Search
  • Follow NativePlanet
Share
» »ఫిబ్రవరి లో సందర్శించవలసిన ఉత్తమ పర్యాటక ప్రదేశాలు !

ఫిబ్రవరి లో సందర్శించవలసిన ఉత్తమ పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

ఫిబ్రవరి నెల ... చూస్తేనే అర్థమైపోతుంది పబ్లిక్ హాలిడేస్ లేని నెల అని. ఈ నెలలో గుర్తొచ్చేది ఒకేఒకరోజు వాలెంటెన్స్ డే. అది తప్పనిచ్చి ఈ నెలలో విశేషాలంటూ ఏమీ లేవు. కానీ ఈ నెలలో చూసొచ్చే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో చాలా మందికి తెలీదు. ఫిబ్రవరి మాసంలో చూడవలసిన ప్రదేశాలను చూడక చాలా మంది పర్యాటకులు భారతదేశం మొత్తం తిరిగేస్తుంటారు. సరైన గైడ్ (సమాచారం) లేకుండా వెళితే ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఇక్కడ మీకు కొంత సమాచారం అందిస్తున్నాం ... ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రేమికులు వీటిలో కొన్నైనా తప్పక సందర్శించాలి.

ఇది కూడా చదవండి : ఇండియాలో డిసెంబర్ లో పర్యటించవలసిన పర్యాటక ప్రదేశాలు !

నేనేం పెద్దగా చాంతాడంత లిస్టు చెప్పనులెండి ఏదో కొన్ని ప్రదేశాలను చెబుతాను. వీటిని మీరే కాదు ఎవ్వరైనా చూసిరావచ్చు. చూసి వస్తే మాత్రం నిజంగా ఎంతో ఉత్సాహంతో హాయిగా ఉంటారు కాదు .. కాదు ... ఈ ప్రదేశాలు మిమ్మల్ని అలా మారుస్తాయి. ఇక్కడి వాతావరణం కాస్త చలికి, వేడికి మధ్యలో ఉంటుంది. సరే ఇక ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాల్సినది, తేల్చుకోవాల్సింది మీరే కాబట్టి, ఈ ఫిబ్రవరి నెలలో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు గురించి ముందుగానే మీ తెలుగు నేటివ్ ప్లానెట్ అందిస్తున్నది.

గోవా

గోవా

భారతదేశానికి పశ్చిమంగా ఉన్న గోవా కర్నాటక, మహారాష్ట్ర మరియు అరేబియా సముద్రాన్ని సరిహద్దుగా కలిగి ఉన్నది. ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళినా బీచ్ లు చూడకుండా ఉండలేరు. బీచ్ పర్యటన ఇక్కడి ప్రధాన ఆదాయ వనరు. మందు బాబులకు అల్కాహాలు చవకగా దొరుకుతుంది. సీ ఫుడ్ లు, నైట్ క్లబ్ లు, రోడ్ సైడ్ పబ్ లు, చర్చీలు ఇంకా షాపింగ్ ఇలా ఎన్నో పర్యాటకులను ఆకర్షిస్తాయి. గోవా సందర్శించడానికి ఉత్తమమైన సమయం ఫిబ్రవరి మాసం.

ఇది కూడా చదవండి : గోవా ... నీ అందం ఆదరహో ..!

చిత్ర కృప : Ketan Nikharge

కుమారకోం

కుమారకోం

కుమారకోం లో బ్యాక్ వాటర్స్ పైన వీకెండ్ సెలవులను గడపడం ఒక మధురానుభూతి. కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశం ఒక చిన్న చిన్న ద్వీపాల సమూహం. కొట్టాయం కి 12 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ అందమైన ప్రవాహాలతో, ఆకు పచ్చని ప్రకృతితో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. పక్షి ప్రేమికులు రకరకాల పక్షులను దగ్గరి నుండి తిలకించడానికి కుమారకోం అనువైన ప్రదేశం. ఇక్కడికి వెళితే సీ ఫుడ్ తినటం మరిచిపోవద్దు ..! సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : కుమారకోం ... కేరళ రాష్ట్ర వర్షపు విందు !

