడు ఈ బొమ్మలను మన దేశం గిఫ్ట్ గా ఇచ్చింది. దసరా సమయంలో ఏర్పాటు చేసే బొమ్మల కొలువులో ఈ చెన్నపట్టణ బొమ్మలకు ఖచ్చితంగా స్థానం ఉండాల్సిందే.

4. కాఫీ ఫౌడర్

4. కాఫీ ఫౌడర్

Image Source:

కాఫీ లేనిదే మనకు తెల్లారదు. అందులోనూ మంచి రుచి, వాసన కలిగిన కాఫీ తో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా తెలియని ఆనందం మన సొంతమవుతుందని నమ్మేవారు ఎంతమందో ఉన్నారు. వారిలో మీకు తెలిసిన వారు ఉంటే మైసూరులో దొరికే కాఫీని తీసుకు వెళ్లండి. మైసూరులో దొరికే కాఫీ రుచి మరెక్కడా దొరకదు.

5. మైసూర్ సాండల్ సోప్స్, ఆయిల్

5. మైసూర్ సాండల్ సోప్స్, ఆయిల్

Image Source:

మైసూరు ప్రాంతంలో విరివిగా మంచి గంధం చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు నుంచి లభించే కలప వల్ల ఒక ప్రత్యేక మైన నూనె ఉత్పత్తి అవుతుంది. సదరు నూనెను వినియోగించి సోపులు తయారు చేస్తారు. మైసూరు సాండల్ సోప్స్ పేరుతో ప్రాచూర్యం పొందిన వీటిని మీకు ప్రియమైన వారికి ముఖ్యంగా మహిళలకు ఇచ్చి వారి మనస్సు గెలుచుకోండి.

6. మైసూరు పేట

6. మైసూరు పేట

Image Source:

మైసూరు పేట అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది గతంలో రాజులు ధరించిన ఓ ప్రత్యేకమైన పేట. ఈ పేట మైసూరు ఓడయార్ల వంశానికి ప్రత్యేకమైనది. ప్రస్తుతం ఇది సమాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతి పెళ్లిలో వరుడు ఈ పేటను వాడటం ఇప్పుడు సాంప్రదాయమై పోయింది. ఈ పేటను కూడా ఇక్కడ ఖరీదు చేయవచ్చు.

7. మైసూర్ పాక్

7. మైసూర్ పాక్

Image Source:

ఏంటి మైసూరు పాక్ అనగానే మొహంలో కొక్షన్ మార్క్ వచ్చింది. దేశంలో ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు మైసూరు పాక్ దొరుకుతుంది కదా అనే మీ ప్రశ్న కరెక్టే. అయితే మైసూరులో దొరికే మైసూరు పాక్ ప్రత్యేకమైనది. అసలు మీ ఊరిలో దొరికే మైసూరు పాక్ ను ఇక్కడ దొరికే మైసూరు పాక్ ను వెంట వెంటనే తిన్నారంటే ఏది అసలైన మైసూరు పాక్ అన్న విషయం మీరే చెబుతారు. మైసూరులో దొరికే మైసూరు పాక్ ను తీసుకువెళ్లి గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మీ సంబంధీకుల హావభావాలను ఒకసారి గమనించండి.

8. అగరబత్తులు

8. అగరబత్తులు

Image Source:

హిందూ సంప్రదాయంలోని పూజల్లో అగరబత్తులు ఉండాల్సిందే. వివిధ రకాల అగరబత్తులు చాలా ప్రదేశాల్లో దొరుకుతాయి. అయితే మైసూరులో దొరికే అగరబత్తులది ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ గంధం నూనెతో అగరబత్తులు తయారవుతాయి. ఇక్కడ అతరబత్తులను కొని గిఫ్ట్ గా ఇవ్వడం సాంప్రదాయంగా కూడా వస్తోంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి