Search
  • Follow NativePlanet
Share
» »అట్టహాస పెళ్లిళ్లకు అనువైన పాలస్ లు !

అట్టహాస పెళ్లిళ్లకు అనువైన పాలస్ లు !

కలలు కనే పెళ్లి. పెళ్లి అనగానే ఎంతో వైభవంగా, అట్టహాసంగా చేయాలని అందరూ భావిస్తారు. అందులోనూ ధనవంతులు తమ ఇండ్లలో పెళ్ళిళ్ళను కనీ వినీ ఎరుగని రీతిలో చేయాలని, వి.ఐ.పి లు అందరూ రావాలని పెండ్లి చేసే ప్రదేశం అందరికీ అందుబాటులో వుండాలని ఎంతో ఖర్చు చేస్తారు. వారి స్థాయిని చాటుకుంటారు. కొంతమంది దేశ వ్యాప్తంగా ఆహ్వానించే వారి సౌకర్యం కొరకు, ఇండియా లో గల కొన్ని అతి వైభవ పాలస్ లను కూడా ఎంపిక చేస్తారు. వాటిలో రాజస్థాన్ రాష్ట్రం లోని కొన్ని పాలస్ లు అటువంటి వారు కోరుకునే అట్టహాసం ప్రదర్శనకు అద్దం పడతాయి. మరి ఆ ప్రదేశాల పట్ల కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

తాజ్ లేక్ పాలస్, ఉదయపూర్
ఇది ఒక బ్రహ్మాండమైన హోటల్. ఒక సరస్సు మధ్య అందంగా నిర్మించారు. తాజ్ లేక్ పాలస్ ఒక కళల సౌధం. పెండ్లి అట్టహాసాలకు అద్దం పడుతుంది. ఈ హోటల్ లోని లిల్లీ కొలను లిల్లీ పూవులతో అలంకరించబడి, కొలను అంతా కొవ్వొత్తి దీపాలతో వెలిగిపోతూ వుంటుంది. పెండ్లికి వచ్చిన వారు అందరూ ఇది కలుసుకునే ప్రదేశం. ఆశించిన దాని కంటే, అధిక అతిధులు వస్తారనుకుంటే, ఈ హోటల్ లోనే మరొక ప్రదేశం మేవార్ టెర్రస్ కలదు. ఈ రకమైన రాజ వైభోగ వెడ్డింగ్ లకు ఈ ప్రదేశం మరపు రానిది.

జై మహల్ పాలస్, జైపూర్
వివాహం ఘనంగా చేయాలనుకునే వారికి ఖ్యాతి పొందిన వివాహ మంటపం జయ మహల్ పాలస్. అద్భుతమైన ఈ రాజ భవనం వెనుక భాగంలో మొగల్ గార్డెన్స్ ఒక సహజ సౌందర్య చిత్రంగా కూడా వుంటాయి. రాజస్థాన్ ప్రజలు చాలామంది ఇక్కడే ఘనమైన వివాహాలు చేసి ఆనందిస్తారు.

ఉమేడ్ భవన్ పాలస్, జోద్ పూర్
అందమైన ఈ భవనం వివాహ సందర్భంలో కాంతులీనుతూ వైభవోపేతంగా వుంటుంది. సాంప్రదాయక నిర్మాణాలు, రంగు రంగుల దృశ్యాలతో ఇక్కడ నృత్యాలు చేసే వారు, ఏనుగులు కూడా లభ్యంగా వుంటాయి. ఈ హోటల్ లో కల మార్వార్ హాల్ గొప్ప గొప్ప పెళ్లిళ్లకు ఆతిధ్యం ఇచ్చింది. మార్వారీ, రాజస్థాని, ఇండియన్, లేదా కాంటినెంటల్ ఆహారాలు మీరు కోరుకున్న రీతిలో తయారు చేసి అందిస్తారు.

దేవి ఘర్, ఉదయపూర్
18 వ శతాబ్దానికి చెందిన ఈ అందమైన హోటల్ ఇండియా లోని అనేక ధనవంతుల ఇండ్ల వివాహాలకు ఆతిధ్య మిచ్చింది. ఈ పాలస్ లో సాయంత్రపు వివాహాలు ఎంతో వేడుకగా చేస్తారు. సాయంత్రపు వేళ ఈ భవన నేపధ్యంలోకల ఆరావళి పర్వత శ్రేణుల సహజ అందాలు, వచ్చిన అతిధులకు స్వాగామిస్తాయి. కొలను పక్కనే కల విందు భోజన ఏర్పాట్లు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఒకే సారి సుమారు 250 మంది అతిధులు కూర్చుని భోజనాలు చేయవచ్చు.

అట్టహాస పెళ్లిళ్లకు అనువైన పాలస్ లు !

ది లీలా పాలస్, ఉదయ పూర్
ది లీలా పాలస్, లో పెండ్లి కుమారుడికి, పెండ్లి కుమార్తె కు స్పా చికిత్సలు కూడా వుంటాయి. వారి శోభనం రాత్రికి ప్రత్యేక విలాసవంతమైన గదులు, సువాసనల స్నానపు గదులు కేటాయిస్తారు. భోజన పదార్ధాల రుచులు చూసేటందుకు, మెనూ ఆర్డర్ పెట్టేందుకు ముందుగా ఆరుగురు వ్యక్తుల పార్టీకి ఆహారాలు రుచి చూపుతారు. ప్రధాన పెండ్లి భోజనం నోటి రుచులు ఊరే రీతిలో వచ్చిన అతిధులకు ఎవరికీ ఏ రకం డిష్ కావాలో దానిని అందిస్తారు.

ఫతే ఘర్, ఉదయపూర్
ఈ హోటల్ లో పూర్తిగా సాంప్రదాయక వివాహాలు అట్టహాసంగా జరుగుతాయి. ఇక్కడ కల ఫర్నిచర్ లేదా, అలంకరణలు గత కాల రాజ భోగాలను గుర్తు చేస్తాయి. పెండ్లి దీపాల వెలుగులను విద్యుత్ లేని మూలకాలనుండి గ్రహించి, కాలుష్యంలేని వాతావరణం అందిస్తారు. పైన ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ రాజ వైభోగంతో మహారాజులా కూర్చుని, ప్రాచీన కాల రాజులు తిన్నట్లు, విందులు ఆరగించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X