Search
  • Follow NativePlanet
Share
» »ఒడిషా రాష్ట్రంలోని సందర్శనీయ ప్రదేశాలు !

ఒడిషా రాష్ట్రంలోని సందర్శనీయ ప్రదేశాలు !

By Mohammad

ఒడిషా భారతదేశ భూభాగంలో ఒక రాష్ట్రం. బంగాళాఖాతం దీనికి చేరువలో ఉన్న సముద్రం. సంస్కృతికి, వారసత్వానికి సంబంధించిన ప్రదేశాలు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా ... అంటే ఆది ఒడిషా మాత్రమే. ఈ రాష్ట్రం చాలా నిర్మానుష్యంగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఒడిషా చరిత్ర

పూర్వం ఒరిస్సా ప్రాంతాన్ని ఎక్కవ కాలం కళింగరాజులు పాలించారు. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు కళింగరాజులను యుద్ధంలో ఓడించి, కళింగ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. అన్నట్టు కళింగ ప్రాంతం అంటే ఇప్పటి ఒడిషా రాష్ట్రం అని. అశోకుడు కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతానికి పాశ్చాత్తాపం పడి, శాంతి మార్గాన్ని ఎంచుకుంటాడు.

ఒడిషా రాష్ట్రంలోని సందర్శనీయ ప్రదేశాలు

ఒడిషా లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు చాలా కొన్నే ఉన్నాయి. వాటిలో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ఒకటి. ఇక్కడ 1000 వరకు ఆలయాలు ఉన్నాయి కనుకనే దీనిని 'మందిరాల నగరం' అని పిలుస్తారు. దేశంలోకెల్లా ప్రఖ్యాతి చెందిన రెండు ఆలయాలు సైతం ఈ ఒరిస్సా రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి ఒకటేమో పూరీ జగన్నాథుని ఆలయం మరొకటేమో కోణార్క్ లోని సూర్య దేవాలయం. వీటితో పాటుగా గుహలు, బీచ్ లు, అభయారణ్యాలు, వారసత్వ ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు సాహస ప్రదేశాలు కలిగి ఉంది ఈ కళింగరాజ్యం(ఒరిస్సా లేదా ఒడిషా).

ఇది కూడా చదవండి : భువనేశ్వర్ పర్యాటక ప్రదేశాలు !

ఒడిషా రాష్ట్రంలో ఈ పర్యాటక ప్రదేశాలతో పాటుగా ఇష్టపడే మరో అంశం ఉంది అదే నోరూరించే వంటకాలు. ఇక్కడి వంటకాలు ఎక్కువ చురుకుగా, తేలికపాటి రుచి కలిగి ఉంటాయి. మనలాగే వీరు కూడా ఎక్కువగా అన్నాన్ని వాడతారు. దానిలోకి పప్పు, ఊరగాయలు వేసుకొని తింటారు.

ఒడిషా రాష్ట్రంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు కొన్నే ఉన్నా కూడా వాటిలో ఉత్తమమైన పర్యాటక ప్రదేశాలను మీ నేటివ్ ప్లానెట్ అందిస్తున్నది. మరి వాటిని ఒకసారి చూసొద్దామా ..!

భువనేశ్వర్, ఒడిషా

భువనేశ్వర్, ఒడిషా

ముందుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి వద్దాం. భువనేశ్వర్ కళింగ కాలం నుండి అద్భుతమైన నిర్మాణాలను కలిగి ఉంది. ఇక్కడ ఏ ఆలయాన్ని చూసిన ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. దేశంలో ఉన్న నగరాల్లో కెల్లా ఇదొక్కచోటనే వెయ్యికి పైగా ఆలయాలు ఉన్నాయి కనుకనే దీనిని ఆలయాల నగరం అని పిలుస్తారు.

చిత్ర కృప : Sarba

భువనేశ్వర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

భువనేశ్వర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

భువనేశ్వర్ లో లింగరాజు ఆలయం బాగా ప్రసిద్ధి చెందినది. దీనితో పాటు ముక్తేశ్వర్ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, ధౌలి గిరి, బిందు సాగర్ సరస్సు, పార్క్ లు మరియు వన్య మృగ సంరక్షణాలయాలు పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : భువనేశ్వర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Swagat Rath

పూరీ, ఒడిషా

పూరీ, ఒడిషా

పూరీ పట్టణం బంగాళాఖాతం సముద్రం తీరాన ఉన్నది. ఈ పట్టణం భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉండి, గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ చూడవలసినవి రెండంటే రెండే. అవి ఆలయాలు, బీచ్.