చిత్ర కృప : Byju Abraham

ఉదైపూర్ (ఉదయపూర్)

ఉదైపూర్ (ఉదయపూర్)

బ్రహ్మాండమైన కోటలకు, మందిరాలకు, అందమైన సరస్సులకు, రాజ ప్రసాదాలకు, మ్యూజియాలకు, అభయారణ్యాలకు ప్రసిద్ది పొందిన ఉదయపూర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. ఈ ప్రదేశం 'సరస్సుల నగరం' గా పిలువబడే అందమైన ప్రదేశం. వేసవిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు ఉంటుంది. ఆ సమయంలో పర్యాటకులు ఇక్కడికి రావటానికి జంకుతుంటారు. అందుకే ఫిబ్రవరి నెలలో పర్యాటకులు ఉదైపూర్ ను సందర్శించడానికి ఇష్టపడతారు.

ఇది కూడా చదవండి : శీతాకాల సందర్శన - ఉదయపూర్ పర్యటన !

చిత్ర కృప : chrispass79

ఖజురహో

ఖజురహో

ఇండియా లోని సాంప్రదాయ నృత్యాలన్నీ ఒక చోట చేరితే ఎలా వుంటుంది ? ఒక్కసారి ఊహించుకోండి...! నిజంగా అది ఒక అద్భుతమే ! పూర్వకాలంలో మహారాజులు తమ సభా ప్రాంగణంలో టెంపుల్ డాన్సర్స్ చే నృత్యాలు చేయించి వినోదాత్మకంగా ఆనందించేవారు. కళలను పోషించేవారు. ఈ కోవలోని చెందినదే ఇప్పటికీ ఖజురాహో లో జరుగుతున్న డాన్స్ ఫెస్టివల్. ఈ డాన్స్ ఫెస్టివల్ ఫిబ్రవరి నెలలో మధ్యప్రదేశ్ లోని ఖజురాహో లో జరుగుతుంది. వేయి సంవత్సరాల పురాతన ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో జరిగే డాన్స్ ఫెస్టివల్ ను చూసేందుకు పర్యాటకులు, కళాకారులు వస్తుంటారు.

ఇది కూడా చదవండి : ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ !

చిత్ర కృప : marielf808

ధర్మశాల

ధర్మశాల

ధర్మశాల, హిమాచల ప్రదేశ్ లోని కాంగ్రాకు ఈశాన్యాన 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పేరొందిన పర్వత కేంద్రం. ధర్మశాల ఓక్, కోనిఫెరస్ చెట్ల అడవుల మధ్య మూడు వైపులా ధవళాధర్ శ్రేణులను సరిహద్దులు కల్గి ఉండి, కాంగ్రా లోయకు చెందిన మంత్రముగ్ధ దృశ్యాలను అందిస్తుంది. ధర్మశాలలో ఉన్న కాంగ్రా కళా మ్యూజియంలో ఆ ప్రాంతపు కళాత్మక, సాంస్కృతిక మూలాలు, శిల్పాలు, చిత్రాలు, నాణేలు, కుండలు, ఆభరణాలు చేతివ్రాతలు, రాజరికపు దుస్తులు ఇక్కడ చూడవచ్చు. ధర్మశాలను సందర్శించడానికి అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : ఇండియాలోని 5 ప్రసిద్ధ బౌద్ధ ఆరామాలు !

చిత్ర కృప : Nagarjun Kandukuru

కొడైకెనాల్

కొడైకెనాల్

కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అందమైన హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ సముద్రమట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారు హనీమూన్ చేసుకోవటానికి కొడైకెనాల్ వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు, సరస్సులు, పూల తోటలు ఇలా ప్రతిఒక్కటి విడిచిపెట్టకుండా తప్పక సందర్శించాలి. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : దక్షిణ భారతదేశ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Thangaraj Kumaravel

సిమ్లా

సిమ్లా

సిమ్లా హిల్ స్టేషన్ లలో మహారాణి గా బిరుదు పొందింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధానైనా సిమ్లా సముద్రమట్టానికి 2202 మీటర్ల ఎత్తులో కలదు. ఇండియాలో ఫిబ్రవరి నెలలో నిర్వహించే ఐస్ స్కేటింగ్ రింక్ కు సిమ్లా ప్రసిద్ధి. ట్రెక్కింగ్, మౌంట్ బైకింగ్, రాప్టింగ్ వంటి సాహస క్రీడలతో పాల్గొనవచ్చు. దీనితో పాటుగా వ్యూ పాయింట్ లు, ఆలయాలు, మొనా స్ట రీ లు కూడా చూసి ఆనందించవచ్చు.

ఇది కూడా చదవండి : ఢిల్లీ - మనాలి ప్రయాణం వయా సిమ్లా !

