• Follow NativePlanet
Share
» »దక్షిణ భారతదేశపు ఖజురహో దేవాలయం

దక్షిణ భారతదేశపు ఖజురహో దేవాలయం

డిచ్ పల్లి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కలదు. నిజామాబాద్ పట్టణం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిచ్ పల్లిలో క్రీ.శ. 14 వ శతాబ్దంలో నిర్మించబడిన రామాలయం కలదు. దీనిని కాకతీయులు నిర్మించినట్లు చెబుతారు. ఒక గుట్టపై నెలకొని ఉన్న ఆలయం పైకి చేరుకోవటానికి మెట్లు చిన్నగా, ఎక్కటానికి వీలుగా ఉంటాయి.

నిజామాబాద్ లో పర్యాటక ఆకర్షణలు !!

డిచ్ పల్లి .. దీనినే 'దక్షిణ భారత దేశ ఖజురహో' అని అభివర్ణిస్తారు చరిత్రకారులు. డిచ్ పల్లి లో రామాలయం ఫేమస్. దీనినే 'ఇందూరు ఖజురహో' గా కూడా పిలుస్తారు. దేవాలయ శిల్ప సంపద అచ్చం ఖజురహో ను పోలి ఉంటుంది. ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి చూడటానికి చిన్నదే అయినప్పటికీ శిల్ప, వాస్తు కళలు అద్భుతంగా ఉంటాయి. ఆలయ గోడలు, పై కప్పు, ద్వారాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

దక్షిణభారతదేశపు ఖజురహో మీకు తెలుసా?

టాప్ ఆర్టికల్స్ కోసం కింద చూడండి

డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆలయం పై తురుష్కులు దాడి చేశారు. శిల్ప సంపద ను ధ్వంసం చేశారు. ఆలయం అసంపూర్తిగానే మిగిలింది. దాంతో ఈ గుడి కి రావాల్సిన ప్రాముఖ్యత రాలేదు.

pc: pullurinaveen

డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

క్రీ. శ. 19 వ శతాబ్దంలో ఓ భక్తుడు దేవాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించటానికి ముందుకొచ్చాడు. తురుష్కుల దండయాత్ర తరువాత అంత వరకు గుడిలో ఎటువంటి విగ్రహాలు ఉండేవి కావు.

pc:Nizamabad District

డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

నలుపు తెలుపు అగ్గి రాయితో నిర్మించిన ఈ ఆలయం పైభాగాన లతలు, తీగలు, శిల్ప సంపద ను గమనిస్తే ఆనాటి శిల్పుల పనితనానికి మెచ్చుకోక చెప్పవచ్చు.

pc:Naveen Dichpally

దక్షిణభారతదేశపు ఖజురహో

దక్షిణభారతదేశపు ఖజురహో

ఆలయం పైన శిల్పాలు హొయలొలుకుతూ ఖజురహో ను గుర్తుకుతెస్తాయి. దేవాలయంలోకి అడుగుపెట్టగానే భక్తుల మనసు ఆధ్యాత్మిక భావంతో పులకరిస్తుంది. ఆలయానికి దక్షిణాన కోనేరు, దాని మధ్య ఒక మండపం ఉన్నాయి.

pc:youtube

ఇందూరు ఖజురహో

ఇందూరు ఖజురహో

డిచ్ పల్లి రామాలయాన్నే "ఇందూరు ఖజురహో" అంటాం. అక్కడి అద్భుతమైన శిల్పసంపద ఖజురహోను పోలి వుంటుంది. కొండ మీద వుండటం వల్ల ఖిల్లా రామాలయం అని కూడా ఈ దేవాలయానికి పేరు.

pc:Nizamabad District

కూర్మాకార దేవాలయం

కూర్మాకార దేవాలయం

14 వ శతాబ్దంలో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయ నిర్మాణాలలో శ్రేష్టమైన కూర్మాకార దేవాలయం ఈ డిచ్ పల్లి రామాలయం.

pc: TS Tourism

తురుష్కుల దండయాత్ర

తురుష్కుల దండయాత్ర

అయితే యే కారణం చేతనో ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. తురుష్కులు ఆ ఆలయం పై దాడి చేసి దాన్ని శిల్పాలను ధ్వంసం చేశారు. అందువల్లే ఈ దేవాలయానికి రావాల్సినంత ప్రాముఖ్యత రాలేదని పండితులు అభిప్రాయపడుతున్నారు.

pc:youtube

సీతారామలక్ష్మణుల విగ్రహాలు

సీతారామలక్ష్మణుల విగ్రహాలు

1949లో గజవాడ చిన్నయ్య గుప్త అనే భక్తుడు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఆలయానికి సమర్పించాడు. తురుష్కుల దండయాత్ర తరువాత అప్పటివరకూ ఆలయంలో దేవతా విగ్రహాలు ఉండేవికాదు.