చిత్ర కృప : Wen-Yan King

పూరీ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

పూరీ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

పూరీ పట్టణంలో ఉన్న జగన్నాథుని ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో ఒకటి. దీనితో పాటుగా పూరీ బీచ్ ఇక్కడి రెండవ ప్రధాన ఆకర్షణ. ఇంకా లోకనాథ ఆలయం, ఆలర్నాథ ఆలయం, గుండిచ ఆలయం, సాత్పదా డాల్ఫిన్ కేంద్రం లు పర్యాటక ఆకర్షణ లుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : పూరీ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Manfred Sommer

రూర్కెలా, ఒడిషా

రూర్కెలా, ఒడిషా

రూర్కెలా ఒరిస్సా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. చుట్టూ ఉండే కొండలు, దాని సహజ పరిసరాలు, నదులు ఈ ప్రదేశ అందాల్ని మరింత పెంచాయి. దీనిని ఒడిషా యొక్క వాణిజ్య రాజధాని గా, స్టీల్ సిటీ గా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ కూడా చూడవలసినవి ఆలయాలే అయినప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉంటాయి.

చిత్ర కృప : Srikant Kuanar

రూర్కెలా మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

రూర్కెలా మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

రూర్కెలా లో చూడవలసినవి ఆలయాలే. వాటిలో ఆహిరబంద్ ఆలయం, హనుమాన్ వాటిక, ఖండధర్ జలపాతం, గాయత్రి ఆలయం, ఘొఘర్ ఆలయం మరియు వైష్ణో దేవి ఆలయం చూడవలసినవిగా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఉన్నాయనుకోండి ..!

ఇది కూడా చదవండి : రూర్కెలా మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Narendra Sadhu

సంబల్పూర్, ఒడిషా

సంబల్పూర్, ఒడిషా

సంబల్పూర్ చరిత్ర మరియు ఆధునికతల మేళవింపుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సంబాల్పూర్ లో వజ్రాలు దొరికేవి. ప్రస్తుతమైతే ఈ నగరం చేనేత వస్త్ర రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది. అప్పటి మాదిరి కాకుండా ఇప్పుడైతే కాస్త ప్రాధాన్యత తగ్గిన హీరాకుడ్ డ్యామ్ తో మళ్లీ పర్యాటక ఆకర్షణ గా నిలిచింది.

చిత్ర కృప : pranab mahapatra

సంబల్పూర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

సంబల్పూర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

సంబల్పూర్ లో ప్రధాన ఆకర్షణ హీరాకుడ్ ఆనకట్ట. సమలేశ్వరి ఆలయం, హుమా వాలు ఆలయం, ఘంటేశ్వరి ఆలయం, దేబిఘర్ వన్యప్రాణి అభయారణ్యం, క్యాటిల్ ద్వీపం, ఉషాకోటి, కంధర, హతిబరి, విక్రంఖోల్ ఇతర పర్యాటక ఆకర్షణ స్థలాలు.

ఇది కూడా చదవండి : సంబల్పూర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : anandsagardash

కియోంఝర్, ఒడిషా

కియోంఝర్, ఒడిషా

కియోంఝర్, ఒడిషా లోని ఉత్తర సరిహద్దు ప్రాంతం లో ఉన్న పర్యాటక ప్రదేశం. ఇక్కడ వైతరణి నది ఉద్భవించిన చోటు నుండి ప్రసిద్ధ కియోంఝర్ పీఠభూమి ఉంది. ఈ ప్రదేశంలో పుష్కలంగా ఫల, పుష్ప జాతులు, ఖనిజ నిక్షేపాలు, అందమైన జలపాతాలు, ఆలయాలు కూడా వున్నాయి. ఇన్ని వైవిధ్యభరితమైన సహజ వనరులున్న జిల్లా రాష్ట్రంలో ఇదొక్కటే.

