• Follow NativePlanet
Share
» »చిత్తూరు జిల్లాలో 2200 యేళ్లనాటి పురాతన ఆలయం !

చిత్తూరు జిల్లాలో 2200 యేళ్లనాటి పురాతన ఆలయం !

చిత్తూరు జిల్లాలో 2200 యేళ్లనాటి పురాతన ఆలయం. చిత్తూరు జిల్లా ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఆధ్యాత్మిక ఆలయాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతంలోనే వున్నాయి. అలాంటి ఆలయమే తిరుపతికి అతి సమీపంలోని గుడి మల్లం. గుడి మల్లం ఆలయం క్రీ.పూ 2,3 శాతాభ్దాలుగా నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు.

చిత్తూరు భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక పట్టణము మరియు జిల్లాకేంద్రం. చిత్తూరుజిల్లా రాయలసీమలో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు సరిహద్దులలో ఉంది. ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు.

చిత్తూరు జిల్లాలో 2200 యేళ్లనాటి పురాతన ఆలయం

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. తలమానికం

1. తలమానికం

చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రగిరి కోట, గుర్రంకొండ, ఆవులకొండ, పుంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన ఋషీ వ్యాలీ పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లెకు సమీపంలో ఉన్న ఆరోగ్యవరం జిల్లాకు తలమానికం.

pc: youtube

2. వేసవి విడిది కేంద్రం

2. వేసవి విడిది కేంద్రం

ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంతం చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.

pc: youtube

3. పరశురామేశ్వర ఆలయం

3. పరశురామేశ్వర ఆలయం

తవ్వకాలలో లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ నిర్దారణ చేశారు. ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు. శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు.

pc: youtube

4. ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం

4. ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం

ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి వుంటుంది. దాదాపుగా 5 అడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షిణి భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు.

pc: youtube

5. ప్రాచీన శైవ పూజ విధానం

5. ప్రాచీన శైవ పూజ విధానం

తలపాగా, దోవతీ ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదకాలంనాటిదని శాస్త్రఘ్నుల అంచనా. ప్రాచీన శైవ పూజ విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చేక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు.

pc: youtube

6. ధూపదీపనైవేద్యాలు

6. ధూపదీపనైవేద్యాలు

ఆలయ గర్భగుడి సైతం గజపుష్పాకారంలో గంభీరంగా వుంటుంది. చోళ, పల్లవ, గంగాపల్లవ,రాయుల కాలంలో దూపదీపనైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954 సంలో గుడి మల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది.

pc: youtube

7. పూజలు పునఃప్రారంభం

7. పూజలు పునఃప్రారంభం

ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. తర్వాత 2009 సంవత్సరంలో పూజలు పునఃప్రారంభమయ్యాయ్. స్థానికులే ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. అదే టిటిడి యే ఆ బాద్యత చేపడితే ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుంది.

pc: youtube

8. అత్యంత పురాతన ఆలయం

8. అత్యంత పురాతన ఆలయం

టిటిడిశివాలయమా?వైష్ణవాలయమా?అనే నిమిత్తం లేకుండా అత్యంత పురాతన ఆలయంగా దీనికున్న ప్రత్యేకతను దృష్టిలో వుంచుకుని టిటిడి విలీనానికి చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

pc: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి