Search
  • Follow NativePlanet
Share
» »అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు? శబరిమలై యాత్రకోసం అయ్యప్పభక్తులు మాల ధరించి 41రోజులు దీక్ష పాటించి గురుస్వామిచే ఇరుముడులు శబరిమలైకి వచ్చి అయ్యప్పస్వామిని దర్శనంచేసుకుని మాలవిరమణ చేస్తారు.

By Venkatakarunasri

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు? శబరిమలై యాత్రకోసం అయ్యప్పభక్తులు మాల ధరించి 41రోజులు దీక్ష పాటించి గురుస్వామిచే ఇరుముడులు శబరిమలైకి వచ్చి అయ్యప్పస్వామిని దర్శనంచేసుకుని మాలవిరమణ చేస్తారు.అయితే స్వాములు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు? అసలు ఇరుముడిలో ఏముంటుందనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇరుముడిలో ఆవునెయ్యి, కొబ్బరికాయలు, బియ్యం, పసుపు, కుంకుమ, జాకెట్, విభూది, పన్నీరు, అగరబత్తి, తేనె, ఖర్జూరం, బెల్లం, మిరియాలు, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, పేలాలు వుంచుతారు.వెనకముడిలో పప్పు, ఉప్పు, చింతపండు, మిరప్పొడి, ఆవాలు, ఇంగువ తినేందుకు తయారుచేసిన పదార్ధాలను వుంచి ఇరుముడిని కడ్తారు. గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్ష్యాట్టూ శ్రీఅయ్యప్పస్వామిగా కొలుస్తారు.

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ఇరుముడిని కట్టే సమయంలో దానిని శిరస్సుపై ధరించేతప్పుడు చివరకు సన్నిధానం చేరేవరకూ స్వామి శరణుఘోషతోనే ఇరుముడిని శిరముపై ధరించాలి. ఇలా కట్టిన ఇరుముడులను గురుస్వామి తన స్వహస్తాలతో శిష్యుల శిరస్సుపై పెట్టి శబరిమలయాత్రకు తీస్కెల్తారు.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పస్వామి దర్శనం అయినతర్వాత ఇరుముడులను ఒకచోటికి చేర్చి భక్తిశ్రద్ధలతో పూజించి ఒక్కొక్క ఇరుముడిని విప్పి అందులోని వస్తువులను స్వామివారికి స్వామివారికి సమర్పించేందుకు గురుస్వామిని సిద్ధం చేస్తారు. ముద్రటెంకాయలను పగలగొట్టి అందులోని నెయ్యిని ఒకపాత్రలో పోయించి శ్రీస్వామి వారి అభిషేకమునకు పంపుతారు.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

మన శరీరమును నారీకేళముగా ఎంచుకుని అహంకారమనే నారను భక్తీ అనే బండపై అరగదీసి అందులోని మోహమనే జలమును తీసి భక్తీ,శ్రద్ధ, విశ్వాసం,ఆచారం,అనుష్టానములానే జ్ఞానామృతములను నింపివైరాగ్యమనే మూతనుపెట్టి ఆత్మ అనే లక్కతో ముద్రవేసి శ్రీఅయ్యప్పస్వామి సన్నిధానానికి తీసుకెళ్ళి అభిషేకంచేసి పునీతులు కావడం ఇందులోని పరమార్ధం.అలా పగలగొట్టి నెయ్యి తీసిన కొబ్బరికాయలను గణపతి హోమగుండంలో వేయాలి. కొబ్బరికాయలతో పాటు పేలాలనుకూడా కొందరు హోమగుండంలో వేస్తారు.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ఇక ఇరుముడిలోని కానుకలను అయ్యప్పస్వామివారి హుండీలో వెయ్యాలి. ఇరుముడులు విప్పి వేరు చేయగానే విభూధి,పసుపు, కుంకుమలను వేరువేరు పాత్రలలో పోయాలి. విభూదిపళ్ళెంలో ఇరుముడిలోని కర్పూరం వెలిగించి మిగిలిన కర్పూరంను, అగరబత్తీలను స్వామివారిసన్నిధానంలో కర్పూరఆళీలో వేయాలి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

బెల్లం, ఖర్జూరం, ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, తేనె, పేలాలు వీటన్నిటినీకలిపి పంచామృతఅభిషేకమునకు పంపాలి. పసుపు, కుంకుమ, విభూది,చందనం, పన్నీరు, మిరియాలు, జాకెట్టు, నల్లగాజులు వీటిని విడివిడిగా తీసుకుని ఒక్కొక్కరూ ఒక్కొక్క పళ్ళెంతీసుకుని వెళ్ళాలి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ప్రతీ స్వామి ఒక్కొక్కకొబ్బరికాయ తీసుకుని మణికాపురం సన్నిధిలో దొర్లించిరావాలి. పసుపు, కుంకుమలను మాళిగైపురత్తమ్మసన్నిధిలో సమర్పించి కొచ్చుగుడత్వస్వామిని దర్శించుకోవాలి. తెచ్చిన జాకెట్లు, నల్లగాజులు అమ్మవారికి సమర్పించాలి.కొబ్బరికాయను ముక్కంటి సాక్షాత్కారంగా భావిస్తారు. నారతీయగానే మూడు నేత్రములు స్పష్టంగా కనిపిస్తాయి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

