Search
  • Follow NativePlanet
Share
» »ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా?

ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల మధ్యలో వున్న అలకనందా నదీ తీరంలో పూజలందుకుంటున్న ధారీదేవి అత్యంత శక్తివంతురాలని చెబుతారు. ఈమెకు ధారామాత అని ఇంకొక పేరుకూడా వుంది.

By Venkatakarunasri

మహాబలిపురం ఆలయంలో వుండేది ఎలియెన్స్ కి సంబంధించిన బండేనా ?మహాబలిపురం ఆలయంలో వుండేది ఎలియెన్స్ కి సంబంధించిన బండేనా ?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల మధ్యలో వున్న అలకనందా నదీ తీరంలో పూజలందుకుంటున్న ధారీదేవి అత్యంత శక్తివంతురాలని చెబుతారు. ఈమెకు ధారామాత అని ఇంకొక పేరుకూడా వుంది. ధారీదేవి ఆలయం పైన కప్పు వుండదు. అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచటమే ధారీదేవికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆ ప్రాంతానికి చెందిన హైందవులు భావిస్తూవుంటారు. ఈ ఆలయానికి అవతలగట్టున ధారీ అనే గ్రామమున్నది. ఈ ఆలయాన్ని మరియు ఆ గ్రామాన్ని కలుపుతూ అలకనందా పైన వూగే బ్రిడ్జ్ వుంది.

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన - మరువలేని అనుభూతి!

శ్రీనగర్, బదరీనాథ్,రహదారి మార్గంలో తగిలే కల్యాసర్ అనే ప్రాంతంలో ఈ ధారీదేవి ఆలయం వున్నది. ఈ ఆలయం ఢిల్లీ నుండి 360 కి.మీ ల దూరంలోను రుద్రప్రయాగ్ నుండి 20కి.మీ ల దూరంలోను వుంది. ఈమె తనని పూజించిన వారిని ఎంత అభిమానంతో కాపాడుతుందో,అదే విధంగా తనను ధిక్కరించిన వారిని అంత భయంకరంగా శిక్షిస్తుంది. ఈ దేవత యొక్క అద్భుత శక్తిని సూచించే ఒక సంఘటన 2013 వ సంవత్సరంలో జూన్ నెల 16వ తేదీన జరిగింది.

పై కప్పులేని ఆలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

టాప్ 3 ఆర్టికల్స్ కోసం క్రింద చూడండి

ధారీదేవి ఆలయం

ధారీదేవి ఆలయం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రవహిస్తున్న అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ఒక ధారీదేవి ఆలయం వున్నది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూవుంటుందని ఈ ప్రాంతంలోని ప్రజలు చెప్పుకుంటూ వుంటారు.

pc: youtube

అలకనందా నది

అలకనందా నది

ఈ దేవీ యొక్క ప్రభావం కారణంగానే అలకనందా నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. ధారీదేవి ఆలయం దాదాపు 8 దశాబ్దాల నుండి వున్నట్లుగా చాలామంది భావిస్తున్నారు.

pc: youtube

సిద్ధపీఠము

సిద్ధపీఠము

నిజానికి ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో వుందని మహాభారతంలో ఇవ్వబడ్డ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ ఆలయం వున్న ప్రదేశాన్ని సిద్ధపీఠము అంది భాగవతంలో చెప్పటం జరిగింది.

pc: youtube

108శక్తిపీఠాలు

108శక్తిపీఠాలు

ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమైన ధారీదేవి వెలసిందని ఆ కారణం వలన ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడినది. అమ్మవారికి చెందిన 108శక్తిపీఠాలలో ధారీదేవి ఆలయం ఒకటి అని శ్రీ మత్ దేవీ భాగవతంలో చెప్పబడినది.

pc: youtube

ఉగ్ర అంశం

ఉగ్ర అంశం

ఈ ధారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్రఅంశం అని చెబుతారు. ఈ శక్తిని భక్తితో కొలిచినవారికి ఎంత మేలు జరుగుతుందో ఈ శక్తిని ధిక్కరించిన వారికి అంత కీడు జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించటం జరుగుతున్నది.

pc: youtube

కేదారనాథ్ ప్రాంతం

కేదారనాథ్ ప్రాంతం

క్రీ.శ 1882లో ఇస్లాం రాజు ఈ ప్రాంతాన్ని పడగొట్టి ఇక్కడ ఒక మసీదు నిర్మించాలని ప్రయత్నం చేసాడు. ఇస్లాం రాజు చేసిన అపచారం కారణంగా ఆ సమయంలో కొండలు పెళ్లలుపెళ్లలుగా విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టం అయిపోయింది. ఆ ప్రకృతి విపత్తు వందలాదిమందిని బలితీసుకుంది.