చిత్ర కృప : Kamalakant Nayak

కియోంఝర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కియోంఝర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కియోంఝర్ లో కందదార్ జలపాతాలు, సంఘగర జలపాతాలు, బడా ఘాగర జలపాతాలు పర్యాటకులకు ఆసక్తి కలిగించేవి. ఘటగావ్ లో వున్న దేవాలయం, గోనసిక, గుండిచఘై, భీమ్ కుండ్, ముర్గమహదేవ్ దేవాలయం, చక్రతీర్థ, సీతా బింజ్, రాజానగర్, జిల్లా మ్యూజియం ఇతర పర్యాటక ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : కియోంఝర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Samir Dash

బెర్హంపూర్, ఒడిషా

బెర్హంపూర్, ఒడిషా

బెర్హంపూర్ (బ్రహ్మాపూర్) అనేది బ్రిటీషు వలసదారులు ఈ నగరానికి ఇచ్చిన పేరు. పట్టు నగర౦ అనే ముద్దుపేరుతో పిలువబడే బెర్హంపూర్, ఒడిషా లోని గంజం జిల్లలో ఉంది. బెర్హంపూర్ పట్టు అని పిలిచే ఈ క్లిష్టమైన పట్టు చీర ఈనాటి నగర పరిస్థితులకి అనేక ప్రభావాల స్మృతి చిహ్నంగా, ప్రత్యేకంగా ఉంది. చేనేత, నగల దుకాణాలు అందమైన నగర దృశ్యాలను అందిస్తాయి.

చిత్ర కృప : telugu native planet

బెర్హంపూర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

బెర్హంపూర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

బెర్హంపూర్ లో బంకేశ్వరి, కులద, నారాయణి, మహేంద్రగిరి, మా బుధి ఠాకురాణి ఆలయం, తారాతరిని ఆలయం, బుగుద విరంచినారాయణ ఆలయం, బాల కుమారి ఆలయం, మంత్రిది సిద్ధ భైరవి ఆలయం మొదలైనవి కొన్ని ప్రసిద్ధ ఆలయాలు. ఆర్యపల్లి బీచ్ ఇక్కడి మరొక ఆకర్షణ.

ఇది కూడా చదవండి : బెర్హంపూర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : telugunative planet

కటక్, ఒడిషా

కటక్, ఒడిషా

ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుండి 28 కి.మీ. దూరంలో కటక్ ఉన్నది. కటక్ ఒరిస్సా యొక్క సాంస్కృతిక మరియు వ్యాపార రాజధానిగా పిలువబడుతుంది. మహా మరియు కత్జోరి నదుల ద్వారా ఏర్పడిన సారవంతమైన డెల్టా మైదానంలో కటక్ ఉన్నది. కటక్ లో పర్యాటకులు సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి.

చిత్ర కృప : Sujit kumar

కటక్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కటక్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కటక్ స్మారక చిహ్నాలు, దేవాలయాలు, కోటలు, కొండలు మొదలైన అనేక గమ్యస్థానాలకు ఒక ప్రత్యేకమైన కూడలిగా ఉంది. ఇక్కడ ధబలేస్వర్ బీచ్, ధబలేస్వర్ ఆలయం చూడదగిన స్ధలాలుగా ఉన్నాయి. చర్చిక ఆలయం, భట్తరిక ఆలయం, శివుని ఆలయం, చండి ఆలయం, సతకోసియా వన్యప్రాణుల అభయారణ్యం, నేతాజీ మ్యూజియం ఇతర ప్రధాన ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : కటక్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Kamalakanta777

ఉదయగిరి, ఒడిషా

ఉదయగిరి, ఒడిషా

భువనేశ్వర్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో వున్న ‘సన్ రైస్ హిల్స్' గా పిలువబడే ఉదయగిరి, భారత దేశ నిర్మాణ కౌశలానికి చక్కటి ఉదాహరణ. నిజానికి దీన్ని ‘ప్రాకృతిక అందం, మానవ నిర్మాణాల అరుదైన మిశ్రమంగా' దీన్ని నిర్వచించవచ్చు. ఇక్కడ తవ్వకాల్లో బయట పడ్డ బౌద్ధ, జైనుల నిర్మాణాలు, ఆశ్రమాలు, స్తూపాలు, శిధిలాల వల్ల దీనికి చారిత్రిక ప్రాముఖ్యత వచ్చింది.

చిత్ర కృప : Steve Browne & John Verkleir

ఉదయగిరి మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ఉదయగిరి మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ఉదయగిరిలో లో ఉన్న మొత్తం 18 గుహలను ఉదయగిరి గుహలు అని పిలుస్తారు. ఉదయగిరి పక్కనే వున్న ఖండగిరి అనే మరో కొండలో 15 గుహలు వున్నాయి. ఈ రెండు కొండలతో పాటు లంగుడికోండి, లలిత్ గిరి, రత్నగిరి కొండలలో గౌతమ బుద్ధుడి అవశేషాలు వున్నాయి.

ఇది కూడా చదవండి : ఉదయగిరి మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Steve Browne & John Verkleir

పరదీప్, ఒడిషా

పరదీప్, ఒడిషా

ఒడిషా లోని జగత్సింగ్ పూర్ జిల్లాలో ఉన్న తీర ప్రదేశం పరదీప్. పరదీప్ ఒక రేపు పట్టణం మరియు రాష్ట్రంలో ఉన్న ప్రాచీన రేవు కూడా. ప్రకృతి అందాన్ని ప్రేమించే వారికి ఇక్కడి విస్తారమైన సముద్ర తీరం, ఉష్ణమండల సూర్యుడు, పచ్చటి అడవులు, సహజ నీటి చెలమలు, అన్నీ కలిసి పరదీప్ ను చూసి తీరాల్సిన స్వర్గధామంగా మారుస్తాయి.

చిత్ర కృప : Ar.Shakti Nanda

పరదీప్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

పరదీప్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

పరదీప్ ఆకర్షణలలో ప్రధానమైనది పరదీప్ బీచ్. ఇక్కడ ఈత కొడుతూనో లేక నడుస్తూనో కుటుంబ౦తో సరదాగా గడపడానికి బాగుంటుంది. ఇక్కడ ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ కూడా సందర్శనకు అనువైనది. దీనితో పాటుగా గహిర్మత బీచ్ , భితర్కనిక నేషనల్ పార్క్, మరైన్ అక్వేరియం, జగన్నాథ ఆలయం, నెహ్రు భవనం, లైట్ హౌస్, హనుమంతుడి ఆలయం కూడా ప్రధాన ఆకర్షణలు గా నిలిచాయి.

ఇది కూడా చదవండి : కటక్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : diptiprakash

దెంకనల్, ఒడిషా

దెంకనల్, ఒడిషా

దెంకనల్ భువనేశ్వర్ నగరం నుండి 99 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. విస్తారమైన ప్రకృతి సహజ అందంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. ఇక్కడ వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క సహజ సంపద పుష్కలంగా ఉంటుంది. నిజానికి కొండలు,లోయలు మరియు నదులు ఆ ప్రాంతం యొక్క అందాన్ని పెంచుతాయి.

చిత్ర కృప : Jeffrey Martin

దెంకనల్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

దెంకనల్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

దెంకనల్ లో వివిధ హిందూ మత దేవుళ్లకు అంకితం చేయబడిన అందమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో లార్డ్ బలభద్ర అంకితం చేసిన బలభద్ర ఆలయం ప్రసిద్ధి చెందినది. దీనితో పాటు సంభుగోపాల్ ఆలయం, రఘనాథ్ ఆలయం, కునజకంత కృష్ణ దేవాలయం వంటి చాలా ప్రదేశాలు ఇప్పటికి చూడవచ్చు.

ఇది కూడా చదవండి : దెంకనల్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : David Drori

కంధమాల్, ఒడిషా

కంధమాల్, ఒడిషా

కంధమాల్, ఒరిస్సా లోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఎత్తిన కొండలు, కాఫీ తోటలు, చేతితో తయారు చేసిన ఆశ్చర్యపరిచే కేన్, డొక్ర, టెర్రకోట, వెదురు కళాకృతులతో కంధమాల్ అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Samir Dash

కంధమాల్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కంధమాల్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

పటుడి జలపాతం, లుడు జలపాతం, కట్రమల్, పకడదర జలపాతాలు కంధమాల్ లోని ఆకర్షణలు. ఫుల్బని, దరింగ్ బడి, చకపడ్, బెల్ఘర్, బలస్కుంప వంటివి ఇతర ప్రధాన ఆకర్షణ లుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : కంధమాల్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : সন্দীপ সরকার

కరంజియా, ఒడిషా

కరంజియా, ఒడిషా

కరంజియా, ఒడిష మయూర్భంజ్ జిల్లాలోని పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం వివిధ దేవీదేవతలకు అంకితం చేసిన ఆలయాలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడి సమీప ప్రాంతాలలో ఉన్న పురాతన కోటల్లో అనేక శిధిలాలను చూడవచ్చు.

చిత్ర కృప : KPB Menon Balu

కరంజియా మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కరంజియా మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కరంజియా ప్రాంతంలో మాఅంబిక, జగన్నాథ ఆలయం, శ్యామరాయి ఆలయం, పుర్నేశ్వర్ ఆలయం, మంగళ ఆలయం, రాణి సతి ఆలయం, బర్ఖండ ఆలయం, ఠాకూర్ అంకుల్చంద్ర ఆలయం, సత్య సాయి ఆలయం, రామేశ్వర్ బాబా శివాలయం తో సహా అనేక దేవాలయాలు ఆధ్యాత్మిక స్థలాలు గా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : కరంజియా మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : KPB Menon Balu

చిల్కా, ఒరిస్సా

చిల్కా, ఒరిస్సా

భారతదేశంలోని అతిపెద్ద కోస్తా సరస్సులలో చిల్కా సరస్సు ప్రసిద్ది చెందింది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా పేరుగాంచింది. ఇది రాజధాని భువనేశ్వర్ నుండి 81 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిల్కా ప్రధాన ఆకర్షణ చిల్కా సరస్సు. ఇదే కాకుండా బోటింగ్, ఫిషింగ్, బర్డ్ వాచింగ్, మంగలజోడి అభయారణ్యం ఇతర ఆకర్షణలు.

చిత్ర కృప : Samrat Banik

మయూర్భంజ్ , ఒడిషా

మయూర్భంజ్ , ఒడిషా

మయూర్భంజ్ లో పర్యాటకులు చూడటానికి అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. వాటిలో బరిపడ, ఖిచింగ్, సిమ్లపల్ నేషనల్ పార్క్, దేవకుండ్ లు ప్రధాన ఆకర్షణ లుగా నిలిచాయి.

చిత్ర కృప : Pallavi Anvekar

గంజాం , ఒడిషా

గంజాం , ఒడిషా

గంజాం ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. ఇది బంగాళా ఖాతం సముద్రం ఒడ్డున వుంది. అందమైన బీచ్ లతో ఏడాది పొడవునా పర్యాటకులతో కిటకిటలాడుతూ వుంటుంది. పెద్ద పెద్ద కొండల మధ్య దట్టమైన పచ్చదనంతో, అందమైన నదులతో ఈ మనోహరమైన ప్రదేశంలో పురాతన అవశేషాలు కూడా వున్నాయి.

చిత్ర కృప : SANTOSH.NAHAK12

గంజాం మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

గంజాం మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

గంజాం పర్యాటకంలో ఆర్యపల్లి, హుమా కంటియాగడా లాంటి కొన్ని అందమైన ఇసుక తీరాలు ప్రపంచంలోనే సాటి లేనివి. జగన్నాథ దేవాలయం, మహురి కలువా దేవాలయం, విష్ణువు విగ్రహం పాదాల నుంచి బయటకు వచ్చే నీటి కొలను ఇతర పర్యాటక ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : గంజాం మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : SANTOSH.NAHAK12

ఇది కూడా చదవండి : గంజాం మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

గోపాల్పూర్, ఒడిషా

గోపాల్పూర్, ఒడిషా

గోపాల్పూర్ ఒడిషా లోని అందమైన కోస్తా పట్టణం. ఈ ప్రదేశం బంగాళాఖాతానికి సమీపంలో ఉంది. ఆకర్షణీయంగా ఉండే ఈ స్థలాన్ని చూడడానికి ప్రతినెలా వేలాదిమంది ప్రజలు ఇక్కడికి వస్తారు.

చిత్ర కృప : SUDHIR PANDA

గోపాల్పూర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

గోపాల్పూర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

గోపాల్పూర్ లో మా తారా తరిణి హిల్ మందిరం, బాలా కుమారి ఆలయం, శ్రీ శ్రీ శ్రీ సిద్ధివినాయక్య పీఠం తోపాటు ధార్మిక ఆశక్తి గల ప్రదేశాలు తప్పక చూడాలి. వీటితో పాటు గా సోనెపూర్ బీచ్, అర్యపల్లి బీచ్, గోపాల్పూర్ బీచ్, డాల్ఫిన్ అభయారణ్యం, బంకేశ్వరి వంటి ఇతర ఆకర్షణలు కూడా చూడవచ్చు.