చిత్ర కృప : Jitendra Singh

సిక్కిం

సిక్కిం

సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతి దీవెనలతో నిండిన ఎంతో అందమైన ఒక అద్భుత భూమి. కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల ఎంత హుషారు వస్తుందో, అక్కడి ప్రదేశాలను సందర్శిస్తే తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో 28 పర్వత శిఖరాలు, 227 ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న మంచు పర్వతాలు, 80 హీమానీనదాలు ఉన్నాయి. సిక్కిం లో వంటలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. సందర్శన కు అనువైన సమయం ఫిబ్రవరి మాసం.

ఇది కూడా చదవండి : సిక్కిం రాష్ట్రం - సంక్షిప్త సమాచారం !

చిత్ర కృప : Stefan Krasowski

జైసల్మీర్

జైసల్మీర్

బంగారు నగరం గా ప్రసిద్ధి చెందిన జైసల్మీర్ రాజస్థాన్ ఎడారి థార్ మధ్యలో ఉన్నది. రాజప్రసాదాలు, ఎడారిలో సంచరించే ఒంటెలు ఇక్కడి ఆకర్షణ లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడి ఇసుక తిన్నెలపై ఎడారి ఉత్సవాల సమయంలో స్థానిక గిరిజన తెగ వారు చేసే నృత్యం కల్బెలియా. ఈ నృత్యాన్ని ఏటా ఫిబ్రవరి నెలలో మూడు రోజులపాటు నిర్వహిస్తారు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : జైపూర్ లో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Sonu Nair

భీమేశ్వరి

భీమేశ్వరి

భీమేశ్వరి మండ్య జిల్లాలో, బెంగళూరుకి 100 కి. మీ. దూరంలో ఉన్న చిన్న పట్టణం. మేకేదాటు మరియు శివసముద్ర జలపాతాల మధ్యలో ఉన్న ఈ విహార ప్రదేశం వివిధ ఆకర్షణలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఆసక్తి ఉన్నవారు ఇక్కడి కావేరి నదిలో చేపలు పట్టడం, మౌంట్ బైకింగ్, ట్రెక్కింగ్ వంటి క్రీడలను ఆడవచ్చు. సీ ఫుడ్ గా చేపలను ఇక్కడ రుచిగా వండించుకొని తినవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : బెంగళూరు కు 100 కి. మీ. దూరంలో .. !

చిత్ర కృప : Rishabh Mathur

ఔలి

ఔలి

ఔలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కీయింగ్ లలో ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అందమైన పర్యాటక ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్నది. వాలు ప్రాంతం అంతా దుర్భేద్యమైన ఓక్ వృక్షాలు మరియు ఇతర పచ్చని చెట్లతో నిండి అడవి లాగా ఉంటుంది. ఈ ప్రదేశం ను 'బుగ్యల్'' అని అంటారు. ఈ మంచుతో కూడిన వాలు గుండా పర్యాటకులు నడిస్తే నందా దేవి, మానా పర్వత్,మరియు కామత్ పర్వత శ్రేణుల అద్భుత దృశ్యాలను, ఆపిల్ తోటలు మరియు లష్ దేవదార్ చెట్లను చూడవచ్చు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి మాసం.

ఇది కూడా చదవండి : ఔలి - స్కయింగ్ క్రీడల స్పెషల్ !

చిత్ర కృప : Joginder Pathak

కాలింపాంగ్

కాలింపాంగ్

కాలింపాంగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మంచుచే కప్పబడిన ప్రాంతంలో ఉన్న హిల్ స్టేషన్. ఇది సముద్రమట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉంటుంది. సెలవుల్లో కాలింపాంగ్ లో బసచేసి చూడటానికి అనేక అద్భుతమైన ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడి సాంప్రదాయాలు, కళ లు, ఆహారపు రుచులు, బౌద్ధ ప్రదేశాల్లో విహారం వంటివి ఎప్పటికీ మార్చిపోలేము. స్థానిక వంటాలైన మొమోస్ తప్పక రుచి చూడాలి. వెజ్ & నాన్ - వెజ్ లలో ఇది లభ్యమవుతుంది. ఇక్కడి సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Ritesh Man Tamrakar

లక్షద్వీప్

లక్షద్వీప్

లక్షద్వీప్ భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం. కేరళ రాష్ట్రానికి 250 కిలోమీటర్ల దూరంలో, అరేబియా సముద్రంలో ఉన్న ఈ దీవులకు చేరుకోవటానికి ఫెర్రీ ప్రయాణం, విమాన మార్గం మాత్రమే అనుకూలం. ఆగట్టి మరియు బంగారం బీచ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఆగట్టి లో ఏర్ పోర్ట్ ఉన్నది. బంగారం బీచ్ లో అల్కాహాలు చవకగా లభ్యమవుతుంది. సముద్రపు ఆహారాలు, బీచ్ లు, రిశార్ట్ లు ఇలా ఎన్నో సౌకర్యాలతో ఉన్న లక్షద్వీప్ ను సందర్శించడానికి అనువైన సమయం ఫిబ్రవరి మాసం.

