» »కొల్లిమలై రహస్యం !

కొల్లిమలై రహస్యం !

By: Venkata Karunasri Nalluru

ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం కదా! అందుకే ఈ వేసవి సెలవులు కుటుంబంతో కలసి సేదతీరటానికి మీ ముందుకు తెస్తున్నాం వేసవి పర్యాటక కేంద్రం కొల్లి మలై. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో కొల్లి మలైగా ప్రసిద్ధి చెందిన కొల్లి హిల్స్ ఉంది. ఈ ప్రాంతం 1500 మీటర్ల ఎత్తులో వుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూపరులను అట్టే కట్టిపడేస్తుంది.

ఇది కూడా చదవండి : సేలం పర్యాటక ప్రదేశాలు !

చరిత్ర

కొల్లి హిల్స్‌కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. కొల్లి హిల్స్‌ తూర్పు కనుమల్లో ఒక భాగం. ఈ ప్రాంతం గురించి ప్రాచీన తమిళరచనలైన శిలప్పదికారం, మణిమేఖలై, పురననూరు, ఐన్‌కుర్నూరు మొదలైన వాటిలో ఉంది. వేసవికాలంలో కొద్దిరోజులు ఇక్కడ ప్రకృతి ఒడిలో సేద తీరావచ్చును. ఎండాకాలంలో ఇక్కడి పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 16 నుంచి 22 డిగ్రీలే! అయితే, చలికాలంలో మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రత - పగటిపూట 10 డిగ్రీలు, రాత్రి వేళ 5 డిగ్రీలు. ఇక్కడ తక్కువ ధరకే బస చేసేందుకు వీలుగా కొన్ని రిసార్ట్‌లు కూడా ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, చాలామంది ఈ ప్రాంతాన్ని 'పేదవాళ్ళ ఊటీ' అని పిలుస్తుంటారు. చాలామందికి తెలియని ఓ వేసవి పర్యాటక కేంద్రం - 'కొల్లి మలై'గా ప్రసిద్ధమైన కొల్లి హిల్స్. వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది చక్కటి పర్యాటక ప్రాంతం.

ఇది కూడా చదవండి : తమిళనాడులోని పిక్నిక్ ప్రదేశాలు !

పేదవాళ్ళ ఊటీ - కొల్లి హిల్స్‌

1. కొల్లి హిల్స్ లేదా కొల్లి కొండలు

1. కొల్లి హిల్స్ లేదా కొల్లి కొండలు

కొలి హిల్స్ లేదా కొల్లి కొండలు అనేవి ఒక పర్వత శ్రేణి. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ ఉంది. నామక్కల్ కి 35 కి.మీ. దూరంలో, సేలం కి 61 కి.మీ. దూరంలో ఉంది. ఈ హిల్ స్టేషన్. సుమారు 280 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కొండ ప్రాంతం సముద్రమట్టానికి 1000 - 15000 మీటర్ల ఎత్తున ఉంటుంది.

చిత్రకృప : Karthickbala

2. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం

2. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం

కొల్లి హిల్స్ బెంగళూరు నగరానికి 263 కి.మీ. దూరంలో, చెన్నై నగరానికి 366 కి.మీ. దూరంలో, ఊటీ కి 254 కి.మీ. దూరంలో మరియు కొడైకెనాల్ కి 245 కి.మీ. దూరంలో ఉన్నది. ఎటుచూసినా చుట్టూ కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, కొండలు, అడవులు .... మనస్సుకి ప్రశాంతతను చేకూరుస్తాయి.

చిత్రకృప :ANAND NANO

3. కొల్లి హిల్స్ ఎలా చేరుకోవాలి ?

3. కొల్లి హిల్స్ ఎలా చేరుకోవాలి ?

కొల్లి హిల్స్ చేరుకోటానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం కొల్లి హిల్స్ కి 110 కి. మీ. దూరంలో ఉన్న ట్రిచీ సమీప విమానాశ్రయం. ట్రిచీ కి రెగ్యులర్ విమానాలు చెన్నై నుంచి అందుబాటులో ఉన్నాయి. ట్రిచీ విమానాశ్రయం నుండి కొల్లి హిల్స్ కు టాక్సీ రైడ్ కు సగటున 1200 రూపాయలు ఖర్చవుతుంది. రైలు మార్గం కొల్లి హిల్స్ కు సమీపంలోని రైల్వే స్టేషన్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలంలో ఉంది. ట్రిచీ రైల్వే స్టేషన్ 90 కి. మీ. దూరంలో ఉంది. సేలం లేదా ట్రిచీ నుండి కొల్లి హిల్ కు టాక్సీ లేదా ఇతర ప్రవేట్, ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం కొల్లి హిల్స్ కు రోడ్ సౌకర్యం చక్కగా ఉంది మరియు చెన్నై మరియు సేలం వంటి నగరాలకు కలపబడింది. సేలం నుండి ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి కొల్లి చేరుకోవచ్చు. అలాగే చెన్నై, మధురై మరియు ట్రిచీ నుండి కూడా చేరుకోవచ్చు. సేలంలో బస్ స్టాండ్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లి కొండలు చేరటానికి ఒకవేళ మీరు టాక్సీ అద్దెకు తీసుకుంటే సగటున రూ. 1100 చెల్లించవలసి వస్తుంది.

