• Follow NativePlanet
Share
» »బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

మీరు ఎంతో ఉత్సాహవంతులు, మీరు లేకుంటే, ఒక పార్టీ నిర్వహణ చాలా కష్టం, అందరిని ఆనందింప చేస్తారు, క్షణాలలో పని జరిపించేస్తారు, ప్రకృతి ప్రియులు, వన్య జంతువుల ఫోటోలు తీస్తారు, శృంగార పురుషులు, సాహస ప్రియులు, ఏ పరిస్థితి అయినా సరే, అన్నిటికీ రెడీ! మరి ఇటువంటి వారి ఆనందాలకు సరైన పర్యాటక నగరం బెంగుళూరు మహా నగరం మరియు దాని చుట్టుపక్కలు. బెంగుళూరు లో ఉంటూ ఆనందాలు వెతుక్కునే వారైతే, దిగువ అంశాలు చదవండి, చిత్ర సమేతంగా ఆనందించండి.

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

మందు బాబులా ?

ఎన్నో రకాల వైన్ లు రుచి చూడండి. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కల దోద్దబల్లాపూర్ లో కల గ్రోవర్ వైన్ యార్డ్ అద్భుత రుచుల పానీయాలు అందిస్తుంది. ఇక్కడ కల వైన్ యార్డ్ లకు ఒక ట్రిప్ వేయండి. అనేక అద్భుత ప్రక్రుతి దృశ్యాల ఆస్వాదనలో చివరి అంశంగా మందు కొట్టేయండి.

Photo Courtesy: Nicolas Mirguet

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

వావ్...సైకిల్ తొక్కే అభిరుచి ఉందా ?

ఎనర్జీ లు పుష్కలంగా వుండి ఫిట్ నెస్ ప్రోగ్రాం ఏదైనా చేయాలని వుంటే, పర్యటనలో భాగంగా, బెంగుళూరు సమీపం లోని నంది హిల్స్ పైకి సైకిల్ తోక్కండి. ఇది సుమారు 12 00 అడుగుల ఎత్తు సైకిల్ తొక్కడం ఎంతో థ్రిల్లింగ్ గా వున్తుల్న్ది. 8 కి. మీ. ల దూరం అంతే ...మరి చాలెంజ్ గా తీసుకుంటారు కదూ....

Photo Courtesy: Sean Ellis

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

చేపలు పట్టటం సరదానా ?

అలా అయితే, బెంగుళూరు కు వంద కి. మీ. ల దూరం లోని భీమేశ్వరి ఫిషింగ్ కెంప్ కు వెళ్ళండి. ఇక్కడ కావేరి నది దానితో పాటు చుట్టూ పచ్చటి ప్రాంతాలు, కొండలు కల ప్రకృతి దృశ్యాలు ఆనందించవచ్చు. పెద్ద పెద్ద మశీర్ జాతి చేపలు పట్టవచ్చు, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్ వంటివి కూడా ఆనందించవచ్చు.

Photo Courtesy: Rishabh Mathur

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

పిల్లలతో కలసి ఆనందమా ?

వెంటనే బెంగుళూరు కు అతి సమీపంలోని బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ సందర్శించండి. ఇక్కడ ఎలుగుబంటి, పులి, సింహం వంటి అనేక జంతువులు కలవు. పిల్లలు బాగా ఆనందిస్తారు.

Photo Courtesy: Muhammad Mahdi Karim

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

సావన్ దుర్గ

ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు అనుకూలం. బెంగుళూరు కు 60 కి. మీ. ల దూరంలో కలదు. సముద్ర మట్టానికి 40 50 అడుగుల ఎత్తున కల ఈ ప్రదేశం మీలోని శారీరక సామర్ధ్యానికి పరీక్ష పెడుతుంది. రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్ వంటివి ఇక్కడ అనేకమంది ఆనందిస్తారు. ఇక్కడకు వెళ్ళినపుడు కెంపే గౌడ ఫోర్ట్ చూడటం మరువకండి.

Photo Courtesy: Shyamal

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బండి పూర్ జంగల్ సఫారి

బండి పూర్ అరణ్యంలో ఒక్క రాత్రి గడపండి ఇక్కడ అనేక రిసార్ట్ లు కలవు. ప్రకృతి ఒడిలో సేద దీరండి. జంగల్ సఫారి లు, అడవి ఏనుగుల ఘీంకారాలు, పులులు, చిరుతలు, ఎలుగులు వంటివి మీకు మంచి ఆనందం కలిగిస్తాయి. కెమెరా మరువకండి సుమా !

Photo Courtesy: Pavan

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

రంగ శంకర

బెంగుళూరు లో కల రంగ శంకర డ్రామా థియేటర్ చాలా ప్రసిద్ధి. ఇక్కడ భారత దేశ ప్రోగ్రాం లు మాత్రమే కాదు, విదేశీ ప్రోగ్రాం లు కూడా నిర్వహిస్తారు. అతి తక్కువ ఖర్చుల అధిక ఆనందం. అనేక నాటకాలు చూసి ఆనందించవచ్చు. ఒకసారి సినిమా వదలి వేసి ఈ థియేటర్ లో ఒక నాటకం చూసి ఆనందించండి.

Photo Courtesy: ZeHawk

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

యు.బి.సిటీ ఆకాశ విశ్రాంతి

యు.బి. నగర భవనాలు అధిక ఎత్తు కలిగి వాటి అందాలతో బెంగుళూరు గ్లామర్, మరియు లక్జరీ జీవన విధానాలకు అద్దం పడతాయి. భవన పై భాగంలో కల రెస్టారెంట్ లో కూర్చుని ఆకాశం చూస్తూ వీనుల విందైన సంగీతాలు ఆనందించండి. ప్రియమైన వారి కంపెనీ మరువకండి సుమా !

Photo Courtesy: Soul Flow

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

పట్టు పురుగుల పరిశ్రమ

పట్టు వస్త్రాలు ఎలా తయారవుతాయి ? అనే ఆసక్తి తో వున్నారా ? మరింత సమాచారానికి బెంగుళూరు చుట్టూ పక్కల కల రామనగరం, వరదేనహళ్లి వంటి గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజల జీవన శైలి తెలుసుకోండి. మీరు వేసుకునే పట్టు వస్త్రాల కధలను చూసి ఆనందించండి.

Photo Courtesy: Wendy North

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

బెంగుళూరు నగరాన్ని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

షాపింగ్ అంటే మనసా ?

బెంగుళూరు లోని చిక్ పేట లేదా కమర్షియల్ స్ట్రీట్ లు షాపింగ్ కు ఫేమస్. అన్నీ తాజా వెరైటీ లు. మీరు కోరే నగల నుండి దుస్తుల వరకూ అనేక వెరైటీ లు ఇక్కడ ఎప్పటికపుడు లేటెస్ట్ వెరైటీ లు దొరుకుతాయి. ఎంపిక చేసుకోనటం కష్టమే. షాపుల చుట్టూ నోటి రుచులు ఊరే ఆహారాల అనేక రెస్ట రెంట్ లు, హోటళ్ళు. అన్నీ మీ బజేట్ లోనే దొరుకుతాయి సుమా ! ఇక ఆనందించండి.

Photo Courtesy: Saad Faruque

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి