Search
  • Follow NativePlanet
Share
» »పారాగ్లైండింగ్ అంటే ఇష్టమా...ఈ ప్రాంతాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి

పారాగ్లైండింగ్ అంటే ఇష్టమా...ఈ ప్రాంతాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి

పారాగ్లైండింగ్ కు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే..ఇక్కడే శ్రీకృష్ణుడుఈ పుష్కరిణిలో స్నానం చేస్తే..ఇక్కడే శ్రీకృష్ణుడు

సూర్య భగవానుడు ఇచ్చిన వర ప్రభావంసూర్య భగవానుడు ఇచ్చిన వర ప్రభావం

అడిగిన వెంటనేఅడిగిన వెంటనే

రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగుతూ భూమి పై ఉన్న ప్రకతి అందాలను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. మనుషులమైన మనకు అది సాధ్యామా అంటే పారాగ్లైండిగ్ రూపంలో అవుననే సమాధానమే మీ ముందు ఉంటుంది. ఈ పారాగ్లైడింగ్ ద్వారా కొంచెం ధైర్యం చేస్తే ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను చూడవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. వీటిలో చాలా ప్రదేశాలు వేసవి విడిదిగా కూడా పేరు గాంచాయి. దేశంలో ఇటువంటి ప్రదేశాలను కొన్ని ఉన్నాయి. వాటి వివరాలు మీ కోసం.

1. మనాలి, హిమాచల్ ప్రదేశ్

1. మనాలి, హిమాచల్ ప్రదేశ్

ImageSource:

మనాలి లోని సోలాంగ్ వ్యాలి ప్రదేశం అడ్వెంచర్ స్పోర్ట్స్ కు పెట్టింది. ఇక్కడ వేసవితో పాటు చలి, వర్షాకాలాలకు అనుగుణంగా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ ను నిర్వాహకులు పర్యటకులకు అందుబాటులోకి తీసుకువస్తుంటారు. ముఖ్యంగా ప్యారచూట్, స్కేటింగ్ తో పాటు ప్యారాగ్లైడింగ్ ఇక్కడ చాలా ప్రత్యేకం

2. బిర్ బిల్లింగ్, హిమాచల్ ప్రదేశ్

2. బిర్ బిల్లింగ్, హిమాచల్ ప్రదేశ్

ImageSource:

హిమాచల్ ప్రదేశ్ లోని జోగింధర్ వ్యాలీని పారాగ్లైడింగ్ రాజధాని అని పిలుస్తారు. ఇక్కడ పరిస్థితులు పారాగ్లైడింగ్ కు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పారాగ్లైడర్స్ ఇక్కడ బిల్లింగ్ అనే ప్రదేశంలో టేక్ ఆఫ్ అయ్యి బీర్ అన్న చేట ల్యాండింగ్ అవుతారు.

3. కుంజపురి, ఉత్తరాఖండ్

3. కుంజపురి, ఉత్తరాఖండ్

3. కుంజపురి, ఉత్తరాఖండ్

ImageSource:

ఉత్తరఖండ్ లోని రుషికేష్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కు భారతీయ రాజధాని అన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా అనుకూలం. పారాగ్లైండింగ్ ను నేర్చుకోవాలని భావించే వారికి కూడా ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయి.

4. కామ్ శేట్, మహారాష్ట్ర

4. కామ్ శేట్, మహారాష్ట్ర

ImageSource:

పూణే నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామ్ శేట్ ఈ క్రీడ పై ఆసక్తి ఉన్నవారిని రారమ్మని పిలుస్తూ ఉంటుంది. కామ్ శేట్ మహారాష్ట్రలోని మరో పర్యాటక ప్రాంతమైన లోనావాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కు అక్టోబర్ నెల అనుకూలంగా ఉంటుంది.

5. యెలగిరి, తమిళనాడు

5. యెలగిరి, తమిళనాడు

ImageSource:

తమిళనాడులోని యోలగిరి ఒక చిన్న గుట్టప్రదేశం. ఇక్కడ రాక్ క్లైంబింగ్ చాలా ఫేమస్. ఇప్పుడిప్పుడే పారాగ్లైండింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వనియంబడి తిరుపట్టూరు మార్గంలో ఈ యెలగిరి మనకు కనిపిస్తుంది.

6. సిక్కిం

6. సిక్కిం

ImageSource:

ఈశాన్య భారత దేశంలో సిక్కిం పారాగ్లైడింగ్ కు అత్యంత అనుకూలమైనది. ఇక్కడ పారాగ్లైండింగ్ చేస్తూ హిమాలయాల అందాలను కూడా చూడవచ్చు. అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వారికి ఇది చాలా ఇష్టమైన ప్రదేశం.

7. అరంబోల్ బీచ్, గోవా

7. అరంబోల్ బీచ్, గోవా

7. అరంబోల్ బీచ్, గోవా

ImageSource:

గోవా లోని అరంబోల్ బీచ్ ప్యారాగ్లైడింగ్ కు అత్యంత అనుకూలమైన ప్రదేశం. ఈ బీచ్ లో బోటింగ్, వాటర్ బాల్ తదితర వాటర్ స్పోర్ట్స్ కూడా ఎక్కవగా ఆడుతారు.

8. పంచగణి, మహారాష్ట్ర

8. పంచగణి, మహారాష్ట్ర

8. పంచగణి, మహారాష్ట్ర

ImageSource:

మహారాష్ర్టలో కామ్ శేట్ తర్వాత పారాగ్లైడింగ్ కు అత్యంత అనుకూలమైన ప్రదేశం పంచగణి. ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తూ క`ష్ణవ్యాలి, సిడ్నీ పాయింట్ తదితరాలను చూడవచ్చు.

9. నంది హిల్స్, బెంగళూరు

9. నంది హిల్స్, బెంగళూరు

9. నంది హిల్స్, బెంగళూరు

ImageSource:

బెంగళూరుకు దగ్గర్లోని నందిహిల్స్ పారాగ్లైడింగ్ కు అత్యంత అనుకూలమైన ప్రదేశం. నందిహిల్స్ బెంగళూరు నుంచి సుమారు 60 కిలోమీర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ బోగ నందీశ్వర దేవాలయం కూడా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X