చిత్రకృప : Ravi S. Ghosh

4. ఇక్కడ జరుపుకునే పండుగలు

4. ఇక్కడ జరుపుకునే పండుగలు

ఇక్కడి గిరిజనులు జరుపుకొనే ప్రధాన పండుగ ఒరి ఫెస్టివల్ . అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి.

చిత్రకృప : Vvijayakumar

5. వసతులు

5. వసతులు

కొల్లి హిల్స్ లో బస చేసేందుకు తక్కువ ధరకే హోటళ్లు, రిసార్ట్‌లు ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది.

చిత్రకృప :Karthickbala

6. మలయాళీ గిరిజనులు

6. మలయాళీ గిరిజనులు

కొల్లి హిల్స్‌లో 'మలయాళీ గిరిజనులు'గాపిలవబడే స్థానిక గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. గిరిజనులు ఎంతో సంస్కారయుతంగా దుస్తులు వేసుకుంటారు.

చిత్రకృప :Docku

7. కొల్లి హిల్స్ సిద్ధర్ గుహలు

7. కొల్లి హిల్స్ సిద్ధర్ గుహలు

సిద్ధర్ గుహలు కొల్లి హిల్స్ కు దగ్గరలో ఉన్నాయి. ఈ గుహల చుట్టూ కూడా ఔషధ మొక్కలు విరివిగా ఉన్నాయి. చోళుల కాలంలో ఆయుర్వేద వైద్యులు ఇక్కడ ఔషధాలను తయారుచేసేవారని అక్కడ కనిపించే దృశ్యాల వల్ల తేటతెల్లమవుతుంది.

చిత్రకృప : Karthickbala

8. జలపాతం

8. జలపాతం

మిని ఫాల్స్ కొల్లి హిల్స్ వద్ద ఉన్నాయి. సుమారు 90 అడుగుల ఎత్తు నుండి కిందపడే నీటిధార చూడటానికి ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈ జలపాతం చుట్టూ కప్పబడిఉన్న ఆయుర్వేద మొక్కలు ఈ ప్రాంత అందాల్ని మరింత పెంచుతున్నాయి.

చిత్రకృప :Docku

9. బోట్ హౌస్

9. బోట్ హౌస్

కొల్లి హిల్స్ కి చేరువలో ఉన్న వసలుర్ పట్టి వద్ద బోట్ విహారం చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రామం సోలక్కాడు - తిన్ననూర్ పట్టి రోడ్డు మార్గంలో ఉన్నది. ఇక్కడ సరస్సు మధ్యలో సహజంగా ఏర్పడ్డ ఐలాండ్ ఇక్కడి అదనపు ఆకర్షణ.

చిత్రకృప :Rajeshodayanchal

10. పిక్నిక్ స్పాట్ - బొటానికల్ గార్డెన్

10. పిక్నిక్ స్పాట్ - బొటానికల్ గార్డెన్

బొటానికల్ గార్డెన్ కొల్లి హిల్స్ కి దగ్గరలో వుంది. దీనిని పిక్నిక్ స్పాట్ గా చెప్పవచ్చు. ఈ పార్క్ లో ఎకో - ఫ్రెండ్లీ కాటేజీలు, రోజా పూల తోటలు, హెర్బల్ పార్క్ మరియు వ్యూ పాయింట్ లు కనిపిస్తాయి. చిన్న పిల్లలకైతే ఆడుకోవడానికి సీసా, వేవ్ స్లైడ్, నిలబడిన జంతువుల బొమ్మలు ఇంకా అనేక రైడ్ లు ఉన్నాయి. ఈ గార్డెన్ లో ప్రత్యేకమైనవి పైనాపిల్ పరిశోధన క్షేత్రం మరియు ఫ్లవర్ షో.

చిత్రకృప :Pravinraaj

11. ప్రనవానంద స్వామి ఆశ్రమం

11. ప్రనవానంద స్వామి ఆశ్రమం

కొల్లి హిల్స్ లో ప్రశాంత వాతావరణంలో స్వామి ప్రనవానంద ఆశ్రమం చూడదగ్గది. స్వామీజీ తపస్సు సమయంలో శివుడు ఇచ్చిన అజ్ఞ మేరకు దేవునికి అంకితం చేయబడిన ఒక దేవాలయమును కట్టించెను. ఈ ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ధ్యానం వంటివి జరుగుతాయి.

చిత్రకృప :Docku

12. మసిలా జలపాతం

12. మసిలా జలపాతం

మసిలా జలపాతాన్ని సందర్శించు సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. మసిలా జలపాతం యొక్క పైభాగంలో మాసి పెరియాస్వామి దేవాలయం ఉంది. ఆలయం సమీపంలో నుండి జలపాత వీక్షణ మంత్రముగ్ధులను చేస్తుంది.