ఎన్నో విశిష్టతల దివ్య క్షేత్రం ... వేములవాడ !!

pc:youtube

ఆలయ ప్రత్యేకత

ఆలయ ప్రత్యేకత

ఆలయాన్ని సందర్శించినవారు దాని గొప్పదనాన్ని, శిల్పకళని ఎప్పటికీ మర్చిపోరు. ఆలయం పక్కగా ఒక కోనేరు మధ్యన మండపం వుంటాయి.

pc:youtube

కోనేరు నీటి మట్టం

కోనేరు నీటి మట్టం

కోనేటి నీటి మట్టాన్ని సూచించే రాతి సూచిక కూడా నిర్మించడం వెనుక ఆ ఆలయ నిర్మాణం చేసిన వారి నైపుణ్యం కనబడుతుంది. డిచ్ పల్లి రామాలయం నుండీ నిజామాబాదులోని రఘునాధ ఆలయానికి వెళ్ళే మెట్లమార్గం వుంది.

pc:youtube

శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం

శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం

శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం నిజామాబాద్ ఎంట్రెన్స్ లో కలదు. ప్రతిరోజూ, ప్రత్యేకించి సోమవారాల్లో శివ భగవానుడిని దర్శించుకోవటానికి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు.

తెలంగాణలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

pc:youtube

నార్త్ ఇండియన్ శిల్ప శైలి

నార్త్ ఇండియన్ శిల్ప శైలి

దీనిని శాతవాహన వంశానికి చెందిన శాతకర్ణి -2 నిర్మించెను. దేవాలయ శిల్ప శైలి నార్త్ ఇండియన్ శిల్ప శైలిని పోలి ఉంటుంది. తెలంగాణాలో అత్యంత ఆదరణీయమైన డిచ్ పల్లి రామాలయాన్ని ఈ మధ్యకాలంలో మరింత అభివృద్ది చేశారు. తెలుగువారంతా గర్వించదగ్గ శిల్పసంపద డిచ్ పల్లి రామాలయం సొంతం.

తెలంగాణ లో అంతుచిక్కని 'బాహుబలి విగ్రహం' రహస్యం !

pc:youtube

ఆర్మూర్ రాక్ ఫార్మేషన్

ఆర్మూర్ రాక్ ఫార్మేషన్

డిచ్ పల్లి నుండి నిర్మల్ కు వెళ్లే మార్గంలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న నల్లటి రాళ్ల కొండ ఒకటి కనిపిస్తుంది. ఈ గ్రామం పేరు ఆర్మూర్. డిచ్ పల్లి కి 25 కి.మీ ల దూరంలో, నిజామాబాద్ నుండి 27 కి.మీ ల దూరంలో ఉంది. కొండ పై కి చేరుకోవటానికి సిమెంట్ రోడ్డు కలదు. కొండ పైన గుహలో నవనాధ సిద్దేశ్వర దేవాలయం కలదు.

ఒకప్పుడు ఇంద్రపురి అని పిలవబడిన నిజామాబాద్ లోని పర్యాటక స్థలాలు

pc:youtube

 డిచ్ పల్లి కి సమీప నగరాలు

డిచ్ పల్లి కి సమీప నగరాలు

నిజామాబాద్ సిటీ, బోధన్ సిటీ, కామారెడ్డి సిటీ, నిర్మల్ సిటీ

శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం - బాసర !

డిచ్ పల్లి సమీప సందర్శనీయ ప్రదేశాలు

డిచ్ పల్లి సమీప సందర్శనీయ ప్రదేశాలు

సుద్దులం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, యానాం పల్లె లో కొండా పై వెలసిన శివుడు, నర్సింగ్ పూర్ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, ఇందల్వాయి సీతారామచంద్ర దేవాలయం, గన్నారం శివ, హనుమాన్ దేవాలయాలు చూడదగ్గవి.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

నిజామాబాద్ కి 27 కి.మీ ల దూరంలో డిచ్ పల్లి రామాలయం వుంది. హైదరాబాద్ నుండి 167 కి.మీ ల దూరం వుంది. నిజామాబాదు వరకూ రైలు మరియు బస్సు సౌకర్యం వుంది. అక్కడి నుండి డిచ్ పల్లికి వెళ్ళే బస్సులు, ఆటోలు వుంటాయి.

అడవులు, సెలయేళ్ళు ... అదిలాబాద్‌ సొంతం !!

pc:google maps

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి