» » సకలేశ్ పూర్ కు వారాన్తపు విహారం!!

సకలేశ్ పూర్ కు వారాన్తపు విహారం!!

Posted By:

కార్యాలయాలలో డైలీ చేసే ఉద్యోగాలు విసుగు పుట్టిన్చేస్తున్నాయా ? వారాంతం ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా ? వీక్ ఎండ్ అతి త్వరలో వచ్చేస్తోంది. మరి వీక్ ఎండ్ ప్రణాలికలు సిద్ధం చేయండి.

మీరు బెంగుళూరు లోని వారైతే, బెంగుళూరు నుండి సకలేశ్ పూర్ కు ఒక చిన్న విహారం చేయవచ్చు. సకలేశ్ పూర్ ఒక చిన్న హిల్ స్టేషన్. ఇది పడమటి కనుమలలో వుంది. సాధారణ టూరిస్ట్ మ్యాప్ నుండి తొలగించ బడిన ఈ హిల్ స్టేషన్ ఒక ప్రత్యేకత గా వుంటుంది.

వారం అంతా బిజీ వర్క్ ఎంతో ఒత్తిడి కలిగి వున్న మీకు ఈ చిన్న హిల్ స్టేషన్ మీరు ఊహించని మేరకు ఆనందాలు అందించి విశ్రాన్తినిస్తుంది. కనుక మీ లగేజ్ సర్ది సిద్ధమవండి.

ప్రయాణం మొదలు

ప్రయాణం మొదలు

మనం మన జర్నీ ని బెంగుళూరు నుండి మొదలు పెడదాం. ఇది సుమారు 270 కి. మీ. ల దూరం లో వుంది. బెంగుళూరు నుండి అయిదు గంటల ప్రయాణం పడుతుంది. మార్గం లో మీరు శ్రావనబెలగోల, హస్సన్, బేలూర్ వంటి మరికొన్ని పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు.

శ్రావణ బెలగోల

శ్రావణ బెలగోల

శ్రావణ బెలగోల అక్కడ కల అతి పెద్ద బాహుబలి రాతి విగ్రహానికి ప్రసిద్ధి. దీనిని విధ్యగిరి హిల్స్ లో ఒక కొండపై పెట్టారు. సుమారు 57 అడుగులు ఎత్తు కల ఈ విగ్రహం భక్తులకు పరమ పవిత్రమైనది. ప్రతి పన్నెండు సంవత్సరాల కొకసారి ఇక్కడ మహామస్తాభిషేకం జరుగుతుంది. దీనిలో పాలు, నెయ్యి, షుగర్ కెన్ జ్యూస్ , కుంకుమ పువ్వు పేస్టు, శాండల్ వుడ్, పసుపు, వంటివి ఉపయోగిస్తారు. చివరకు పూవులు, బంగారం, వెండి మొదలైనవి విగ్రహం పాదాల చెంత ఉంచుతారు.

Ananth H V

హస్సన్

హస్సన్

హసన్ ను కర్ణాటక రాష్ట్ర శిల్ప కళల రాజధాని అంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన హోయసల వంశం అనేక కళలను పోషించింది. ఇక్కడ అనేక జైన టెంపుల్స్ కలవు. ప్రస్తుతం అవి శిధిలావస్థలో కలవు. ఇక్కడ మీరు చక్కని శివాలయం చూడవచ్చు. ఇక్కడ కొన్ని మంచి హోటళ్ళు కూడా కలవు.

బేలూర్

బేలూర్

బేలూర్ కర్నాటక లో ఒక ప్రసిద్ధ దేవాలయాల పట్టణం. తరచుగా దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కల టెంపుల్స్ లో చెన్నకేశవ టెంపుల్ అతి వైభవంగా వుంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీనిలో విష్ణు మూర్తి అవతారం అయిన చెన్న కేశవుడు ప్రధాన దైవం.

హలెబీడు

హలెబీడు

హలెబీడు లొనీ పురాతన నగరం హోయసల రాజులకు రాజధానిగా వుండేది. దీనిని అప్పటిలో 'ద్వారసముద్రం' అని పిలిచేవారు. ఇక్కడ కలహొయసలేశ్వర మరియు శాంతాలేశ్వర టెంపుల్స్ ప్రసిద్ధి చెందినవి. హోయసల రాజులు జైన మతస్తులు ఐనప్పటికీ, శివుడి కి గల టెంపుల్స్ కూడా ఇక్కడ అనేకం చూడవచ్చు.
Photo Courtesy: Dineshkannambadi

కాఫీ మరియు సుగంధ తోటలు

కాఫీ మరియు సుగంధ తోటలు

పడమటి కనుమల లో కల సకలేశ పూర్ లో కాఫీ మరియు సుగంధ ద్రవ్యాల తోటలు కలవు. ఇక్కడ బిస్లె రిజర్వు ఫారెస్ట్ మరియు పుష్పగిరి వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు చూడవచ్చు.
Photo Courtesy: L. Shyamal

కుమార పర్వత

కుమార పర్వత

సాహస క్రీడలు ఆచరిన్చాలనుకునే వారు ఈ కుమార పర్వతానికి ట్రెక్కింగ్ లో వెళ్ళవచ్చు. ఇక్కడ సమీపంలో కల సుబ్రమణ్య టెంపుల్ కూడా చూడవచ్చు.

మంజరా బాద్ కోట

మంజరా బాద్ కోట

ఇక్కడ కల కొండ వంపులలో ఒక చోట మీరు అతి పురాతన మంజరాబాద్ కోట ఇపుడు శిధిలాలలో వున్నది చూడవచ్చు. ఈ మంజరాబాద్ కోటను టిప్పు సుల్తాన్ తన సైన్యపు మరియు కావలి టవర్ అవసరాలకు నిర్మించుకున్నాడని చెపుతారు.
Photo Courtesy: Aravind K G

మరిన్ని హస్సన ఆకర్షణలకు క్లిక్ చేయండి

Please Wait while comments are loading...