» »ఇక్కడకు వెళ్లి వచ్చారంటే మీకు గుండె ధైర్యం ఎక్కువనే అర్థం

ఇక్కడకు వెళ్లి వచ్చారంటే మీకు గుండె ధైర్యం ఎక్కువనే అర్థం

Written By: Beldaru sajjendrakishore

భారత దేశం ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం. ఈ విశాల దేశంలో అటు సముద్ర తీర ప్రాంతంతో పాటు ఇటు ఇసుక ఎడారులు కూడా ఉన్నాయి. జలజల పారే నదులతో పాటు ఎతైన కొండలు కూడా ఉన్నాయి. ఇక మానవ నిర్మితమైన కోటలకు లెక్కలేదు. అదే విధంగా ప్రకతి సహజంగా ఏర్పడిన బీచ్ ల అందాలకు కూడా భారత దేశం నిలయమన్న సంగతి తెలిసిందే. నదీ లోయాలు, పచ్చటి అడవులు ఇలా వర్ణించుకుంటూ పోతే సమయం, స్థలం చాలదేమో.

అయితే ఇదే భారత దేశంలో అత్యంత ప్రమాద కరమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బస్తర్ అటవీ ప్రాంతం, సిజూ గుహలు, పంబన్ బ్రిడ్జ్, థార్ ఎడారి వంటివి ఈ కోవకే చెందుతాయి. కులధార గ్రామం, భాంగార్ కోటలు కూడా. వీటిలో కొన్ని చోట్ల ప్రకతి భయపెడుతూ ఉంటే మరికొన్ని చోట్ల తెలియని భయం పర్యాటకులను వెన్నాడుతుంది. అలాంటి ప్రాంతాల సమహారం ఈ కథనం

1.పుక్తల్ ఆశ్రమం

1.పుక్తల్ ఆశ్రమం

Image Source:


కొండశిఖరం పై తేనెపట్టు వలే నిర్మించిన ఈ ఆశ్రమం లడక్ ప్రాంతంలో ఉంది. ఇక్కడకు చేరుకునే మార్గాలు చాల పరిమితంగానే ఉంటాయి. ఈ ఆశ్రమానికి చేరుకునే దారిలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

2.బస్తర్

2.బస్తర్

Image source:

ఛత్తీస్ ఘడ్ లోని ఈ ప్రాంతం ప్రక`తి రమణీయతకు ఆలవాలం. జలపాతాలు, పచ్చని అడవులు మనలను రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. అయితే ఇది చాలా ఏళ్లుగా నక్సలైట్లకు నిలయంగా మారింది. ఇక్కడ సమాంతర ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోంది. ఇక్కడకు కొత్తవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వరు

3.ద్రాస్

3.ద్రాస్

Image Source:

నివాసయోగ్యమైన ప్రపంచంలో రెండో అతి శీతల నగరం ద్రాస్. జమ్ములో ఉన్న ఈ ప్రాంతాన్ని గేట్ వే టు లడక్ అని పిలుస్తారు. అయితే ఇది ప్రస్తుతం ఉగ్రవాదుల అడ్డాగా మారింది. నిత్యం కాల్పులతో ఈ ప్రాంతం మారిమోగుతుంటుంది.

4. థార్ ఎడారి

4. థార్ ఎడారి

Image Source:

ఒక వైపు ఇసుక తిన్నెల అందాలు రారమ్మని ఆహ్వానం పలుకుతుంటే మరోవైపు ఎప్పుడు వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటాయో తెలియని వైనం మనలను భయపెడుతూ ఉంటుంది. కొంత ఏమరుపాటు ఈ థార్ ఎడారిలో మన ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి.

5. మానస సరోవర యాత్ర

5. మానస సరోవర యాత్ర

Image Source:

సాక్షాత్తు ఆ పరమశివుడు నివశించే పర్వతంగా చెప్పుకొనే కైలాస శిఖర దర్శనంతో పాటు దాని పాదం వద్ద ఉన్న మానస సరోవర దర్శనాన్నే మానస సరోవర యాత్ర అంటారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఇక్కడకు వెళ్లడం కొంత ప్రాణాలతో చెలగాటమే. వాతావారణం ఎప్పుడు ఎలా మారుతోందో తెలియని పరిస్థితుల్లో ఒక రకంగా ఇది సాహసయాత్రగా చెబుతారు.

6. ఖర్థూంగ్లా

6. ఖర్థూంగ్లా

Image source:

ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం ఇదే. లడక్ నుంచి లేహ్ కు ఈ మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇది సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల ప్రాణవాయువు చాలా స్వల్పమొత్తంలో లభిస్తుంది. ఇక్కడ ప్రయాణం కొంత ప్రాణాలతో చెలగాటమే అని చెప్పాలి.