మిగిలిన అన్ని ప్రదేశాల్లో కొబ్బరికాయను పగలగొట్టిన సాక్ష్యాత్ ఆది పరాశక్తిఆవాసస్థలమైన మాళిగైపురత్తమ్మసన్నిధిలోని శక్తితో శివుని జతకలుపురీత్యా నారికేళంను పగులగొట్టకుండా దొర్లించి విడిచిపెట్టుట సాంప్రదాయం. అమ్మవారికర్పూరహారతి చూపించి పసుపు, కుంకుమలను ప్రసాదంగా స్వీకరించి వెనుకపక్కన వున్న భస్మ కొళంలో స్నానంచేయాలి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

సన్నిధానంలో ఇరుముడులను విప్పినతర్వాత అందులోని బియ్యంనుండి పిడికెడు బియ్యం అక్షింతలుగా ప్రతీవారి ఇరుముడులలో వేస్తారు. ఇలా శబరిమలయాత్ర ముగిసినతర్వాత మిగిలిన ఆ బియ్యాన్ని ఇంట్లో వుండే బియ్యంతో కలపడంవలన అది ఎప్పటికీ అక్షయపాత్రలా తరగదని అయ్యప్పభక్తుల నమ్మకం.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

చుట్టూ దట్టమైన అడవులతో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రం శబరిమల. సహజసిద్దమైన ప్రకృతి ఒడిలో ,పంబా నది ఒడ్డున , పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్నది ఈ పుణ్యక్షేత్రం.లక్షలాది భక్త జనం మలయాళ క్యాలెండర్ ప్రకారం మండలకల కాలం అయిన నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ క్షేత్రానికి తరలి రావటం జరుగుతుంది. భారతదేశ నలుమూలల నుండి భక్తులు తమ తమ మతాలకు అతీతంగా, మరియు ఆర్ధిక స్తితిగతులకు అతీతంగా ఈ క్షేత్రానికి ప్రతిసంవత్సరం వస్తారు.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

పురాణ విశేషం సబరిమల్ అంటే శబరి ( రామాయణ గాథ లోని ఓక పుణ్య పాత్ర ) యొక్క పర్వత శ్రేణి అని అర్ధం.కేరళ లోని మానవీయ పెరియర్ టైగర్ హిల్ రిజర్వు లో ఉన్నటువంటి , పట్టనంతిట్ట జిల్లా కి తూర్పు ప్రాంతాన ఉన్నదీ గొప్ప క్షేత్రం.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ఈ దేవాలయం లో కొలువున్న దేవుడు అయ్యప్ప లేదా స్వామీ అయ్యప్ప. ఈ స్వామి దర్శనం కోసం ఇక్కడకి రావాలనుకొనే భక్తులు తప్పనిసరిగా 41 రోజులు శాఖాహారులై లౌకిక సుఖాలకు దూరం గా ఉండాలి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ఇక్కడి దేవాలయానికి ఉండే పచ్చని చెట్లు,ప్రవాహాలు మరియు పచ్చిక బయళ్ళ లో నుండి ఉండే కాలిబాట లో ప్రయాణం ప్రతిఒక్కరికి భగవత్ ప్రేరేపిత అనుభవం గా ప్రతి ఒక్కరు తమ జీవిత కాలం లో చవి చూడవలసిన ఒక అద్భుతం.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

భగవంతుని చేరే మార్గం (తనను తానూ తెలుసుకోవటమే) కాలినడకన దేవాలయం చేరే భక్తులు ఈ పొడవైన, కఠినమైన మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే చెట్ల నీడలో విశ్రమించి సేదతీరి ప్రయాణం కొనసాగించవచ్చు.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ప్రపంచం లోనే అతి గొప్ప పుణ్యక్షేత్రంగా పేరు గడించిన ఈ శబరిమల కు ప్రతి సంవత్సరం సుమారు 45-50 మిలియన్ ల భక్తులు విచ్చేస్తారు.18 కొండల మధ్య ఉన్న ఈ అయ్యప్ప స్వామి కోవెల చూడటానికి ఏంతో కన్నుల పండుగగా ఉంటుంది.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ఈ దేవాలయం పర్వత శ్రేణుల మధ్య, దట్టమైన అడవుల మధ్య శిఖరం పైన సముద్ర మట్టానికి 1535 అడుగుల ఎత్తున ఉన్నది. శబరిమల యొక్క ఔన్నత్త్యం భయంకరమైన రాక్షసి మహిషి ని అంతమొందించి అయ్యప్పస్వామి ఇక్కడ తపస్సు చేసారని పురాణాలు చెపుతాయి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

