Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటకలోని ఈ అడవుల్లో విహరించారా?

కర్నాటకలోని ఈ అడవుల్లో విహరించారా?

కర్నాటకలోని వన్యప్రాణీ సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన వివరాలతో కూడిన కథనం.

వీకెండ్ వచ్చేస్తోంది. రణగొణ ట్రాఫీక్ జంఝాటాలను తప్పించుకొంటూ ఆఫీసుకు వెళ్లడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. అదే విధంగా ఆఫీసులో ఇచ్చే టార్గెట్లను అచీవ్ కావడం కోసం సీటుకు అతుక్కుపోయి పనిచేయడం మనకందరికీ తెలిసిందే. అయితే వీకెండ్ మాత్రం చాలా ఎంజాయ్ చేయాలని అనుకొంటూ ఉంటారు. అటువంటి వారు ప్రకతిలో మమేకం కావడానికి ఇష్టపడితే మీ కోసం ఈ కథనం.

బన్నేరుగట్ట నేషనల్ పార్క్...

బన్నేరుగట్ట నేషనల్ పార్క్...

P.C: You Tube

బెంగళూరు నుంచి కేవలం 22 కిలోమీటర్ల దూరంలోనే ఈ బన్నేరుగట్ట నేషనల్ పార్క్ ఉంది. మొత్తం 65, 127 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం అనేక అందాలకు నెలవు. కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ నేషనల్ పార్క్ ను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రసిద్ధ చంపాకదామ కొండల లోయలోని అడవుల మధ్యలో బన్నెర్గట్ట నేషనల్ పార్క్ ఉంది.

పార్వతికి పరమేశ్వరుడు సృష్టి రహస్యం చెప్పింది ఈ పుణ్యక్షేత్రంలోనే...పార్వతికి పరమేశ్వరుడు సృష్టి రహస్యం చెప్పింది ఈ పుణ్యక్షేత్రంలోనే...

సీతాకోక చిలుక ఉద్యానవనం

సీతాకోక చిలుక ఉద్యానవనం

P.C: You Tube

దేశంలోనే ఏకైక సీతాకోక చిలుక ఉద్యానవనవాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి గంటన్నరకు ఒకసారి సఫారీ ప్రారంభమవుతుంది. దాదాపు 101 జాతుల పక్షులకు నిలయమైన ఈ నేషనల్ పార్క్ ఏనుగుల సంరక్షణ కేంద్రం కూడా.

మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం:

మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం:

P.C: You Tube

ఉడిపి జిల్లాలోని కొల్లూరుకు దగ్గర్లో మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యం శరావతి వన్యప్రాణుల అభయారణ్యంతో సరిహద్దులను పంచుకొంటుంది. మంగళూరు నుంచి 125 కిలోమీటర్ల దూంరలో ఉన్న ఈ అభయారణ్యాన్ని చేరుకోవడానికి రవాణా సౌకర్యం బాగుంటుంది.

సఫారీ

సఫారీ

P.C: You Tube

సింహపు తోకను పోలిన తోకలను కలిగిన కొండముచ్చు జాతికి చెందిన ప్రాణులు కర్ణాటకలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. సఫారీ సమయం ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ, మరలా సాయంత్రం 3.30 నుంచి 6 గంటల వరకూ. కర్ణాటకలోని అనేక జాతీయ ఉద్యానవనాలు మరియు వ్యన్యప్రాణుల అభయారణ్యాల్లో మూకాంబిక వన్యప్రాణుల అభయారణం దాని సంపన్న వృక్ష మరియు జంతుజాలం కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది

దండేలి అభయారణ్యం

దండేలి అభయారణ్యం

P.C: You Tube

ఈ అభయారణ్యం ఎన్నో రంగుల రంగుల పక్షులతోపాటు, మచ్చల మరియు ఎలుక జింక, స్లాత్ ఎలుగుబంటి, చిరుతపులి, పులి, గౌర్, ఏనుగు, అడవి కుక్క, అడవి పిల్లి, బైసన్, జాకాల్, లంగూర్ మరియు ఎగిరే ఉడుతలకు సురక్షితమైన ఆశ్రయం. ఇక్కడ కేవలం సఫారీనే కాకుండా ర్యాఫ్టింగ్ వంటి సాహస జల క్రీడలకు కూడా అవకాశం ఉంది.

గుహాలయం కూడా

గుహాలయం కూడా

P.C: You Tube

ఈ అభయారణ్యానికి దగ్గరగా అతి ప్రాచీనమైన కవాల గుహలు కూడా ఉన్నాయి. ఇందులోని శివుడిని దర్శించుకోవాలంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరం నడక తప్పదు. ప్రక`తి సోయగాన్ని చూస్తూ అడుగులు వేయడం ప్రక`తి ప్రేమికులకు పెద్దగా అలసట అనిపించదు.

కావేరి వన్యప్రాణుల అభయారణ్యం

కావేరి వన్యప్రాణుల అభయారణ్యం

P.C: You Tube

కావేరి వన్యప్రాణుల అభయారణ్యం బర్డ్ వాచర్స ను విశేషంగా ఆకర్షిస్తుంది. బెంగళూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంటుంది. ఈ అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 1,02,753 హెక్టార్లు.

భద్ర వణ్య ప్రాణి సంరక్షణ కేంద్రం:

భద్ర వణ్య ప్రాణి సంరక్షణ కేంద్రం:

P.C: You Tube

కర్నాటకలోని భద్ర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చిక్కమగళూరుకు దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పులుల సంరక్షణ కేంద్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఆకర్షిస్తోంది. ఇక్కడ అనేక రకాలైన వ`క్ష, జంతువులను మనం చూడవచ్చు.

సముద్ర మట్టానికి 1,875 అడుగులు

సముద్ర మట్టానికి 1,875 అడుగులు

P.C: You Tube

సముద్ర మట్టానికి ఈ అభయారణ్యం 1,875 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ అభయారణ్యంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం హెబ్బేగిరి. భారత దేశంలో మొదటి పులుల సంరక్షణ కేంద్రం ఇదే కావడం గమనార్హం.

సఫారీ

సఫారీ

P.C: You Tube

ఈ భద్ర వన్యప్రాణీ సంరక్షణ కేంద్రంలో రోజుకు రెండు సార్లు జంగిల్ సవారీ అందుబాటులో ఉంటుంది. ఉదయం 6.30 గంటలకు మరోసారి సాయంత్రం 4 గంటలకు ఈ సఫారీ మొదలవుతుంది. సఫారీ సమయం దాదాపు 2 నుంచి 2.30 గంటల పాటు సాగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X