ఇది కూడా చదవండి : భారతదేశపు పగడపు దీవులు - లక్షద్వీప్ !

చిత్ర కృప : icultist

బసిలికా ఆఫ్ బామ్ జీసస్

బసిలికా ఆఫ్ బామ్ జీసస్

పురాతన గోవా లో ఉన్న బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చి వేలాది పర్యాటకులను, యాత్రికులను ఆకర్షిస్తున్నది. చర్చి చాలా మహిమ కలదని ప్రత్యేకించి ఫాదర్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ రోగాలను, వ్యాధులను నివారించడంలో గొప్పవాడని నమ్ముతారు. చర్చిలో ప్రార్థనలు చేయవచ్చు మరియు అక్కడి కళా సంపదను, శిల్ప కళను చూసి ఆనందించవచ్చు. యునెస్కో వారిచే ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న ఈ స్మారక కట్టడం చూడటానికి అనువైన సమయం ఫిబ్రవరి మాసం.

చిత్ర కృప : David Jones

గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్ ను హరమందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరంలో ఉన్నది. ఈ దేవాలయాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వచ్చి దర్శించుకుంటారు. గురుద్వారా యొక్క పై అంతస్తును 400 కేజీల బంగారం తో పూత వేశారు. ఈ గురుద్వారా చుట్టూ అమృత్ సరోవర్ అనే కొలను ఉంటుంది. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం - ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ !

చిత్ర కృప : Erik Grootscholte

లోటస్ టెంపుల్

లోటస్ టెంపుల్

ఢిల్లీ లోని భవనాల్లో కెల్లా లోటస్ టెంపుల్ సుందరమైనది, అద్భుతమైనది. ఈ టెంపుల్ నిర్మాణ శైలిని చూడటానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. సగం విడిచిన పద్మం ఆకారంలో నిర్మించిన ఈ గుడి ఆధ్యాత్మికత, ప్రశాంతతకి స్వర్గధామం. తెల్లటి మార్బుల్ పరచబడిన దేవాలయం చుట్టూ తీర్చిదిద్దిన లాన్స్, ఉద్యాన వనాలు, దారులు, శిల్పాలు, మెట్లు, బ్రిడ్జీలు ఉన్నకొలనులు 9 ఉన్నాయి. గంట గంటకీ ప్రదర్శించే లేజర్ షో ల వల్ల సందర్శకులకి ఈ గుడి గురించి తెలుసుకునే వీలు కలుగుతుంది. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Ken Wieland

మహాబోధి ఆలయం

మహాబోధి ఆలయం

మహబోధి ఆలయం బౌద్ధుల ఆలయం. ఈ ప్రదేశంలోనే బుద్ధుడు జ్ఞానాన్ని పొందాడని విశ్వసిస్తారు. బీహార్‌లో ని బుద్ధగయ లో ఉన్న ఈ ఆలయాన్ని అశోకుడు ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించాడు. గుడికి పక్కనే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కూడా ఉంది. ఈ ప్రదేశం కూడా ఫిబ్రవరి మాసంలో తప్పక సందర్శించాలి.

చిత్ర కృప : Santosh Kumar

మీనాక్షి ఆలయం

మీనాక్షి ఆలయం

మీనాక్షి ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం తమిళ నాడు రాష్ట్రంలోని మధురై పట్టణంలో ఉన్నది. ఆలయ సముదాయం 6 హెక్టార్లలో విస్తరించి, 12 గేట్లు కలిగి ఉంటుంది. ఇక శిల్ప సంపద విషయానికి వస్తే ఆలయ గోడలపై, స్థంబాల పై దేవుళ్ళు, దేవతామూర్తుల రూపాలను అందంగా చెక్కారు. దీనిని క్రీ.శ. 2500 వ సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయ సందర్శనకు కూడా అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : మీనాక్షి టెంపుల్ - మమతానురాగాల నెలవు !

