» »తిరుమలలో వెలసిన వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఎవరు నిర్మించారో మీకు తెలుసా?

తిరుమలలో వెలసిన వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఎవరు నిర్మించారో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

తిరుపతి దేవాలయం ఒక మహిమాన్వితమైన దేవాలయం. ఈ దేవాలయంలో వున్న స్వామిని దర్శించుటకు దేశంలోని మూలమూలలనుండికాకుండా విదేశాల నుండి కూడా తరలివస్తారు.అత్యంత అందమైన ఈ స్వామియొక్క వజ్రాల, బంగారుభారణాలు అలంకరించబడి ఉంది.ఈ స్వామియొక్క దేవాలయం అత్యంత విశేషంగా నిర్మించబడినది.

స్వామిదేవాలయానికి వెళ్ళేటప్పుడు మనమదిలో కలిగే ప్రశ్నఏమిటంటే ఈ దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? ప్రస్తుత వ్యాసంలో ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? నిర్మించటానికి కారణం ఏమిటి?స్వామి ఇక్కడ వెలియుటకు కారణంఏమిటి? అనే ప్రశ్నకు ఈ వ్యాసంమూలంగా చదవండి.

తిరుమల దేవాలయాన్ని నిర్మించినది ఎవరు?

తిరుమల దేవాలయాన్ని నిర్మించినది ఎవరు?

వెంకటేశ్వరస్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని చెప్తారు. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు. ఇక్కడ రాయబడిన శాసనాల ప్రకారం 1500చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీ.శ.614లో ఆనంద నిలయంపునరుద్దరణ చేసారు.

PC:YOUTUBE

స్వామి ఉత్సవఆభరణాలు

స్వామి ఉత్సవఆభరణాలు

స్వామి ఉత్సవాలు, ఆభరణాలు యువరాణి సమర్పిస్తుంది. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచివుంది.ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు.19వ శతాభ్దంచివరిలో స్వామిదేవాలయం మరియు హతిరామ మటం వదిలి వేరే ఏవిధమైన నిర్మాణం లేదు.అర్చకులు కూడా కొండ క్రింద వుండే గదుల్లో ఉండేవారు.

PC:YOUTUBE

కలలోకనపడి

కలలోకనపడి

మనకు సామాన్యంగా తిరుపతికి వెళ్లినతర్వాత మూడవప్రశ్న ఏమంటే ఈ పుణ్య క్షేత్రాన్ని నిర్మించినది ఎవరు అని.ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించినది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్.ఇతనికి ఒక రోజు విష్ణుమూర్తి కలలో కనపడి ఈవిధంగా చెప్పెను"గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతోపిలవబడి,నా భక్తుడై వున్నాను"అని చెప్పెను.

PC:YOUTUBE

దేవాలయం నిర్మాణం

దేవాలయం నిర్మాణం

ఈ విధంగా వెంకటేశ్వరస్వామిశేషాచలంకొండ మీద వెలసియున్నాడని,కలియుగాంతంవరకూ అక్కడే వుంటాను అని అందువలన నీవు అక్కడ దేవాలయాన్ని నిర్మించాలని చెప్పెను.దీనికి సంతోషించిన తొండమాన్ రాజు విశ్వకర్మను పిలిచి దేవాలయంయొక్క ప్రణాళిక సిద్ధంచేసెను. అద్భుతంగా దేవాలయాన్ని నిర్మాణం చేసెను.

PC:YOUTUBE

ఇతర రాజవంశీకులు

ఇతర రాజవంశీకులు

తొండమాన్ ను ఆకాశరాజు సహోదరుడు. ఇతని అనంతరం చోళులు, పల్లవులు, విజయనగరరాజులు మొదలైనవారు దేవాలయం అభివృద్ధికి కృషిచేసిరి.ఈ దేవాలయంలో ఆస్వామి అలంకారానికి ఖర్చు బంగారుఆభరణాలు సుమారు 12 కె.జిబరువుకలిగివున్నది.ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యేపనికాదు.

PC:YOUTUBE

స్వామికిరీటం

స్వామికిరీటం

దేవాలయంలో వుండే స్వామి కిరీటం నీలిరంగులో వుండిన వజ్రాలతోకూడిన ప్రపంచంలో ఎక్కడాచూడనటువంటి దానిధర ఎన్నో లక్షకోట్లవిలువచేస్తుందని పూజారులు అభిప్రాయపడతారు. శ్రీ కృష్ణదేవారాయలు తిరుమలను పరిపాలించిన 21 సంవత్సరాలూ స్వర్ణ యుగం అని చెప్పవచ్చు.ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వెలకట్టలేనంత వజ్రాలు, మరియు మొదలైనవాటి నుంచి ధగధగామెరిసిపోయేవజ్రాలకిరీటాన్ని స్వామికి అర్పించెను.