శబరిమల దేవాలయం చాలామంది భక్తులకు సమానతకు ,సమైక్యతకు,మంచికి చిహ్నం గా గోచరిస్తుంది. ఇది భక్త జనానికి మరొకసారి మంచి ఎప్పుడు చెడుని జయిస్తుంది అని , ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.మతాతీతంగా, కులాతీతంగా, వర్ణాతీతం గా భక్తులకు అందుబాటు లో ఉన్న అతి కొద్ది దేవాలయాలలో శబరిమల పుణ్య క్షేత్రం ఒకటి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

మహావిష్ణువు యొక్క ఒకానొక అవతారమైన పరశురామ మహర్షి తన గొడ్డలిని పారవేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమల లో ప్రతిష్టించారని చెప్పబడుతుంది. ఈ శబరిమల ప్రభుత్వ ఆధ్వర్యం లోని ద త్రావెంకరే దేవస్వోం బోర్డు (TDB) యొక్క నిర్వహణ లో ఉన్నది.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

పుణ్యక్షేత్రం శబరిమల దీక్షా కాలం నవంబర్ మధ్యలో ప్రారంభమై జనవరి నాలుగవ వారంలో ముగుస్తుంది. జనావాసాలు లేకపోయినా శబరిమల పట్టణ సముదాయం నిరంతరం యాత్రికులు, దుకాణాలు మరియు హోటల్స్ తో ఎప్పుడూ రద్దీ గా నే ఉంటుంది.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

శబరిమల లో ప్రధానంగా జరుపుకునే పండుగలు మండల పూజ మరియు మకరవిలక్కు. వవారు స్వామి అనబడే ముస్లిం పకిరుకి ఇక్కడ మందిరం ఉంది. అందువల్ల, ఈ ప్రాంతం మతాలకు అతీతంగా ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం కలగలిపిన ఈ శబరిమల సందర్శన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

వేల మంది పర్యాటకులు భక్తితో ఈ శబరిమలను సందర్శించేందుకు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఇక్కడికి తరలి వస్తారు. పచ్చని చెట్లు, అందమైన ప్రవాహాలని దాటుకుంటూ చక్కటి నడక ద్వారా ఈ అయ్యప్పస్వామి గుడికి చేరుకోవడం వర్ణనాతీతమైన అనుభూతి. ఈ కొండ పైకి ఎక్కడానికి సుమారు మూడు కిలో మీటర్లు కాలి నడకన వెళ్ళాల్సి వస్తుంది.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలం, అద్భుతమైన పర్వత సౌందర్యం దారి పొడవునా కనువిందు చేస్తాయి. ప్రకృతి ని ఆరాధించేవారికి ఈ శబరిమల సందర్శనం మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రధాన నగరాలకు రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా అనుసందానమైన పంబా పట్టణం నుండి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. శబరిమల ను సందర్శించదలచిన పర్యాటకులకు అన్ని సిజన్లలో టూరిస్ట్ ప్యాకేజులు మరియు హోటల్ వసతులు అందుబాటు ధరలోనే ఉంటాయి.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

శబరిమల వాతావరణం

సందర్శించేందుకు అనువైన సమయం

ఇక్కడి వాతావరణం అన్ని సిజన్లలో శబరిమల ను సందర్శించేందుకు అనువుగా ఉంటుంది. అయినా సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. వర్షాకాల ప్రభావం, ఎండాకాలం మొదలవ్వక ముందు ఉండే పచ్చదనం వల్ల ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్ 15 వ తేది నుండి డిసంబర్ 26 వ తేదీ వరకు రోజు మొత్తం ఈ గుడి తెరిచే ఉంటుంది.

PC:youtube

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

కేరళ లో ఉన్న అన్ని ప్రధాన నగరాల నుండి పంబ పట్టణానికి తరచూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) ద్వారా కేరళ ప్రభుత్వ రవాణా శాఖ కొట్టాయం, చెంగన్నూర్ మరియు తిరువల్ల రైల్వే స్టేషన్ ల కి బస్సు సర్వీసులు నడుపుతుంది. ప్రైవేటు టాక్సీలు మరియు టూరిస్ట్ ప్యాకేజీ లు కూడా శబరిమల కి అందుబాటులో ఉన్నాయి.

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

రైలు మార్గం

పంబా పట్టణానికి 90 కి మీ ల దూరం లో ఉన్న చెంగన్నూర్ రైల్వే స్టేషన్, శబరిమల కి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. తిరువనంతపురానికి మరియు కొట్టాయం కి మార్గమధ్యంలో ఈ చెంగన్నూర్ ప్రాంతం ఉండడం వల్ల భారత దేశంలో ప్రముఖమైన రైల్వే స్టేషన్స్ అన్నిటికి అనుసంధానించబడి ఉన్నది. చెంగన్నూర్ నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు అందుబాటులోఉన్నాయి.

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు?

వాయు మార్గం

కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం శబరిమలకి సమీపంలో ఉన్నాయి. శబరిమల నుండి తిరువనంతపురం 130 కి మీ ల దూరంలో, కొచ్చి నేడంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం 190 కి మీ ల దూరంలో ఉన్నాయి. ఈ రెండు విమానాశ్రయాల నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు లభ్యమవుతాయి. పంబా పట్టణం నుండి సులభంగా శబరిమలకు చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X