చిత్ర కృప : Varun Shiv Kapur

ఆలీబాగ్

ఆలీబాగ్

ఆలీబాగ్ చిన్న మరియు అందమైన పట్టణం. ఈ పట్టణం మహారాష్ట్ర లోని కొంకణ్ తీరంలో రాయ్ ఘడ్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం మూడువైపులా నీరు కలదు. అనేక బీచ్ లు కలవు. వీటితో పాటు కనకేశ్వర మరియు సోమేశ్వర ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందినాయి. ఇవి రెండు గుడులు కూడా శివ భగవానుడికి అంకితం ఇవ్వబడ్డాయి. కంధేరీ కోట కూడా ఇక్కడ తప్పక చూడవలసిన ప్రదేశం గా నిలిచింది. ఈ ప్రదేశ సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Alosh Bennett

పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి

పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి

పాండిచ్చేరి చెన్నై నగరానికి 167 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రధానం గా చూడవలసిన ప్రదేశాలు ఆరోవిల్లె నగరం, వారసత్వ కట్టడాలు, స్మారక చిహ్నాలు, బీచ్. దీంతో పారు మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఆశ్రమం కూడా సందర్శనీయ స్థలాలే. ఈ ప్రదేశ సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి మాసం.

ఇది కూడా చదవండి : పుదుచ్చేరి - అనుభూతి కలిగించే పర్యటన !

చిత్ర కృప : Aleksandr Zykov

ఊటీ

ఊటీ

ఊటీ నే ఉదకమండలం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి పర్యాటకులు వేసవి సెలవులను గడపటానికి లక్షల్లో వస్తుంటారు. సరస్సులు, కొండలు, పూల తోటలు, ఫ్లవర్ షో లు వంటి ఎన్నో ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు రెండూ కూడా కలిసే చోటులో ఊటీ ఉంది అందుకే ఈ ప్రదేశ వాతావరణం చల్లగా, హాయిగా ఉంటుంది. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : ఉల్లాసపరిచే ఊటీ రైలు ప్రయాణం !

చిత్ర కృప : Satheeshkumar K

జోధ్‌పూర్

జోధ్‌పూర్

జోధ్‌పూర్ ను నీలి నగరం లేదా బ్లూ సిటీ అని అభివర్ణిస్తారు పర్యాటకులు. కోటలు, భవనాలు, ఆలయాలు, సరస్సులు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. సంప్రదాయ రాజస్థానీ వంటకాలను రుచి చూడవచ్చు. పెరుగు, పంచదార తో తయారుచేసే మఖనీయ లస్సి ఇక్కడ తప్పక రుచి చూడాలి. ఏటా ఫిబ్రవరి నెలలో నిర్వహించే నాగార్ ఉత్సవం జోధ్‌పూర్ చుట్టూప్రక్కల ప్రసిద్ధి చెందినది. జానపద సంగీతం, రాజస్థానీ నృత్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశ సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Milo & Silvia in the world

బి ఆర్ హిల్స్

బి ఆర్ హిల్స్

బి ఆర్ హిల్స్ అంటే బిలగిరి రంగన్న హిల్స్ అన్నమాట. ఇవి పశ్చిమ కనుమలకి తూర్పు సరిహద్దుగా ఉంటాయి. ఈ కొండలు కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్నాయి. కొండల మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి పైనున్న ఆలయాన్ని దర్శించుకోవటం ఒక సాహస కార్యాక్రమం. ఈ దేవాలయంలో ప్రధాన దేవుడు రంగనాథస్వామి. పండుగ కాలాల్లో ఆలయంలో ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : బి ఆర్ హిల్స్ - కొండల నడుమ ప్రశాంతత !

చిత్ర కృప : R E B E L TM®

రామ్‌ఘర్

రామ్‌ఘర్

రామ్‌ఘర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అందమైన హిల్ స్టేషన్. సముద్రమట్టానికి 1900 మీటర్ల ఎత్తులో ఉండే ఈ స్థలంలో చూసేందుకు తోటలు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశ్రమం,లైబ్రెరీ, గిరిజాదేవి ఆలయం, 25 కి. మీ. దూరంలో ముక్తేశ్వర్ లోని శివాలయం ఉన్నాయి. వీటితో పాటు సాహస క్రీడలు, ఫిషింగ్, అన్నింటినీ మించి రాత్రిపూట నది ఒడ్డున క్యాంప్ లో బస చేయటం చేయవచ్చు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Deepak Bhatia

