Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు పర్యాటకులకు సరైన ప్రదేశం !

బెంగళూరు పర్యాటకులకు సరైన ప్రదేశం !

By Mohammad

యాత్రికులకు సరైన ప్రదేశం శివగంగ. ఈ ప్రదేశం ఒక చిన్న కొండ భాగం. కొండ పైన శివాలయం ఉంటుంది. ఇక్కడే ఒక అందమైన నీటి బుగ్గ కూడా కలదు. ఆ నీటి బుగ్గ సాక్షాత్తు గంగా నది నుండి ఉద్భవించిందని చెబుతూ దీనికి శివగంగ అని పేరుపెట్టారు. కొండ పైన ఉన్న శివాలయం దక్షిణ కాశీ అనే మరో పేరుతో పిలువబడుతున్నది.

'శివగంగ' ప్రాంతం బెంగళూరు మహానగరానికి 54 కిలోమీటర్ల దూరంలో మరియు తుంకూర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో కలదు. బెంగళూర్ నుండి వారంతం విహారం కోరుకొనే వారికి (వీకెండ్) శివగంగ సూచించదగినది. బెంగళూరు నుండి ఉదయాన్నే బయలుదేరి సాయంత్రం కల్లా తిరిగిరావచ్చు. ఇది సముద్ర మట్టానికి 1368 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాహస యాత్రలు చేసేవారికి, ఆధ్యాత్మికత భావనలు గలవారికి శివగంగ ఒకేరీతిలో ఆనందాన్ని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి నృత్యగ్రామ్ వన్ డే ట్రిప్ అనుభవాలు !

శివగంగ కొండ

శివగంగ కొండ

చిత్ర కృప : Brunda Nagaraj

గవి గంగాదేశ్వర గుహాలయం

బెంగళూరు నగర వ్యవస్థాపకుడు కెంప గౌడ, గవి గంగాదేశ్వర గుహాలయం నిర్మించాడు. గుడిలో ప్రధాన దైవం శివభగవానుడు. ఇందులో అరుదుగా కనిపించే, పూజించే అగ్ని దేవుని విగ్రహం ఉన్నది. ఈ అగ్ని దేవుని విగ్రహంతో పాటు మరో 33 విగ్రహాలు కూడా గుహాలయం లో ఉన్నాయి. ఒకే రాతి తో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళ, వాస్తు శైలి కలిగి ఉంది.

దేవతామూర్తుల విగ్రహాలు, శివగంగ

చిత్ర కృప : Brunda Nagaraj

ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సూర్యుని కిరణాలు శివుని వాహనమైన నంది విగ్రహం కొమ్ముల గుండా ప్రసరించి గర్భ గుడి లోని శివలింగాన్ని తాకుతాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధికంగా తరలివస్తుంటారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 : 30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 : 30 వరకు ఈ గుహాలయాన్ని దర్శించవచ్చు.

హొన్నా దేవి ఆలయం

హొన్న దేవి శివగంగ ప్రధాన దేవత మరియు గ్రామ దేవత. హొన్నా దేవి శివుని భార్య. దేవతను స్వర్ణాంబ అని మరొక పేరు కూడా కలదు. ప్రతి సంవత్సరం ఏప్రియల్ నెలలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివస్తుంటారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు కు 70 కిలోమీటర్ల దూరంలో !

ఆలయం, శివగంగ

ఆలయం, శివగంగ

చిత్ర కృప : Brunda Nagaraj

ఒలకల తీర్థ

ఒలకల తీర్థ గవి గంగాదేశ్వర ఆలయం వెనక భాగంలో ఉంటుంది. ఇది సహజ నీటి బుగ్గ. ఇందులో నీరు నిరంతరం రాళ్ళ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని ఒక రంధ్రం గుండా మాత్రమే చూడగలము. రంధ్రంలో చేయి పెడితే, ఆ నీరు మిమ్మల్ని తాకుతే, వీరి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఇది కూడా చదవండి : బెంగళూరు - మైసూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ లు !

శివగంగ ఊరి దృశ్యాలు

శివగంగ ఊరి దృశ్యాలు

చిత్ర కృప : Brunda Nagaraj

పాతాళగంగ

పాతాళగంగ మంచి నీటి బుగ్గ. ఈ నీటి బుగ్గ లో సాక్షాత్తు గంగా నది నీరు ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. రెండు పెద్ద ఏకశిల రాతి మధ్యన పాతాల గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు కోలార్ జిల్లాలోని అంతరగంగ కు అనుసంధానించబడినది అని కూడా చెబుతారు. హిందువులు ఈ నీటి బుగ్గ ను పవిత్రమైనది భావిస్తారు, పూజలు కూడా చేస్తారు. పాతాల గంగ అంటే అట్టడుగున ఉంటె గంగా నది అని అర్థం.

ఇది కూడా చదవండి : అంతరగంగ - సాహస క్రీడల సమాహారం !

పాతాల గంగ వైపు వెళ్ళే దారి

పాతాల గంగ వైపు వెళ్ళే దారి

చిత్ర కృప : Brunda Nagaraj

శివగంగ ట్రెక్కింగ్

శివగంగ కొండ పై పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. సాహస క్రీడలు చేయాలనుకునేవారు ఈ కొండలు ఎక్కవచ్చు. ఈ కొండపై ఎక్కి చూస్తే శివగంగ అందాలన్ని గమనించవచ్చు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ అనేక రాతి శిలలు, అల్లరి చేసే కోతులు కనిపిస్తాయి. కొండ పైవరకు సాహసం చేసి ఎక్కితే నల్లని రాతి నంది విగ్రహం కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి 25 ట్రెక్కింగ్ ప్రదేశాలు !

కోతులు, శివగంగ

కోతులు, శివగంగ

చిత్ర కృప : Brunda Nagaraj

శివగంగ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

శివగంగ కు సమీపాన బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు (70 కిలోమీటర్ల దూరంలో). దేశ విదేశాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి శివగంగ చేరుకోవచ్చు.

రైలు మార్గం

శివగంగ కు సమీపాన 8 కిలోమీటర్ల దూరంలో దొబ్బాస్పేట్ రైల్వే స్టేషన్ కలదు. ప్రధాన రైల్వే స్టేషన్ బెంగళూరు రైల్వే స్టేషన్. ఇక్కడికైతే దేశంలోని వివిధ నగరాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

ట్రెక్కింగ్ చేస్తున్న యాత్రికులు

ట్రెక్కింగ్ చేస్తున్న యాత్రికులు

చిత్ర కృప : Brunda Nagaraj

రోడ్డు / బస్సు మార్గం

బెంగళూరు నుండి ప్రభుత్వ బస్సులు శివగంగ కు ప్రతిరోజూ నడుస్తుంటాయి. తుముకూర్ పట్టణం నుండి కూడా శివగంగ కు బస్సులు, ప్రవేట్ వాహనాలు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి అద్భుతమైన రోడ్ ట్రిప్ ప్రయాణాలు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X