7. లుండింగ్ ఆఫ్లాంగ్ రైలు మార్గం

7. లుండింగ్ ఆఫ్లాంగ్ రైలు మార్గం

Image Source:

అస్సాంలోని లుండింగ్ ఆప్లాంగ్ రైలు మార్గం ద్వారా ప్రయాణించడం ప్రక`తి ఒడిలో పవలించడమే. అయితే ఇక్కడ ఉన్నటు వంటి అస్సాం తీవ్రవాద దళాలు ఎప్పుడు విరుచుకుపడుతాయో తెలియదు. ఇక్కడ పనిచేసేవారే కాక ఈ మార్గం ద్వారా ప్రయాణించే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంటారు.

8. పంబన్ బిడ్జి

8. పంబన్ బిడ్జి

Image Source:

తమిళనాడులోని రామేశ్వర ప్రాంతాన్ని భారత దేశ ప్రధాన భూ భాగంతో కలిపే రైలు మార్గమే పంబన్ బిడ్జి. ఓడల రాకపోకలను అనుగుణంగా ఈ బిడ్జ్ రెండుగా విడిపోతూ ఉంటుంది. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బిడ్జి ఎప్పుడు కూలి పోతుందో చెప్పడం కష్టమని చెబుతున్నారు.

9.సిజూ గుహలు

9.సిజూ గుహలు

Image Source:

మేఘాలయ రాష్ర్టంలో ఈ చీకటి గుహలు ఉన్నాయి. ఇక్కడ వెళ్లడానికి చాలా ధైర్యం ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ పురాతన హాంగింగ్ బ్రిడ్జ్ లు కూడా మనకు సవాలు విసరుతుంటాయి. చాలా దశాబ్దాల క్రితం కేవలం చెక్కలు, తాళ్లతో ఈ హాంగింగ్ బ్రిడ్జ్ లను నిర్మించారు.

10.చంబల్ లోయ

10.చంబల్ లోయ

Image Source:

మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయ అనేక ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు నిలయం. ముప్పై ఏళ్ల క్రింతం వలే కాకపోయినా ఇప్పటికీ ఇక్కడి వెళ్లి రావడం కొంత సాహసంతో కూడిన వ్యవహారమే.

11.హెమీస్ జాతీయ పార్క్

11.హెమీస్ జాతీయ పార్క్

Image Source:

లడక్ లోని పర్వత అటవీ ప్రాంతం. పర్వాతారోహణ చేయాలనుకునే వారికి మాత్రం ఇక్కడ కఠిన శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఎల్లప్పుడూ - 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక ఏ దిక్కు నుంచి ఎప్పుడు దాడి చేస్తయో తెలియని మంచు చిరుతలు కూడా మనలను ఇక్కడ భయపెడుతూ ఉంటాయి.

12. గురూజ్ లోయ

12. గురూజ్ లోయ

Image Source:

శ్రీనగర్ కు 120 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతం మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కు సరిహద్దులో ఉంటుంది. దీంతో ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా నే ఉంటాయి. దీని కంటే ముఖ్యంగా ఇక్కడ కొండల పై నుంచి మంచు పెళ్లలు ఎప్పడూ పడుతూనే ఉంటాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తుంటారు.

13. భాంగర్ కోట

13. భాంగర్ కోట

Image Source:

రాజస్థాన్ లోని భాంగర్ కోట ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచినది. దీనిని దెయ్యాల కోట అని కూడా అంటారు. ప్రేతాత్మలు నిత్యం సంచరిస్తుంటాయని నమ్ముతారు. దీంతో రాత్రిపూట ఇందులోకి ప్రవేశాన్ని నిషేదించారు

14. కులధార

14. కులధార

Image Source:

రాజస్థాన్ లోనే ఈ ప్రాంతం ఉంది. ఒకప్పుడు ఈ గ్రామం ప్రజలతో సందడిగా ఉండేది. అయితే ఏమయ్యిందో తెలియదు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయన్న కారణంతో ప్రజలంతా వలస వెళ్లి పోయారు. దీంతో పాడుపడిన మొండిగోడలు ఇక్కడ దర్శనమిస్తాయి. పగటి పూటా కూడా ఇక్కడకు ఎవరకూ వెళ్లరు.

15. డ్యూమాస్ బీచ్

15. డ్యూమాస్ బీచ్

Image Source:

ఈ బీచ్ గుజరాత్ లో ఉంది. ఇక్కడ ప్రక`తితో పాటు నల్లగా ఉన్న బీచ్ కూడా పర్యాటకులను భయపడుతూ ఉంటుంది. ఈ బీచ్ కు వచ్చిన వారిలో కొంతమంది అద`శ్యమైన ఘటనలు కూడా ఉన్నాయి. దీనికి దగ్గరగానే స్మశానం కూడా ఉంటుంది. దీంతో రాత్రి సమయంలో ఇక్కడ ఒక్కరు కూడా ఉండరు.