అరకు వాలీ

అరకు వాలీ

అరకు వాలీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ వైజాగ్ జిల్లాలో ఉన్నది. లోయలో పండించే కాఫీ సువాసనలు అరకు వాలీ అంతటా వ్యాపించి ఉంటాయి. దీని అందాలకు దాసోహంగా మారిన టాలీవూడ్ సినీ పరిశ్రమ ఇక్కడ షూటింగ్ లు చేయటానికి ఆసక్తిని కనబరుస్తారు. నాటి నుంచి నేటి వరకు అరకు వాలీ లో చాలానే సినిమా షూటింగ్ లు జరుపుకొని విజయం సాధించినాయి. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : అరకు లోయ - మరుపురాని పర్యటన !

చిత్ర కృప : Bhaskaranaidu

కూర్గ్

కూర్గ్

కూర్గ్ పట్టణం కొత్త జంటల కు విహార కేంద్రంగా ఉంది. దీనిని కొడుగు అని పిలుస్తారు. పశ్చిమ కనుమల అందాలు, జలపాతాలు, కాఫీ తోటలు, పండ్ల తోటలు, అడవులు, లోయాలు, మంచుచే కప్పబడే కొండలు ఇక్కడ కంటికి కనపడే ఆకర్షణలు. ఇక కంటికి కనపడనివి ఎన్నో...! అందుకే కాబోలు కూర్గ్ ను ఇండియాలోని స్కాట్ లాండ్ అంటారు. ఏటా ఫిబ్రవరి నెల మొదటి వారంలో స్థానికులు 'స్మార్ట్ మ్యూజిక్ ఫెస్టివల్' నిర్వహిస్తారు. ఈ పండుగలో వివిధ రకాల ఆహారాలను ఆరగించి, లిక్కర్ తాగి సంగీత నృత్యాల్లో చిందులేస్తారు. యువత ఈ పండుగలో పాల్గొనటానికి ఆసక్తిని కనబరుస్తారు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : కొత్త జంటల హనీమూన్ ప్రదేశం ... కూర్గ్ !

చిత్ర కృప : Kalidas Pavithran

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్ ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ ను చూసేందుకు అందరూ ఇష్టపడతారు కారణం ఈ ప్రదేశంలో 5 నదులు పుడతాయి. అందులో ఒకటి జీవనది కృష్ణమ్మ. ఈ హిల్ స్టేషన్ మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు లెక్కకు మించిన వ్యూ పాయింట్ లు. అలాగే పురాతన దేవాలయాలను ఈ ప్రదేశం కలిగి ఉంది. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Ankur P

పాలంపూర్

పాలంపూర్

అందమైన ప్రకృతి దృశ్యాలకు మరియు నిర్మలమైన వాతావరణానికి పేరు పొందిన ప్రాంతం, పాలంపూర్. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లోయలో ఉన్న ఒక కొండ పట్టణం. పైన్ మరియు దేవదార్ చెట్ల దట్టమైన అడవులు, స్వచ్చమైన ప్రవాహాలతో ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 1220 మీ. ఎత్తున ఉండి, ప్రకృతి ఆరాధకులకు ఒక వరంలా ఉన్నది. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి మాసం.

చిత్ర కృప : Jon Connell

ఆగ్రా

ఆగ్రా

ఆగ్రా అంటే అందరికీ గుర్తొచ్చేది తాజ్ మహల్. ఢిల్లీ నుండి ఆగ్రా 210 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ తాజ్ మహల్ కాకుండా రెండు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. అవి వరుసగా ఫతేపూర్ సిక్రీ మరియు ఆగ్రా కోట. యమునా నది ఒడ్డున స్మారక చిహ్నాలు, అక్బర్ సమాధి, తాజ్ మ్యూజియం వంటి ఆసక్తిని కలిగించే ఇతర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : అందాల తాజ్ ... అన్నీ చిత్రాలే !

చిత్ర కృప : jack wickes

బేలూర్ - హళేబీడ్

బేలూర్ - హళేబీడ్

బేలూర్, హళేబీడ్ ప్రదేశాలు ఒకదానికొకటి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఒకప్పుడు హొయసుల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశాల్లో ప్రదర్శించేవారు. పైన పేర్కొన్న రెండు ప్రదేశాలు హొయసుల నిర్మాణ ప్రతిభకు నిదర్శనాలు. తరచూ యాత్రికులు ఈ రెండు ప్రదేశాలను ఒకేసారి దర్శిస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి : బేలూరు - హాలిబెడు ఆలయాల మధ్య ప్రయాణం !

చిత్ర కృప : Prof. Mohamed Shareef

హంపి

హంపి

ఒకప్పటి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపి. ఈ పట్టణం తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. ఇది పురాతన ప్రదేశం ఎంత అంటే దీని గురించి రామాయణంలోనూ ప్రస్తావించబడింది. ఇక్కడే హనుమంతునికి మొదటిసారి రాముని దర్శనం లభించింది. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, వీరభద్ర ఆలయం, ఆంజనేయాద్రి ఆలయం వంటి ఇత్యాది ఆలయాలు ఉన్నాయి. యునెస్కో వారిచే గుర్తించబడ్డ ఈ ప్రదేశంలో చూడటానికి 500 కు పైగా స్థలాలు ఉన్నాయి. ఈ పట్టణ సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : హంపి - హోస్పేట్ వన్ డే రోడ్ ట్రిప్ జర్ని !

చిత్ర కృప : Brian Stocks

భోపాల్

భోపాల్

భోపాల్ మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. భోపాల్ లోను, చుట్టు పక్కల చూడటానికి ఆసక్తికరమైన పర్యాటక స్థలాలు వున్నాయి. నగర శివార్లలోని అందమైన విహార కేంద్రం కేవ్రా డ్యాం. ఒక కొండ శిఖరం మీద వుండడం వల్ల మనుభాన్ కీ టేక్రీ అనే విహార కేంద్ర నుంచి నగర దృశ్యం అందంగా కనిపిస్తుంది. సాయంత్రాలలోను, వారాంతాల లోను స్థానికులు విరివిగా సందర్శించే విహార స్థలాలు షాహపురా సరస్సు, గుఫా మందిర్, గోహర్ మహల్, షౌకత్ మహల్, పురానా కిలా, సాదర్ మంజిల్ లాంటివి వున్నాయి. ఈ నగర అందాలను చూడటానికి అనువైన సమయం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : మధ్య ప్రదేశ్ లోని ప్రధాన ఆకర్షణలు - సంక్షిప్తంగా !

చిత్ర కృప : Jean-Pierre Dalbéra

బండిపూర్

బండిపూర్

ఇండియాలోపులులు అధికంగా ఉండే ప్రదేశాల్లో బండిపూర్ ఆటవే ప్రాంతం ఒకటి. బెంగళూరు నుండి 220 కి.మీ. దూరంలో, మైసూర్ కు 800 కి.మీ. దూరంలో ఉన్న బండిపూర్ లో సుమారు 70 జాతుల వన్య జంతువులు సంచరిస్తుంటాయి. కాబిని నది ఒడ్డున ఈ ప్రాంతంలో పులులు, చిరుతలు, జింకలు, ఏనుగులు, దుప్పిలు, ఖడ్గ మృగాలు, అడవి నక్కలు ఇలా ఎన్నో జంతువులను, పక్షులను చూడవచ్చు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి మాసం.

ఇది కూడా చదవండి : అరణ్యాలలో సాహస పర్యటన యాత్ర !

చిత్ర కృప : Navaneeth KN

కేవల్ దేవ్ నేషనల్ పార్క్

కేవల్ దేవ్ నేషనల్ పార్క్

కేవల్ దేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్ లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ పార్కుని ఇంతకు మునుపు భరత్పూర్ మహారాజులు బాతు వేటకు ఉపయోగించేవారు. తరువాత ఇది పక్షుల అభయారణ్యంగా, యునెస్కో చేత ప్రపంచ సంప్రదాయ స్థలంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం, ఈ పార్క్ లో తాబేళ్లు, చేపలు, ఉభయచరాలూ ఉన్నాయి. వర్షాకాలంలో పక్షులతో పాటు ఇక్కడ నల్ల దుప్పులు, కొండచిలువలు, సామ్బార్లు, మచ్చల జింకలు, నీల్గాయి లు వంటి జంతు జాతులను కూడా చూడవచ్చు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి మాసం