pc: youtube

బలమైన విశ్వాసం

బలమైన విశ్వాసం

ఈ దేవి యొక్క మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు భయంతో తోక ముడిచాడు. అప్పటినుండి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి యొక్క ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.

pc: youtube

గర్భగుడి

గర్భగుడి

ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో ప్రవహిస్తున్న అలకనందా నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం వుంది. ఈ ఆలయ గర్భగుడిలో ధారీదేవి యొక్క పై సగభాగం మాత్రమే వుంటుంది.

pc: youtube

 ప్రత్యేకత

ప్రత్యేకత

ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మాత రూపం ఉదయం పూట బాలికగాను, మధ్యాహ్నం పూట మధ్య వయసు స్త్రీగాను, సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూ వుంటుంది. ఈ ధారీదేవి యొక్క విగ్రహం క్రింది భాగం కాళీమఠ్ లో వున్నది.

PC: Aloak1

శ్రీనగర్

శ్రీనగర్

ఈ మఠంలోని అమ్మవారు కాళీమాతగా పిలవబడుచున్నది. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ధారీదేవి విగ్రహాన్ని అక్కడినుంచి తొలగించి అక్కడికి కొంచెం ఎత్తుగా వున్న ప్రదేశంలో ఒక చోట ఆ విగ్రహాన్ని వుంచటం జరిగింది.

pc: youtube

ధారీదేవి

ధారీదేవి

విద్యుత్ తయారీ కోసం ఈ డ్యాం నిర్మాణం ఉద్దేశించబడింది. 330 MW విద్యుత్ ఉత్పత్తిని చేయగల ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించటం కోసం ఉత్తరఖండ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో వున్న ధారీదేవి పురాతన ఆలయాన్ని పడగొట్టడానికి ఏ మాత్రము వెనకాడలేదు.

pc: youtube

భక్తులు విశ్వాసం

భక్తులు విశ్వాసం

అలకనంద నది మీద డ్యాం నిర్మించటం కోసం ధారీదేవి ఆలయం పడగొట్టడం జరిగింది. ప్రభుత్వం చేసిన పొరపాటుకు వేలాదిమంది భక్తులు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అది ఎలాగంటే ఛార్ ధాం యాత్రలకు వెళ్ళే భక్తులని ధారీదేవి రక్షిస్తూ వుంటుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

pc: youtube

ఉత్తరఖాండ్ ప్రభుత్వం

ఉత్తరఖాండ్ ప్రభుత్వం

ఇలాంటి శక్తివంతురాలైన ధారీదేవి యొక్క ఆలయాన్ని ఉత్తరఖాండ్ ప్రభుత్వం పడగొట్టింది. ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు వెయ్యటానికి ఆటంకంగా వుందని అనే సాకుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2013వ సంవత్సరం జూన్ 16 సాయంత్రం 6 గంటలకు ఆ ఆలయాన్ని కొంతమంది కూలీల చేత పడగొట్టించింది.

pc: youtube

మహావర్షం

మహావర్షం

ఆ తరవాత ధారీదేవీ విగ్రహాన్ని అక్కడినుండి తొలగించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలలోపే అనగా మరుసటిరోజే కేదారనాథ్ ప్రాంతంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకుని ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని కుంభవృష్టి ప్రారంభమైంది. ఆ తర్వాత 2 గంల పాటు ఆ మహావర్షం కొనసాగింది.

pc: youtube

భయంకర రూపం

భయంకర రూపం

ఫలితంగా అలకనంద భయంకర రూపం దాల్చి ప్రవహించింది. ఫలితంగా చాలా ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి. ఛార్ ధాం యాత్రకు వెళ్ళిన వేలాదిమంది భక్తులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతాన్ని ఆనుకొనివున్న కొండలు పెళ్ళుపెళ్ళులుగా విరిగి కిందపడ్డాయి.

కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !

pc: youtube

ఉత్సాహపరులు

ఉత్సాహపరులు

వరదల్లో చిక్కుకున్న భక్తులను బయటకు తీయటం చాలా కష్టమైపోయింది. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురవటానికి కారణం ఏమిటి? చాలా మంది ఉత్సాహపరులు ఈ ఆసస్మిక జలప్రళయం వెనక వున్న కారణాన్ని తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించారు.

