Search
  • Follow NativePlanet
Share
» » వర్షాకాలపు హనీమూన్ ప్రదేశాలు !!

వర్షాకాలపు హనీమూన్ ప్రదేశాలు !!

ఈ హనీమూన్ వర్షాకాలంలో ఏ ప్రదేశానికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా ? వర్షాకాలంలో ప్రత్యేకించి హనీమూన్ కు వెళ్ళటానికి కొన్ని ప్రదేశాలు కలవు. వాటిలో సూర్య రశ్మి అధికంగా వుండే ప్రదేశం సముద్రపు అలలు ఎగిసిపడే ప్రదేశం అయిన గోవా ప్రధానమైనది. లేదా కేరళ లోని అష్టము డి బ్యాక్ వాటర్స్ కు వెళ్ళండి. అక్కడ కల హౌస్ బోటు లలో వర్షపు జల్లుల విహారాలు చేయవచ్చు. లేదా కేరళ లోని మున్నార్ ప్రదేశం సందర్శించి మంత్ర ముగ్దులవండి. ఇవే కాదు ఇంకా మరికొన్ని ప్రదేశాలు కూడా ఇస్తున్నాం. చూడండి.

కేరళ హోటల్ వసతులకు క్లిక్ చేయండి

గోవా

గోవా

గోవా ప్రదేశాల అందాలు వర్షాకాలంలోనే చూడాలి ఆనందించాలి అని అంటారు. ఇది వాస్తవమే. వర్షాలు పడితే ఈ ప్రదేశాలు ఎంతో తాజా అనుభూతులను కలిగిస్తాయి. స్వచ్చమైన బీచ్ లు, సముద్రపు గాలులు మరింత ఆనందం కలిగిస్తాయి. బీచ్ లో చల్లని గాలులలో అలలను చూస్తూ ప్రియమైన వారితో మెత్తటి ఇసుకలో గంటల కొద్దీ సాయంత్రపు సమయాలు గడిపేయవచ్చు. బీచ్ లు మాత్రమే కాక ఇక్కడ పసందైన పార్క్ లు అభయారణ్యాలు కూడా కలవు.

Photo Courtesy: ruben alexander

దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలు

మోల్లం నేషనల్ పార్క్ చివరి భాగాలలో కల దూద్ సాగర్ జలపాతాలు, వర్ష రుతువులో చక్కగా ఆనందించ దగినవి. అంతేకాదు ఇక్కడ కల సుమారు రెండువందల సంవత్సరాల నాటి సుగంధ ద్రవ్యాల తోటలు, దట్టమైన పచ్చటి అడవులు, కొండల ద్వారా ప్రయాణించి ఆనందంగా గడపవచ్చు. జూన్ నెలలో ఇక్కడి చర్చి లలో జరిగే వేడుకలు చూసి ఆనందించవచ్చు.

Photo Courtesy: ZeHawk

కోవలం

కోవలం

కోవలం లో కల లైట్ హౌస్ బీచ్, హవా బీచ్ మరియు సముంద్ర బీచ్ లు మీకు మీ ప్రియమైన వారికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. మరింత శృంగార భరిత సన్నివేశాలు కావాలనుకుంటే, విజింజాం కొండ గుహలకు వెళ్ళండి. ఇవి కోవలం నుండి ఒక కి. మీ. దూరంలో మాత్రమే కలవు. ఈ గుహలు సుమారు 18 వ శతాబ్దం నాటివి. అనేక శిల్ప చిత్రాలు కలిగి వున్నాయి. Photo Courtesy: Roberto Faccenda

మున్నార్

మున్నార్

మున్నార్ కేరళలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ప్రకృతి ప్రియుల స్వర్గం. నీల గిరి దార్ జంతువు సంచరించే ఎరావికులం ప్రాంతం చూడండి. రాజమల కొండలకు వెళ్లి ట్రెక్కింగ్ చేయండి. లేదా ఒక సరస్సు, డాం మరియు అనేక టీ గార్డెన్ లు కల అనయరంకాల్ ప్రదేశానికి వెళ్ళండి. సమీపంలో కల దక్షిణ ఇండియా లోనే అతి ఎత్తైన శిఖరం అనముడి చూడటం మరువకండి. Photo Courtesy: Arayilpdas

కూర్గ్

కూర్గ్

కూర్గ్ , కర్నాటక లో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పడమటి కనుమలలోని మల్నాడ్ ప్రాతంలో కలదు. దీనిని స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియా అని వ్యవహరిస్తారు. నిరంతరం పచ్చగా వుండే అడవులకు, దట్టమైన చెట్లు కల వాలీ లకు, పొగ మంచు తో తడిసిన కొండలకు, విస్తారమైన కాఫీ మరియు టీ తోటలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఎత్తైన శిఖరాలు, వేగంగా ప్రవహించే జలపాతాలు ఎన్నో చూడవచ్చు. పూర్వకాల వైభవంకల అనేక భవనాలతో కూర్గ్ ప్రదేశం ఒక చక్కని హనీ మూన్ ప్రదేశం కాగలదు.

బెకాల్

బెకాల్

బెకాల్ పట్టణం చిన్నది అయినప్పటికీ ఆకర్షనీయమైనది. ఇది కేరళ లోని కాసర్గోడ్ జిల్లాలో పల్లికారే గ్రామం సమీపంలో అరేబియా మహా సముద్ర తీరంలో కలదు. చక్కటి ప్రకృతి దృశ్యాలకు ఇది ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ కల బెకాల్ కోట ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ కల హనుమాన్ టెంపుల్, టిప్పు సుల్తాన్ నిర్మించిన ఒక పురాతన మసీదు మరికొన్ని ఆకర్షణలు.

Photo Courtesy: vivek raj

అష్టముడి

అష్టముడి

ప్రకృతి ని మరింత సన్నిహితంగా ఆనందించేందుకు హనీమూన్ జంటలకు అష్టముడి బ్యాక్ వాటర్స్ ఒక గొప్ప అవకాశం కలిగిస్తాయి. ఈ బ్యాక్ వాటర్ ప్రదేశం అష్టముడి సరస్సు కారణంగా ఏర్పడింది. ఇది కేరళ రాష్ట్రంలోనే ఒక అతి పెద్ద గొప్ప స్వచ్చమైన నీటి సరస్సు. అష్టముడి బ్యాక్ వాటర్స్ లో హౌస్ బోటు విహారం ఒక ప్రధాన ఆకర్షణ. బ్యాక్ వాటర్స్ నేపధ్యంలో జంటలు ఆయుర్వేద మసాజ్ లు చేయిన్చుకోనవచ్చు. కేండిల్ లైట్ డిన్నర్ లు ఆస్వాదించవచ్చు.

Photo Courtesy: Kerala Tourism

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X