ఇది కూడా చదవండి : గోపాల్పూర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : telugu native planet

చాందీపూర్, ఒడిషా

చాందీపూర్, ఒడిషా

చాందీపూర్, ఒడిషా లోని బలేశ్వర్ జిల్లలో ఉన్న ఒక బీచ్ రిసార్ట్. ఇక్కడ మిసైల్స్ ను టెస్టింగ్ చేసి నింగిలోకి వదులుతారు. పంచలింగేశ్వర్, ఖిర్చోర గోపీనాథ్ ఆలయం చండిపూర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణలు. అలాగే భితర్కానిక అభయారణ్యం, నీలగిరి, సజనగర్ లు ఇతర ఆకర్షణలు.

చిత్ర కృప : Ar.Shakti Nanda

కోణార్క్, ఒడిషా

కోణార్క్, ఒడిషా

కోణార్క్ ఒడిషా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడి ఆకర్షణలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాలు. ఈ పట్టణంలో ప్రధాన ఆకర్షణ సన్ టెంపుల్. ఈ సన్ టెంపుల్ సముదాయం లో మాయాదేవి మరియు వైష్ణవ టెంపుల్ మందిరాలు కలవు.

చిత్ర కృప : Bhawani Sankar Dash

కోణార్క్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కోణార్క్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కోణార్క్ పర్యాటక ఆకర్షణ లలో ప్రధానంగా చెప్పుకోవలసినది సూర్య దేవాలయం. ఈ ఆలయం తర్వాత అష్టరంగ, చంద్రభాగ్ సముద్ర తీరం, మాయా దేవి ఆలయం, చౌరసి, కాకాత్పూర ఆలయం, వైష్ణవ ఆలయం ,రామచండి ఆలయం, కురుమ, బలిఘి బీచ్, మెరైన్ డ్రైవ్ లు చూడవలసిన ఇతర ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : కోణార్క్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Parshotam Lal Tandon

జేయ్పోరే, ఒడిషా

జేయ్పోరే, ఒడిషా

జేయ్పోరే ను 'విక్టరీ నగరం' అని పిలుస్తారు. ఇది ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం జలపాతాలు, పచ్చిక భూములు, పచ్చని లోయలు, దట్టమైన ఆకుపచ్చని అడవుల వంటి కొన్ని సుందరమైన మరియు సహజ అందాలతో ఉంది.

చిత్ర కృప : Partha Pratim Patra

జేయ్పోరే మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

జేయ్పోరే మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

జేయ్పోరే లో శక్తి, బగర మరియు డుడుమా వంటి మనోహరమైన జలపాతాలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. దేవమాలి, సునబెడ, కొలాబ్, కోరాపుట్, మలిగుర, నందాపూర్, జేయ్పోరే పార్క్, మిన్నఝోల జేయ్పోరే పర్యాటనలో చూడవలసిన ప్రాంతాలుగా ఉన్నాయి. అంతేకాక పురాతన రాజభవనాలు మరియు కోటలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : జేయ్పోరే మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : telugu native planet

ధరంఘర్, ఒడిషా

ధరంఘర్, ఒడిషా

ధరంఘర్, ఒడిషా లోని కాలహంది జిల్లాలోని ఉన్నది. ధరంఘర్ చుట్టూ ఉన్న అనేక పురాతన, ప్రత్యేక ఆలయాల వలన ఇది ఎంతో ప్రసిద్ది చెందింది. ఉన్నతమైన కొండలు, ఉధృతమైన జలపాతాలు, గుసగుసలాడే అడవులు, అక్కడక్కడ ఉన్న పచ్చికభూములతో నిండిన అద్భుతమైన ప్రకృతితో అనేక మందిని ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Bhanupratap59

ధరంఘర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ధరంఘర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ధరంఘర్ - శ్రీ అరబిందో, శ్రీ మా వంటి పవిత్ర ప్రాచీన చిహ్నాలకు మరియు శివాలయం, దంతేశ్వరి ఆలయం, బుద్ధరాజ ఆలయం, లంకేశ్వరి, కనక దుర్గ, శ్రీ జగన్నాథ ఆలయం వంటి కొన్ని పురాతన ఆలయాలకు పుట్టిల్లు. అంపని, దోఖరి చంచ్ర వంటి అద్భుతమైన జలపాతాలతో పాటుగా గుడహండి ప్రాంతం, ముఖిగూడలోని ఇంద్రావతి ఆనకట్ట, ఖైర్పదర్, గోలముండా, కొక్సర వంటి ప్రదేశాలను చూడవచ్చు.

