
స్థితికారకుడైన విష్ణువు అరుదైన దైవ రూపం రంగనాథ స్వరూపం. ఈ రూపంలో విష్ణుభగవానుడికి ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశంలోనే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. అందులోని కావేరి నదీ పరివాహ రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
ఈ రంగనాథుడి ఆలయాలు చాలా వరకూ ఈ రెండు రాష్ట్రాల్లో కావేరి నదీ తీరంలోనే కొలువై ఉన్నాయి. ఇదిలా ఉండగా దక్షిణ భారత దేశంలో ఉన్న రంగనాథ ఆలయాల్లో విశిష్టమైన ఐదు శ్రీ రంగనాథుడి ఆలయాలను పంచరంగ క్షేత్రాలని పిలుస్తారు. ఈ పంచ రంగ ఆలయ దర్శనం పురాణ కాలం నాటి నుంచి కూడా ఉందని చెబుతారు.
ఇందులో శ్రీరంగ పట్టణం, శ్రీరంగం, సారంగపాణి దేవాలయం తదితరాలు ఉన్నాయి. ఈ పంచరంగ క్షేత్రాల సందర్శనం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ ఐదు రంగనాథస్వామి దేవాలయాలతో పాటు వాటి పురాణ కథనాలు క్లుప్తంగా నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం.

శ్రీరంగపట్టణం
P.C: You Tube
టిప్పుసుల్తాన్ కు శ్రీరంగ పట్టణానికి విడదీయరాని బంధం ఉంది. తన రాజ్యానికి శ్రీరంగ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని టిప్పుసుల్తాన్ పరిపాలన సాగించాడు. శ్రీరంగనాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టే దీనిని శ్రీరంగపట్ణణం అని పిలుస్తున్నారు.

కావేరీ మాత సహితంగం
P.C: You Tube
ఇక్కడ స్వామి వారు కావేరి సహితంగా కొలువై ఉంటాడు. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం కొన్ని వేల ఏళ్లనాటి చరిత్రను సొంతం చేసుకొంది. ఇక్కడ ఉన్న రంగనాథుడిని ఆదిరంగ అని పిలుస్తారు. ఇక్కడ మాత్రమే శ్రీరంగనాథుడి పాదల చెంత కావేరి మాత ఉండటం మనం చూస్తాము.

తిరుప్పునగర్
P.C: You Tube
తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న గ్రమం పూరు తిరుప్పునగర్. ఇక్కడ ఉన్న మూలవిరాట్టును అప్పకుడగాన్ పెరుమాళ్ అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఉభమన్యు అనే రాజుకు ఒక ముసలివాడి రూపంలో కనిపించి తన ఆకలి తీర్చమని వేడుకొన్నాడని స్థలపురాణం చెబుతుంది.

అప్పాలను అందించగా
P.C: You Tube
రాజు గర్వంతో ఆకలే కదా అని చెబుతూ పంచబక్షాలను అందించాడు. ఎంత తిన్నా ఆ ముసలివాడి ఆకలి తీరలేదు. దీంతో తన ఆస్థానంలో ఉన్న పరాశర మహర్షి సూచనమేరకు భక్తితో ఆ ముసలివాడికి అప్పాలను అందించాడు. దీంతో అతని ఆకలి తీరి రాజుకు రంగనాథుడి రూపంలో సాక్షాత్కరించాడు. అందువల్లే ఇక్కడ ఉన్న మూలవిరాట్టును అప్పకుడతాన్ అని పిలుస్తారు.

సారంగపాణి ఆలయం
P.C: You Tube
కుంభకోణంలోని రంగనాథస్వామి దేవాలయంలో స్వామివారు పడుకొన్న స్థితి నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు. దీనిని ఉద్దాన శయన భంగిమ అని పిలుస్తారు. ఇటువంటి రూపంలో ఉన్న ఉన్న విగ్రహం ప్రపంచంలో ఇదొక్కటే.

ఇల్లరికపు అల్లుడు
P.C: You Tube
అదే విధంగా ఇక్కడ స్వామివారు ఇల్లరికపు అల్లుడు. వైకుంఠం నుంచి లక్ష్మీదేవిని వెదుక్కొంటూ వచ్చిన శ్రీనివాసుడు కుంభకోణంలోని హేమ రుషి వద్ద పెరుగుతున్న లక్ష్మీ దేవిని వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపోయాడు. అందుకే స్వామివారు ఇక్కడ ఇక్కడ ఇల్లరికపు అల్లుడు.

మయిలదుతురై
P.C: You Tube
కావేరి నదీతీరంలో తమిళనాడులోని మయిలదుతురై అనే చోట ఉన్న రంగనాథ ఆలయం పంచరంగ క్షేత్రాల్లో ఒకటి. పరాకల్ అనే ఆళ్వారు మొదట ఒక గజ దొంగ. అతనిని భక్తి మార్గంలో నడిపించడానికి శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఓ బ్రాహ్మణుడి వేశంలో ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడని కథనం.

నాద స్వరం సంగీత వాయిద్యంగా
P.C: You Tube
అటు పై ఆ ఆళ్వారు కోరికమేరకు ఈ క్షేత్రంలో కలియుగాంతం వరకూ రంగనాథుడి రూపంలో కొలువై ఉంటానని మహావిష్ణువు స్వయంగా చెప్పాడని చెబుతారు. ఇక్కడ ఉన్న స్వామివారిని పరిమళ పెరుమాళ్ అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపు దిద్దుకుందని చెబుతారు.

శ్రీరంగం
P.C: You Tube
శ్రీరంగాన్ని అంత్య రంగమని అంటారు. అయితే శ్రీరంగనాథుడి ఆలయాల్లో అతి ఈ శ్రీరంగంలోని ఆలయం అత్యంత ప్రముఖమైనది. తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రాన్ని ఇండియాన్ వాటికన్ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలోని మూలవిరాట్టును రాక్షసరాజు అయిన విభీషనుడు ప్రతిష్టించినట్లు చెబుతారు.

వెంటనే వివాహం
P.C: You Tube
భారత దేశంలోనేఅతి విశాలమైన దేవాలయాల్లో ఇది మొదటిది. 108 దివ్య ఆలయాల్లో ఒకటి. 6,31,000 చదరపు మీటర్లు అంటే 156 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. రాజగోపురం ఎత్తు 236 అడుగులు. ఇక్కడ మూలవిరాట్టుకు వస్త్రాలు సమర్పిస్తే వివాహం కానివారికి వెంటనే వివాహమవుతుందని భక్తుల నమ్మకం.