అందమైన పూవుల లోకం ... వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ !

pc: youtube

జ్యోతిష్యశాస్త్రం ఈ వరదల గురించి ఏం చెప్పింది ?

జ్యోతిష్యశాస్త్రం ఈ వరదల గురించి ఏం చెప్పింది ?

ధారీదేవి ఆలయం మరియు కాళీ మఠ్ ఆలయాలలో ఒకే దేవీ యొక్క రెండు భాగాలు పూజలందుకుంటున్నాయి. కాళీదేవీ ఈశాన్యంలో తన కాళ్ళను వుంచి,ఆగ్నేయంలో తన శిరస్సును వుంచింది అనటానికి నిదర్శనంగా ఈ రెండు ఆలయాలు ఒకదానికొకటి ఎదురుగా రెండు మూలాలలో వున్నాయి.ఇలా వున్న కారణంగా ఈశాన్యదిక్కులో ప్రవహించే గురువు ప్రవాహం శక్తి యొక్క కారణంగా ఈశాన్య దిక్కులో వున్న అమ్మవారి యొక్క శిరస్సు శాంతంగా వుంచబడుతున్నది.

pc: youtube

ఆదిశంకరాచార్యులు

ఆదిశంకరాచార్యులు

నిజానికి కాళీపీఠంలో అమ్మవారి మిగిలిన శరీర భాగం వుండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రం పూజించబడుతున్నది.ఈ స్త్రీ యంత్రాన్ని అమ్మవారి యోనికి ప్రతిరూపంగా ఆదిశంకరాచార్యులు స్థాపించారని తెలుస్తుంది. కాళీపీఠంకి సరిగ్గా ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం వుంది.

చార్ ధాం యాత్రలు ... చెప్పలేని ఆనందాలు !

pc: youtube

జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్య శాస్త్రం

ఈ ఉత్తరదిక్కుకి అధిపతిగా బుధుడు వుంటాడు. బుధుడు అహింసను ప్రభోదిస్తూవుంటాడు.ఫలితంగా ఉత్తరదిక్కు నుండి వచ్చే శాంతిప్రభావం వల్ల ఆగ్నేయ దిక్కులో వుండే కాళీ శాంతిస్తూ వుంటుంది. యుద్ధానికి, ఆగ్రహానికి, ఆందోళనకి కారకుడైన కుజుడుకి చెందినదని జ్యోతిష్య శాస్త్రం ఉద్ఘాటిస్తుంది.

ఉత్తరకాశిలో వినాయకుడు జన్మించిన పుణ్య స్థలం !

pc: youtube

కాళీమాత శిరస్సు

కాళీమాత శిరస్సు

కాళీ మాత శిరస్సు ఆగ్నేయ దిక్కులో వున్న కారణంగా ఆమె కూడా ఆగ్నేయ స్వభావంలో వుంటుందని చెబుతారు. విద్యుత్ ఉత్పాదనకు అడ్డంగా వున్న ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలిగించి ఆ విగ్రహాన్ని అక్కడికి పై ప్రదేశంలో వున్న ఒక పీఠం మీద ప్రతిష్టించినప్పుడు కాళీ మఠ క్షేత్రవిగ్రహానికి మరియు ధారీదేవి విగ్రహానికి మధ్య వున్న దిక్కులకు సంబంధం మారిపోయింది. ఫలితంగా ధారీదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించింది.

pc: youtube

 ధారీదేవి ఆలయం

ధారీదేవి ఆలయం

సరిగ్గా ఆ మర్నాడే మానవుడి ఊహకు అతీతంగా కుంభవృష్టి కురిసి ఆ పై ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్ ని ముంచెత్తాయి.ఈ వరదల కారణంగా దాదాపు 5000మంది మానవులు అకారమరణం పొందారు. ధారీదేవి ఆలయాన్ని పడగొట్టిన కొద్ది గంటలలోపే ఆ ప్రాంతంలో కుంభవృష్టి ప్రారంభమైంది.

pc: youtube

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్

ఇటు గుడిని పడగొట్టడానికి అటు కుంభవృష్టి కారణంగా అలకనంద వరదకు గురిఅవటం కేవలం కాకతాళీయం అని భావించటం బుద్ధిహీనత అని ఉత్తరాఖండ్ కి చెందిన కృష్ణాజీ అనే ఒక సాధువు పేర్కొన్నారు.

ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ లు !!

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X