PC:YOUTUBE

స్వర్ణయుగం

స్వర్ణయుగం

12వశతాబ్దంనుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ప్రారంభమాయెను. ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామికి సమర్పించారు.అవి మూలవిరాట్ కి 6కిరీటాలు, ఉత్సవమూర్తికి 7కిరీటాలు,20ముత్యాలహారాలు,స్వర్ణపీపీఠాలు, స్వర్ణపాదాలు,లెక్కలేననిబంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు.

PC:YOUTUBE

వేంకటేశ్వరస్వామి భూలోకంలో వెలయుటకు కారణం ఏమిటి?

వేంకటేశ్వరస్వామి భూలోకంలో వెలయుటకు కారణం ఏమిటి?

ఒక పురాణకథ ప్రకారం

శ్రీవేంకటేశ్వరస్వామి తిరుమలలో వెలయుటకు కారణం ఏమిటి అనే రహస్యం అంతగా ఎవరికీతెలియదు.పూర్వం నారదముని భూ లోకంలో మానవులకు భగవంతునిమీద నమ్మకం, భక్తి, విశ్వాసాలు లేకుండా పాపభీతి లేకుండా జీవిస్తున్నారని చెప్పెను.అందుకు శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా వెలుస్తానని చెప్పెను.

PC:YOUTUBE

వేంకటేశ్వరస్వామి భూలోకంలో వెలయుటకు కారణం ఏమిటి?

వేంకటేశ్వరస్వామి భూలోకంలో వెలయుటకు కారణం ఏమిటి?

మరొక కథ ప్రకారం

మరొక కథ ప్రకారం శ్రీ కృష్ణుని నిజమైన తల్లిదండ్రులైన దేవకి,వసుదేవులు.అయితే శ్రీకృష్ణుడు కారణజన్ముడుకావటంచేత యశోదదగ్గర పెరుగుతాడు.శ్రీకృష్ణుడు పెరిగిపెద్దవాడైన తరవాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు.అయితే ఆ వివాహాన్ని యశోద చూసితరించాలనిబాధపడుతుంటే శ్రీకృష్ణుడు కలి యుగంలోవేంకటేశ్వరుడై వెలసి తన వివాహసంబరంలో(యశోదమాతను)వకుళాదేవిగా వివాహాన్ని చూసిఆనందించమని చెప్తాడు.

PC:YOUTUBE

వేంకటేశ్వరస్వామి భూలోకంలో వెలయుటకు కారణం ఏమిటి?

వేంకటేశ్వరస్వామి భూలోకంలో వెలయుటకు కారణం ఏమిటి?

ఇంకొక కథ ప్రకారం

ఇంకొక కథ ప్రకారం వేదవతి శ్రీ మహావిష్ణువును వివాహంచేసుకోవాలని తన తండ్రితో విన్నవించుకొనెను.తదనంతరం శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేసెను.ఆ సమయంలో రావణుడు వేదవతిని అపహరించాలని చూస్తాడు.వేదవతి రావణునికి "నీవు నీలంకలోనే ఒక స్త్రీ మూలకంగా నాశానమౌతావు"అని శపించెను.

PC:YOUTUBE

శ్రీవేంకటేశ్వర స్వామి భూలోకంలో వెలయుటకు గల కారణం

శ్రీవేంకటేశ్వర స్వామి భూలోకంలో వెలయుటకు గల కారణం

సీతామాతను అపహరించిన రావణుడు మాయసీతయైన వేదవతిని లంకలో బంధిస్తాడు.రావణున్ని సంహరించినఅనంతరం మాయసీతయైన వేదవతి తనను వివాహంచేసుకోవాలని వేడుకుంటుంది. ఏకపత్ని వ్రతాన్ని అనుసరించిన రాముడు కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా పుట్టి పద్మావతియైన నిన్ను ఆ సందర్భంలో వివాహంచేసుకుంటానని చెప్పెను.

PC:YOUTUBE

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

బెంగుళూరునుంచి తిరుమలకు సుమారు 267కిమీ ల దూరంలో వున్నది,అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు అందుబాటులో వున్నాయి.అదేవిధంగా రైలుసౌకర్యం కూడా తిరుపతికి వున్నాయి.

ఇది కూడా చదవండి: తిరుమలలో బంగారు బావి

PC:YOUTUBE