Search
  • Follow NativePlanet
Share
» »పరమ రహస్యం - శ్రీ శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వరాలయం !

పరమ రహస్యం - శ్రీ శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వరాలయం !

By Mohammad

భారతదేశ చరిత్ర ప్రాచీనమైనది మరియు మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ప్రాంతాలలో జరిపిన పురావస్తు తవ్వకాలు. అలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో కలవు. ఎంటా ప్రదేశం ? అసలు ఏముంది అక్కడ ? తెలుసుకోవాలంటే .... దీని గురించి చెప్పాల్సిందే ..!

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో 'పానగల్లు' అనే గ్రామం కలదు. అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో మరెక్కడా కనిపించని విశేషం ఉన్నది. అదేమిటంటే గర్భాలయంలోని శివలింగాన్ని నీడ(ఛాయ) కప్పేయడం. ఒకనాటి కాకతీయ సామాంతులైన కందూరు చోళులు క్రీ.శ. 10, 11 వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి ఆధారాల వల్ల తెలిసింది. వీరికి రాజధాని కూడా ఇప్పుడున్న పానగల్లు గ్రామమే .. !

ఇది కూడా చదవండి : నల్గొండ పట్టణానికి 65 కి. మీ. దూరంలో ఉన్న నాగార్జునసాగర్ నుండి శ్రీశైలానికి బోట్ ప్రయాణం !

ఈ సామాంతులు అప్పట్లోనే అనేక ఆలయాలను అత్యద్భుతంగా నిర్మించారు. అందులో ఇదొకటి. మిగితావి ఇంకా వెలుగులోకి రాలేదు. స్టేట్ పురావస్తు శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా వెలికితీత పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇది ఫలిస్తే .. తెలంగాణ చరిత్ర గురించి కొంతమేర అవగాహన రావచ్చు.

ఛాయా సోమేశ్వర ఆలయం

ఛాయా సోమేశ్వర ఆలయం

ప్రత్యేకత

ఛాయా సోమేశ్వర ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న చిన్న మండపాలు .... వీటి చుట్టూ మూడు గర్భగుడులు ఉన్న దేవాలయం ఉంటుంది. దీనినే 'త్రికూటాలయం' అంటారు.

చిత్ర కృప : Adityamadhav83

ఛాయా సోమేశ్వర ఆలయం

ఛాయా సోమేశ్వర ఆలయం

వింత

గర్భాలయంలో శివలింగం నడుం లోతు నీళ్ళల్లో ఉంటుంది. ఈ నీళ్ళు అన్ని కాలాల్లో అదే లోతులో ఉండటం ఓ విచిత్రం. ఈ నీళ్ళల్లో మునిగిన శివలింగం పై స్తంభాకారం లో నీడ సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మారకుండా అదే స్థితిలో నిశ్చలంగా పడుతుంది. ఇది వింత కాకపోతే మరేది ..! ఆలయానికి దగ్గర్లోని చెరువులో నీరు ఉంటే, గర్భాలయంలో కూడా నీరు ఉబికి రావటం వింతలో వింత కాకపోతే ..!

చిత్ర కృప : Shankar Nag

ఛాయా సోమేశ్వర ఆలయం

ఛాయా సోమేశ్వర ఆలయం

మరో వింత

ఇంకో వింత కూడా ఉందిక్కడ అదేమిటంటే సింహ ద్వారానికి ఎదురుగా గర్భాలయ ద్వారంలో నిలబడితే, మన నీడ మూడు ఛాయల్లో, అయిదు ఛాయల్లో ఎదుటి గోడ మీద పడుతుందట. అప్పట్లోనే ఇంతటి సూక్ష్మ కాంతి రహస్య జ్ఞానాన్ని తెలిసిన ఆ జక్కన్న శిల్పి ఎవరో గాని అతనికి, అతని శిల్ప చాతుర్యానికి ముక్కోటి దందాలండీ ..!

చిత్ర కృప : Cormac Lawler

పచ్చల సోమేశ్వరాలయం

పచ్చల సోమేశ్వరాలయం

పానగల్లు లో చూడవలసిన మరో ఆలయం పచ్చల సోమేశ్వరాలయం. ఇది నల్లరాతి స్తంభాల నిర్మాణం. ఆ స్తంభాల్లో మన ప్రతిబింబాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే నా అర్థం ఆ 70 స్తంభాలను అంత అందంగా మలిచారని ..! పచ్చల హారం స్వామి వారికి నిరంతరం ధరింపజేయటం వల్ల ' 'పచ్చల' సోమేశ్వరాలయం అన్న పేరొచ్చిందని భక్తుల భావన.

చిత్ర కృప : run jeeth

పురావస్తు మ్యూజియం

పురావస్తు మ్యూజియం

పచ్చల సోమేశ్వర ఆలయం వెనక భాగంలో పురావస్తు మ్యూజియం ఒకటుంది. అందులో ఆది మానవులు ఉపయోగించిన వంట పాత్రలు, పనిమూట్లు, ఆయుధాలు ఇంకా ఇతరత్ర ప్రదర్శనకై ఉంచారు. అలాగే క్రీ.శ. 1 - 18 వ శతాబ్ధం వరకు శిలాశాశనాలు, ఆయుధాలు, విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. ప్రతి సోమవారం సెలవు. మిగితా రోజుల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 4 : 30 వరకు తెరిచే ఉంటుంది.

చిత్ర కృప : R. Clark

నల్గొండ ఎలా చేరుకోవాలి ?

నల్గొండ ఎలా చేరుకోవాలి ?

నల్గొండ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన నార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

నల్గొండ కు సమీపాన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (117 కి.మీ దూరంలో) కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి నల్గొండ చేరుకోవచ్చు.

రైలు మార్గం

నల్గొండ లో రైల్వే స్టేషన్ ఉన్నది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ స్టేషన్ మీదుగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. హైదరాబాద్, గుంటూరు రైల్వే మార్గం లో ఉన్న ఈ స్టేషన్ కు హైదరాబాద్ నుండి రోజూ ఒక ప్యాసింజర్ రైలు వెళుతుంటుంది.

రోడ్డు / బస్సు మార్గం

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, మహబూబ్ నగర్, ఖమ్మం నగరాల నుండి నిత్యం నల్గొండకు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Rajesh Pamnani

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X