ఇది కూడా చదవండి : ధరంఘర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Siddhantbabu

కలహంది, ఒడిషా

కలహంది, ఒడిషా

కలహంది ఒడిషా రాష్ట్రంలో గొప్ప చరిత్ర మరియు సంస్కృతి గల జిల్లా. ఉట్టి మరియు టెల్ నదుల సంగమం వద్ద ఉన్నది. కలహంది 12 వ శతాబ్దం నాటి విస్తృతమైన వాస్తు నైపుణ్యానికి గుర్తుగా కొన్ని పురాతన దేవాలయాలకు నిలయంగా ఉంది. కాస్కేడింగ్ జలపాతాలతో పాటు అనేక సుందరమైన కొండలు ఉండుటవల్ల ఈ పట్టణానికి పర్యాటకులు వస్తుంటారు.

చిత్ర కృప : telugu native planet

కలహంది మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కలహంది మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కలహంది లో సందర్శకులు ఆసక్తికరమైన చరిత్ర మరియు అద్భుతమైన సహజ అందాలనూ చూడవచ్చు. ఇక్కడ అసుర్గర్హ్ , గుదహంది కొండ, మొహన్గిరి పురాతన శివాలయం, రబన్దర్హ్ అనే ఒక అందమైన జలపాతం లు ఆకర్షణలుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : కలహంది మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : dillip kumar sahoo

ప్రాచి వాలీ, ఒడిషా

ప్రాచి వాలీ, ఒడిషా

భువనేశ్వర్ నుండి 61 కిలోమీటర్ల దూరం లో ప్రాచి వాలీ ఉంది. పురాతత్వ శాస్త్రం పై ఆసక్తి కనబరచేవారికి అలాగే చరిత్రపై ఇష్టం ఉన్నవారికి ప్రాచి వాలీ పర్యటన ఆహ్లాదాన్నిస్తుంది. ప్రాచి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో క్రీ.శ. 7 వ శతాబ్దం నుండి క్రీ.శ. 15 వ శతాబ్దానికి చెందిన అనేక రకమైన స్మారక చిహ్నాలు కనబడతాయి.

చిత్ర కృప : wikicommons

ప్రాచి వాలీ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ప్రాచి వాలీ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ఎన్నో పురాతన ఆలయాలకు ప్రాచి వాలీ స్థావరం. రామాయణ మరియు మహాభారత ఇతిహాసాలకు ఇది సంబంధం ఉన్న ప్రదేశం ఇది. అమరేశ్వర లో ఉన్న శివుని ఆలయం, శోభనేశ్వర ఆలయం, చాముండ దేవి ఆలయం, గ్రామేశ్వర ఆలయం లు ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు.

ఇది కూడా చదవండి : ప్రాచి వాలీ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : wikicommons

బలంగీర్, ఒడిషా

బలంగీర్, ఒడిషా

బలంగీర్ సాంస్కృతిక, వారసత్వ సంపద ఉన్న ఒక ముఖ్యమైన నగరం. ఈ ప్రాంతం అనేక పురాతన ఆలయాలు, ప్రాచీన విగ్రహాలతో కూడిన అందమైన ప్రాంతాలకు ప్రసిద్ధి. క్రీ.శ. 19 వ శతాబ్దానికి చెందిన బలంగీర్ రాజు బలరాం దేవ్ నిర్మించిన బలరాంఘర్ అనే కోట పేరును ఈ ప్రాంతానికి పెట్టారు.

చిత్ర కృప : Satyajit Nayak

బలంగీర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

బలంగీర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

బలంగీర్ లో జలియా, గైఖయి, పట్నాఘర్- రాణిపూర్, ఝరియాల్, సైంతల టెంటులిఖుంటి ముర్సింగ్, జల్ మహదేవ్ సందర్శించనిదే పూర్తి కాదు. అంతేకాక సుఖ్తేల్ ప్రాజెక్ట్ , ఆశ్రమాలు, సరస్సులు, భవనాలు, పార్కులు, వివిధ మతాలకు చెందిన ఆలయాలు, విగ్రహాలు అన్ని ఈ నగరంలో చూడవచ్చు.

ఇది కూడా చదవండి : బలంగీర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

చిత్ర కృప : Satyajit Nayak

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X