చిత్రకృప :Bejnar

13. మసిలా జలపాతం ఆకర్షణ

13. మసిలా జలపాతం ఆకర్షణ

మసిలా జలపాతం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంవల్ల సెలవు రోజులలో కుటుంబాలతో కలసి గడపటానికి బాగుంటుంది. ఈ జలపాతం ఎత్తు 200 అడుగులు ఉంటుంది. కుడివైపు జలపాతం వరకు విస్తరించి ఒక కాంక్రీట్ మార్గం మరియు పార్కింగ్ స్పాట్ ను పర్యాటకుల కొరకు ఏర్పాటుచేశారు.

చిత్రకృప :Venkatesan P.R.S

14. సీకుపరై మరియు సేలూర్ నాడు

14. సీకుపరై మరియు సేలూర్ నాడు

సీకుపరై మరియు సేలూర్ నాడు అనేవి కొల్లి హిల్స్ లో చూడదగినవి. ట్రెక్కింగ్, బోటింగ్ మరియు ధ్యానం వంటి వాటికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన సహజ ప్రకృతి దృశ్యాలైన అద్భుతమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూడటానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

చిత్రకృప : Raghavz260

15. కొల్లి హిల్స్ లో గల అడవులు

15. కొల్లి హిల్స్ లో గల అడవులు

కొల్లి హిల్స్ మీద సుమారుగా 100 దాకా అడవులు ఉన్నాయి. పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లో తమ బంధువులను, పూర్వీకులను ఖననం చేస్తారు కనుక ఇక్కడ గిరిజనులు ఎవ్వరినీ అనుమతించరు.

చిత్రకృప :Rajeshodayanchal

16. తోటలు

16. తోటలు

కొల్లి హిల్స్ లోని కొండల నిండా అనాస, పనస, సపోటా, బత్తాయి, పైనాపిల్ తోటలు సమృద్దిగా ఉన్నాయి. మిరియాలు, కాఫీ వంటి వాణిజ్య పంటలు సైతం ఈ కొండల్లో పండిస్తారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు గుర్తుగా వీటిలో కొన్నింటిని తీసుకువెళ్ళచ్చు.

చిత్రకృప :Pravinraaj

17. సెమ్మేడు అనే పట్టణం

17. సెమ్మేడు అనే పట్టణం

కొల్లి హిల్స్ పైకి చేరుకోగానే సెమ్మేడు అనే పట్నం కనిపిస్తుంది. పర్యాటకులు ఇక్కడ బస చేసి చుట్టుపక్కల ప్రాంతాలు చూడవచ్చును. ఈ పట్నానికి 17 కి.మీ.ల దూరంలో ఓ జలపాతం ఉంది. ఈ జలపాతం చాలా అందంగా వుంటుంది.

ఇక్కడ వసతులు: స్టార్ హోటళ్ళు, రిసార్టులు.

చిత్రకృప :Pravinraaj

18. అరపలీస్వరార్ ఆలయం

18. అరపలీస్వరార్ ఆలయం

అగాయ గంగా జలపాతం సమీపంలో అరపలీస్వరార్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1 - 2 వ శతాబ్ధంలో వల్విల్ ఒరి పాలనలో నిర్మించినారు. ఇది మహా శివునికి అంకితం చేయబడ్డ గుడి. ఈ ఆలయం వద్ద చోళ కాలం నాటి శాసనాలు చూడవచ్చు. అలాగే పురాణాల ప్రకారం, పొలం దున్నతున్న రైతుకి శివలింగం తగిలి రక్త స్రావం అయ్యెను. అప్పుడు శివలింగం మీద ఏర్పడ్డ చిన్న గాయం నేటికీ కనిపిస్తుంది.

చిత్రకృప :Pravinraaj

19. అగాయ గంగై జలపాతం

19. అగాయ గంగై జలపాతం

కొల్లి హిల్స్ అన్నివైపులా దట్టమైన పర్వతాలతో చుట్టుముట్టిన అగాయ గంగా జలపాతంను చేరుకోవటానికి 1032 మెట్లు దిగవలసి ఉంటుంది. కిందకు చేరుకోగానే రాతి శిలల నుంచి జారువాలే నీటిధారను చూస్తే అప్పటి వరకు పడ్డ కష్టం మరిచిపోయి, ఉత్సాహంతో చిందులు వేస్తారు.

చిత్రకృప :Simply CVR

20. అగాయ గంగై జలపాతం, కొల్లి హిల్స్

20. అగాయ గంగై జలపాతం, కొల్లి హిల్స్

ఈ జలపాతం కొల్లి హిల్స్ నుండి 12 కి. మీ. దూరంలో ఉండి, పావు గంటలో చేరుకొనే విధంగా ఉంటుంది. సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతుంది ఈ జలపాతం.

చిత్రకృప :Simply CVR

Please Wait while comments are loading...