చిత్ర కృప : Marc Tarlock

మానస్ నేషనల్ పార్క్

మానస్ నేషనల్ పార్క్

అస్సాం రాష్ట్రంలో యునెస్కో వారిచే హేరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన మానస్ నేషనల్ పార్క్ గౌహతి లో ఉన్నది. ఈ నేషనల్ పార్క్ లో మూడు విభాగాలు ఉన్నాయి. అవి వరుసగా టైగర్ రిజర్వ్, బయొస్పియర్ రిజర్వ్ మరియు ఎలిఫెంటా రిజర్వ్ లు. హిమాలయా పాదాల చెంత ఉన్న ఈ పార్క్ భూటాన్ దేశం వరకు వ్యాపించి ఉన్నది. ఇక్కడ వివిధ రకాల జంతువులను, పక్షులను మరియు ఉభయచరాలను చూడవచ్చు. ఈ ప్రదేశ సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప :Sougata Sinha Roy

రనతంబోర్ నేషనల్ పార్క్

రనతంబోర్ నేషనల్ పార్క్

రనతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన టైగర్ రిజర్వ్ పార్క్ లలో ఇది ఒకటి. ఈ నేషనల్ పార్క్ లో పులులు, చిరుతలు, అడవి నక్కలు, దుప్పి లు వంటి జంతువులనే కాక పక్షులను చూడవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఈ నేషనల్ పార్క్ సందర్శనకు ఉత్తమమైన సమయం ఫిబ్రవరి మాసం.

చిత్ర కృప : Björn Ognibeni

సుందర్బన్స్

సుందర్బన్స్

సుందర్బన్స్ రెండు దేశాల మధ్యన (భారత్ - బంగ్లాదేశ్) ఉన్న అతి పెద్ద మడ అడవుల రిజర్వ్. ఈ రిజర్వ్ అంతరించిపోతున్న భారతీయ పులులకు నివాసం. ఫోటోగ్రాఫర్ లకు ఈ ప్రదేశం స్వర్గ ధామం. సుందర్బన్స్ కుటుంబాలకు, జంట లకు గొప్పగా ఉంటుంది. బోట్ షికారు కూడా ఇక్కడ ఆసక్తికరంగా ఉంటుంది. సందర్శనకు అనువైన స్థలం ఫిబ్రవరి.

ఇది కూడా చదవండి : సుందర్బన్ అరణ్యం - అద్భుత దృశ్యాలు !

చిత్ర కృప : Sayamindu Dasgupta

దేవ్ బాగ్ బీచ్

దేవ్ బాగ్ బీచ్

దేవ్ బాగ్ బీచ్ కార్వార్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది కార్వార్ బీచ్ కు 4 కి.మీ. ల దూరంలో ఉంటుంది. హానీమూన్ జంటలకు స్వర్గంలా ఉంటుంది. నీటి క్రీడలు కూడా అనేకం ఆడవచ్చు. స్కూబా డైవింగ్, పారాసైలింగ్, బనానా బోట్ రైడ్, బోట్ క్రూయిస్, స్నోర్ కెల్లింగ్ ప్రధాన ఆటలుగా ఉంటాయి. పర్యాటకులు బోట్ లేదా ట్రాలర్ లో ప్రయాణించి ఇక్కడి ద్వీపాలు చూడవచ్చు. సమీప కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Abhijeet Rane

దిఘ

దిఘ

దిఘ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జంట బీచ్ లకి ప్రసిద్ధి చెందిన విహార స్థలం. సాధారణంగా బీచ్ ల ను సందర్శించడానికి ఉదయం లేదా సాయంత్రం వెళ్ళి సేదతీరుతాం ... కానీ ఈ బీచ్ వద్ద మధ్యాహ్నం పూట ప్రజలు అధికంగా వస్తారు. ఇక్కడ చూడవలసిన బీచ్ లు శంకరాపూర్, ఉదయ్ పూర్ బీచ్ లు. ఈ ప్రదేశాన్ని చూడటానికి అనువైన సమయం ఫిబ్రవరి.

చిత్ర కృప : Subharnab Majumdar

ముదుర్ జంజీరా

ముదుర్ జంజీరా

ముదుర్ జంజీరా మహారాష్ట్ర రాష్ట్రంలోని కోస్తా గ్రామం మరియు ఓడరేవు. ఇక్కడ జంజీరా కోట ప్రధాన ఆకర్షణ. అలాగే దత్తాత్రేయ దేవాలయం, గారమ్బి డామ్ లు ఇతర ఆకర్షణ లుగా ఉన్నాయి. సందర్శనకు అనువైన సమయం ఫిబ్రవరి. ఆ సమయంలో ఓడరేవులో చేపలను అధికంగా పట్టుకోవచ్చు, కాల్చుకొని కూడా తినవచ్చు.

చిత్ర కృప : Ishan Manjrekar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X